
విమానంలో క్రికెట్ లెజెండ్ కపిల్‌దేవ్ కనిపించడం విశేషం కాకనొవచ్చు. అయితే ఈసారి మాత్రం విశేషంగా మారింది. ఇండిగో ఆహ్వానం మేరకు విమానంలోకి అడుగుపెట్టిన కపిల్‌దేవ్ కొత్తగా కెప్టెన్‌గా ప్రమోట్ అయిన ప్రియాంక యూనిఫామ్‌కు చారలపట్టి పిన్ చేశారు.
ఈ ఫోటోని విమానయాన సంస్థ ఇండిగో ‘ఎక్స్’లో తన అఫీషియల్ ఎకౌంట్‌లో షేర్ చేసింది. ‘ఇది చిరస్మరణీయంగా గుర్తుండి పోయే సందర్భం. కెప్టెన్ కావడం అనేది చిన్న విషయమేమీ కాదు. ప్రియాంకకు తన విజయాన్ని ఎప్పుడూ గుర్తు చేసుకునే మధుర జ్ఞాపకం’ ... ఇలాంటి కామెంట్లు ఇండిగో పోస్ట్‌లో కనిపిస్తాయి.
‘చూడముచ్చటైన దృశ్యం. గోవా టు దిల్లీ ఫ్లైట్‌లో ఈ అపురూప దృశ్యాన్ని చూసే అవకాశం నాకు వచ్చింది’ అని రాశారు అదే ఫ్టైట్‌లో ప్రయాణించిన ఒక యూజర్. ‘ఫ్రమ్ ఏ విన్నింగ్ కెప్టెన్ టు ఏ న్యూ కెప్టెన్’ అన్నారు ఒకరు. ‘కెప్టెన్ ప్రియాంక నేపథ్యం ఏమిటి? ఆ స్థాయికి రావడానికి పడిన కష్టాల గురించి రాసి ఉంటే ఎంతో మందికి స్ఫూర్తిగా ఉండేది’ అని రాశారు ఒక యూజర్.
Becoming a Captain is no small feat and having Mr. Kapil Dev pin her stripes made Captain Priyanka’s achievement a moment she’ll always treasure. There’s indeed no better way to say Hello, Captain! #goIndiGo@therealkapildev pic.twitter.com/09tgA7cowR
— IndiGo (@IndiGo6E) October 4, 2025
(చదవండి: నెల జీతం వస్తోంది కానీ... విత్ డ్రా చేయలేకపోతున్నాను..!)