శ్రీనివాస ఫార్మ్స్ చైర్మన్‌ జగపతి రావు కన్నుమూత | Srinivasa Farms Chairman Chitturi Jagapati Rao passes away | Sakshi
Sakshi News home page

శ్రీనివాస ఫార్మ్స్ చైర్మన్‌ జగపతి రావు కన్నుమూత

Nov 29 2025 8:14 PM | Updated on Nov 29 2025 8:29 PM

Srinivasa Farms Chairman Chitturi Jagapati Rao passes away

సాక్షి, హైదరాబాద్‌: ప్రముఖ వ్యాపారవేత్త శ్రీనివాస ఫార్మ్స్ చైర్మన్‌ చిట్టూరి జగపతి రావు ఇక లేరు. భారతదేశ పౌల్ట్రీ రంగానికి విశేష సేవలు అందించిన ఆయన శనివారం తన నివాసంలో కన్నుమూశారు. 

చిట్టూరి జగపతి రావు తూర్పు గోదావరి జిల్లా కుళ్లా గ్రామంలో జన్మించారు. దేశ ఆధునిక పౌల్ట్రీ పితామహుడిగా ఈయనకంటూ ఓ గుర్తింపు ఉంది. నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ (NECC) స్థాపనలో ఈయనది కీలక పాత్ర. పౌల్ట్రీ రంగంలో రైతులకు రక్షణ కల్పించడం.. గుడ్ల ధరలను స్థిరీకరించడంతో పాటు ఫార్మ్స్‌ ఏర్పాటుతో లక్షలాది ఉద్యోగాలను సృష్టించారాయన. ఆయన చేసిన కృషికిగానూ పలు అవార్డులు దక్కాయి. 2023లో ఆయనకు ‘ఇంటర్నేషనల్ ఎగ్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు లభించింది.

చిట్టూరి జగపతి రావు మరణం పౌల్ట్రీ రంగానికి, వ్యవసాయ అనుబంధ రంగాలకు తీరని లోటని పలువురు ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు. అంతేకాదు.. సోషల్‌ మీడియాలోనూ ఓ పోస్ట్‌ చేశారు. శనివారం సాయంత్రం ఆయన అంత్యక్రియలు ముగిసినట్లు సమాచారం. 

 

Advertisement
 
Advertisement
Advertisement