
సాక్షి,నెల్లూరు: నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ విచారణ ముగిసింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
మాజీ మంత్రి ప్రసన్నకుమార్ రెడ్డికు మద్దతు తెలిపేందుకు నాపై కేసు పెట్టారు.ప్రసన్న కుమార్‌తో కలిసి నన్ను ఏ2గా చేర్చారు. నేను నవ్వినందుకు కేసు పెట్టారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాను. కూటమి ప్రభుత్వంలో వేదిక మీద నవ్విన నాయకుల మీద కేసులు పెట్టే పరిస్థితులు వచ్చాయి. నవ్విన తప్పే అంటే ఇక ఏమి చేయాలి?. కూటమి నేతలు ఏ స్థాయికి దిగజారి పోయారో తెలుస్తోంది.
36 ప్రశ్నలు అడిగారు, 10 నిమిషాల్లో సమాధానం రాసి ఇచ్చాను. నన్ను ఆరు గంటలు కూర్చోబెట్టారు, విచారణ చేశారు. బీసీ నాయకులను కూటమి ప్రభుత్వం కక్ష్య సాధిస్తోంది’అని ఆరోపించారు.
కాగా,కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్య కొనసాగుతోంది. అనిల్ కుమార్‌పై వేమిరెడ్డి ప్రశాంతి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో అనిల్ కుమార్.. నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.
