అనుకున్న టైం కంటే ముందే ఓటీటీలోకి స్టార్ హీరో సినిమా! | Sakshi
Sakshi News home page

OTT Movie: నెలలోపే ఆ మూవీ ఓటీటీ రిలీజ్.. తేదీ అదేనా?

Published Tue, Dec 5 2023 5:59 PM

Tiger 3 Movie OTT Release Date Salman Khan - Sakshi

మరో స్టార్ హీరో సినిమా.. నెలలోపే ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైపోయింది. యాక్షన్ స్టోరీతో తీసిన ఈ చిత్రం.. ఏకంగా రూ.1000 కోట్ల కలెక్షన్స్ సాధించేస్తుందని ఆశపడ్డారు. కానీ రియాలిటీలో తేడా కొట్టేసింది. దీంతో అనుకున్న టైమ్ కంటే ముందే ఓటీటీలోకి రానుంది. ఇంతకీ ఏంటా సినిమా? ఎప్పుడు రాబోతుంది?

(ఇదీ చదవండి: ఆరు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా)

యాక్షన్ సినిమాలకు ఈ మధ్య గిరాకీ బాగా పెరిగింది. 'పఠాన్', 'జవాన్' లాంటి చిత్రాలు రూ.1000 కోట్ల మార్క్ క్రాస్ చేశాయి. తాజాగా 'యానిమల్' కూడా ఆ నంబర్ దాటేస్తుందనిపిస్తోంది. అయితే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ 'టైగర్ 3' కూడా ఇలాంటి అంచనాలతోనే మొన్నీమధ్య దీపావళికి(నవంబరు 12న) థియేటర్లలో రిలీజ్ చేశారు. కానీ ఆశించిన స్పందన రాలేదు. వసూళ్లు కూడా అంతంత మాత్రంగానే వచ్చాయి.

ఉత్తరాదిలో కాస్తోకూస్తో కలెక్షన్స్ బాగానే వచ్చాయి కానీ తెలుగు సినిమా, వసూళ్లు.. రెండూ దెబ్బకొట్టేశాయి. దీంతో ఇప్పుడీ మూవీని నెల రోజుల్లోనే ఓటీటీలోకి తీసుకొచ్చేయబోతున్నారు. 'టైగర్ 3' చిత్ర డిజిటల్ హక్కుల్ని అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. లెక్క ప్రకారం 6-8 వారాల తర్వాత ఓటీటీ రిలీజ్ ప్లాన్ చేశారు. కానీ రిజల్ట్ తేడా కొట్టేయడంతో డిసెంబరు 12నే ఓటీటీ స్ట్రీమింగ్ ఫిక్స్ చేశారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 సినిమాలు)

Advertisement
 
Advertisement