ఎలుక హల్‌చల్‌.. మూడు గంటలు ఆలస్యంగా ఇండిగో విమానం టేకాఫ్‌ | Delhi-Kanpur Indigo Flight Delayed by 3 Hours, Rat in Cabin | Sakshi
Sakshi News home page

ఎలుక హల్‌చల్‌.. మూడు గంటలు ఆలస్యంగా ఇండిగో విమానం టేకాఫ్‌

Sep 22 2025 10:32 AM | Updated on Sep 22 2025 10:39 AM

Delhi-Kanpur Indigo Flight Delayed by 3 Hours, Rat in Cabin

కాన్పూర్‌: 172 మంది ప్రయాణికులతో బయలుదేరేందుకు సిద్ధమైన ఇండిగో విమానం ఒక ఎలుక కారణంగా మూడు గంటలు ఆలస్యంగా టేక్‌ ఆఫ్‌ అయ్యింది. కాన్పూర్ నుండి ఢిల్లీకి వెళ్లే విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విమానపు సిబ్బంది క్యాబిన్‌లో ఎలుక కనిపించడంతో ఎలుకను వెదికి పట్టుకునేందుకు ముందుగా ప్రయాణికులను కిందకు దింపారు. ఎలుకను పట్టుకుని, దానిని తొలగించిన తర్వాత విమానం బయలుదేరింది.

షెడ్యూల్ ప్రకారం ఢిల్లీ-కాన్పూర్ ఇండిగో విమానం ఆదివారం మధ్యాహ్నం 2.10 గంటలకు చకేరి విమానాశ్రయం(కాన్పూర్‌)లో ల్యాండ్ అయింది. ఆ విమానం మధ్యాహ్నం 2.50 గంటలకు బయలుదేరాల్సి ఉంది. ఆ సమయంలో విమానంలో దాదాపు 172 మంది ప్రయాణికులున్నారు. టేకాఫ్‌కు  సిద్ధం అయ్యేంతలో క్యాబిన్ లోపల ఒక ఎలుక పరిగెత్తుతున్నట్లు సిబ్బంది ఒకరు గమనించారు. ఆయన ఈ విషయాన్ని సీనియర్ అధికారులకు  తెలియజేయగా, తొలుత ప్రయాణికులందరినీ దింపి, లాంజ్‌కు తరలించారు. ఎలుకను పట్టుకుని , దానిని తొలగించిన తర్వాత ప్రయాణికులను విమానంలోనికి ఎక్కాలని కోరారు. విమానం సాయంత్రం 4.50 గంటలకు బయలుదేరింది. కాన్పూర్ విమానాశ్రయ మీడియా ఇన్‌ఛార్జ్ వివేక్ సింగ్ విమానంలో ఎలుక ఉందని ధృవీకరించారు. ఎలుకను పట్టుకునేందుకు దాదాపు గంటన్నర సమయం పట్టిందన్నారు. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యాన్ని నివారించేందుకు రిఫ్రెష్‌మెంట్‌లు, ఇతర ఏర్పాట్లు చేసినట్లు ఇండిగో అధికారులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement