breaking news
Fisherfolk
-
మత్స్యకారులకు మరో వెన్నుపోటు
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం మత్స్యకారులకు మరోసారి వెన్నుపోటు పొడిచింది. వారి జీవనోపాధి కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.306.29 కోట్లతో అభివృద్ధి చేసిన జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను ప్రైవేట్ పరం చేస్తోంది. వేలాది బోట్లు అక్కడ నిలుపుకునే అవకాశం కల్పించడం ద్వారా మత్స్యకారులకు అండగా నిలవాలన్న లక్ష్యానికి తూట్లు పొడుస్తోంది. పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రభుత్వ నిధులతో నిర్మించిన జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను అప్పనంగా ప్రైవేట్ వారికి కట్టబెట్టేస్తోంది.ఇప్పటికే ఈ హార్బరులో 30 ఎకరాలను సాగర్ డిఫెన్స్ అనే ప్రైవేటు సంస్థకు అప్పగించిన బాబు సర్కారు.. తాజాగా మిగిలిన స్థలాన్ని కూడా ప్రైవేట్ వాళ్లకు ఇచ్చేయడానికి బరితెగించింది. తద్వారా మత్స్యకారుల పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. సర్కారు నిర్ణయంతో ఒక్క జువ్వలదిన్నె ప్రాంతంలోనే 6 వేలకు పైగా మత్స్యకార కుటుంబాల జీవనోపాధిని తీవ్రంగా దెబ్బ తీయనుంది. హార్బర్‌ను ప్రైవేట్‌కు దోచిపెట్టి.. మీకింత–నాకింత అని దోచుకునేందుకే ఇలా చేస్తున్నారని స్పష్టమవుతోంది.ఈ క్రమంలో గత ప్రభుత్వంలోనే అభివృద్ధి చేసిన జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నిర్వహణకు ప్రైవేటు సంస్థలను ఆహ్వానిస్తూ ఏపీ మారిటైమ్ బోర్డు బిడ్లను ఆహ్వానించింది. ఈ హర్బర్‌ను ఐదేళ్ల కాలానికి ఆపైన మరో ఐదేళ్లు పొడిగించుకునే అవకాశం కల్పించేలా చంద్రబాబు సర్కారు బిడ్లను పిలిచింది. ఈ హార్బరు పనులు గత ప్రభుత్వంలోనే పూర్తయ్యి.. 2024 ఆగస్టు 30న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించినప్పటికీ, రెండేళ్లుగా ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించకుండా చంద్రబాబు సర్కారు గాలికి వదిలేసింది.తీరా రెండేళ్ల తర్వాత ఇప్పుడు ఈ హార్బర్‌ను నిర్వహించేందుకు ఆసక్తిగల సంస్థలు సెపె్టంబర్ 2వ తేదీలోగా బిడ్లు దాఖలు చేయాలని ఆహ్వానించింది. ఈ హార్బరుకు రోడ్డు, రైలు, పోర్టుతో కనెక్టివిటీతో పాటు అన్ని రకాల మౌలిక వసతులున్నట్లు పేర్కొంది. వైఎస్ జగన్ హయాంలో తీర ప్రాంత అభివృద్ధి పరుగులు పెట్టింది. రూ.26,501 కోట్లతో 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లకు శ్రీకారం చుట్టి.. మత్స్యకారుల జీవనగతి మారేలా అడుగులు ముందుకు వేశారు. అయితే ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తోంది. తీరాన్ని దోచుకో.. పంచుకో.. తినుకో.. ఏపీ తీరాన్ని చంద్రబాబు సర్కారు దోచుకో.. పంచుకో.. తినుకో.. విధానంలో ప్రైవేటు వాళ్లకు పంచి పెట్టేస్తోంది. దండుకున్న దాంట్లో మీకింత–మాకింత విధానాన్ని అవలంబిస్తోంది. సంపద సృష్టిలో భాగంగా వైఎస్ జగన్ సర్కారు పోర్టులు, ఫిషింగ్ హార్బర్లను ప్రభుత్వ నిధులతో నిర్మిస్తే.. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వీటిని ప్రైవేటీకరణ చేసేస్తోంది. ఇప్పటికే రామాయపట్నం పోర్టును ప్రైవేటు వాళ్లకి అప్పగించడానికి టెండర్లు పిలిచిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను కూడా ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడానికి టెండర్లు ఆహ్వానించింది.అంతేకాకుండా కృష్ణా జిల్లా మచిలీపట్నం పోర్టు, రామాయపట్నం పోర్టుల పరిధులను తగ్గించేసింది. ఇలా పరిధిని తగ్గించిన తర్వాత ప్రైవేటు సంస్థల కోసం ఏకంగా 6,248 ఎకరాల భూమిని అదనంగా సేకరించడానికి ఉత్తర్వులు జారీ చేసింది. కాకినాడలో ఏపీ మారిటైమ్ బోర్డుకు చెందిన 45 ఎకరాలను 30 ఏళ్ల దీర్ఘకాలిక లీజు కింద సేఫ్ వన్ ఇండియా ఎస్పీ కాంపాక్ట్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఇచ్చేసింది.తీర ప్రాంతం అభివృద్ధి పేరిట ఏపీ మారిటైమ్ బోర్డు ల్యాండ్ అలాట్మెంట్ గైడ్ లైన్స్–2026 విడుదల చేసి.. వాటర్ ఫ్రంట్ ఏరియా, తీరం, ఉప్పు సాగు భూములను అభివృద్ధి పేరిట కావాల్సిన వారికి కేటాయించేందుకు రంగం సిద్ధం చేసింది. ఏపీ మారిటైమ్ బోర్డు అయితే ఏకంగా తన దగ్గర లేని భూమిని.. ఇంకా ఏర్పాటు కాని నెక్సస్ ఇంటిగ్రేటెడ్ పార్కుకు ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చేసిందంటే దోపిడీ ఏవిధంగా సాగుతోందో అర్థం చేసుకోవచ్చు.ఎడాపెడా నిర్మాణ వ్యయం పెంపు⇒ రెండేళ్లయినా కొత్తగా ఒక ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేపట్టకపోగా, నిర్మాణంలో ఉన్న వాటిని నిలిపి వేసి.. ఇప్పుడు కమీషన్ల కోసం ఏకంగా టెండర్ల విలువను భారీగా పెంచేసి నిలువు దోపిడీకి సిద్ధమైంది చంద్రబాబు సర్కారు.⇒ గత వైఎస్ జగన్ ప్రభుత్వం తొలి దశలో జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులు ప్రారంభించి.. రెండో దశలో బుడగట్లపాలెం, కొత్తపట్నం, పూడిమడక, బియ్యపు తిప్ప, ఓడరేవుల వద్ద ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి పరిపాలనా అనుమతులు ఇస్తూ టెండర్లు పిలిచింది. ⇒ చంద్రబాబు సర్కారు రెండేళ్లుగా తట్టెడు మట్టి కూడా ఎత్తకుండా ఓడరేవు వంటి ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులను ఆపేయడమే కాకుండా బుడగట్లపాలెం, కొత్తపట్నం, పూడిమడక హార్బర్ల నిర్మాణ విలువను భారీగా పెంచేసి తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వం ఈ మూడు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ వ్యయం రూ.1,150.22 కోట్లుగా నిర్ణయిస్తే.. ఇప్పుడు దానికి అదనంగా ఏకంగా రూ.436.41 కోట్లు పెంచేసి రూ.1,586.63 కోట్లకు చేర్చింది.⇒ ఇందులో బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బరు నిర్మాణ వ్యయం రూ.365.81 కోట్ల నుంచి రూ.444.75 కోట్లకు, కొత్తపట్నం హార్బర్ నిర్మాణ వ్యయం రూ.392.41 కోట్ల నుంచి రూ.441.88 కోట్లకు పెంచుతూ పరిపాలనా అనుమతులు జారీ చేసింది. ⇒ పూడిమడక హార్బర్‌ను ప్రభుత్వం ద్వారా కాకుండా, పీపీపీ విధానంలో నిర్మించాలని నిర్ణయించింది. ఈ హార్బర్ నిర్మాణ వ్యయాన్ని రూ.392 కోట్ల నుంచి ఏకంగా రూ.700 కోట్లకు పెంచేయడం హార్బర్ల పేరుతో చంద్రబాబు సర్కారు చేస్తున్న నిలువు దోపిడీకి అద్దం పడుతోంది.⇒ రూ.417.55 కోట్లతో గత ప్రభుత్వ హయాంలో పనులు ప్రారంభించిన ప్రకాశం జిల్లా ఓడరేవు హార్బర్ నిర్మాణ పనులు 25 శాతం లోపే ఉన్నాయంటూ 2024 సెప్టెంబర్ 27న ఆ టెండర్లను రద్దు చేస్తూ పనులను అర్ధంతరంగా ఆపేసింది. -
చెన్నై–ఆంధ్ర జాలర్ల వివాదంపై ఏపీతో చర్చలు
సాక్షి, చెన్నై : సముద్రంలో చేపల వేటకు సంబంధించి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మత్స్యకారుల మధ్య తరచూ సాగుతున్న వివాదాలను పరిష్కరించి, మత్స్యకారులు ప్రశాంత వాతావరణంలో వేట సాగించేందుకు తమిళనాడు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దాదాపు 50 ఏళ్లుగా ఇక్కడి జాలర్లు కాశిమేడు, తిరువొతి్తయూరు, తదితర ఫిషింగ్ హార్బర్ నుంచి చెన్నైకి తూర్పున బంగాళాఖాతంలోని లోతైన సముద్ర ప్రాంతాల వరకు వెళ్లి చేపల వేట సాగిస్తున్నారు. దాదాపు 200 చెన్నై మత్స్యకార మెకనైజ్డ్ బోట్లు ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో చేపల వేట సాగిస్తున్నాయి.అయితే, తమిళనాడు, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన మత్స్యకారులు ఆంధ్రప్రదేశ్ సముద్ర తీరంలో వేట సాగించడంవల్ల తమ ప్రాంతంలో మత్స్య సంపద తగ్గిపోతుందేమోనన్న ఆందోళన అక్కడి జాలర్లలో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో.. పొరుగు రాష్ట్ర బోట్లు తమ సముద్ర ప్రాంతంలో వేట సాగించడాన్ని నిషేధించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులు ఇటీవల ఆందోళనలు చేపట్టారు. దీనివల్ల అక్కడ శాంతిభద్రతల సమస్యలు తలెత్తాయి. ఫలితంగా.. ఏపీ అధికారులు ఇండియన్ మారిటైమ్ జోన్ యాక్ట్, 1976 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ అధికార పరిధిగా ఉన్న 12 నాటికల్ మైళ్ల లోపల వేట సాగిస్తున్న చెన్నై మత్స్యకార బోట్లను స్వాధీనం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా చెన్నైకి చెందిన ఏడు మెకనైజ్డ్ బోట్లను సీజ్‌చేసి జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్లో ఉంచారు.సామరస్య పూర్వకంగా..ఇలా తరచూ ఏపీ జాలర్లతో సమస్యలు ఎదురవుతుండడంతో చెన్నైలోని జాలర్ల సంఘాల ప్రతినిధులు ఆ శాఖ మంత్రి శ్రీనాథ్‌ను కలిసి మొరపెట్టుకున్నారు. దీంతో ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు తమిళనాడు ప్రభుత్వం ముందుకొచి్చంది. ఇరు రాష్ట్రాల అధికారులతో సమావేశాన్ని నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. మరోవైపు.. చెన్నై జిల్లా కలెక్టర్ స్థాయిలోనే కాకుండా, మత్స్యశాఖ మంత్రి, ఆర్థిక, ప్రణాళికా శాఖ మంత్రి ఆధ్వర్యంలో చెన్నై మత్స్యకార సంఘాల ప్రతినిధులతో పలుమార్లు సమావేశాలు నిర్వహించారు. అంతేకాక.. నెల్లూరులో ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారుల సమావేశం నిర్వహించినట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ఈ సమావేశంలో.. అదుపులోకి తీసుకున్న చెన్నై బోట్లను విడుదల చేయాలని, చెన్నై మత్స్యకారుల జీవనోపాధిని దృష్టిలో ఉంచుకుని, వారిని ఎప్పటిలాగే ఆంధ్రప్రదేశ్ సముద్ర ప్రాంతాల్లో వేటాడేందుకు అనుమతించాలని తమిళనాడు అధికారులు కోరినట్లు సమాచారం. -
విశాఖ హార్బర్లో అధికారులను నిలదీసిన మత్స్యకార మహిళలు
-
మత్స్యకారులకు ‘పెద్దల’ వెన్నుపోటు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అలల సవ్వడితో ఆహ్లాదకరంగా ఉండే తీర ప్రాంతం చంద్రబాబు సర్కారు పెద్దల కుట్రలతో అట్టుడికి పోతోంది. తమ బతుకులను ఛిద్రం చేస్తున్న తమిళ జాలర్లతో టీడీపీ పెద్దలు భారీగా డీల్ కుదుర్చుకున్నారనే విషయం ఆంధ్రా మత్స్యకారుల్లో అల్లకల్లోలం సృష్టిస్తోంది. తమ బతుకులపై దెబ్బ కొట్టిన వారికి ఎలా మద్దతిస్తారంటూ మత్స్యకార గ్రామాలన్నీ ఏకమై రగిలిపోతున్నాయి. ప్రభుత్వం అండ చూసుకుని మత్స్యకారులకు ద్రోహం తలపెట్టిన గ్రామ పెద్దలను తాళ్లతో నిర్బంధించి ఆరా తీయడంతో సర్కారు ద్రోహం బయటపడింది.ఉమ్మడి నెల్లూరు జిల్లా కావలి పెద్దపట్టపుపాళెం నుంచి తడ వరకు సముద్ర జలాల్లోకి తమిళ జాలర్లు మెకనైజ్డ్ బోట్లతో చొచ్చుకువచ్చి స్థానిక మత్స్యకారుల వేటలో పట్టుబడిన మత్స్య సంపదను దోచుకెళ్లడంతోపాటు వలలను, నాటు బోట్లను ధ్వంసం చేస్తున్నారు. ఇలా కొన్నేళ్లుగా జరుగుతోంది. దీంతో అనేక దఫాలు తమిళ బోట్లను, జాలర్లను పట్టుకుని నిర్బంధిస్తే.. ఆంధ్రా, తమిళ ప్రభుత్వాలు మధ్యవర్తిత్వం చేసి విడిపిస్తున్నాయి. అయినా తమిళ జాలర్లు పంథా మార్చుకోకపోగా, ఆంధ్రా మత్స్యకారులపై భౌతిక దాడులకు తెగబడుతున్నారు. వీరి ఆగడాలను భరించలేక కావలి, బోగోలు, అల్లూరు, ముత్తుకూరు మండలాలకు చెందిన మత్స్యకారులు ఈ దఫా గట్టి నిర్ణయం తీసుకున్నారు. ఐదు నెలల క్రితం తమిళనాడుకు చెందిన నాలుగు మెకనైజ్డ్ బోట్లు (500 సీసీ) జిల్లాలోకి చొరబడి మత్స్య సంపదను దోచుకుంటుండగా ప్రాణాలకు తెగించి ఆ బోట్లతోపాటు పలువురు తమిళ జాలర్లను అదుపులోకి తీసుకున్నారు. అప్పట్లో ఈ పరిణామం సంచలనంగా మారడంతో కొందరు పెద్దలు స్థానిక మత్స్యకారులను ఒప్పించి తమిళ జాలర్లను వదిలేలా చేశారు. కానీ ఆ నాలుగు బోట్లను మాత్రం వదిలి పెట్టలేదు. వీటిని అల్లూరు మండలం ఇస్కపల్లిపాళెం మత్స్యకారుల పెద్దలకు అప్పగించారు. ఐదు నెలలుగా మత్స్యకార యువత వంతుల వారీగా బోట్ల వద్ద కాపలాగా ఉంటున్నారు. ఈ దఫా ఎన్ని రాజకీయ ఒత్తిళ్లు వచ్చినా వదిలే ప్రసక్తి లేదని ఒకమాటపై నిలిచారు. ఈ క్రమంలో మెరైన్ పోలీసులు సైతం ఆ బోట్ల భద్రతలో పాలుపంచుకున్నారు. తమిళ జాలర్లతో టీడీపీ పెద్దలు భారీ డీల్ » ఇటీవల బోగోలు మండలం జువ్వలదిన్నెకు ఒక కీలక మంత్రి వచ్చి వెళ్లడం.. ఆ తర్వాత జిల్లా కలెక్టరేట్లో మత్స్యకారులతో మరో మంత్రి సమావేశం కావడం.. ఆ తర్వాత నాలుగు రోజులకే అర్ధరాత్రి వేళ మత్స్యకారులు ప్రాణాలకు తెగించి తమ నిర్బంధంలో ఉంచుకున్న నాలుగు బోట్లను రహస్యంగా వదిలేయడం జరిగిపోయింది. ఆఖరి క్షణంలో ఈ విషయం తెలుసుకున్న మత్స్యకారులు మరోసారి ప్రాణాలకు తెగించి మెకనైజ్డ్ బోట్లను వెంటాడినా ఫలితం దక్కలేదు. దీంతో ప్రభుత్వం నమ్మక ద్రోహం చేసిందని మత్స్యకారులు కోపాగి్నతో రగిలిపోతున్నారు. » టీడీపీ పెద్దలు తమిళ జాలర్లతో భారీ డీల్ కుదుర్చుకున్న తర్వాతే ఈ మంత్రాంగం నడిచిందని మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అల్లూరు మండలం ఇస్కపల్లిపాళెం పెద్దలకు భారీ మొత్తం చేతిలో పెట్టి, మత్స్యకారుల నిర్బంధంలో ఉన్న తమిళ బోట్లను విడిపించినట్లు తెలుస్తోంది. ఇదంతా టీడీపీ పెద్దల కుట్ర కోణంతోనే జరిగిందని తీర ప్రాంతంలో ఉన్న దాదాపు 114 గ్రామాల మత్స్యకార ప్రజలు మండిపడుతున్నారు. బోట్లు వదిలేసిన వారిని నిర్బంధించిన మత్స్యకారులు » అల్లూరు మండలం ఇస్కపల్లిపాళెంకు చెందిన గ్రామ పెద్ద కాపు, ఆయన ఇద్దరు కుమారులతోపాటు బోగోలు మండలం బంగారుపాళెంకు చెందిన మరో కాపును మత్స్యకారులు, ఆయా గ్రామాల పెద్ద కాపులు కలిసి నిర్బంధించారు. తాళ్లతో కట్టేసి ఈ కుట్రకోణం వెనుక టీడీపీ పెద్దలు ఎవరున్నారో చెప్పాలని ఒత్తిడి తెచ్చారు.» మత్స్యకారులకు ద్రోహం తలపెట్టిన కాపుల నోటి నుంచి టీడీపీ కీలక నేతల పేర్లు వచి్చనట్లు తెలుస్తోంది. టీడీపీకి చెందిన ఓ రాజ్యసభ సభ్యుడి హస్తం కూడా ఉందని, కొందరు పోలీసు అధికారులు కూడా సహకరించడం వల్లే ఆ బోట్లను వదిలేశారని సమాచారం. దీంతో అధికార పార్టీ నేతలు, పోలీసులు అటు వైపు వెళ్లడానికి జంకుతున్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణ కోసం వచ్చే నెల 3న సమావేశం కావాలని ఆ గ్రామాల మత్స్యకారులు నిర్ణయించారు. అప్పటి వరకు తాము నిర్బంధించిన వారిని తమ అదుపులోనే ఉంచుకోవాలని నిర్ణయించినట్లు తెలిసింది.తరచూ జరిగేది ఇదేతీరంలోని తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల మత్స్యకారులు తరచూ తమిళ జాలర్లతో బతుకు పోరాటం చేస్తున్నారు. వీరు వేటాడిన మత్స్య సంపదను రెప్పపాటులో తమిళ మత్స్య దొంగలు అంతర్రాష్ట్ర సరిహద్దులు దాటి వచ్చి దోచుకుపోతున్నారు. తమిళనాడులోని వ్యాపారులు కొందరు అత్యాధునిక బోట్లు, వలలతో వచ్చి మత్స్య సంపదను కొల్ల గొడుతున్నారు. నిబంధనల ప్రకారం తీరానికి 12 నాటికల్ మైళ్ల అవతల కాకుండా కేవలం 5 నాటికల్ మైళ్లలోపు వేట సాగిస్తున్నారు. తిరుపతి జిల్లా తడ నుంచి ప్రకాశం జిల్లా కొత్త పట్నం వరకు తమిళ మత్స్యకారులు దూసుకొస్తున్నారు. తిరుపతి జిల్లా వాకాడు ప్రాంతం గోవిందరావు పట్టపుపాళెం, నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇస్కపల్లి పట్టపుపాళెం, రామాయపట్నం, చాకిచర్ల పట్టపుపాళెం, ఊర్లపాళెం, పాకల పట్టపుపాళెం, టంగుటూరు మండలం తాళ్లపాళెం కొత్తపట్నం బీచ్, మడనూరు ప్రాంతాల్లో తమిళ మత్స్యకారులు దాడులకు తెగబడుతున్నారు. -
చిల్లర వేట
తూర్పుగోదావరి: పుష్కరాల సందర్భంగా ఘాట్లలో గోదావరికి భక్తులు సమర్పించే చిల్లర కోసం మత్య్సకార యువకులు నీటిలో నిరీక్షిస్తున్నారు. భక్తులు చిల్లర నాణేలు వేయగానే అది నీటి అడుగుకు వెళ్లకుండానే ఒడుపుగా పట్టుకుంటున్నారు. అయాస్కాంతాలతో కట్టిన ఒక తాడును నీటిలో వేసి నాణేలను తీస్తున్నారు. అలా కొన్ని నాణేలు వచ్చేదాకా పంటి కింద అదిమి పట్టుకుంటున్నారు. కొంత చిల్లర పోగయ్యాక ఒక సంచిలో అవి వేసుకుని పంటితో పట్టుకుని గట్టుకు వచ్చేస్తున్నారు.


