ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలి.. జీవితంలోసెటిల్ అవ్వాలనేది సగటు భారతీయ యువకుడి కల. కానీ ముంబైకి చెందిన ఒక వృత్తి కార్మికుడు (బార్బర్) ఆలోచన మాత్రం మరోలా ఉంది. ఒక ఎంట్రీ-లెవల్ ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా కూడా, తన వృత్తిని కొనసాగించ డానికే ఇష్టపడతానని చెబుతున్న వైనం ఆసక్తికరంగా మారింది. ముంబైకి చెందిన ఒక సెలూన్ బార్బర్ గురించి, ఫండ్ మేనేజర్ హర్ష్ గుప్తా మధుసూదన్ ఎక్స్ వేదికగా పంచుకున్న ఆసక్తికరమైన కథనం నెట్టింట ఆసక్తికరంగా మారింది.
ఉత్తరప్రదేశ్‌లోని ఆజమ్‌గఢ్‌కు చెందిన ఈ బార్బర్ ముంబైలో 'అర్బన్' (Urban) సంస్థ ద్వారా డోర్‌స్టెప్ సేవలు అందిస్తూ, ప్రయాణ ఖర్చులు పోను నెలకు దాదాపు రూ. 1 లక్ష వరకు ఆర్జిస్తున్నారు. వారానికి ఆరు రోజులు, ఉదయం నుండి రాత్రి వరకు కష్టపడి పని చేస్తారాయన.
ప్రభుత్వ ఉద్యోగం వద్దు
ప్రభుత్వ ఉద్యోగం కన్నా తన వృత్తిలో ఉండే స్వాతంత్ర్యాన్నే ఎక్కువ ఇష్టపడతానని చెప్పారు. ఒక వేళ ఎంట్రీ లెవల్ ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చినా తాను తీసుకోనని స్పష్టం చేశారు. కష్టపడి పనిచేసే వారికి దేశంలో తగినన్ని అవకాశాలున్నాయనే విశ్వాసాన్ని వ్యక్తం చేయడం విశేషం. యూపీలోని తన స్వగ్రామం గురించి మాట్లాడుతూ, గతంలో లక్నో వెళ్లడానికి 7-8 గంటలు పట్టేదని, కానీ ఇప్పుడు అభివృద్ది చెందిన హైవేల కారణంగా లంచ్, టీ తాగుతూ ప్రయాణించినా అదే సమయంలో రాకపోకలు (రౌండ్ ట్రిప్) సాధ్యమవుతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: 5 కాసుల గోల్డ్ చైన్ కొట్టేసింది : యూట్యూబర్ మధుమితపై కేసు
Got a hair cut via Urban today morning. The barber has been in Mumbai for sometime but is from Azamgarh. Works six days a week, morning to night and earns around a lakh rupees per month after his basic travel expenses. Said there is no dearth of opportunity or jobs, just need to work hard. Said wouldn’t take an entry level government job even if offered as he likes his work and autonomy. I asked him about UP. He said earlier it took 7-8 hours to go from his village to Lucknow. Now you can do a round trip in that time while stopping for lunch and tea. Added that your glass of tea is unlikely to spill on the highways - they are so good. Was very happy with the development work in the country. Said in the village his family got some scheme benefits but not in the city. Told me TDS is deducted so he proudly files his returns and often gets refunds. Has one son who he sends to a private pre-school and wife earned extra but is currently on break given the kid is small. I felt like telling him that he must let go of this toxic positivity about India and his life, and he must pronto create an account on X and Instagram to receive the “correct” opinions about our ostensibly ‘failed’ nation - but I didn’t have the heart to say that to him! ;)
— Harsh Gupta Madhusudan (@harshmadhusudan) October 7, 2026
ఇదీ చదవండి: నానా పటేకర్ లాస్ట్ మెసేజ్, చివరి ప్రసంగం: కన్నీళ్లు రాక మానవు!
అంతేకాదు ఆయన క్రమం తప్పకుండా ఆదాయపన్ను రిటర్న్స్ దాఖలు చేస్తారు. ఇది తనకు చాలా గర్వకారణమని కూడా చెప్తారు. ఆయనకు ఒక చిన్న కుమారుడు ఉన్నాడు. అతన్ని ఒక ప్రైవేట్ ప్రీ-స్కూల్‌లో చదివిస్తున్నారు. ఆయన భార్య కూడా గతంలో సంపాదించేవారట, ప్రస్తుతం పాపాయిని చూసుకోవడానికి ఆమె ఉద్యోగానికి కొంత విరామం ఇచ్చారు.
సోషల్ మీడియాలో స్పందన
ఈ పోస్ట్ నెటిజన్ల మధ్య పెద్ద చర్చకే దారితీసింది: కొందరు ఈ బార్బర్ కష్టాన్ని, గిగ్ వర్క్ (Gig work) ద్వారా ఆయన సాధించిన విజయాన్ని ప్రశంసించారు. మరికొందరు మాత్రం నెలకు రూ. 1 లక్ష సంపాదించడం చాలా అరుదైన విషయమని అందరికీ ఇది సాధ్యం కాకపోవచ్చని అభిప్రాయపడ్డారు. దేశంలో STEM (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్) రంగ చదువులు పూర్తి చేసిన ఎంతో మందికి సరైన ఉద్యోగాలు లేవని, ఈ ఒక్క ఉదాహరణతో దేశంలోని మొత్తం ఉపాధి పరిస్థితిని అంచనా వేయలేమని కొంతమంది వాదించారు.
ఇదీ చదవండి: పాములు పట్టేవాడు.. పాముకాటుకు బలైపోయాడు!


