ఇంగ్లండ్ క్రికెట్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆ జట్టు మాజీ క్రికెటర్ హ్యూగ్ మోరిస్ (62) కన్నుముశారు. గత కొన్నాళ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న మోరిస్ ఆదివారం మృతి చెందారు. మోరిస్ సుదీర్ఘ కాలం ప్రాతినిధ్యం వహించిన గ్లామోర్గాన్ కౌంటీ జట్టు ఒక ప్రకటనలో సంతాపం తెలిపింది. ఆటగాడిగానే కాకుండా... సీఈఓ గానూ క్లిష్ట పరిస్థితుల్లో క్లబ్‌ను ఆర్ధిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించినట్లు అందులో పేర్కొంది. (Hugh Morris Death)
ఇంగ్లండ్ తరఫున 3 టెస్టులు ఆడిన మోరిస్... ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో పరుగుల వరద పారించారు. ఆటకు వీడ్కోలు పలికిన అనంతరం ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు సీఈఓగాను మోరిస్ బాధ్యతలు నిర్వర్తించారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 314 మ్యాచ్‌లాడిన ఈ ఓపెనర్... 19,785 పరుగులు చేశారు. అందులో 53 సెంచరీలు, 98 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక లిస్ట్ ‘ఎ’ క్రికెట్‌లో 274 మ్యాచ్‌ల్లో 8606 పరుగులు చేశారు.


