టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కన్నుమూత | Director A S Ravi Kumar Chowdary Passed Away | Sakshi
Sakshi News home page

A.S. Ravi Kumar Chowdary: గుండెపోటుతో మరణించిన తెలుగు డైరెక్టర్

Jun 11 2025 10:53 AM | Updated on Jun 11 2025 11:04 AM

Director A S Ravi Kumar Chowdary Passed Away

తెలుగులో పలు సినిమాలు తీసిన దర్శకుడు ఏఎస్ రవికుమార్ మృతి చెందారు. గతరాత్రి గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. గతేడాది చివరగా రాజ్ తరుణ్‌తో 'తిరగబడరా సామీ' అనే మూవీ చేశారు. ఇప్పుడు ఇలా అకాల మరణం చెందడంతో టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్తతో తెలుగు చిత్రసీమలో విషాదం నెలకొంది.

గోపీచంద్ హీరోగా నటించిన 'యజ్ఞం' సినిమాతో దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టిన ఏఎస్ రవికుమార్ చౌదరి.. బాలకృష్ణతో 'వీరభద్ర', సాయి ధరమ్ తేజ్‌తో 'పిల్లా నువ్వు లేని జీవితం'తో పాటు ఆటాడిస్తా, ఏం పిల్లో ఏం పిల్లడో తదితర చిత్రాలు తీశారు. అయితే 'తిరగబడరా సామీ' పరాజయం పాలవడంతో తీవ్ర ఒత్తిడికి లోనయినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈయన మృతి పట్ల తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షులు వీరశంకర్ సంతాపం తెలియజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement