ఓటీటీలోకి వచ్చేసిన బ్లాక్‌ బస్టర్‌ హారర్‌ థ్రిల్లర్‌.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే? | Horror Thriller Demon Movie Streaming On This OTT Platform | Sakshi
Sakshi News home page

Demon Movie: ఓటీటీలోకి వచ్చేసిన బ్లాక్‌ బస్టర్‌ హారర్‌ థ్రిల్లర్‌.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

May 29 2025 1:22 PM | Updated on May 29 2025 1:33 PM

Horror Thriller Demon Movie Streaming On This OTT Platform

హారర్‌ చిత్రాలకు ఓటీటీలో మంచి ఆదరణ ఉంటుంది. థియేటర్స్‌లో ఆడని చిత్రాలు కూడా ఓటీటీలో హిట్‌ అవుతున్నాయి. అందుకే పలు ఓటీటీ సంస్థలు హారర్‌ చిత్రాలపై స్పెషల్‌ ఫోకస్‌ పెడుతున్నాయి. ఇక హారర్‌ థ్రిల్లర్‌ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించడంతో ఆహా ముందుంటుంది. ఇప్పటికే పలు తమిళ, మలయాళ హారర్‌ చిత్రలను తెలుగులో ప్రేక్షకుల ముందుకు తెచ్చిన ఆహా..మరోసారి బ్లాక్‌ బస్టర్‌ హారర్‌ చిత్రంతో అలరించేందుకు రెడీ అయింది. తమిళ్‌ బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్ "డీమన్"(Demon ) నేటి(మే 29) నుంచి ఆహాలో స్ట్రీమింగ్‌ అవుతోంది.  

రమేశ్ పళనీవేల్ దర్శకత్వంలో, నిర్మాత ఆర్. సోమసుందరం నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం,  భవాని మీడియా ద్వారా Aha ఓటీటీలో ప్రసారం కానుంది. సచిన్ మణి , అబర్నతి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో, సురుతి పేరియసామి, కుంకి అశ్విన్, రవీనా కీలక పాత్రల్లో అదరగొట్టారు. హారర్, సస్పెన్స్, ట్విస్ట్ లతో కూడిన కథనంతో డీమన్ ప్రేక్షకులను ఉర్రూతలూగించబోతున్నది. ఊహించని మలుపుతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా చేస్తుంది. చిత్రానికి రోనీ రాఫెల్ అందించిన సంగీతం, ఆర్.ఎస్. ఆనందకుమార్ చేసిన ఛాయాగ్రహణం, రవికుమార్ ఎం. చేసిన ఎడిటింగ్ మరింత అద్భుతంగా తీర్చిదిద్దాయి.

Advertisement
 
Advertisement
Advertisement