నటుడు పార్తిబన్ పరువు తీసేసిన త్రిష.. ట్వీట్ వైరల్ | Actress Trisha Reacts Parthiban Comments | Sakshi
Sakshi News home page

Trisha: ఆ నటుడికి బుర్రలేదు.. త్రిష ఇలా అనేసిందేంటి?

Mar 8 2026 9:26 PM | Updated on Mar 9 2026 9:22 AM

Actress Trisha Reacts Parthiban Comments

హీరోయిన్ త్రిష రీసెంట్ టైంలో పెద్దగా సినిమాలు చేయలేదు. అయినా సరే సోషల్ మీడియా అంతా ఈమె గురించే మాట్లాడుకుంటున్నారు. విజయ్‌తో ఈమె రిలేషన్‌లో ఉందనే రూమర్సే దీనికి కారణం. ఎక్కడా ఈ విషయాన్ని అధికారికం చేయనప్పటికీ.. దాదాపు అందరూ వీళ్లిద్దరి గురించే మాట్లాడుకుంటున్నారు. తమిళ నటుడు పార్తిబన్ కూడా వీళ్ల బంధం గురించి పరోక్షంగా అర్థం వచ్చేలా చిల్లర కామెంట్స్ చేశాడు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు ట్వీట్ చేసింది.

శనివారం రాత్రి చెన్నైలో జరిగిన ఓ అవార్డ్ వేడుకలో నటుడు దర్శకుడు పార్తిబన్, త్రిష గురించి మాట్లాడుతూ.. ఆమె ఇంట్లో ఉంటేనే మంచిది. బయటకు వస్తే ఎక్కడలేని సమస్యలన్నీ వస్తున్నాయి అని అన్నాడు. ఈ వ్యాఖ్యల పట్ల సోషల్ మీడియాలోనూ గట్టిగానే విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడీ విషయం కాస్త త్రిష వరకు చేరడంతో ఆమె కుడా ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్తిబన్‌కి అసలు బుర్ర లేదనేలా రాసుకొచ్చింది.

'ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో నా పేరు, ఫొటో చేర్చుతున్నామని చివరి నిమిషంలో నిర్వాహకులు సమాచారం ఇచ్చారు. ఓ వ్యక్తి తన సహాయుకుడిని పంపించి నన్ను అడిగారు. అయితే మైక్రోఫోన్‌లో మాట్లాడినంత మాత్రాన అది తెలివైన వ్యాఖ్య లేదా కామెడీనో అవదు. అది కేవలం మూర్ఖత్వాన్ని ఎక్కువ వినిపించేలా చేస్తుంది. జ్ఞానం లేకుండా మాట్లాడే అసభ్య పదాలు, అవి ఎవరిని లక్ష‍్యంగా చేసుకున్నాయో అనేదాని కంటే మాట్లాడిన వ్యక్తి తత్వాన్ని బయటపెడతాయి' అని త్రిష ట్వీట్ చేసింది. పార్తిబన్‌కి అసలు బుర్ర లేదు అని అర్థం వచ్చేలా త్రిష రాసుకొచ్చింది.

Advertisement
 
Advertisement
Advertisement