కమెడియన్ అవినాష్ ఇంట్లో విషాదం.. బాధతో ఇన్ స్టాలో పోస్ట్

Jabardasth Comedian Avinash Baby Death And Instagram Post Viral - Sakshi

'జబర్దస్త్' షోతో చాలామంది వెలుగులోకి వచ్చారు. వీరిలో ఒకడు అవినాష్. అయితే ముక్కు అవినాష్ అనే పేరుతో ఇతడు పాపులర్ అయ్యాడు. ప్రసుత్తం పలు ఈవెంట్స్, సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. 2021 నవంబరులో అవినాష్.. అనూజ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆమెకు ప్రెగ్నెన్సీ వచ్చినట్లు స్వయంగా అవినాష్.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇప్పుడు బిడ్డని కోల్పోయిన విషయాన్ని పంచుకున్నాడు. 

అయితే కొన్నాళ్లుగా భార్యతో కలిసి ప్రెగ్నెన్సీ విషయమై పలు వీడియోస్ చేస్తూ వచ్చిన అవినాష్ దంపతులు.. ఇప్పుడు బిడ్డ చనిపోవడంతో బాధపడుతున్నారు. ఈ విషయం ఎప్పటికీ జీర్ణించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసిన అవినాష్.. దీని గురించి ఎలాంటి ప్రశ్నలు అడిగి మరింత బాధపెట్టొద్దని చెప్పుకొచ్చాడు. అయితే పురిట్లోనే బిడ్డ చనిపోయిందా? లేదా ప్రసవించిన తర్వాత చనిపోయిందా? అనే విషయం అవినాష్ చెప్పలేదు.

(ఇదీ చదవండి: నేరుగా ఓటీటీలోనే రిలీజ్ అవుతున్న ఆ తెలుగు సినిమా.. డేట్ ఫిక్స్)

'నా లైఫ్‌లో సంతోషమైన, బాధ అయినా.. నా ఫ్యామిలీ అయినా మీతోనే పంచుకుంటాను. ఇప్పటివరకు నా ప్రతి ఆనందాన్ని మీతోనే పంచుకున్నాను. కానీ మొదటి సారి నా జీవితంలో జరిగిన ఒక విషాదాన్ని మీతో పంచుకుందామని అనుకుంటున్నాను. మేము అమ్మ నాన్న అవ్వాలనే ఆ రోజు కోసం ఎదురు చూసాం. కానీ కొన్ని కారణాల వల్ల మేము మా బిడ్డనీ కోల్పోయాం. ఈ విషయం మేము ఎప్పటికీ జీర్ణించుకోలేనిది'

'అంత తొందరగ మర్చిపోలేనిది. మీకు ఎప్పటికైనా చెప్పాలీ అన్న బాధ్యతతో ఈ విషయాన్నీ మీతో పంచుకుంటున్నాను. ఇప్పటివరకు మీరు మాపై చూపించిన ప్రేమకు థాంక్యూ. మీ ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే దయచేసి ఈ విషయంపై ఎలాంటి ప్రశ్నలు అడిగి మమ్మల్ని బాధ పెట్టవద్దు. మీరందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటూ మీ అనూజ అవినాష్' అని కమెడియన్ అవినాష్ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు. ఈ క్రమంలోనే పలువురు అతడికి ధైర్యంగా ఉండాలని కామెంట్స్ పెడుతున్నారు.

(ఇదీ చదవండి: విమాన ప్రమాదం.. కూతుళ్లతో సహా ప్రముఖ నటుడి దుర్మరణం)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top