‘వ్యభిచార’ లాడ్జీలో పట్టుబడ్డ టీడీపీ నేత రావూరి రాధాకృష్ణమ నాయుడు | Nellore TDP Leader Radhakrishnam Naidu Caught in Police Raid | Sakshi
Sakshi News home page

‘వ్యభిచార’ లాడ్జీలో పట్టుబడ్డ టీడీపీ నేత రావూరి రాధాకృష్ణమ నాయుడు

Mar 22 2026 8:25 PM | Updated on Mar 22 2026 8:25 PM

 Nellore TDP Leader Radhakrishnam Naidu Caught in Police Raid

నెల్లూరు: వ్యభిచార నిర్వహణ లాడ్జీపై పోలీసుల దాడిలో సర్వేపల్లి నియోజకవర్గ టీడీపీ కీలక నేత, పీఏసీఎస్‌ అధ్యక్షుడు రావూరి రాధాకృష్ణమ నాయుడు పట్టుబడ్డారు. నెల్లూరు ఏఎస్పీ పలు లాడ్జీలపై ఆకస్మిక తనిఖీలు చేశారు. మొత్తం 40 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  

సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డికి ముఖ్య అనుచరుడిగా రాధాకృష్ణమ‌ నాయుడు చలామణి అవుతున్నారు. ఇటు వ్యభిచార గృహాలు నడుపుతూ ఆయన అధిష్ఠానంలో చక్రం తిప్పుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌తో రాధాకృష్ణమ నాయుడుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అధిష్ఠానంలో పలుకుబడితో సర్వేపల్లిలో అక్రమాలకు పాల్పడుతున్నారు. వైసీపీ నేతలపై అక్రమ కేసులు బనాయింపులో సదరు ప్రస్తుత విటుడు రాధాకృష్ణమ నాయుడిది కీలక భూమిక.

Advertisement
 
Advertisement
Advertisement