ప్రమాదం.. కూతుళ్లతో సహా ప్రముఖ నటుడి దుర్మరణం | Hollywood Actor Christian Oliver Died His Daughters In Plane Crash | Sakshi
Sakshi News home page

విమాన ప్రమాదంలో పిల్లలతో పాటు ప్రముఖ నటుడు మృతి

Jan 6 2024 9:32 AM | Updated on Jan 6 2024 11:10 AM

 Hollywood Actor Christian Oliver Died His Daughters In Plane Crash - Sakshi

ఘోర ప్రమాదం జరిగింది. ప్రముఖ నటుడు దుర్మరణం చెందాడు. ఇతడితో పాటు విమానంలో ప్రయాణిస్తున్న అతడు ఇద్దరు కూతుళ్లు కూడా ప్రాణాలు విడిచారు. ప్రస్తుతం ఈ వార్త అతడి అభిమానుల మనసు కదిలిపోయేలా చేసింది. ఇంతకీ అసలేం జరిగింది? ఎవరా నటుడు?

(ఇదీ చదవండి: ఓటీటీలోకి మరో డిఫరెంట్ సిరీస్.. స్టార్ దర్శకుడికి ఇదే తొలిసారి)

జర‍్మనీలో పుట్టి ప్రస్తుతం హాలీవుడ్‌లో పలు సినిమాల్లో నటించిన క్రిస్టియన్ ఒలీవర్(51).. తాజాగా కరీబియన్ దీవులకు ఫ్యామిలీతో కలిసి విహారయాత్రకు వెళ్లాడు. అయితే గ్రెనాడిస్ అనే ద్వీపం నుంచి సెయింట్ లూసియా అనే ప్రాంతానికి ప్రైవేట్ జెట్‌లో వెళ్లాడు. కాకపోతే గురువారం ఈ విమానం గాల్లోకి ఎగిరిన కాసేపటికే.. పక్కనే ఉన్న నదిలో కుప్పకూలిపోయింది.

ఈ ప్రమాదంలో నటుడు క్రిస్టియన్ ఒలీవర్‌తోపాటు ఇతడు ఇద్దరు కుమార్తెలు, పైలెట్ మృతి చెందారు. ప్రమాదం జరుగుతున్నప్పుడు ఎవరో దూరం నుంచి వీడియో తీయగా.. అది ట్విట్టర్‌లో వైరల్ అవుతుంది. ప్రమాదం జరిగిన వెంటనే డైవర్స్ స్పందించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. బాడీలని ఒడ్డుకు తీసుకొచ్చిన పోలీసులు.. యాక్సిడెంట్‌కి కారణాలు తెలుసుకునే పనిలో ఉన్నారు.

(ఇదీ చదవండి: రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన ఆ తెలుగు సినిమా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement