
తెలుగు సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ వస్తోంది. మన టాలీవుడ్ చిత్రాలకు విదేశీ ఫ్యాన్స్ ఫిదా అయిపోతుంటారు. జపానీయులైతే మన చిత్రాలను తెగ చూసేస్తారు. జపాన్కు చెందిన జూనియర్ ఎన్టీఆర్ అభిమాని తెలుగు కూడా నేర్చుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అంతలా మన సినిమాలకు ఫారినర్స్ ఫిదా అయిపోయారు. ఇక డేవిడ్ వార్నర్ గురించి చెప్పాల్సిన పనిలేదు. పుష్ప మేనరిజంతో రీల్స్ చేస్తూ అలరించిన డేవిడ్ వార్నర్.. నితిన్ మూవీ రాబిన్హుడ్తో ఏకంగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. అంతలా మన సినిమాలు, పాటలకు విదేశీ ఆడియన్స్ సైతం ఫిదా అయిపోవాల్సిందే.
గతంలో సంక్రాంతి వస్తున్నాం సాంగ్తో అలరించిన విదేశీ జంట.. మరోసారి తెలుగు పాటతో సోషల్ మీడియాను షేక్ చేసింది. తాజాగా ఈ జంట మరోసారి తెలుగు సాంగ్తో ప్రేక్షకులను అలరించింది. స్వీడన్‌కు చెందిన కర్ల్ స్వాన్‌బెర్గ్ అనే నటుడు తన సతీమణితో కలిసి మరో తెలుగు పాటకు డ్యాన్స్ చేశారు.
అర్జున్ సర్జా మేనల్లుడు ధృవ సర్జా, ఐశ్వర్య అర్జున్ హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం సీతా పయనం. ఈ సినిమాలో 'ఏ ఊరికెళ్తావే పిల్లా..నువ్వు ఏ ఊరికెళ్తావే పిల్లా.. మా ఊరు రావే పిల్లా' అనే పాటను రీ క్రియేట్ చేశారు. తెలుగు వంటకాలను పరిచయం చేస్తూ విదేశీ జంట చేసిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. తెలుగు ఆడియన్స్ను ఈ వీడియో తెగ ఆకట్టుకుంటోంది. కాగా.. అర్జున్ సర్జా నటిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం ‘సీతా పయనం. అర్జున్ కుమార్తె, హీరోయిన్ ఐశ్వర్యా అర్జున్ మెయిన్ లీడ్ రోల్‌లో నటించింది. సత్యరాజ్, ప్రకాశ్‌రాజ్, కోవై సరళ కీలక పాత్రల్లో నటించారు.