‘వ్యక్తిగత జీవితాల గురించి నీచంగా మాట్లాడుతున్నారు’ | Govardhan Reddy Condemns Disrespect Towards Women in Politics | Sakshi
Sakshi News home page

‘వ్యక్తిగత జీవితాల గురించి నీచంగా మాట్లాడుతున్నారు’

Apr 6 2026 11:33 AM | Updated on Apr 6 2026 12:45 PM

 Govardhan Reddy Condemns Disrespect Towards Women in Politics

నెల్లూరు: వైఎస్సార్‌సీపీ శ్రేణుల వ్యక్తిగత జీవితాల గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్న వారిపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి మండిపడ్డారు. ఇవాళ నెల్లూరులో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.

‘వైఎస్సార్‌సీపీ శ్రేణుల వ్యక్తిగత జీవితాల గురించి నీచంగా మాట్లాడుతున్నారు. ఏబీఎన్‌ రాధాకృష్ణ పూర్తిగా దిగజారిపోయారు. ఏబీఎన్‌ రాధాకృష్ణ చెత్త రాతలపై మహిళలు ఛీ కొడుతున్నారు. మావిగన్‌ ప్రతిపాదన పెట్టినప్పటి నుంచి కూటమి సర్కార్‌కు భయం వేస్తోంది. 

మహిళలను అవమానించి లబ్ధిపొందాలనుకోవడం దుర్మార్గం. జగన్‌ ప్రతిపాదనతో చంద్రబాబులో వణుకు మొదలైంది. చంద్రబాబు అవినీతి కోట బద్ధలవుతుందని భయపడుతన్నారు’ అని కాకాణి గోవర్ధన్‌ రెడ్డి అన్నారు. 

జడలు విప్పి రాక్షస విన్యాసాలు..
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ‘మావిగన్’పై ప్రజల్లో విస్తృత చర్చను చూసి కూటమి నేతల్లో వణుకు మొదలైందని కాకాణి గోవర్ధన్‌డ్డి అన్నారు. ‘ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఎల్లో మీడియా జడలు విప్పి రాక్షస విన్యాసాలు చేస్తోంది. మావిగన్ చర్చను అడ్డుకోవడానికి  ఏబీఎన్ రాధాకృష్ణ క్షుద్ర విద్యలన్నీ ప్రదర్శిస్తున్నారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి సోషల్ మీడియాలో నెగటివ్ ట్రోలింగ్ చేయిస్తున్నారు.

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని దూషిస్తేనే ఎమ్మెల్యేలకు ర్యాంకింగ్ పెరుగుతుందని చంద్రబాబు టార్గెట్ పెట్టారు. అవినీతి చేసినా పర్లేదు కానీ.. వైఎస్‌ జగన్‌ను తిట్టడమే కూటమి ఎమ్మెల్యేల లక్ష్యం. రాధాకృష్ణ తన ‘చెత్తపలుకు’లో అత్యంత దిగజారి వైఎస్సార్‌సీపీ నేతలపై విషం చిమ్మారు. ఎవరూ మాట్లాడలేని చండాలమైన భాషను రాధాకృష్ణ వాడుతున్నారు.

రాధాకృష్ణ జీవితమంతా అవినీతి మయం.. ఆయనలో ఎక్కడా నీతి అనేది కనిపించదు. సొంత జీవితంలో అనైతిక సంబంధాలు పెట్టుకున్న రాధాకృష్ణ.. మా ఇంటి మహిళల గురించి మాట్లాడతారా? చంద్రబాబుకు బ్రోకరిజం చేసిన రాధాకృష్ణకు మహిళల గురించి మాట్లాడే అర్హత లేదు.

రాజకీయ విమర్శల పేరుతో మహిళలను అవమానించడం అత్యంత నీచమైన ప్రవర్తన. జర్నలిజం ముసుగులో రాధాకృష్ణ వంద శాతం బ్రోకరిజం నడిపిస్తున్నారు. చంద్రబాబు ఆదేశాలతోనే సిగ్గు శరం లేకుండా దళారీ పనులు చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీని రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేకే వ్యక్తిగత దాడులకు దిగుతున్నారు. మళ్లీ వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావడం, వైఎస్‌ జగన్ సీఎం అవ్వడం ఖాయం’ అని అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement