
ఫైనల్ డెస్టినేషన్.. హాలీవుడ్ లో ఈ ఫ్రాంచైజీకి ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎందుకంటే చావు ఎన్ని రకాలుగా ఉంటుందో ఈ సినిమాల్లో చూపించారు. మన చుట్టూ ఉండే చిన్న చిన్న వస్తువులే మన ప్రాణాలు తీస్తాయి అని భయపెట్టారు. ఇప్పుడు ఈ ఫ్రాంచైజీలోని ఆరో భాగం విడుదలకు సిద్ధమైంది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలు ఇవే)
'ఫైనల్ డెస్టినేషన్: బ్లడ్ లైన్స్' పేరుతో ఆరో భాగమైన చివరి పార్ట్ ని తీశారు. మే 16న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుండగా.. ముందురోజు 15వ తేదీనే మన దేశంలో రిలీజ్ చేస్తున్నారు. తెలుగులోనూ ఈ మూవీ రిలీజ్ చేస్తుండటం విశేషం. 2000లో తొలి పార్ట్ రాగా.. 2003, 2006, 2009, 2011లో మిగతా పార్ట్స్ వచ్చాయి. దాదాపు 14 ఏళ్ల తర్వాత ఆరోది రిలీజ్ అవుతోంది. ఇదే చివరిది కూడా.
కొన్నాళ్ల క్రితమే ట్రైలర్ రిలీజ్ చేయగా.. అది కూడా భయపెట్టేసింది. ఇంటి పెరటిలో ఓ ఫ్యామిలీ పార్టీ చేసుకుంటూ ఉంటారు. అయితే వాళ్లని చావు వెంటాడుతుంది. బీర్ గ్లాస్ ముక్క, వాక్యూమ్ క్లీనర్.. ఇలా అక్కడున్న ప్రతి వస్తువు వీళ్ల చావుకు కారణమయ్యేలా ఉంటుంది. మరి చావు నుంచి తప్పించుకున్నారా? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీలా అనిపిస్తుంది.
(ఇదీ చదవండి: ట్విన్స్ కి జన్మనిచ్చిన హాలీవుడ్ ప్రముఖ నటి.. తండ్రి ఎలన్ మస్క్?)