
విమానంలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి ఎయిర్ హోస్టెస్‌తో అసభ్యంగా ప్రవర్తించిన తాజాగా వెలుగులోకి చ్చింది.ఢిల్లీ-షిర్డీ వెళ్తున్న ఇండిగో విమానంలో విమాన సిబ్బందిలో భాగమైన ఎయిర్‌హోస్టెస్‌ను వేధింపులకు గురిచేశాడు. ఆమెను అనుచితంగా తాకి లైంగికంగా వేధించాడు. చివరికి ఏమైందంటే..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మే 2న ఢిల్లీ నుంచి షిర్డీ వెళ్లే 6E 6404 ఇండిగో విమానంలో మద్యం తాగిన వ్యక్తి ఎయిర్ హోస్టెస్‌ను లైంగికంగా వేధించాడనే ఆరోపణలు నమోదయ్యాయి. ఈ ఫిర్యాదు మేరకు శుక్రవారం మధ్యాహ్నం ఇండిగో విమానం షిర్డీ విమానాశ్రయంలో దిగిన తర్వాత నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
విమానంలోని టాయిలెట్ దగ్గర ప్రయాణీకుడు ఎయిర్ హోస్టెస్‌ను అనుచితంగా తాకినట్లు పోలీసు అధికారి తెలిపారు. అసభ్యకరమైన ప్రవర్తనతో విసిగిపోయిన ఎయిర్ హోస్టెస్ తన మేనేజర్‌కు సమాచారం అందించింది. దీంతో విమానం షిర్డీ విమానాశ్రయంలో దిగిన తర్వాత వారు భద్రతా సిబ్బందికి సమాచారం అందించారని, ఆ ప్రయాణీకుడిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారి తెలిపారు.
రహతా పోలీస్ స్టేషన్‌లో అతనిపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. వైద్య పరీక్షలో అతను మద్యం సేవించినట్లుగా కూడా నిర్ధారణ అయింది. దీనిపై ఇండిగో ఎయిర్‌లైన్స్ స్పందింస్తూ.. ‘‘అందరికీ సురక్షితమైన, గౌరవప్రదమైన వాతావరణాన్ని" అందించడమే తమ లక్ష్యమని వెల్లడించింది. ప్రయాణికులకు ఏదైనా అసౌకర్యం కలిగి ఉంటే చింతిస్తున్నామని ఎయిర్‌లైన్ ఓ ప్రకటనలో పేర్కొంది.