సాక్షి, తాడేపల్లి: నెల్లూరులో టీడీపీకి ఊహించిని షాక్ తగిలింది. టీడీపీని వీడిన ఐదు మంది కార్పొరేటర్లు.. వైఎస్సార్‌సీపీలోకి చేరారు. వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఆ పార్టీలోకి నెల్లూరు టీడీపీ కార్పొరేటర్లు చేరారు. వైఎస్సార్‌సీపీలో చేరిన వారిలో మద్దినేని మస్తానమ్మ (6వ డివిజన్), ఓబుల రవిచంద్ర (5వ డివిజన్), కాయల సాహితి (51వ డివిజన్), వేనాటి శ్రీకాంత్ రెడ్డి (16వ డివిజన్), షేక్ ఫమిదా (34వ డివిజన్) ఉన్నారు.
వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి వైఎస్ జగన్ ఆహ్వానించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. నెల్లూరు మేయర్‌పై అవిశ్వాసం నేపథ్యంలో టీడీపీకి పెద్ద ఎదురుదెబ్బే తగిలింది. ఐదుగురు పార్టీ వీడటంతో మరెందరు వెళ్తారోనన్న భయం కూటమికి పట్టుకుంది. మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ షాక్ ఇచ్చింది.


