పోయి చెప్పులు కుట్టుకో! | Not fit to fly, go stitch slippers: Trainee IndiGo pilot alleges | Sakshi
Sakshi News home page

పోయి చెప్పులు కుట్టుకో!

Jun 24 2025 8:05 AM | Updated on Jun 24 2025 8:04 AM

Not fit to fly, go stitch slippers: Trainee IndiGo pilot alleges

ఇండిగో ట్రైనీ పైలట్‌పై సహోద్యోగుల వివక్షపూరిత వ్యాఖ్యలు

ముగ్గురిపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు

న్యూఢిల్లీ: ప్రైవేట్‌ విమానాయాన సంస్థ ఇండిగోలో పై కుల వివక్ష పూరిత వ్యాఖ్యలు చేసిన ముగ్గురిపై అట్రాసిటీ కేసు నమోదైంది. ఆఫీసులో తన కుమారుడిపై ముగ్గురు సహోద్యోగులు దుర్భాషలాడారని బాధితుడు శరణ్‌కుమార్‌ తండ్రి అశోక్‌కుమార్‌ తెలిపారు. కాక్‌పిట్‌లో కూర్చో వడానికి, విమానం నడపడానికి అర్హతలేదని, వెళ్లి చెప్పులు కుట్టుకోవాలంటూ తన కొడుకును అవ మాన పరిచారని ఆయన పేర్కొన్నారు. బాధితుని తండ్రి ఫిర్యాదు మేరకు ముగ్గురు నిందితులపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ విషయం సోమ వారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఇండిగోలో పనిచేస్తున్న శరణ్‌కుమార్‌ వేతనంలో అనధికార కోతలు విధించారు. ఎలాంటి కారణం లేకుండా సిక్‌లీవ్స్‌ను తగ్గించారు. సిబ్బంది ప్రయాణం, ఏసీఎమ్‌ సౌకర్యాలను రద్దు చేశారు. చివరకు రాజీనామా చేయాలంటూ లేఖ జారీ చేశారు. దీంతో ఆయన  దిద్దుబాటు శిక్షణ పొందవలసి వచ్చింది. అయితే.. దీనిపై ప్రశ్నించినందుకు సహచరులు తపస్‌ డే, మనీష్‌ సహానీ, రాహుల్‌ పాటిల్‌లు శరణ్‌కుమార్‌పై కుల వివక్షపూరిత వ్యాఖ్యలు చేశారు. ‘మా ముందు కూర్చుని, మ మ్మల్ని వివరణ అడిగే ధైర్యం ఉందా? ఈ భవనంలో వాచ్‌మన్‌గా ఉండే అర్హత కూడా లేని నువ్వు వివరణ అడుగుతున్నావా? మీరు విమానం నడపడానికి అర్హులు కాదు.

తిరిగి వెళ్లి చెప్పులు కుట్టండి. మీరు షూ తుడవడానికి కూడా పనికి రారు’ అంటూ అవమా నించారు. ఈ విషయాన్ని ఇండిగో ఎయిర్‌లైన్స్‌ సీఈఓ, ఎథిక్స్‌ కమిటీకి నివేదించినప్పటికీ వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో.. శరణ్‌ తండ్రి అశోక్‌కుమార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సహోద్యోగులు నిరంతరం తన కుమారుడిని లక్ష్యంగా చేసుకుని వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. తన కొడుకును అవమానించే ఉద్దేశంతోనే కులం గురించి స్పష్టంగా ప్రస్తావించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అతని ఫిర్యాదు ఆధారంగా, ముగ్గురు నిందితులపై షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగల (అత్యాచారాల నివారణ) చట్టం కింద కేసు నమోదు చేశారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement