
మార్వెల్ అభిమానులకు ఇక పండగే! 'ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్' అనే హాలీవుడ్ సినిమా వచ్చేనెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. ఇది మార్వెల్ మొదటి సూపర్ హీరో కుటుంబానికి, గ్రహాలను మింగేసే గెలాక్టస్‌కి మధ్య జరగబోయే భీకర పోరాటం ఈ సినిమాలో చూపించనున్నారు. ఫైట్స్, విజువల్స్ చూస్తే ఈ సినిమాపై అభిమానుల్లో మరింత ఆసక్తి పెంచేలా కనిపిస్తోంది. 1960ల నాటి రెట్రో-ఫ్యూచరిస్టిక్ సెట్టింగ్‌లో ఈ సినిమా ఉండనుంది.
ఈ చిత్రానికి మాట్ షాక్‌మాన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను కెవిన్ ఫీజ్ నిర్మించారు. 'ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్' ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో జూలై 25, 2025న విడుదల కానుంది.ఈ చిత్రంలో పెడ్రో పాస్కల్ (రీడ్ రిచర్డ్స్/మిస్టర్ ఫెంటాస్టిక్), వెనెస్సా కిర్బీ (సూ స్ట్రోమ్/ఇన్విజిబుల్ ఉమెన్), జోసెఫ్ క్విన్ (జానీ స్ట్రోమ్/హ్యూమన్ టార్చ్), ఎబోన్ మోస్-బచ్‌రాక్ (బెన్ గ్రిమ్/ది థింగ్) నటించారు. ఈ యాక్షన్ అడ్వెంచర్‌లో పాల్ వాల్టర్ హౌసర్, జాన్ మల్కోవిచ్, నటాషా లియోన్, సారా నైల్స్ కూడా కనిపించనున్నారు.