
ముంబై: బ్యాంకాక్–ముంబై ఇండిగో విమానానికి త్రుటిలో పెనుప్రమాదం తప్పింది. శనివారం వేకువజామున ముడు గంటల సమయంలో ముంబై విమానాశ్రయంలో ఎయిర్‌బస్ విమానం లాండయ్యింది. ఆ సమయంలో విమానం తోకభాగం రన్‌వేను తాకింది. ప్రతికూల వాతావరణం కారణంగా విమానం తక్కువ ఎత్తులో విమానాశ్రయం చుట్టూ ఎగురుతూ ల్యాండ్ అయ్యే సమయంలో ఘటన చోటుచేసుకుంది. అనంతరం మరో ప్రయత్నంలో సురక్షితంగా ల్యాండైంది. ఈ నేపథ్యంలో విమానం పైలట్, కోపైలట్‌లను తాత్కాలికంగా విధుల నుంచి తప్పించారు. ఘటనపై విచారణకు ఆదేశించినట్లు డీజీసీఏ తెలిపింది.
ఈ నేపథ్యంలో ఘటనపై ఇండిగో ప్రతినిధి మాట్లాడుతూ.. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా తక్కువ ఎత్తులో ప్రయాణిస్తుండగా ఇండిగో ఎయిర్‌బస్ A321 విమానం తోక రన్‌వేను తాకింది. ఆ తర్వాత, విమానం మరొక సమీపానికి వెళ్లి సురక్షితంగా ల్యాండ్ అయింది. ప్రామాణిక ప్రోటోకాల్‌ను అనుసరించి, విమానం తిరిగి కార్యకలాపాలను ప్రారంభించే ముందు అవసరమైన తనిఖీలు, మరమ్మతుల అనుమతి తర్వాతే వెళుతుంది. ప్రయాణికులు, సిబ్బంది, విమానాల భద్రత మా మొదటి ప్రాధాన్యత. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రయత్నిస్తామని అన్నారు.
IndiGo plane tail touches runway at Mumbai amid bad weather@tweets_amit with more details#indigoflight #Mumbai @suyeshasavant pic.twitter.com/nDzTY1yxFe
— IndiaToday (@IndiaToday) August 16, 2025