న్యూఢిల్లీ: పశ్చిమాసియా ప్రాంతంలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా సౌదీ అరేబియాకు విమాన సర్వీసుల రద్దును అక్టోబర్ 24వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ శనివారం ప్రకటించాయి. అంతకుముందు, ఇండిగో, అకాశా ఎయిర్ సంస్థలు కూడా సౌదీ అరేబియా నగరాలకు తమ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి. ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ జెడ్డా, రియాద్ మరియు దమ్మామ్లకు రానుపోను విమాన సర్వీసులను 24 అక్టోబర్ వరకు తాత్కాలికంగా నిలిపి వేశాయని ఎయిర్ ఇండియా ఒక పోస్ట్లో పేర్కొంది. తాజా పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నా మని తెలిపింది.


