
సినిమాల రిలీజ్కు నెల రోజుల ముందే హైప్ క్రియేట్ అవ్వడం కామన్. అభిమాన హీరో చిత్రం వస్తోందంటే ఫ్యాన్స్లో ఆ మాత్రం ఉత్సాహం, ఆసక్తి ఉంటుంది. కానీ విడుదలకు ఏడాది ఉండగానే ఏ సినిమాకైనా అంత క్రేజ్ ఉంటుందా? ఆ ఇంకా ఏడాది ఉంది కదా అని అనుకుంటారు. కానీ హాలీవుడు దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ సినిమాలకు మాత్రం ఏడాది ముందే టికెట్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయంటే ఆయన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతేడాది ఓపెన్ హైమర్ మూవీతో అలరించిన క్రిస్టోఫర్ నోలన్ మరో ఆసక్తికర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
ఆయన డైరెక్షన్లో వస్తోన్న ది ఒడిస్సీ అనే చిత్రం వచ్చే ఏడాది థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా వచ్చే ఏడాది జూలై 17న రిలీజ్ అవుతోంది. కానీ.. సరిగ్గా ఏడాదికి ముందే ఈ మూవీ టిక్కెట్లకు బుకింగ్స్ ప్రారంభించారు. ఇంకా ఏడాది ఉంది కదా అప్పుడే రిలీజ్ చేశారేంటి? అనుకున్నారనుకుంటే పొరపాటే.. అవీ అట్ట బుకింగ్ ఓపెన్ కాగానే.. గబుక్కున్న మూడే మూడు నిమిషాల్లో టికెట్స్ అన్ని బుక్కైపోయాయి. ఇది చాలు క్రిస్టోఫర్ నోలన్ సినిమాలకు క్రేజ్ గురించి చెప్పడానికి. ఈ విషయాన్ని కొందరు ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
న్యూయార్క్, లాస్ ఏంజిల్స్, శాన్ ఫ్రాన్సిస్కో, లండన్ వంటి నగరాల్లో టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి. గురువారం సాయంత్రం ఓపెన్ అవ్వగానే నిమిషాల వ్యవధిలోనే అయిపోయాయి. కొద్ది నిమిషాలకే టిక్కెట్లు పూర్తిగా బుకింగ్ కావడంతో చాలా మంది సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని పంచుకున్నారు. ఒక వ్యక్తి ట్విట్టర్ వేదికగా మూడు నిమిషాల్లో టిక్కెట్స్ అమ్ముడైనట్లు రాసుకొచ్చాడు. మరో వ్యక్తి లింకన్ స్క్వేర్ థియేటర్‌లో ది ఒడిస్సీ టికెట్లు 3 నిమిషాల కంటే తక్కువ సమయంలో అమ్ముడైనట్లు పోస్ట్ చేశారు. లాస్ ఏంజిల్స్‌లోని కొన్ని థియేటర్లలో బుకింగ్ ఓపెన్ అయిన ఒక నిమిషం లోపు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు చరిత్రలో ఏ చిత్రానికి ఇంత వేగంగా టికెట్స్ బుకింగ్స్ కాలేదని అందరూ అవాక్కవుతున్నారు.
అమెరికన్ ఫిల్మ్‌మేకర్ క్రిస్టోఫర్ నోలన్ తాజాగా చేస్తున్న చిత్రం ‘ది ఒడిస్సీ’. మాట్ డామన్, టామ్ హాలండ్, అన్నే హతావే, జెండయా వంటి హాలీవుడ్ స్టార్స్ ఈ సినిమాలో నటిస్తున్నారు. గ్రీకు పురాతన ఇతిహాస సాహిత్యాల్లో ప్రముఖమైన వాటిల్లో ఒకటిగా చెప్పుకునే హోమర్ రాసిన ‘ఒడిస్సీ’ ఆధారంగా ఈ సినిమాను నోలన్ తెరకెక్కిస్తున్నారు. ట్రోజన్ యుద్ధం అనంతరం తన భార్య పెనెలోప్‌ను కలిసే క్రమంలో ఇథాకా గ్రీసు రాజు అధిగమించిన సమస్యలు, ఎదుర్కొన్న సవాళ్ల నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉండనుంది. ఎమ్మా థామస్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి నోలన్ కూడా సహ–నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.