
ఇండస్ట్రీలో మరో విషాదం. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ చంద్ర బరోట్(86) కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా శ్వాసకోస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఈయన.. ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ విషయమై బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా స్పందించారు. దర్శకుడికి నివాళి అర్పించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
(ఇదీ చదవండి: యంగ్ హీరో నిఖిల్‌కి ఝలక్.. ట్వీట్ వైరల్)
అమితాబ్ హీరోగా వచ్చిన 'డాన్' ఎంత సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ సినిమా తీసింది ఈయనే. అలా 'డాన్' దర్శకుడిగా చాలా ఫేమస్ అయిపోయారు. దీని తర్వాత ప్యార్ బరా దిల్, హాంకాంగ్ వాలీ స్క్రిప్ట్, నీల్ కో పకడ్నా తదితర చిత్రాల్ని తెరకెక్కించారు. కానీ, ఆయనకు అత్యంత గుర్తింపు తెచ్చింది మాత్రం డాన్. దర్శకత్వం వహించడానికి ముందు పురబ్ ఔర్ పచ్చిమ్, యాద్గార్, రోటీ కపడా ఔర్ మకాన్ తదితర మూవీస్‌కి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఇప్పుడు ఈయన మృతి చెందడంతో పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
(ఇదీ చదవండి: నిజజీవిత కథ.. 'గరివిడి లక్ష‍్మి' గ్లింప్స్ రిలీజ్)