
హలీవుడ్లో వచ్చిన ట్రాన్ సిరీస్ ఇప్పటివరకు అభిమానుల విపరీతంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సిరీస్లో మరో చిత్రం అలరించేందుకు వస్తోంది. ఏఐ ప్రోగ్రామ్ మన ప్రపంచంలోకి వస్తే ఎలా ఉంటుందనే ఆసక్తికర అంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మానవుల మధ్యకు ఏఐ ప్రపంచం వస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో ఈ చిత్రంలో చూపించనున్నారు. దాదాపు 15ఏళ్ల తర్వాత ట్రాన్ సిరీస్‌లో వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ట్రైన్ ఫ్రాంచైజీలో వస్తోన్న మూడో చిత్రం కావడం విశేషం. 1982 సైన్స్ ఫిక్షన్ చిత్రం ట్రాన్, ఆ తర్వాత 2010 సీక్వెల్ను రూపొందించారు. వాల్డ్ డిస్నీ స్డూడియోస్ నిర్మించిన ఈ సిరీస్ చిత్రాలు అభిమానులను అలరించాయి.
ఈ సినిమాకు జోచిమ్ రోనింగ్ దర్శకత్వం వహించారు. అకాడమీ అవార్డు విన్నర్ జారెడ్ లేటో కీలక పాత్రలో నటించారు. ఈ మూవీలో గ్రెటా లీ, ఇవాన్ పీటర్స్, హసన్ మిన్హాజ్, జోడీ టర్నర్-స్మిత్, ఆర్టురో కాస్ట్రో, కామెరాన్ మోనాఘన్, గిలియన్ ఆండర్సన్, జెఫ్ బ్రిడ్జెస్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబరు 10న ఇంగ్లీష్‌తో పాటు ఇండియన్ భాషల్లోనూ విడుదల కానుంది. తాజాగా తెలుగు ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్.
This October, they are coming to our world.
Watch the brand-new trailer for Tron: Ares and experience it in theaters, filmed for IMAX, October 10. pic.twitter.com/a2z8Pnn3Ei— Walt Disney Studios (@DisneyStudios) July 17, 2025