ఆకాశంలో అల్లకల్లోలం.. 170మందితో వెళ్తున్న విమానాన్ని పక్షి ఢీకొట్టడంతో.. | IndiGo Flight Suffers Bird Hit At 4,000 Feet | Sakshi
Sakshi News home page

ఆకాశంలో అల్లకల్లోలం.. 170మందితో వెళ్తున్న విమానాన్ని పక్షి ఢీకొట్టడంతో..

Jun 2 2025 5:53 PM | Updated on Jun 2 2025 7:10 PM

IndiGo Flight Suffers Bird Hit At 4,000 Feet

రాంచీ: ఓ పక్షి ఆకాశంలో అల్లకల్లోలం సృష్టించింది. 170 మంది ప్రయాణికులతో వెళుతున్న విమానాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనతో విమానాన్ని,అందులోని ప్యాసింజర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. అ‍యితే, పైలెట్‌ అప్రమత్తం కావడంతో ప్రయాణికులు సురక్షితంగా భయపడ్డారు. వారిలో పలువురు ప్రయాణికులకు గాయలైనట్లు తెలుస్తోంది. 

సోమవారం మధ్యాహ్నం 1.14 గంటల సమయంలో ఇండిగో ఎయిర్‌బస్ 320 (Airbus 320) విమానం పాట్నా నుండి రాంచీ(ranchi)కి రావాల్సి ఉంది. ఆ సమయంలో ఎయిర్‌బస్‌ 320ని ఓ పక్షి ఢీకొట్టింది. ఈ ఘటనలో విమానానికి పగుళ్లు ఏర్పడ్డాయి. ప్రమాదంతో అప్రమత్తమైన పైలెట్‌ చాకచక్యంగా ల్యాండింగ్‌ చేయాల్సిన ఎయిర్‌ పోర్టుకు కాకుండా సమీపంలో ఉన్న రాంచీ బిర్సా ముండా విమానాశ్రయంలో విమానాన్ని సురక్షితంగా దించారు. ఈ ఘటనలో 175 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.   



రాంచీ సమీపంలో ఇండిగో విమానాన్ని ఓ  పక్షి ఢీకొట్టింది. ఈ సంఘటన జరిగినప్పుడు ఫ్లైట్‌ 3,000 నుండి 4,000 అడుగుల ఎత్తులో ఉంది. ఇండిగో విమానం పాట్నా నుండి రాంచీకి వస్తుండగా, పైలట్ ఇక్కడ అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది’ అని రాంచీలోని బిర్సా ముండా విమానాశ్రయ డైరెక్టర్ ఆర్ ఆర్ మౌర్య  తెలిపారు.

ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని, పక్షి ఢీకొట్టడం వల్ల విమానానికి పగుళ్లు ఏర్పడ్డాయి. ఇంజనీర్లు నష్టాన్ని అంచనా వేస్తున్నారు’ అని అన్నారు. కాగా, ఈ ఘటనపై ఇండిగో ప్రతినిధులు అధికారికంగా స్పందించాల్సి ఉంది. 

Advertisement
 
Advertisement
Advertisement