అమెరికాలో నల్గొండ విద్యార్థిని కన్నుమూత | Nalgonda student Priyanka declared brain dead in US | Sakshi
Sakshi News home page

అమెరికాలో నల్గొండ విద్యార్థిని కన్నుమూత

May 14 2025 1:12 PM | Updated on May 14 2025 5:33 PM

Nalgonda student Priyanka declared brain dead in US

ఉన్నత చదువులకోసం  విదేశాలకు  వెళ్లిన మరో భారతీయ విద్యార్థి  కన్నుమూసింది. ఇటీవలి కాలంలోఅమెరికాలో భారత విద్యార్థుల మృతుల సంఖ్య ఆందోళనకరంగా  మారుతోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థుల సంఖ్య అధికంగా ఉండటం మరింత విషాదం. తాజాగా మరో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం పందెనపల్లికి చెందిన యువతి మృతి చెందింది. 

నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం పందెనపల్లికి చెందిన కొండి వెంకట్ రెడ్డి, శోభారాణి దంపతులకు కుమార్తె ప్రియాంక(26) అమెరికాలో అగ్రికల్చర్ ఎమ్మెస్సీ (మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ అగ్రికల్చర్) చదువుతోంది. అనారోగ్యంతో మృతి చెందడం విషాదాన్ని  నింపింది.అలబామా యూనివర్సిటీలో ఎంఎస్సీ పూర్తిచేసిన ప్రియాంక అక్కడే  పార్ట్ టైం వర్క్ చేస్తోంది. బ్రెయిన్ డెడ్ (మెదడు మృతి) స్థితికి చేరుకోవడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. దంత సంబంధిత అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లగా.. పరీక్షించి ఆమెకు బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉందని తెలిపిన వైద్యులు తెలిపారు. స్నానం చేసేందుకు వెళ్లిన ప్రియాంక బాత్రూంలో పడిపోయి ఉండటాన్ని గమనించి స్నేహితులు ఆసుపత్రికి తీసుకువెళ్లగా.. అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న ప్రియాంకను పరిశీలించి ఆమె బ్రెయిన్ డెడ్ అయిందని  వైద్యులు నిర్ధారించారు.  ఈ ఘటన ఆమె కుటుంబ సభ్యులతో పాటు గ్రామంలోని సన్నిహితులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement