ఇండిగో కీలక ప్రకటన: 10 నగరాల్లో విమానాల రద్దు | IndiGo Cancels Flights To 10 Cities Till May 10 | Sakshi
Sakshi News home page

ఇండిగో కీలక ప్రకటన: 10 నగరాల్లో విమానాల రద్దు

May 9 2025 4:22 PM | Updated on May 9 2025 4:46 PM

IndiGo Cancels Flights To 10 Cities Till May 10

భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో ప్రముఖ ప్రైవేట్ విమానయాన సంస్థల్లో ఒకటైన 'ఇండిగో' మే 10న రాత్రి 11:59 గంటల వరకు 10 నగరాలకు విమాన సేవలను రద్దు చేసింది. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ప్రయాణికులు తమ బుకింగ్ స్టేటస్ చెక్ చేసుకోవాలని, రీషెడ్యూల్ కోసం కస్టమర్ కేర్‌ను సంప్రదించాలని ఎయిర్‌లైన్ సూచించింది. రేపు (శనివారం) రాత్రి 11:59 గంటల వరకు శ్రీనగర్, జమ్మూ, అమృత్సర్, లేహ్, చండీగఢ్, ధర్మశాల, బికనీర్, జోధ్‌పూర్, కిషన్‌గఢ్, రాజ్‌కోట్‌లకు విమాన సదుపాయం ఉండదు.

విమానాలకు రద్దుకు కారణమేమిటనే విషయాన్ని.. ఎయిర్‌లైన్ అధికారికంగా వెల్లడించలేదు. కానీ భారతదేశంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య విమానాలను రద్దు చేసి ఉండొచ్చని సమాచారం. మే 10 తరువాత విమాన సేవలు యధావిధిగా కొనసాగుతాయా?, లేదా మళ్ళీ నిలిపివేస్తారా.. అనే విషయాన్ని ఇండిగో వెల్లడించాల్సి ఉంది.

ఇలాంటి పరిస్థితిలో ప్రయాణికులు ఏం చేయాలి?
➤అప్డేట్ కోసం కోసం ఇండిగో మెసేజస్ లేదా ఇమెయిల్‌లను చేస్తూ ఉండండి.
➤రీషెడ్యూల్ చేయడానికి లేదా రద్దు చేయడానికి ఎయిర్‌లైన్ వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌ను సందర్శించండి.
➤ప్రత్యామ్నాయ ప్రయాణ ఎంపికల కోసం కస్టమర్ సేవను సంప్రదించండి.

ప్రయాణికులు విమానయాన శాఖ అడ్వైజరీ
➤ఎయిర్‌పోర్ట్‌లకు మూడు గంటల ముందుగానే చేరుకోవాలి.
➤75 నిమిషాల ముందే చెక్‌ ఇన్‌ క్లోజ్‌ అవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement