సౌత్‌వెస్ట్‌ ఎయిర్‌లైన్స్‌ ఛైర్మన్‌గా ఇండిగో కో-ఫౌండర్ | IndiGo Co-founder Rakesh Gangwal Appointed As Southwest Airlines Chairman | Sakshi
Sakshi News home page

సౌత్‌వెస్ట్‌ ఎయిర్‌లైన్స్‌ ఛైర్మన్‌గా ఇండిగో కో-ఫౌండర్

Nov 6 2024 12:22 PM | Updated on Nov 6 2024 12:36 PM

IndiGo Co-founder Rakesh Gangwal Appointed As Southwest Airlines Chairman

ఇండిగో కో-ఫౌండర్ 'రాకేష్ గంగ్వాల్' అమెరికాలోనే ప్రధాన విమానాశ్రయాల్లో ఒకటైన సౌత్‌వెస్ట్‌ ఎయిర్‌లైన్స్‌ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. జులైలో బోర్డులో మెంబర్‌షిప్‌గా చేరిన గంగ్వాల్.. ఇటీవల 108 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 900 కోట్లు) విలువైన షేర్స్ కొనుగోలు చేశారు.

కొత్త బోర్డు కమిటీ అధ్యక్షుల పేర్లతో పాటుగా గంగ్వాల్ స్వతంత్ర బోర్డు ఛైర్మన్‌గా వ్యవహరిస్తారని ప్రకటించింది. సౌత్‌వెస్ట్‌ ఎయిర్‌లైన్స్ తిరిగి బలమైన ఆర్థిక పనితీరుకు మార్గనిర్దేశం చేసేందుకు ప్రెసిడెంట్, సీఈఓ బాబ్ జోర్డాన్‌ సహకారం కూడా ఉంటుందని గంగ్వాల్ పేర్కొన్నారు.

సెప్టెంబరు 30, అక్టోబరు ప్రారంభంలో గంగ్వాల్  3.6 మిలియన్ షేర్లను సౌత్‌వెస్ట్‌లో కొనుగోలు చేశారు. ఒక్కో షేరుకు 29 డాలర్ల నుంచి 30 డాలర్ల మధ్యలో ఉన్నాయి. మొత్తం పెట్టుబడి 108 మిలియన్ డాలర్లు. గంగ్వాల్ వరల్డ్‌స్పాన్ టెక్నాలజీస్‌కు చైర్మన్ & సీఈఓగా కూడా బాధ్యతలు నిర్వరిస్తున్నారు. ఈయన ఐఐటీ కాన్పూర్ పూర్వ విద్యార్ధి. 2022లో స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీని స్థాపించారు.

Advertisement
 
Advertisement
Advertisement