
హాలీవుడ్ అడ్వెంచర్ సినిమాలంటే ఇష్టమా? మీ కోసమే రీసెంట్ హిట్ మూవీ లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. గత నెలలో థియేటర్లలో రిలీజై దాదాపు రూ.4 వేల కోట్లకు పైగా వసూలు చేసిన ఈ చిత్రం సరికొత్త రికార్డ్స్ సృష్టించింది. ఇప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా డిజిటల్‌గా అందుబాటులోకి వచ్చింది. ఇంతకీ ఏంటా చిత్రం? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది.
(ఇదీ చదవండి: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత ఇంట్లో విషాదం)
గతంలో యానిమేషన్ రూపంలో నాలుగైదు భాగాలుగా వచ్చి ప్రేక్షకుల్ని అలరించిన చిత్రం 'హౌ టూ ట్రైన్ యువర్ డ్రాగన్'. ఇప్పుడు దీన్ని లైవ్ యాక్షన్ మూవీగా తీశారు. ఇది ఇప్పుడు మంగళవారం నుంచి వీడియో ఆన్ డిమాండ్ అంటే రెంట్ పద్ధతిలో అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అమెజాన్ ప్రైమ్, ఆపిల్ ప్లస్ టీవీ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
'హౌ టూ ట్రైన్ యువర్ డ్రాగన్' విషయానికొస్తే.. బర్క్ అనే దీవిపై సమీపంలో ఉండే డ్రాగన్స్ ఎప్పటికప్పుడు దాడి చేస్తుంటాయి. పశువులని ఎత్తుకెళ్తుంటాయి. గ్రామస్థులు వాటిని చంపాలని చూస్తుంటారు కానీ కుదరదు. ఓ రోజు స్టాయిక్ ది వాస్ట్ అనే యోధుడి కుమారుడు హికప్ హాడక్ వల్ల అరుదైన నైట్ ఫ్యూరీ జాతికి చెందిన డ్రాగన్ తీవ్రంగా గాయపడుతుంది. దాన్ని రక్షించి, దానితోనే స్నేహం చేస్తాడు. మరి చివరకు డ్రాగన్స్ సమస్యని ఆ ఊరి ప్రజలు తీర్చారా లేదా అనేదే మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 15 సినిమాలు రిలీజ్)