ది కేరళ స్టోరీ హీరోయిన్ ఆదా శర్మ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె అమ్మమ్మ ఇవాళ ఉదయం కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో నెల రోజుల క్రితం ఆస్పత్రిలో చేరిన ఆమె తుదిశ్వాస విడిచింది. ఈ ఘటనతో ఆదా శర్మ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తన అమ్మమ్మను పాటీ అని ముద్దుగా పిలిచేది ఆదా శర్మ. ఆమె మరణంపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
కాగా..ఈ ఏడాది ప్రారంభంలో ఆదా శర్మ తన అమ్మమ్మ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంది. ఆమెతో ఉన్న వీడియోను షేర్ చేస్తూ నాని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. ఇక ఆదా శర్మ సినిమాల విషయానికొస్తే ఈ ఏడాది చివరిసారిగా తుమ్కో మేరీ కసమ్ చిత్రంలో కనిపించింది. ఈ చిత్రానికి విక్రమ్ భట్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, ఇష్వాక్ సింగ్, ఈషా డియోల్ ప్రధాన పాత్రల్లో నటించారు.


