యెమెన్‌లోనిహౌతీ తిరుగుబాటుదారుల దాడులు కొనసాగుతున్నాయ. ఈ నేపథ్యంలో యెమెన్‌లో పరిస్థితి ఆందోళన కరంగా ఉంది. యెమెన్‌లో ప్రభుత్వ ఆధ్వర్యంలోని సైన్యానికి సౌదీ అరేబియా మద్దతు ఇస్తుంటే, తిరుగుబాటుదారులైన హౌతీలకు ఇరాన్ మద్దతు ఇస్తోంది. ఈ ఉద్రిక్తత దేశీ విమానయాన సంస్థలు రియాద్‌కు విమానాలు రద్దు చేశాయి. సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో భద్రతా పరిస్థితులు క్షీణించడంతో ఎయిరిండియా, ఇండిగో, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానయాన సంస్థలు రియాద్‌కు వెళ్లాల్సిన విమానాలను అక్టోబర్ 10 వరకు రద్దు చేశాయి.
ప్రభావితమైన ప్రయాణీకులకు పూర్తి రీఫండ్ (Full Refund) లేదా ఉచితంగా మరో తేదీకి మార్చుకునే (Rescheduling) సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు ఎయిర్ లైన్స్ ప్రకటించాయి. విమానాశ్రయానికి వెళ్లే ముందు ప్రయాణీకులు తమ విమాన స్థితిని (Flight status) నేరుగా తనిఖీ చేసుకోవాలని రియాద్‌లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయం కోరింది.
ఇదీ చదవండి: 5 కాసుల గోల్డ్ చైన్ కొట్టేసింది : యూట్యూబర్ మధుమితపై కేసు
హౌతీల దాడులు
ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ తిరుగుబాటుదారులు ఇటీవలి కాలంలో సౌదీ విమానాశ్రయాలు, సైనిక, చమురు కేంద్రాలపై దాడులను తీవ్రతరం చేశారు.సౌదీ గగనతలాన్ని తమ సైనిక కార్యకలాపాల ప్రాంతంగా అభివర్ణించిన హౌతీ తిరుగుబాటుదారులు, సౌదీ గగనతలంలో విమానాలు నడిపే అంతర్జాతీయ విమానయాన సంస్థలకు గురువారం ఉదయం "చివరి హెచ్చరిక" జారీ చేశారు.
ఇదీ చదవండి : ప్రభుత్వ ఉద్యోగం వద్దని నెలకు రూ. లక్ష సంపాదిస్తున్న బార్బర్
కాగా రియాద్, అభా విమానాశ్రయాలపై హౌతీలు జరిపిన దాడుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్లు బుధవారం సౌదీ అధికారులు వెల్లడించారు. సౌదీ అరేబియా, మిత్రపక్ష యెమెన్ బలగాలు హౌతీలపై పెద్ద ఎత్తున సైనిక దాడులు ప్రారంభించిన తర్వాత ఈ ప్రాణనష్టం సంభవించడం ఇదే మొదటిసారి.


