కోలీవుడ్‌లో విషాదం.. మనోరమ కుమారుడు కన్నుమూత | Late actress Manorama son Bhoopathi passes away | Sakshi
Sakshi News home page

Manorama: కోలీవుడ్‌లో విషాదం.. మనోరమ కుమారుడు కన్నుమూత

Oct 24 2025 3:36 PM | Updated on Oct 24 2025 4:38 PM

Late actress Manorama son Bhoopathi passes away

దాదాపు వెయ్యికి పైగా చిత్రాల్లో మెప్పించిన నటి మనోరమ కుమారుడు కన్నుమూశారు.  దివంగత నటి కుమారుడు భూపతి(70) గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఆయన.. చైన్నైలోని త్యాగరాయ నగర్‌లోని తన ఇంట్లోనే మరణించినట్లు పీఆర్‌ఓ నిఖిల్ వెల్లడించారు. ‍అతని మరణ వార్త విన్న కోలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు.

కాగా.. తమిళ సినిమా చరిత్రలో మనోరమ దాదాపు 1000 కి పైగా చిత్రాలలో నటించింది. ఆమె వృద్ధాప్య సమస్యలతో అక్టోబర్ 2015లోనే మరణించింది. మనోరమ ఏకైక కుమారుడు భూపతిని ఇండస్ట్రీకి పరిచయం చేసింది.  అతన్ని చిత్ర పరిశ్రమకు పరిచయం చేయడానికి మనోరమ అనేక ప్రయత్నాలు చేసింది. కానీ భూపతి చేసిన చిత్రాలు ఆశించిన విజయం సాధించలేకపోయాయి. అతను 'కుడుంబం ఓరు కదంబం' అనే మూవీలో నటించాడు. అయితే తీసిన సినిమాల్లో పెద్దగా గుర్తింపు రాలేదు. కాగా.. భూపతి అభిరామి (25) అనే కూతురు ఉన్నారు. 

కాగా.. నటి మనోరమను అప్పట్లో ‘లేడీ శివాజీ గణేశన్’ అని గుండెలకు హత్తుకున్నారు ప్రేక్షకులు. దాదాపు 1500 చిత్రాలలో నటించి గిన్నిస్ బుక్‌లోకి ఎక్కి ప్రపంచ చరిత్రను తిరగరాసింది.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement