
వాషింగ్టన్: అపోలో 13 మిషన్‌కు నాయకత్వం వహించిన అమెరికా వ్యోమగామి జిమ్ లవెల్ 97 ఏళ్ల వయస్సులో శుక్రవారం కన్నుమూ శారు. ‘జిమ్ వ్యక్తిత్వం, దృఢ సంకల్పం మన దేశం చంద్రుడిని చేరుకోవడానికి, విషాదాన్ని విజయంగా మార్చడానికి సహాయపడ్డాయి, అప్పటి ఘటన నుంచి మేం ఎంతో నేర్చుకు న్నాం. జిమ్ మరణానికి సంతాపం తెలియజే స్తున్నాం’అని నాసా ఒక ప్రకటనలో తెలిపింది. నాసా కార్యకలాపాలు చేపట్టిన మొదటి దశాబ్ద కాలంలో అత్యధికంగా ప్రయాణించిన వ్యోమగాములలో ఒకరు లవెల్. జెమిని 7, జెమిని 12, అపోలో 8, అపోలో 13 మిషన్లలో నాలుగుసార్లు ప్రయాణించారు.
1928లో క్లీవ్‌ల్యాండ్‌లో జన్మించారు లవెల్. 1952లో అమెరికా నేవల్ అకాడెమీలో డిగ్రీ సాధించారు. 1952లో టెస్ట్ పైలట్, 1962లో నాసాలో వ్యోమగామిగా ఎంపికయ్యారు. జెమిని 7, అపొలో 8 వంటి మిషన్లలో ఆయన భాగస్వామిగా ఉన్నప్పటికీ, 1970 నాటి అపొలో 13 మిషన్ మాత్రం లెజెండ్‌గా ఆయన్ను మార్చివేసింది. మూడో యాత్ర సందర్భంగా చంద్రుడిపైకి దిగాక ఆక్సిజన్ సిలిండర్ పేలిపోయింది. దీంతో, అందులోని సిబ్బంది భూమికి సుమారు 2 లక్షల మైళ్ల దూరంలో చిక్కుబడిపోయారు. అయినప్పటికీ ధైర్యాన్ని కోల్పోక ప్రత్యామ్నా యాలను అనుసరించి, అపాయం నుంచి బయటపడ్డారు.
‘వాస్తవానికి ఆ మిషన్ విఫల మైంది. దాంతో సాధించింది కూడా ఏమీ లేదు. కానీ, దాని ద్వారా వచ్చిన ఫలితం మాత్రం అద్భుతం. అలాంటి విపత్తును సైతం ధైర్యంగా స్వీకరించి విజయవంతంగా మార్చ గల సత్తా ఉందని నిరూపించడమే మేం సాధించిన విజయం’అని లవెల్ రాయిటర్స్‌కు 2010లో ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
తనతోపాటు సహచరులు జాక్ స్విగెర్ట్, ఫ్రెడ్ హయిజ్‌లు.. గడ్డకట్టించే చలి, ఆకలి, మరో వైపు కేవలం నాలుగు రోజులకు మాత్రమే సరిపడే ఆక్సిజన్ ఉన్నా ఎంతో ధైర్యతో వ్యవ హరించామన్నారు. ఆ సమయంలో స్విగెర్ట్.. ‘హౌస్టన్, మాకో సమస్య వచ్చి పడింది’అంటూ నాసాకు చాలా తేలికైన సందేశమిచ్చారు. దీనినే టామ్ హాంక్స్ 1995 నాటి అపొలో 13 సినిమాలో వాడుకున్నారు. ఆ సినిమాలో లవెల్ పాత్రను టామ్ హాంక్స్ పోషించడం విశేషం. అపొలో 13 మిషన్ పసిఫిక్ సముద్రంలో సురక్షితంగా ల్యాండైంది. అప్పటికే లవెల్ పేరు ప్రపంచమంతటా మారుమోగిపోయింది. ఎన్నో తీవ్ర ఒత్తిళ్ల మధ్య నిబ్బరంగా పనిచేసిన లవెల్ మారుపేరుగా నిలిచారు. 1973లో నాసా నుంచి రిటైరయ్యారు.