గోపాలపట్నం (విశాఖ): సాంకేతిక కారణాలతో దేశవ్యాప్తంగా ఇండిగో విమానాలు రద్దు ప్రభావం విశాఖ విమానాశ్రయంపై కూడా పడింది. ఇక్కడ గురువారం మొత్తం ఆరు ఇండిగో విమానాలు రద్దయ్యాయని విశాఖ విమానాశ్రయం అధికారులు వెల్లడించారు.
హైదరాబాద్–విశాఖ– హైదరాబాద్ (618/307), విశాఖ–బెంగళూరు–విశాఖ (217/218), చెన్నై–విశాఖ–ముంబై (557/6485), ముంబై–విశాఖ–చెన్నై (5248/845), కోల్‌కత–విశాఖ–కోల్‌కత (512/617), ఢిల్లీ–విశాఖ–ఢిల్లీ (6779/6680) విమానాలను రద్దుచేశారు.


