కర్ణాటక రాజధాని బెంగళూరులో విషాదం చోటు చేసుకుంది. నగర సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ రియాలిటీ షో డ్యాన్సర్ సుధీంద్ర(36) మృతిచెందారు. రోడ్డుపక్కన కారు ఆపి నిలిపి ఉండగా.. వేగంగా వచ్చిన ట్రక్కు సుధీంద్రను ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్యాన్సర్ సుధీంద్రకు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
నిద్రమత్తులో ట్రక్కు నడిపిన డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కారు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. కాగా.. కొత్త కారు కొన్న సుధీంద్ర తన తమ్ముడికి చూపించేందుకు వెళ్తండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే కారులో సమస్య రావడంతో నేలమంగళ తాలూకాలోని పెమ్మనహళ్లి సమీపంలో హైవే పక్కన ఆపినట్లు సమాచారం. కాగా.. సుధీంద్ర పలు టెలివిజన్ రియాలిటీ షోలలో పాల్గొన్నారు.
A Life Lost, A System Failed: Sudheendra’s Death Near Nelamangala Exposes Stark Road Safety Neglect
The tragic death of 36-year-old dancer Sudheendra near Nelamangala is not just a personal loss it’s a damning indictment of our civic infrastructure and administrative apathy.… pic.twitter.com/6FrnDY9A6g— Karnataka Portfolio (@karnatakaportf) November 4, 2025


