బెంగళూరు: రియాలిటీ షోలలో తన పెర్‌ఫామెన్స్‌తో పేరు తెచ్చుకున్న ప్రముఖ డ్యాన్సర్ సుధీంద్ర (30) మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించాడు. కొత్త కారు కొనుగోలు చేసిన సుధీంద్ర, ఈ ఆనందాన్ని తన సోదరుడితో పంచుకునేందుకు వెడుతుండగా బెంగళూరు నగర శివార్లలోని నెలమంగళలోని పెమ్మనహళ్లి సమీపంలో ఈ విషాదం చోటు చేసుకుంది. దీంతో ఆయన కుటుంబం సభ్యులు విచారంలో మునిగిపోయారు.
‘డాన్స్ షో’తో సహా కన్నడ రియాలిటీ షోలతో పేరుతెచ్చుకున్న సుధీంద్ర,కర్ణాటకలోని త్యామగోండ్లు గ్రామానికి చెందిన వాడు. డోబ్స్‌పేటలో ఒక పాఠశాలను కూడా నడుపుతూ ప్రజాదారణ పొందాడు. సోమవారం కొత్త కారును కొనుగోలు చేశాడు. అనంతరం పెమ్మనహళ్లిలోని సోదరుడికి ఇంటికి బయలుదేరాడు. ప్రయాణం మధ్యలో, కారులో సాంకేతిక లోపం ఏర్పడింది, దీనితో డ్యాన్సర్ వాహనాన్ని రోడ్డు పక్కన ఆపి తనిఖీ చేస్తుండగా, అటునుంచి వస్తున్న ట్రక్కు అతణ్ని బలంగా ఢీట్టింది. దీంతో అతను అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
#Accident near #Bengaluru
36-year-old dancer Sudheendra died near Nelamangala after a truck rammed into him. He had stopped to inspect his new car that developed a snag. He was on his way to his brother’s house to show the car when the mishap occurred.@timesofindia pic.twitter.com/DyeIROeWuL— TOI Bengaluru (@TOIBengaluru) November 4, 2025
సీసీటీవీలో ఈ దృశ్యాలు రికార్డైనాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ నెట్టింట సంచలనగా మారింది. ఇది ప్రమాదం కాదు, హత్య అనే ఆరోపణలు వినిపించాయి. టక్కు వేగంగా లేదనీ, కావాలనే ఢికొట్టినట్టు కనిపిస్తోందని, లేదంటే డ్రైవర్ తాగి ఉన్నాడా? నిద్ర మత్తులో ఉన్నాడా? అనే అనుమానాలు వెల్లువెత్తాయి. ఏం జరిగింది అనేది పోలీసుల విచారణలో తేలనుంది. మరోవైపు కేసు నమోదు చేసిన డోబ్స్‌పేట పోలీసులు ట్రక్కు డ్రైవర్‌ను అరెస్టు చేశారు.


