ఢిల్లీ: ప్రముఖ విమానయాన రంగ సంస్థ ఇండిగోలో కలకలం రేగింది. కోల్‌కతా నుంచి శ్రీనగర్‌కు వెళ్తున్న ఇండిగో విమానం 6E 6961లో ఫ్యూయల్ ట్యాంక్ లీకైంది. దీంతో అప్రమత్తమైన పైలెట్ విమానాన్ని ఉత్తరప్రదేశ్ లాల్‌బహుదూర్ శాస్త్రి ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్ చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో ఇండిగో విమానంలో 166మంది ప్రయాణికులున్నారు.
అత్యవసర ల్యాండింగ్ కారణంగా విమానంలోని ప్రయాణికులు, సిబ్బందికి ఎలాంటి అపాయం సంభవించలేదని, సురక్షితంగా ఉన్నట్లు ఇండిగో యాజమాన్యం ప్రకటించింది. ల్యాండింగ్ తర్వాత విమానంలోని ఫ్యూయల్ లీకేజీ సమస్యని పరిష్కరించి, తిరిగి కార్యకలాపాలు ప్రారంభించినట్లు సమాచారం.


