మత్స్యకారులకు ‘పెద్దల’ వెన్నుపోటు | Incursion of Tamil boats into local territorial waters over the years | Sakshi
Sakshi News home page

మత్స్యకారులకు ‘పెద్దల’ వెన్నుపోటు

Mar 21 2026 5:27 AM | Updated on Mar 21 2026 5:27 AM

Incursion of Tamil boats into local territorial waters over the years

సముద్రంలో మత్స్యకారుల నిర్బంధంలోని తమిళ జాలర్ల బోటును తీసుకెళ్లిపోతున్న దృశ్యం

స్థానిక సముద్ర జలాల్లోకి కొన్నేళ్లుగా తమిళ బోట్ల చొరబాటు

మత్స్య సంపదను దోచుకోవడంతోపాటు వలలు ధ్వంసం 

ఐదు నెలల క్రితం నాలుగు బోట్లు, తమిళ జాలర్ల నిర్బంధం 

జాలర్లను వదిలేసి బోట్లను స్వాదీనం చేసుకున్న స్థానిక మత్స్యకారులు 

తమిళ జాలర్లు.. టీడీపీ పెద్దల మధ్య కుదిరిన భారీ డీల్‌.. ఇటీవల ఇద్దరు మంత్రుల పర్యటన.. కొందరు మత్స్యకార పెద్దలకు తాయిలాలు 

ఫలితంగా నాలుగు రోజుల క్రితం రహస్యంగా బోట్లు వదిలేసిన వైనం 

విషయం తెలుసుకుని ఏకమై భగ్గుమన్న 114 మత్స్యకార గ్రామాలు 

ఇందుకు కారణమైన పెద కాపులను నిర్బంధించిన మత్స్యకారులు 

అక్కడకు వెళ్లడానికి సాహసించలేకపోతున్న పోలీసులు, టీడీపీ నేతలు  

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అలల సవ్వడితో ఆహ్లాదకరంగా ఉండే తీర ప్రాంతం చంద్రబాబు సర్కారు పెద్దల కుట్రలతో అట్టుడికి పోతోంది. తమ బతుకులను ఛిద్రం చేస్తున్న తమిళ జాలర్లతో టీడీపీ పెద్దలు భారీగా డీల్‌ కుదుర్చుకున్నారనే విషయం ఆంధ్రా మత్స్యకారుల్లో అల్లకల్లోలం సృష్టిస్తోంది. తమ బతుకులపై దెబ్బ కొట్టిన వారికి ఎలా మద్దతిస్తారంటూ మత్స్యకార గ్రామాలన్నీ ఏకమై రగిలిపోతున్నాయి. ప్రభు­త్వం అండ చూసుకుని మత్స్యకారులకు ద్రోహం తలపెట్టిన గ్రామ పెద్దలను తాళ్లతో నిర్బంధించి ఆరా తీయడంతో సర్కారు ద్రోహం బయటపడింది.

ఉమ్మడి నెల్లూరు జిల్లా కావలి పెద్దపట్టపుపాళెం నుంచి తడ వరకు సముద్ర జలాల్లోకి తమిళ జాలర్లు మెకనైజ్డ్‌ బోట్లతో చొచ్చుకువచ్చి స్థానిక మత్స్యకారుల వేటలో పట్టుబడిన మత్స్య సంపదను దోచుకెళ్లడంతోపాటు వలలను, నాటు బోట్లను ధ్వంసం చేస్తున్నారు. ఇలా కొన్నేళ్లుగా జరుగుతోంది. దీంతో అనేక దఫాలు తమిళ బోట్లను, జాలర్లను పట్టుకుని నిర్బంధిస్తే.. ఆంధ్రా, తమిళ ప్రభుత్వాలు మధ్యవర్తిత్వం చేసి విడిపిస్తున్నాయి. అయినా తమిళ జాలర్లు పంథా మార్చుకోకపోగా, ఆంధ్రా మత్స్యకారులపై భౌతిక దాడులకు తెగబడుతున్నారు. 

వీరి ఆగడాలను భరించలేక కావలి, బోగోలు, అల్లూరు, ముత్తు­కూరు మండలాలకు చెందిన మత్స్యకారులు ఈ దఫా గట్టి నిర్ణయం తీసుకున్నారు. ఐదు నెలల క్రితం తమిళనాడుకు చెందిన నాలుగు మెకనైజ్డ్‌ బోట్లు (500 సీసీ) జిల్లాలోకి చొరబడి మత్స్య సంపదను దోచుకుంటుండగా ప్రాణాలకు తెగించి ఆ బోట్లతోపాటు పలువురు తమిళ జాలర్లను అదుపు­లోకి తీసుకున్నారు. అప్పట్లో ఈ పరిణామం సంచలనంగా మారడంతో కొందరు పెద్దలు స్థానిక మత్స్యకారులను ఒప్పించి తమిళ జాలర్లను వదిలేలా చేశారు. 

కానీ ఆ నాలుగు బోట్లను మాత్రం వదిలి పెట్టలేదు. వీటిని అల్లూరు మండలం ఇస్కపల్లిపాళెం మత్స్యకారుల పెద్దలకు అప్పగించారు. ఐదు నెలలుగా మత్స్యకార యువత వంతుల వారీగా బోట్ల వద్ద కాపలాగా ఉంటున్నారు. ఈ దఫా ఎన్ని రాజకీయ ఒత్తిళ్లు వచ్చినా వదిలే ప్రసక్తి లేదని ఒకమాటపై నిలిచారు. ఈ క్రమంలో మెరైన్‌ పోలీసులు సైతం ఆ బోట్ల భద్రతలో పాలుపంచుకున్నారు.   

తమిళ జాలర్లతో టీడీపీ పెద్దలు భారీ డీల్‌ 
» ఇటీవల బోగోలు మండలం జువ్వలదిన్నెకు ఒక కీల­క మంత్రి వచ్చి వెళ్లడం.. ఆ తర్వాత జిల్లా కలెక్టరేట్‌లో మత్స్యకారులతో మరో మంత్రి స­మా­వేశం కావడం.. ఆ తర్వాత నాలుగు రోజులకే అర్ధరాత్రి వేళ మత్స్యకారులు ప్రాణాలకు తెగించి తమ నిర్బంధంలో ఉంచుకున్న నాలుగు బోట్లను రహస్యంగా వదిలేయడం జరి­గిపోయింది. ఆఖరి క్షణంలో ఈ విషయం తెలు­సుకున్న మత్స్యకారులు మరోసారి ప్రాణాలకు తెగించి మెకనైజ్డ్‌ బోట్లను వెంటాడినా ఫలితం దక్కలేదు. దీంతో ప్రభుత్వం నమ్మక ద్రోహం చేసిందని మత్స్యకారులు కోపాగి్నతో రగిలిపోతున్నారు.  

»  టీడీపీ పెద్దలు తమిళ జాలర్లతో భారీ డీల్‌ కుదుర్చుకున్న తర్వాతే ఈ మంత్రాంగం నడిచిందని మ­త్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అ­ల్లూరు మండలం ఇస్కపల్లిపాళెం పెద్దలకు భా­రీ మొత్తం చేతిలో పెట్టి, మత్స్యకారుల నిర్బంధంలో ఉన్న తమిళ బోట్లను విడిపించినట్లు తెలుస్తో­ంది. ఇదంతా టీడీపీ పెద్దల కుట్ర కోణంతోనే జరిగిందని తీర ప్రాంతంలో ఉన్న దాదాపు 114 గ్రా­మాల మత్స్యకార ప్రజలు మండిపడుతున్నారు.  

బోట్లు వదిలేసిన వారిని నిర్బంధించిన మత్స్యకారులు 
»  అల్లూరు మండలం ఇస్కపల్లిపాళెంకు చెందిన గ్రామ పెద్ద కాపు, ఆయన ఇద్దరు కుమారులతోపాటు బోగోలు మండలం బంగారుపాళెంకు చెందిన మరో కాపును మత్స్యకారులు, ఆయా గ్రామాల పెద్ద కాపులు కలిసి నిర్బంధించారు. తాళ్లతో కట్టేసి ఈ కుట్రకోణం వెనుక టీడీపీ పెద్దలు ఎవరున్నారో చెప్పాలని ఒత్తిడి తెచ్చారు.

» మత్స్యకారులకు ద్రోహం తలపెట్టిన కాపుల నోటి నుంచి టీడీపీ కీలక నేతల పేర్లు వచి్చనట్లు తెలుస్తోంది. టీడీపీకి చెందిన ఓ రాజ్యసభ సభ్యుడి హస్తం కూడా ఉందని, కొందరు పోలీసు అధికారులు కూడా సహకరించడం వల్లే ఆ బోట్లను వదిలేశారని సమాచారం. దీంతో అధికార పార్టీ నేతలు, పోలీసులు అటు వైపు వెళ్లడానికి జంకుతున్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్‌ కార్యాచరణ కోసం వచ్చే నెల 3న సమావేశం కావాలని ఆ గ్రామాల మత్స్యకారులు నిర్ణయించారు. అప్పటి వరకు తాము నిర్బంధించిన వారిని తమ అదుపులోనే ఉంచుకోవాలని నిర్ణయించినట్లు తెలిసింది.

తరచూ జరిగేది ఇదే
తీరంలోని తిరుపతి, నెల్లూరు, ప్ర­కాశం, బాపట్ల జిల్లాల మత్స్యకా­రులు తరచూ తమిళ జాలర్లతో బతుకు పోరాటం చేస్తున్నారు. వీరు వేటాడిన మత్స్య సంపదను రెప్పపాటులో తమిళ మత్స్య దొంగలు అంతర్రాష్ట్ర సరిహద్దులు దాటి వచ్చి దోచుకుపోతున్నారు. తమిళనాడులోని వ్యాపారులు కొందరు అత్యాధునిక బోట్లు, వలలతో వచ్చి మత్స్య సంపదను కొల్ల గొడుతున్నారు. నిబంధనల ప్రకారం తీరానికి 12 నాటికల్‌ మైళ్ల అవతల కాకుండా కేవలం 5 నాటికల్‌ మైళ్లలోపు వేట సాగిస్తున్నారు. 

తిరుపతి జిల్లా తడ నుంచి ప్రకాశం జిల్లా కొత్త పట్నం వరకు తమిళ మత్స్యకారులు దూసుకొస్తున్నారు. తిరుపతి జిల్లా వాకాడు ప్రాంతం గోవిందరావు పట్టపుపాళెం, నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇస్కపల్లి పట్టపుపాళెం, రామాయపట్నం, చాకిచర్ల పట్టపుపాళెం, ఊర్లపాళెం, పాకల పట్టపుపాళెం, టంగుటూరు మండలం తాళ్లపాళెం కొత్తపట్నం బీచ్, మడనూరు ప్రాంతాల్లో తమిళ మత్స్యకారులు దాడులకు తెగబడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement