
సాక్షి,నెల్లూరు: అన్నమయ్య సర్కిల్ ఆర్ఎన్ఆర్ జూనియర్ ఇంటర్ కాలేజీలో దారుణం జరిగింది. హాస్టల్లో ఉంటున్న ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. హాస్టల్ గదిలోనే ఉరేసుకుని ప్రాణాలు కోల్పోయింది.

దీంతో విద్యార్థిని ఆత్మహత్య గురించి గుట్టుచప్పుడు కాలేజీ యాజమాన్యం వ్యవహరించింది. ఎవరికీ అనుమానం రాకుండా.. విద్యార్ధినికి ఆరోగ్యం బాగలేదంటూ ఆస్పత్రికి తరలించింది. బాధితురాలి తల్లిదండ్రులకు ఇదే విధంగా సమాచారం అందించింది. కుమార్తె ఆరోగ్యంపై సమాచారం అందుకున్న తల్లిదండ్రులు హుటాహుటీన ఆస్పత్రికి తరలివచ్చారు.
అయితే,విద్యార్థిని మెడ భాగంపై కమిలిన గాయాలు ఉండడంపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. ఆర్ఎన్ఆర్ కాలేజీ వద్ద తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు.