‘ఇండిగో’లో మందుబాబు హల్‌చల్‌.. షాకిచ్చిన ఎయిర్‌ లైన్స్‌ | Drunk Passenger Misbehaves on IndiGo | Sakshi
Sakshi News home page

‘ఇండిగో’లో మందుబాబు హల్‌చల్‌.. షాకిచ్చిన ఎయిర్‌ లైన్స్‌

Sep 3 2025 1:35 PM | Updated on Sep 3 2025 1:41 PM

Drunk Passenger Misbehaves on IndiGo

న్యూఢిల్లీ: ఇండిగో విమానంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీ నుండి కోల్‌కతాకు వెళుతున్న ఇండిగో విమానం 6ఈ 6571లో ఒక ప్రయాణికుడు మద్యం మత్తులో గందరగోళం సృష్టించాడు. విమానంలోని క్యాబిన్ సిబ్బందితో దురుసుగా ప్రవర్తించాడు. తోటి ప్రయాణికులను ఇబ్బంది పెట్టాడనే ఫిర్యాదులు అందాయి.
 

ఈ ఘటనను ధృవీకరించిన ఇండిగో ఎయిర్‌లైన్స్‌..విమానయాన ప్రోటోకాల్‌ల ప్రకారం, ప్రయాణికుడిని విమానం కోల్‌కతాకు చేరుకున్న తర్వాత భద్రతా సిబ్బందికి అప్పగించింది. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ప్రయాణికులు, సిబ్బంది భద్రతకు భంగం కలిగించినందుకు అతనిపై చర్యలు తీసుకోనున్నారు. 31డీ సీటులో కూర్చున్న ప్రయాణికుడు విమానంలో మద్యం సేవించాడు. మతపరమైన నినాదాలు చేస్తూ, అనుచిత వ్యాఖ్యలు చేశాడు.అయితే ఈ ఆరోపణలకు అతను ఖండించాడు. విమానాశ్రయంలో ఎక్కే ముందే తాను బీరు తాగానని, కొనుగోలు రసీదును రుజువుగా చూపాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement