breaking news
corporators
-
కరీంనగర్ మేయర్ పీఠంపై కొనసాగుతున్న ఉత్కంఠ
-
GVMC టీడీపీ రౌడీ రాజ్యం.. కబ్జాకు పచ్చజెండా
-
ఫ్రీ కదా.. పోయొద్దాం
సాక్షి, హైదరాబాద్: స్టడీ టూర్ పేరిట ఇతర సిటీలను చూసేందుకు వెళ్లిన కార్పొరేటర్ల అవస్థలు అన్నీఇన్నీ కావు. వారిని చూసి పలువురు జాలి పడుతున్నారు. సాధారణంగా.. నగర పాలనకు సంబంధించి ఇతర సిటీల్లో అమలవుతున్న మెరుగైన విధానాలను అధ్యయనం చేసి, వాటిని హైదరాబాద్‌లో అమలు చేసే అంశాన్ని పరిశీలించేందుకు కార్పొరేటర్లు స్లడీ టూర్లకు వెళ్తారు. తాము అధ్యయనం చేసిన అంశాల్ని, వాటిని ఇక్కడ ఎలా అమలు చేయవచ్చో పేర్కొంటూ ఒక నివేదిక రూపొందించి కమిషనర్‌కు అందజేస్తారు. సాధ్యాసాధ్యాలు పరిశీలించి అమలు చర్యలు చేపడతారు. కార్పొరేటర్ల స్టడీటూర్కయ్యే వ్యయాన్ని జీహెచ్ఎంసీ ఖజానా నుంచే చెల్లిస్తారు. జీహెచ్ఎంసీలో చేయాల్సిన పనులకు కాబట్టి జీహెచ్ఎంసీ నుంచి ఖర్చు చేస్తారు. అందుకు ఎవరికీ అభ్యంతరం లేదు. ఎందుకీ అభ్యంతరాలు ? కార్పొరేటర్ల టూర్లపై పలు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. గతంలో స్టడీటూర్ల పేరిట ఆయా నగరాలు తిరిగి వచ్చి , ఇక్కడ చేసిందేమీ లేకపోవడం ఒక కారణం కాగా.. మరో నెలరోజుల్లో పదవి నుంచి దిగిపోనున్న వారు ఇక చేసేదేముంటుందన్నది ప్రధాన అభ్యంతరం. ప్రజా ధనంతో ఇలాంటి టూర్లను అనుమతించరాదంటూ ఫోరమ్ ఫర్ గుడ్‌గవర్నెన్స్ సహా పలు సంస్థలు, ప్రజలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో లోకాయుక్త సైతం ప్రజాధనంతో కార్పొరేటర్ల టూర్లను ఆక్షేపించింది. ఈ నేపథ్యంలో గుట్టుచప్పుడు కాకుండా.. మేయర్ సహా అహ్మదాబాద్ కు బయలుదేరారు. దిగిపోయేముందు ఈ టూర్లు అనవసరమని భావించి స్వచ్ఛందంగానే టూర్లను విరమించుకున్న కార్పొరేటర్లు కూడా ఉండటం విశేషం. టూర్ కోసం జీహెచ్ఎంసీ ఒక్కో కార్పొరేటర్‌కు దాదాపు లక్ష రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. కార్పొరేటర్లు టూర్లు చేయాలనుకుంటే కష్టమేం కాదు. ఏ కొందరో మినహా, ఎన్నికల్లో గెలిచేందుకు లక్షలకు లక్షలు ఖర్చు చేశారు. అలాంటి వారికి ఈ టూర్కయ్యే వ్యయం లెక్కలోది కాదు. అలాంటప్పుడు ఈ కక్కుర్తి ఏమిటన్నదే సాధారణ ప్రజల ప్రశ్న. పదవి దిగిపోయే ముందు అపప్రథ మూటగట్టుకోవడం తప్ప ఇప్పుడీ టూర్ ఎందుకన్నదానికి ‘స్టడీ’టూర్‌కు వెళ్లిన, వెళ్లనున్న వారేమైనా సమాధానం చెబుతారేమో వేచి చూడాల్సిందే. పేరుకు మాత్రమే.. జీహెచ్ఎంసీలో కొంతకాలంగా, మరీ ముఖ్యంగా ప్రస్తుత పాలకమండలి హయాంలో స్టడీ టూర్లంటే విహార యాత్రలనే ముద్ర పడేలా చేశారు. పేరు మాత్రం స్టడీ టూర్లంటూ ఇష్టమొచ్చినట్టు నగరాల్ని రెండు మూడు బ్యాచ్‌లుగా వెళ్లి వచ్చేలా అలవాటు చేశారు. వెళ్లనివారు అనివార్య కారణాల వల్ల వెళ్లలేదని పేర్కొంటూ ప్రయాణ చార్జీల్ని పొందిన ఘటనలు కూడా గతంలో ఉన్నాయి. తాజాగా మంగళవారం 40 మందికి పైగా అహ్మదాబాద్ వెళ్లినట్లు సమాచారం. అహ్మదాబాద్‌లోని నర్మద రివర్ప్రాజెక్ట్ అధ్యయనం పేరిట వెళ్లారు. మిగతా వారు సంక్రాంతి పండగ తర్వాత వెళ్లేందుకు ప్లాన్ సిద్ధం చేశారు. -
కార్పొరేటర్లను కిడ్నాప్ చేసిన పచ్చ పోలీసులు..!
-
నెల్లూరులో టీడీపీకి బిగ్ షాక్
సాక్షి, తాడేపల్లి: నెల్లూరులో టీడీపీకి ఊహించిని షాక్ తగిలింది. టీడీపీని వీడిన ఐదు మంది కార్పొరేటర్లు.. వైఎస్సార్సీపీలోకి చేరారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ఆ పార్టీలోకి నెల్లూరు టీడీపీ కార్పొరేటర్లు చేరారు. వైఎస్సార్సీపీలో చేరిన వారిలో మద్దినేని మస్తానమ్మ (6వ డివిజన్), ఓబుల రవిచంద్ర (5వ డివిజన్), కాయల సాహితి (51వ డివిజన్), వేనాటి శ్రీకాంత్ రెడ్డి (16వ డివిజన్), షేక్ ఫమిదా (34వ డివిజన్) ఉన్నారు.వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి వైఎస్ జగన్ ఆహ్వానించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. నెల్లూరు మేయర్‌పై అవిశ్వాసం నేపథ్యంలో టీడీపీకి పెద్ద ఎదురుదెబ్బే తగిలింది. ఐదుగురు పార్టీ వీడటంతో మరెందరు వెళ్తారోనన్న భయం కూటమికి పట్టుకుంది. మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ షాక్ ఇచ్చింది. -
మున్సిపల్ వార్డులకు వచ్చే నెలలో ఉప ఎన్నికలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వివిధ కారణాలతో ఖాళీ అయిన నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీల్లో 55 కార్పొరేటర్లు, కౌన్సిలర్ పదవులకు సెప్టెంబర్ 17లోగా ఉప ఎన్నికలు నిర్వహించేందకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కసరత్తు చేపట్టింది.విజయనగరం, విశాఖ, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, కడప, తిరుపతి నగరపాలక సంస్థల్లో 12 డివిజన్లతోపాటు 34 మున్సిపాలిటీల పరిధిలో 43 వార్డు కౌన్సిలర్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా ఆయా డివిజన్లు, వార్డుల వారీగా ఓటర్ల ఫొటోలతో కూడిన జాబితాలను నిర్ధారించి ప్రచురించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలంసాహ్ని ఆయా నగరపాలక సంస్థలు, మున్సిపల్ కమిషనర్లు, కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.మరోవైపు ఆయా డివిజన్లు, వార్డుల వారీగా ఓటర్ల ఫొటోలతో కూడిన జాబితాలను నిర్ధారించడంతో పాటు ప్రచురించే అంశంపై సంబంధిత నగరపాలక సంస్థలు, మున్సిపల్ సిబ్బందికి ఈ నెల 12, 13 తేదీల్లో శిక్షణ ఇవ్వనున్నారు. -
జీవీఎంసీ స్థాయీ సంఘం ఎన్నికల్లో కూటమికి షాక్
డాబాగార్డెన్స్: జీవీఎంసీ స్థాయీ సంఘం ఎన్నికల్లో కూటమికి వైఎస్సార్సీపీ షాక్ ఇచ్చింది. కౌన్సిల్లో కూటమికి పూర్తి ఆధిక్యత ఉన్నా.. బుధవారం జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో అత్యధిక ఓటింగ్‌తో అనూహ్యంగా ఒక స్థానాన్ని దక్కించుకుంది. పది స్థానాలకు కూటమి నుంచి 10 మంది, వైఎస్సార్సీపీ నుంచి 10 మంది కార్పొరేటర్లు పోటీ పడ్డారు. వాస్తవానికి కౌన్సిల్లో 63 మంది కార్పొరేటర్ల బలం ఉన్న కూటమికే ఈ పది స్థానాలు దక్కడం లాంఛనమన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమయ్యాయి. అయితే అనూహ్యంగా వైఎస్సార్సీపీ 24వ వార్డు కార్పొరేటర్ సాడి పద్మారెడ్డి 50 ఓట్లతో స్థాయీ సంఘం సభ్యురాలిగా ఎన్నికయ్యారు.కూటమిపై అసంతృప్తికి నిదర్శనంకూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రలోభాలు, బెదిరింపులతో 27 మంది వైఎస్సార్సీపీ కార్పొరేటర్లను లాక్కుంది. దీంతో జీవీఎంసీలో వైఎస్సార్సీపీ బలం 32కు తగ్గిపోయింది. వైఎస్సార్సీపీ మేయర్ గొలగాని హరివెంకటకుమారిపై అవిశ్వాస తీర్మానం పెట్టి మేయర్ సీటునూ అనైతికంగా కూటమి సొంతం చేసుకుంది. అదే తరహాలో డిప్యూటీ మేయర్ స్థానాన్ని దక్కించుకుంది.ఒకవైపు కూటమి ప్రభుత్వంపైనే కాకుండా మేయర్ పీఠాన్ని దక్కించుకున్న మూడు నెలల్లోనే జీవీఎంసీ పరిధిలో కూటమి పాలనపై వ్యతిరేకత మొదలైంది. వైఎస్సార్సీపీ నుంచి కూటమిలోకి వెళ్లిన కార్పొరేటర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో స్థాయీ సంఘం ఎన్నికల్లో వారు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినట్లు తెలుస్తోంది. వైఎస్సార్సీపీ నుంచి స్టాండింగ్ కమిటీ సభ్యులుగా పోటీ చేసిన పది మందికి 32 ఓట్లు కంటే అధికంగా పడడమే ఇందుకు నిదర్శనం. వైఎస్సార్సీపీ విజయం..జీవీఎంసీ స్థాయీ సంఘం ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ సాడి పద్మారెడ్డి విజయం సాధించారు. 97 మంది కార్పొరేటర్లలో 92 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరిలో 50 మంది కార్పొరేటర్లు సాడి పద్మారెడ్డికి అనుకూలంగా ఓటు వేశారు. వాస్తవానికి జీవీఎంసీలో వైఎస్సార్ సీపీ బలం 32 ఉండగా.. అధికార కూటమికి చెందిన 18 మంది కార్పొరేటర్లు వైఎస్సార్ సీపీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించడం విశేషం. కాగా, తొలుత ఫలితం ప్రకటించలేదు వైఎస్సార్ సీపీ నేతలు అడిగిన తరువాతే ఫలితాన్ని ప్రకటించారు. -
Botsa: నమ్మించి మోసం చేశారు.. 11 నెలల పదవి కోసం ఇన్ని దారుణాలా
-
పార్టీ మారిన కార్పొరేటర్ల పై వరుదు కళ్యాణి సీరియస్ కామెంట్స్
-
టీడీపీ నేతల రౌడియిజం.. పార్టీ మారమని బెదిరింపులు
-
మీ కోట్లు మాకొద్దు.. మా పయనం ఎప్పటికీ జగనన్న వెంటే..!
-
కార్పొరేటర్‌కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ నువ్వా జగన్ గురించి మాట్లాడేది
-
ఈసారి జగన్ 2.0ని చూడబోతున్నారు: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ‘‘ఈసారి జగన్ 2.0ని చూడబోతున్నారు.. ఈ 2.0 వేరేగా ఉంటుంది’’ అంటూ వైఎస్సార్సీపీ(YSRCP) అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తల కోసం జగన్ ఎలా పనిచేస్తాడో చూపిస్తా. తొలివిడతలో ప్రజల కోసం తాపత్రయం పడ్డాను. వారికి మంచి చేసే విషయంలో కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేకపోయాను. ఇప్పుడు చంద్రబాబు మిమ్మల్ని పెడుతున్న కష్టాలు, బాధలను చూశాను. ఎక్కడ ఉన్నా తీసుకువచ్చి చట్టం ముందు నిలబెడతా. అక్రమ కేసులు పెట్టిన వారిపై ప్రైవేటు కేసులు వేస్తాం’’ అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.బుధవారం ఆయన తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో విజయవాడ నగరపాలక సంస్థ వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు, ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏమన్నారంటే... ఎవరికి ఏ కష్టం వచ్చినా నా కథ గుర్తుకుతెచ్చుకోండి..‘‘ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బెదిరిస్తారు, దొంగకేసులు పెడతారు. జైల్లో పెట్టినా భయపడాల్సిన పనిలేదు. కార్యకర్తలకు నేను అండగా నిలుస్తా. మళ్లీ అధికారంలోకి వస్తాం, 30 ఏళ్లు పరిపాలన చేస్తాం. సంపద సృష్టించి పేదలకు పంచుతానని చంద్రబాబు చెప్పారు. కానీ ఈ 9 నెలల్లో సూపర్ సిక్స్ పథకాలను కూడా అమలు చేయలేదు. చంద్రబాబు హామీలను అమలు చేయలేరని నేను ముందే చెప్పాను. చంద్రబాబును నమ్మటం అంటే చంద్రముఖిని నిద్రలేపటమే. రాష్ట్ర బడ్జెట్, చంద్రబాబు హామీల ఖర్చుల గురించి ప్రజలకు వివరంగా చెప్పాను. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలి. త్వరలోనే జమిలీ ఎన్నికలు అంటున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అఖండ మెజార్టీతో వైఎస్సార్సీపీ గెలుస్తుంది...ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడ చూసినా మద్యం ఏరులై పారుతోంది. ఏ గ్రామంలో చూసినా బెల్టు షాపు నడుస్తోంది. ఒక్కో ఎమ్మెల్యే వేలంపాటలో రూ.2 లక్షలకో, 3 లక్షలకో బెల్టుషాపులు పెట్టిస్తున్నారు. ఇసుక ధర రెట్టింపు అయింది. ప్రతి నియోజకవర్గంలో పేకాట క్లబ్బులు కనిపిస్తున్నాయి. ఏ పని జరగాలన్నా, ఇండస్ట్రీ నడపాలన్నా, మైనింగ్ చేసుకోవాలన్నా ముడుపులు చెల్లించే దుస్థితి వచ్చింది. ఎమ్మెల్యేల దగ్గర్నుంచి చంద్రబాబు వరకు ముడుపులను పంచుకుంటున్నారు...రాజకీయాలలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు వస్తాయి. ఆ కష్టాలను ఎదుర్కొన్నప్పుడే మనం లీడర్ గా ఎదుగుతాం. ఒకసారి వ్యక్తిత్వాన్ని కోల్పోతే ప్రజల్లో చులకన అవుతాం. కష్టాలు ఎల్లకాలం ఉండవు. ఎవరికి ఏ కష్టం వచ్చినా నా కథ గుర్తుకుతెచ్చుకోండి. నామీద టీడీపీ, కాంగ్రెస్ కలిసి అక్రమంగా కేసులు పెట్టారు. నన్ను 16 నెలలు జైల్లో పెట్టారు. కేవలం రాజకీయంగా ఎదుగుతున్నానన్న కారణంతోనే దొంగకేసులు బనాయించారు. కానీ ఏం జరిగింది? బయటకు వచ్చి, ప్రజల అండదండలతో ముఖ్యమంత్రి అయ్యాను’’ అని వైఎస్ జగన్ గుర్తు చేశారు.ఇదీ చదవండి: ‘ఛీ.. ఎన్టీఆర్ మాటకు తూట్లు పొడిచి మరీ!‘‘విజయవాడ కార్పొరేషన్లో 64 స్థానాలుంటే 49 స్థానాలు అప్పట్లో మనం గెలిచాం. తెలుగుదేశం పార్టీకి వచ్చిన స్థానాలు 14, కమ్యూనిస్టులు 1 గెలిచారు. వాళ్లకు కేవలం 14 స్థానాలున్నా.. ఎన్నికలు అయిపోయిన తర్వాత రోజు నుంచి రకరకాల ప్రలోభాలపెట్టో, భయపెట్టో 13 మందిని తీసుకున్నారు. అయినా ఇంకా 38 మంది నిటారుగా నిలబడ్డారు అని చెప్పడానికి గర్వపడుతున్నాను’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.‘‘కారణం ఏమిటంటే.. ఏ కార్పొరేషన్, మున్సిపాల్టీ, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఏవి తీసుకున్నా.. ఎన్నికలు అయిపోయిన మూడేళ్ల తర్వాత స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగితే అటువంటి పరిస్థితుల్లో ఇలాంటి రిజల్ట్‌తో కేవలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే క్వీన్ స్లీప్ చేయగలిగింది’’ అని వైఎస్ జగన్ చెప్పారు. ..ఎన్నికల వేళ ప్రజలకు ఇచ్చిన మేనిఫెస్టోలో 99 శాతం హామీలు అమలు చేశాం. ప్రతినెలా ఏ పథకం అమలు చేస్తామో బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజే సంక్షేమానికి సంబంధించిన క్యాలెండర్ విడుదల చేసి.. క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం, ఎక్కడా ప్రజలకు నష్టం జరగకుండా, ఇబ్బందులు పడకుండా ఇచ్చిన ప్రభుత్వం దేశ చరిత్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రమే.కాలర్ ఎగరేసుకుని గర్వంగా చెప్పకునేలా....ఆ రోజు కోవిడ్ లాంటి ఊహించని పరిణామాలు వచ్చాయి. ఇలాంటి విపత్తు ఒకటి ఉంటుందా, ఇలాంటిది వస్తే రాష్ట్రం, దేశం అతలాకుతలం అవుతుందన్న పరిస్థితులు ఎప్పుడూ ఊహకు కూడా అందిఉండవు. అలాంటిది వరుసగా రెండు సంవత్సరాలు కోవిడ్ సమస్యలతో అనుకోని ఖర్చులు పెరిగాయి. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు తగ్గాయి. అయినా ఏ రోజూ కూడా మనం సాకులు చెప్పలేదు. ఏ రోజూ ప్రజలకు ఇవ్వకుండా ఉండడానికి కారణాలు వెదుక్కోలేదు. మన సమస్యలు ఎన్ని ఉన్నా ప్రజలకు ఇచ్చిన మాట ఏరోజూ తప్పలేదని వైఎస్సార్సీపీ కార్యకర్తగా గర్వంగా చెబుతున్నాను. ప్రజలకు మంచే చేశాం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విలువల కోసం నిలబడి ఉన్న పార్టీ. నా దగ్గర నుంచి గ్రామస్థాయి కార్యకర్త వరకు ఇది నా పార్టీ అని కాలర్ ఎగరేసుకుని గర్వంగా చెప్పకునేలా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరించింది, నిలబడింది.ప్రజల దగ్గర మన విలువ తగ్గలేదు....ఇవాళ ఎన్నికలు పూర్తయి దాదాపు 9 నెలలు కావస్తోంది. మనం ఓడిపోయినా కూడా ఈ రోజుకు కూడా మనం గర్వంగా తలెత్తుకుని ప్రజల దగ్గరకు పోగలుగుతాం. వాళ్ల చిరునవ్వుల మధ్య నిలబడి వాళ్ల సమస్యలను వినగలుగుతాం. వాళ్లతో మమేకం కాగలుతాం. కారణం ఏ రోజూ మనం వాళ్లను మోసం చేయలేదు. వాళ్లకు ఏరోజూ అబద్దాలు చెప్పలేదు. ఏదైతే చెప్పామో అది చేసి చూపించిన తర్వాత వాళ్లకు ఓట్లు అడిగాం కాబట్టి ప్రజల దగ్గర మన విలువ తగ్గలేదు. ప్రజలకు సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో టీడీపీ నేతలు, కార్యకర్తలు....కానీ. .ఎన్నికలు అయిన 9 నెలలు తిరక్కముందే కూటమికి చెందిన ఎమ్మెల్యే దగ్గర నుంచి.. కార్యకర్త వరకు గడప, గడప అంటూ ప్రజల దగ్గరకు వెళ్లే పరిస్థితి లేదు. కారణం ఏ గడపకు వెళ్లినా ఎన్నికలు ముందు వీళ్లు ఇచ్చిన మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ లు, సూపర్ సెవెన్లు ప్రజలు వీళ్లకు చూపించి.. ఆ ఇంట్లో నుంచి ఇద్దరున్నా ముగ్గురు పిల్లలున్నా ఇంటికి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులను, కార్యకర్తలను నా రూ.రూ15వేలు ఏమైందని ప్రశ్నిస్తారు. ఆ పిల్లల తల్లులు కూడా నా రూ.18 వేలు ఏమైందని ప్రశ్నిస్తారు. 50 ఏళ్లు నిండిన ఆ తల్లుల అత్తలు, అమ్మలు నా రూ.45వేలు ఏమైందని ప్రశ్నిస్తారు...అదే ఇంట్లో 20 ఏళ్ల పిల్లవాడు నాకు నెల, నెలా రూ.3వేలు ఇస్తానన్నావ్.. నా రూ.36 వేలు ఏమైందని అడుగుతాడు. గ్రామీణ ప్రాంతాలకు వెళితే కండువా వేసుకున్న రైతులు నా రూ.20 వేలు సంగతేంటని నిలదీస్తారు. ఇలా ఏ ఇంటికి వెళ్లినా టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఎన్నికలప్పుడు ఆ రోజు మేం చేయకపోతే నా కాలర్ పట్టుకొండని అన్నాడు. కానీ ఈ రోజు ప్రజలు కాలర్ పట్టుకుంటారని భయపడి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతున్నారు. ఆ రోజే చెప్పా.. చంద్రబాబును నమ్మడం అంటే....ఎన్నికలు అయిపోయిన 9 నెలల తర్వాత ఇవాళ సంపద సృష్టించడం ఎట్లో నా చెవిలో చెబితే నేను తెలుసుకుంటానంటున్నాడు. ఇదే మాటను ఆ రోజే నేను ఎన్నికల ప్రచారంలో చెప్పాను. చంద్రబాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపడమేనని, చంద్రబాబును నమ్మడం అంటే పులి నోట్లో తలపెట్టడం అని చెప్పాను. మన మేనిఫెస్టోను, వాళ్ల హామీలను చూపిస్తూ.. చంద్రబాబు చెప్పినవి అమలు చేయడం సాధ్యం కాదని చెప్పాను. రాష్ట్ర బడ్జెట్ ఇది.. మనం చేస్తున్న కార్యక్రమాలు ఇవి.. వీటికింత ఖర్చవుతుంది. మరో వైపు చంద్రబాబు రూ.1.72 లక్షల కోట్లు ఖర్చయ్యే ప్రతిపాదనలు చెబుతున్నాడు. ప్రజలను మోసం చేయడం ధర్మం కాదు....సూపర్ సిక్స్ మోసం, సూపర్ సెవెన్ మోసం అని చెబుతూ.. మనం ఏం చేయగలుగుతామో అన్నది కూడా ప్రజలకు అర్థం అయ్యేటట్టు చెప్పాం. ఆ రోజు కూడా మన ప్రజాప్రతినిధులు, మన శ్రేయోభిలాషులు నా దగ్గరకు వచ్చి మనమూ సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ చెబుదామన్నారు. కానీ నేను ఒక్కటే చెప్పాను. రాజకీయాల్లో ఉన్నప్పుడు విలువలు, విశ్వసనీయత లేని రాజకీయాలు చేయడం అనవసరం అని చెప్పాను. ఏదైతే చేయగలుగుతామో అదే చెప్పాలి. చేయలేనిది చెప్పి, ప్రజలను మోసం చేయడం ధర్మం కాదని చెప్పాను.ప్రజలకు చంద్రబాబు నైజం పూర్తిగా అర్థమైంది....ఓడిపోయాం ఫర్వాలేదు. ప్రతిపక్షంలో కూర్చున్నాం అదీ ఫర్వాలేదు. మరలా అదే రోజుకు వెనక్కి తిరిగి వెళితే... ఇదే విధంగానే మరలా చెబుతాం.. కారణం రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయతకు అదే అర్ధం. జమిలి అంటున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అదే విలువలు, విశ్వసనీయత అన్న పదం మీద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరలా అఖండ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. అయితే అప్పటికి ప్రజలకు చంద్రబాబు నైజం పూర్తిగా అర్థం అవుతుంది...ఎందుకంటే ఇవాళ ఇచ్చిన హామీలన్నీ పూర్తిగా పక్కకు వెళ్లిపోవడం ఒక అంశం అయితే... రెండో అంశం వ్యవస్ధలన్నీ పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయి. చంద్రబాబు ప్రభుత్వం రాకమునుపు మన ప్రభుత్వంలో ప్రతిదీ పకడ్బందీగా జరిగింది. ఇప్పుడు చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నాడనే చర్చ ఇప్పుడు ప్రతి ఇంటిలోనూ జరుగుతుంది. జగన్ ఉన్నప్పుడు స్కూళ్లు బాగుపడ్డాయి. ఇంగ్లిషు మీడియం వచ్చింది. నాడు-నేడుతో స్కూళ్లు బాగుపడ్డమే కాకుండా సీబీఎస్ఈ నుంచి ఐబీ వరకు ప్రయాణం మొదలుపెట్టాడు. ఆరో తరగతి నుంచిప్రతి తరగతి గది డిజిటైజ్ అయింది...జగన్ ఉన్నప్పుడే 8వ తరగతి పిల్లాడి చేతిలో ట్యాబులు కనిపించేవి. మరో వైపు ప్రైవేటు బడులు ప్రభుత్వ బడులతో పోటీ పడే పరిస్ధితి రాష్ట్రం ఎప్పుడైనా చూసిందంటే.. అది కేవలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలోనే జరిగింది. మొట్టమొదటిసారిగా గవర్నమెంటు బడులలో నో వేకెన్సీ బోర్డులు కేవలం వైయస్సార్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రమే కనిపించాయి...మన హయాంలో క్రమం తప్పకుండా తల్లులకు అమ్మఒడి ఇచ్చి, తల్లులను ప్రోత్సహిస్తూ పిల్లలను బడులకు పంపిస్తూ.. వాళ్లు ఎదగాలని, భావి ప్రపంచంతో పోటీపడాలని, ఏలాలని వాళ్ల చదువుల్లో మార్పులు తీసుకొచ్చిన రోజులు మన పాలనలో చూస్తే.. కేవలం 9 నెలల్లో ప్రభుత్వ స్కూళ్లు పరిస్థితి చూస్తే.. నాడు నేడు పాయే.. అమ్మఒడి పాయే. ఇంగ్లిషు మీడియం పాయే. ఆరోతరగతి నుంచి తరగతి గదులు డిజిటైజేషన్ కార్యక్రమమూ పాయే. ఎనిమిదో తరగతి పిల్లలకు ట్యాబులకు ఇచ్చే కార్యక్రమం పాయే. మూడో తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్ కాన్సెఫ్ట్ పాయే.వీళ్ల పాంప్లెట్ పేపర్ ఈనాడులో చూశాను. గవర్నమెంటు బడులలో 70 శాతం బడులలో 70 శాతం పిల్లలు లేరు రాశారు. అది వీళ్ల తప్పిదం వల్ల అని రాయకుండా అది కూడా మన తప్పిదం వల్లే జరిగిందని రాశారు...పేదవారికి ఆరోగ్యం బాగా లేకపోతే ఆ పేదవాడి పరిస్థితి ఇవాళ దయనీయంగా తయారయింది. నెట్ వర్క్ ఆసుపత్రులకు వెళితే పేదవాడికి ఉచితంగా ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందించే పరిస్దితి లేదు. 1000 ప్రొసీజర్స్ నుంచి 3,300 ప్రొసీజర్లు పేదవాడికి ఉచితంగా వైద్యం అందించేటట్టుగా ప్రొసీజర్లు పెంచడమే కాకుండా, రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అందించేలా ఆరోగ్యశ్రీ పరిమితిని పెంచాం. 900 నుంచి 2,400 ఆసుపత్రుల వరకు నెట్ వర్క్ ఆసుపత్రులను పెంచాం. గవర్నమెంటు హాస్పటళ్లలో వైద్యులు, నర్స్‌ల కొరత అన్నది పరిపాటే అన్న సాంప్రదాయాన్ని మార్చివేశాం.మొట్టమొదటిసారిగా గవర్నమెంటు ఆసుపత్రుల రూపురేఖలను నాడు-నేడు ద్వారా మార్చివేశాం. దేశవ్యాప్తంగా స్పెషలిస్టు డాక్టర్లు కొరత 61 శాతం ఉంటే.. మన రాష్ట్రంలో దాన్ని 4 శాతానికి తీసుకొచ్చిన ఘనత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీదే. ప్రభుత్వ ఆసుపత్రులుకు వెళితే మందులు దొరకని పరిస్థితి నుంచి.. మందుల కోసం వెలితే డబ్ల్యూ హెచ్ ఓ, జీఎంపీ ప్రమాణాలున్న మందులు మాత్రమే దొరికేలా చేసిన ప్రభుత్వం కూడా వైఎస్సార్సీపీదే.మొట్టమొదటసారిగా రాష్ట్రంలో ఎప్పుడూ కనీవినీ ఎరుగని విధంగా గ్రామాల్లో విలేజ్ క్లినిక్ ఏర్పాటు చేశాం. అక్కడ 105 రకాల మందులు సరఫరా చేస్తూ.. 24గంటలూ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, ఏఎన్ఎంలు అందుబాటులోకి ఉండేటట్టు.. 14 రకాల డయాగ్నోస్టిక్ టెస్టులు కూడా అక్కడే చేసేలా విలేజ్ క్లినిక్‌లు ఏర్పాటుచేశాం. తొలిసారిగా పీహెచ్‌సీలను బలోపేతం చేసి ప్రతి పీహెచ్సీలోను ఒక డాక్టరు ఉండేలా, మరో డాక్టర్ 104 అంబులెన్స్ లో ఊర్లలో అందుబాటులో ఉండేలా చేసాం. ప్రతి మండలానికి రెండు పీహీచ్సీలను ఏర్పాటు చేశాం. ప్రతి డాక్టర్ ఏ ఊరికి వెళ్లాలో నిర్ణయించి... నెలలో కనీసం రెండు రోజులు ఆ ఊర్లకు వెళ్లేలా చేస్తూ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెఫ్ట్ ను అందుబాటులోకి వచ్చింది కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే వచ్చింది.కనీవీని ఎరుగని విధంగా..కనీవీని ఎరుగని విధంగా మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది కూడా వైఎస్సార్సీపీ హయాంలోనే అమల్లోకి వచ్చింది. ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా పోయింది. విలేజ్ క్లినిక్‌లు పనిచేయడం లేదు. పీహెచ్‌సీలు కూడా పనిచేయడం లేదు. రూ.3వేల కోట్లు నెట్వర్క్ ఆసుపత్రులకు బిల్లలు చెల్లించలేదు. ప్రతి నెలా రూ.300 కోట్లు అవుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతుంది. అంటే దాదాపుగా రూ.3వేల కోట్లు ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. వైద్యం కోసం పేదవాడు ఆసుపత్రికి పోతే ఉచితంగా ఆరోగ్యశ్రీ అందించలేని పరిస్ధితి. ఇదీ మన ప్రభుత్వానికి వీళ్ల ప్రభుత్వానికి తేడా.మొట్టమొదటిసారిగా రైతులకు ఆర్బీకేలు తీసుకుని రావడం, ఇ-క్రాప్ చేయడం, దళారీ వ్యవస్థ తీసివేసి ఆర్బీకే ద్వారానే రైతులకు కనీస గిట్టుబాటు ధర లభ్యమయ్యేలా కొనుగోలు చేయడం, అక్కడే అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ కూర్చుని వ్యవస్థను మార్చేలా తీసుకున్న చర్యలన్నీ నాశనం అయ్యాయి. గ్రామంలో ప్రతి సేవకు సచివాలయం ఏర్పాటు చేసి.. ఎవరెవరు ఏ సేవలు చేయాలో నిర్ణయించాం. ప్రతి 50-60 ఇళ్లకు వాలంటీర్‌ను తీసుకొచ్చి ప్రతి పథకం పారదర్శకంగా ప్రతి ఇంటికి చేర్చే కార్యక్రమాలన్నీ ఇవాళ కొలాప్స్ అయ్యాయి. కేవలం తొమ్మిది నెలల్లోనే వ్యవస్థలన్నీ నాశనమయ్యాయి.మరో వైపు ఏది చూసినా స్కామే. ఏ గ్రామంలో చూసినా బెల్టుషాపునకు రూ.2 లక్షలకో, రూ.3లక్షలకో ఎమ్మెల్యే దగ్గరుండి వేలం పాడిస్తున్నారు. పోలీసులు దగ్గరుండి మద్యం అమ్మేలా సపోర్టు చేస్తున్నారు. ఏ గ్రామంలో చూసినా మద్యమే కనిపిస్తోంది. మొట్టమొదటిసారిగా ప్రభుత్వం నడుపుతున్న మద్యం షాపులు తీసివేసి ప్రైవేటు షాపులు తీసుకొచ్చారు.ఇదీ చదవండి: దొడ్డిదారిలో ‘డిప్యూటీ’ఇసుక ఎక్కడ చూసినా రెట్టింపు ధరలకు అమ్ముతున్నారు. ప్రతి నియోజకవర్గంలో పేకాట క్లబ్బులు కనిపిస్తున్నాయి. ప్రతి నియోజకవర్గంలో ఏ పని జరగాలన్నా.. ఇండస్ట్రీ నడపాలన్నీ, మైనింగ్ చేసుకోవాలన్నా.. ఏ పనికైనా నా కింత అని ఎమ్మెల్యే దగ్గర నుంచి మొదలై చంద్రబాబు వరకు పంచుకుంటున్నారు. ఇవాళ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, పార్టీ ప్రజలకు మంచి వాళ్లగా కనిపిస్తున్నారు. ఆ స్థాయిలో 9 నెలల కాలంలోనే కూటమి నేతలు దారుణంగా తయారయ్యారు.రాజకీయాలలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు వస్తాయి. ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకొండి. ఆ కష్టాలలో ఉన్నప్పుడు మనం వాటిని ఎలా ఎదుర్కొంటామో అన్నదే మనల్ని నాయకుల్ని చేస్తుంది. కష్టం వచ్చినా మనం మన వ్యక్తిత్వాన్ని కోల్పోకూడదు. ఒక్కసారి వ్యక్తిత్వాన్ని కోల్పోతే ప్రజల్లో చులకన అవుతాం. కష్టాలు ఎల్లకాలం ఉండవు. ఎవరికి ఏ కష్టం వచ్చినా నా కథ గుర్తుకుతెచ్చుకొండి.నన్ను 16 నెలలు జైల్లో పెట్టారు. నా మీద కేసులు వేసింది కూడా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ నాయకులే. కేవలం రాజకీయంగా ఎదుగుతున్నానన్న కారణంతో దొంగకేసులు బనాయించి 16 నెలలు జైల్లో పెట్టారు. కానీ ఏం జరిగింది. బయటకు వచ్చి, ప్రజల అండదండలతో ముఖ్యమంత్రి అయ్యాను. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకొండి.ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బెదిరిస్తారు, దొంగకేసులు పెడతారు. జైల్లో పెడతారు. అయినా రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తాం. మీకు మంచి చేసిన వారినీ, చెడు చేసిన వారినీ ఇద్దరినీ గుర్తుపెట్టుకొండి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బ్రతుకుతుంది. ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది. మరో ముప్పై సంవత్సరాలు ఏలుతాం. ఒక్కటే గుర్తు పెట్టుకొండి. ఈసారి జగనన్న 2.0 వేరేగా ఉంటుంది. కార్యకర్తల కోసం జగన్ ఎలా పనిచేస్తాడో చూపిస్తా.. ఇది కచ్చితంగా చెబుతున్నాను. జగనన్న1.0లో కార్యకర్తలకు అంత గొప్పగా చేయలేకపోయిండవచ్చు. ప్రతి పథకం, ప్రతి విషయంలో మొట్టమొదటిగా ప్రజలే గుర్తుకువచ్చి వారి కోసమే తాపత్రయపడ్డాను. వారి కోసమే నా టైం కేటాయించాను, ప్రజల కోసమే అడుగులు వేశాను. కానీ ఇప్పుడు చంద్రబాబు మన కార్యకర్తలను పెడుతున్న ఇబ్బందులు చూశాను. కార్యకర్తల బాధలను గమనించాను. వారి అవస్థలను చూశాను. వీళ్ల కోసం మీ జగన్ అండగా ఉంటాడు’’ అని ఆయన స్పష్టం చేశారు. -
విజయవాడ కార్పొరేటర్లకు వైఎస్ జగన్ దిశానిర్దేశం (ఫొటోలు)
-
విజయవాడ నేతలతో వైఎస్ జగన్ సమావేశం
గుంటూరు, సాక్షి: విజయవాడ వైఎస్సార్సీపీ నేతలు, కార్పొరేటర్లతో పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. బుధవారం ఉదయం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో వాళ్లతో ఆయన తాజా రాజకీయ పరిణామాలను చర్చిస్తున్నారు. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ఎలాంటి కుట్రలకు దారి తీసిందో తెలిసిందే. ఈ నేపథ్యంలో కార్పొరేటర్లలో ఆందోళన నెలకొనగా, వారికి భరోసా ఇచ్చేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారాయన. ఒకవేళ అలాంటి పరిస్థితి ఎదురైతే.. వ్యూహాత్మకంగా ఎలా వ్యవహరించాలో ఆయన దిశానిర్దేశం చేస్తున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి కార్పొరేటర్లతో పాటు మేయర్ భాగ్యలక్ష్మి, వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, దేవినేని అవినాష్, పోతిన మహేష్ తదితరులు హాజరయ్యారు. -
తప్పయింది క్షమించండి.. భూమన కాళ్ల మీద పడ్డ కార్పొరేటర్లు
సాక్షి, తిరుపతి జిల్లా: ఉత్కంఠభరితంగా సాగిన తిరుపతి డిప్యూటీ మేయర్ (Tirupati Deputy Mayor) పదవి ఎన్నికల్లో కూటమి నేతలు తమను కొట్టి బెదిరించారంటూ నలుగురు వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు మాజీ మంత్రి, భూమన కరుణాకర్‌రెడ్డి (bhumana karunakar reddy) కాళ్ల మీద పడి క్షమాపణలు కోరారు.డిప్యూటీ మేయర్ ఎన్నిక అనంతరం భూమన కరుణాకర్‌రెడ్డి నివాసానికి టీడీపీకి ఓటేసిన నలుగురు వైఎస్సార్సీపీ (ysrcp corporators) కార్పొరేటర్లు వచ్చారు. బెదిరించి కూటమికి ఓట్లు వేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పు అయిందంటూ భూమన కాళ్లమీద పడి క్షమాపణ కోరారు. కూటమి నేతలు తమను కొట్టి బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నలుగురు కార్పొరేటర్లు మీడియాతో మాట్లాడుతూ.. పశ్చాత్తాపంతో తమను క్షమించమని వేడుకుంటూ భూమన కరుణాకరరెడ్డిని మేం నలుగురం (కార్పొరేటర్లు) అనీష్, అనిల్, మోహన్ కృష్ణ యాదవ్, అమరనాథ్ రెడ్డిలు ప్రాధేయపడ్డాం. తామంతా వైఎస్సార్సీపీ అధినతే, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వం కోరుకునే వాళ్ళమని, మమ్మల్ని భయపెట్టి, ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తామని బెదిరించి కిడ్నాప్ చేశారు.వాళ్ళకి భయపడి ఓటు వేయాల్సి వచ్చింది, తప్పు జరిగి పోయింది క్షమించమని కరుణాకర్ రెడ్డిని వేడుకుంటున్నాం: అనీష్ రాయల్ ఎత్తుకెళ్లి మాపై భౌతికంగా దాడి చేసి, ఇబ్బందులు పెట్టారు. ఓటు వేయకుంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు..భయపెట్టారు: అనీష్ రాయల్ , అనిల్, మోహన్ కృష్ణ యాదవ్నన్ను ఎంతగా భయపెట్టినా టీడీపీకు అనుకూలంగా ఓటు వేయను అని స్పష్టం చేశాను. భయపెట్టి, బెదిరింపులకు పాల్పడ్డారు. నేను ఎవరికీ ఓటు వేయకుండా తటస్థంగా ఉన్నాను.నేను వైఎస్సార్సీపీలో గెలిచాను, ఆ పార్టీలోనే చివరి వరకు కొనసాగుతా. జరిగిన పరిస్థితులు అర్థం చేసుకుంటారని, పశ్చాత్తాపంతో కరుణాకర్ రెడ్డి వద్దకు వచ్చాను: 5వ డివిజన్ కార్పొరేటర్ అమరనాథ్ రెడ్డి -
టీడీపీకి చట్టం అంటే గౌరవం లేదు: బొత్స సత్యనారాయణ
-
YSRCP కార్పొరేటర్లకు డబ్బులు పంచుతూ అడ్డంగా దొరికిన టీడీపీ
-
జనసేన ఎమ్మెల్యే కొడుకు రౌడీయిజం సంచలన నిజాలు బయటపెట్టిన తిరుపతి కార్పొరేటర్లు
-
40 మంది YSRCP కార్పొరేటర్లకు టీడీపీ వల
-
తిరుపతిలో హైటెన్షన్.. పోలీసుల ముందే వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల కిడ్నాప్
-
కార్పొరేటర్లు, కౌన్సిలర్లకి విప్ జారీ చేసిన YSRCP
-
YSRCP కార్పొరేటర్లను నిర్భందించిన కూటమి నేతలు
-
కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు వైఎస్ఆర్ సీపీ విప్ జారీ
-
కాంగ్రెస్.. ‘ఢీ’ఆర్ఎస్!
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎసీ చరిత్రలోనే మున్నెన్నడూ లేని విధంగా అసెంబ్లీ తరహాలో మార్షల్స్‌తో సభ్యులను బలవంతంగా బయటకు పంపించిన ఘటన గురువారం చోటుచేసుకుంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ కార్పొరేటర్ల మధ్య జరిగిన వివాదంతో సభాధ్యక్ష స్థానంలోని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సభలో ఉన్న బీఆర్ఎస్ కార్పొరేటర్లందరినీ బయటకు పంపించాల్సిందిగా మార్షల్స్‌ను ఆదేశించారు. దాంతో వారు కార్పొరేటర్లను బలవంతంగా బయటకు తీసుకువెళ్లారు. అనంతరం రామ్‌గోపాల్‌పేట పీఎస్‌కు తరలించి, సాయంత్రం వరకు అక్కడే ఉంచారు. దాదాపు మూడు గంటల వ్యవధిలో సభ నాలుగుసార్లు వాయిదా పడింది. ఆరంభం నుంచే.. సమావేశం ఆరంభం నుంచే రసాభాస చోటు చేసుకుంది. ఉదయం 10.35 గంటలకు సభ ప్రారంభం కాగా 10.40 గంటలకు బడ్జెట్‌పై చర్చ ప్రారంభిద్దామని మేయర్ అన్నారు. తొలుత ప్రశ్నోత్తరాలు చేపట్టాలని బీఆర్ఎస్, బీజేపీ సభ్యులు నినాదాలు చేశారు. గందరగోళం చెలరేగడంతో 10.50 గంటలకు మేయర్ సభను వాయిదా వేశారు. ఈ సమయంలోనూ సభ్యుల మధ్య తోపులాట జరిగింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ జూటా అంటూ బీజేపీ సభ్యులు నినాదాలు చేశారు. తిరిగి సభ ప్రారంభమయ్యాక సైతం గందరగోళం ఆగలేదు. ఎలాంటి చర్చ లేకుండానే వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2025–26) రూ. 8440 కోట్ల బడ్జెట్‌ను ఆమోదించినట్లు (డీమ్డ్ టూ అప్రూవ్ అంటూ) మేయర్ ప్రకటించారు. పరిస్థితి అదుపు తప్పిందిలా.. బీఆర్ఎస్ సభ్యుల చేతుల్లోని కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు, సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా ఉన్న ప్లకార్డుల్ని కాంగ్రెస్ సభ్యులు బాబా ఫసియుద్దీన్, సీఎన్‌రెడ్డి తదితరులు చించివేశారు. బడ్జెట్ ప్రతులను బీఆర్ఎస్ వారు మేయర్ పోడియంపైకి విసిరారు. పోడియం వద్దకు వెళ్లకుండా కాంగ్రెస్ సభ్యులు వారికి అడ్డు నిల్చున్నారు. కాంగ్రెస్ డౌన్‌డౌన్ అంటూ బీఆర్ఎస్ సభ్యులు నినాదాలు చేశారు. రెండు పార్టీల మధ్య తోపులాట పెరిగి పరిస్థితి అదుపు తప్పింది. ఒక దశలో బాహాబాహీకి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు సింధు, శాంతి, పద్మా వెంకట్‌రెడ్డి, విజయ్కుమార్గౌడ్లను బయటకు పంపించారు. అనంతరం ప్రశ్నోత్తరాలు ప్రారంభిస్తున్నట్లు మేయర్ ప్రకటించారు. దీంతో బయటకు పంపిన తమ సభ్యులను లోనికి తీసుకురావాల్సిందేనని, లేనిదే తాము చర్చలో పాల్గొనమని బీఆర్ఎస్ సభ్యులు మన్నె కవితారెడ్డి తదితరులు పట్టుబట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. బీఆర్ఎస్ సభ్యులందరినీ బయటకు తీసుకెళ్లాల్సిందిగా మేయర్ ఆదేశించడంతో 33 మంది సభ్యులను మార్షల్స్ బలవంతంగా ఎత్తుకెళ్లారు. బయటకెళ్లిన వారు నిరసన ప్రదర్శనకు దిగగా జీహెచ్ఎంసీ కార్యాలయం నుంచి రామ్‌గోపాల్‌పేట పీఎస్‌కు తరలించారు. బీఆర్ఎస్ బలంతోనే మేయర్‌గా ఎన్నికైన విజయలక్ష్మి తమనే బయటకు పంపించడం దారుణమని ఆ పార్టీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా.. కాంగ్రెస్ వాళ్లు కేటీఆర్ 420 అంటూ, బీఆర్ఎస్ వాళ్లు సీఎం రేవంత్‌రెడ్డి 420 అంటూ ఒకరికి వ్యతిరేకంగా ఒకరు ప్లకార్డులు పట్టుకొచ్చారు. సభ ప్రారంభానికి ముందు బీజేపీ సభ్యులు శ్రవణ్, తదితరులు తమకు బడ్జెట్ కేటాయించడం లేదంటూ, మేయర్ ఎంట్రన్స్ వద్ద యాచకుల మాదిరిగా చిప్పలు పట్టుకొని ప్రదర్శన నిర్వహించారు. బాబా ఫసి యుద్దీన్ భారత్ జోడో యాత్ర టీషర్ట్ వేసుకొని రావడంపై బీజేపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. 70 శాతం ఆదాయం అధికారులకే.. ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు కమిషనర్, సంబంధిత అధికారులు బదులిచ్చారు. వీధిదీపాల సమస్యలు త్వరలో తీరుతాయని, చెత్త సమస్యలు పరిష్కరిస్తామన్నారు. పారిశుద్ధ్యం, వీధి దీపాల సమస్యలున్నాయని డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్‌రెడ్డి తెలిపారు. మేయర్‌తో కలిసి అన్నిడివిజన్లలో సమస్యలు పరిష్కరిస్తామన్నారు. బల్దియాలో అనసరంగా ఎందరో అధికారులున్నారని, 70 శాతం జీహెచ్ఎంసీ ఆదాయం వారి జీతభత్యాలకే పోతుండగా, వారి ద్వారా ఒరుగుతున్నదేమీ లేదని కాంగ్రెస్ సభ్యుడు ఉప్పలపాటి శ్రీకాంత్ జీహెచ్ఎంసీ తీరును ఎండగట్టారు. అవసరమైన పారిశుధ్యం వంటి పనులకు మాత్రం సిబ్బంది లేరన్నారు. సమీక్షించి తగిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ ఇలంబర్తి హామీ ఇచ్చారు. కాంగ్రెస్ చర్య దుర్మార్గం: కేటీఆర్ జీహెచ్ఎసీ పాలకమండలి సమావేశంలో హైదరాబాద్ నగరాన్ని పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టినందుకు కార్పొరేటర్ లను అరెస్టు చేయడం దుర్మార్గమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచి్చన తర్వాత హైదరాబాద్ నగరానికి నిధులు ఇవ్వడం లేదని కోటి మంది నగర ప్రజల తరఫున ప్రశ్నిస్తే బయటకి గెంటెస్తారా? అని ఆయన ప్రశ్నించారు.రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమే : మంత్రి పొన్నం జీహెచ్ఎఎంసీ బడ్జెట్ సమావేశాలను అడ్డుకోవడం రాజ్యాంగాన్ని అపహస్యం చేయడమేనని హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అందుకు బీఆర్ఎస్ నాయకత్వం సమాధానం చెప్పాలన్నారు. బడ్జెట్‌ను అడ్డుకోవడం హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకున్నట్టేనన్నారు. -
‘అక్రమ అరెస్టు’లపై కేటీఆర్ ఆగ్రహం
హైదరాబాద్, సాక్షి: బీఆర్ఎస్ కార్పొరేటర్ల అరెస్ట్‌ను భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఖండించారు. నగరాన్ని పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టినందుకు కార్పొరేటర్ లను అరెస్టు చేయడం దుర్మార్గమని అన్నారాయన. ఇవాళ్టి సర్వసభ్య సమావేశంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లపై సస్పెన్షన్ వేటు పడగా.. ఆపై ఆందోళనకు దిగిన వాళ్లను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.‘‘కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) వచ్చిన తర్వాత హైదరాబాద్ నగరానికి నిధులు ఇవ్వడం లేదని కోటి మంది నగర ప్రజల తరఫున ప్రశ్నిస్తే బయటకి గెంటేస్తారా?. గత సంవత్సరం పెట్టిన బడ్జెట్ నిధులను కనీసం కూడా ఖర్చు చేయకుండా.. మరోసారి అవే కాగితాల పైన అంకెలు మార్చి గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ మోసాన్ని అడ్డుకున్నందుకు మా ప్రజా ప్రతినిధుల గొంతు నొక్కుతారా?. .. పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్ సరఫరా వంటి కనీస ప్రజా సౌకర్యాలను కూడా సరిగ్గా నిర్వహించలేని జీహెచ్ఎంసీ అసమర్ధ తీరును ప్రశ్నిస్తే కూడా ఈ ప్రభుత్వం జీర్ణించుకోవడం లేదు. హైదరాబాద్ నగర ప్రజల సమగ్ర అభివృద్ధి కోసం గత ప్రభుత్వం ప్రారంభించిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలను వెంటనే పూర్తి చేయాలి. అప్పటిదాకా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, పురపాలక శాఖకు బాధ్యత వహిస్తున్న ముఖ్యమంత్రిని నిలదీస్తూనే ఉంటాం. అరెస్టు చేసిన కార్పొరేటర్లను, పార్టీ నేతలను వెంటనే విడుదల చేయాలి. ఇచ్చిన హామీలను అమలను చేయకుండా అరెస్టుల పేరుతో ప్రజాప్రతినిధులను అణగదొక్కాలని చూస్తే ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని మా పార్టీ తరఫున ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం అని అన్నారాయన. -
GHMC కౌన్సిల్ మీటింగ్ హిట్.. బీజేపీ కార్పొరేటర్ల వినూత్న నిరసన
-
BRS కార్పొరేటర్లు సస్పెండ్.. ఆపై అరెస్ట్.. జీహెచ్ఎంసీ వద్ద ఉద్రిక్తత
హైదరాబాద్, సాక్షి: జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశాల నుంచి బీఆర్ఎస్ కార్పొరేటర్లను మేయర్ విజయలక్ష్మి సస్పెండ్ చేశారు. సమావేశానికి అడ్డుపడడంతో పాటు తనపై పేపర్లు విసిరడంతో జీహెచ్ఎంసీ సెక్షన్ 89/1 ప్రకారం ఆమె ఈ చర్యకు ఉపక్రమించారు. ఆపై రంగప్రవేశం చేసిన మార్షల్స్.. బీఆర్ఎస్ కార్పొరేటర్లను బయటకు తీసుకెళ్లారు. అయితే బీహెచ్ఎంసీ బయటే బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన చేపట్టగా.. పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు.అంతకు ముందు.. ప్రశ్నోత్తరాలను బీఆర్ఎస్ కార్పొరేటర్లు అడ్డుకున్నారు. అప్పటికే బయటకు తీసుకెళ్లిన తమవాళ్లను లోపలికి తీసుకురావాలంటూ డిమాండ్ చేశారు. అయితే.. బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ ఎవరో తనకు తెలియదని, ఆ పార్టీ సభ్యులు తనపై పేపర్లు విసిరారని మేయర్ విజయలక్ష్మి ఆరోపణలకు దిగారు. దీంతో.. మేయర్‌కు క్షమాపణలు చెప్పాలంటూ బీఆర్ఎస్కు కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ క్రమంలో మేయర్ పోడియం వద్ద చేరుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు పరస్పరం దూషించుకున్నారు. దీంతో.. సమావేశాన్ని మేయర్ మరోసారి వాయిదా వేశారు. అంతకుముందు.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో రసాభాస చోటు చేసుకోవడంతో కాసేపు సమావేశాన్ని మేయర్ వాయిదా వేశారు. ప్రజా సమస్యలపై చర్చించాలని బీఆర్ఎస్ ఫ్లకార్డులతో నిరసనకు దిగగా.. బడ్జెట్ ఆమోదం విషయంలో మొండిపట్టుతో ఉన్న కాంగ్రెస్ సభ్యులు వాళ్లను అడ్డుకునే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్-కాంగ్రెస్ కార్పొరేటర్ల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో బీఆర్ఎస్ సభ్యుల్లో కొందరిని మార్షల్స్ సాయంతో మేయర్ బయటకు పంపించేశారు. ఆపై విపక్షాల ఆందోళన నడుమ గందరగోళం నెలకొనడంతో సభ వాయిదా పడింది.ఎన్నికల హామీల మాటేంటి?గురువారం ఉదయం జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ప్రారంభం కాగానే.. ముందుగా బడ్జెట్ ప్రవేశపెడుతున్నట్లు మేయర్ ప్రకటించారు. అయితే.. ప్రజా సమస్యలపై ముందు చర్చించాలని బీఆర్ఎస్, బీజేపీలు పట్టుబట్టాయి. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు గురించి నిలదీశాయి. దీంతో ఒక్కసారిగా పరిస్థితి మారింది. ఫ్లకార్డులు పట్టుకుని బీఆర్ఎస్ సభ్యులు నిరసనకు దిగారు. మేయర్ పోడియం చుట్టుముట్టి నినాదాలు చేశారు. దీంతో సభను వాయిదా వేసిన మేయర్.. ఆ వెంటనే బడ్జెట్‌ను ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు. ఇది మరింత అగ్గి రాజేసింది.ఏకపక్షంగా బడ్జెట్‌ను మేయర్ ఆమోదించడంపై నిరసనకు దిగిన బీఆర్ఎస్ కార్పొరేటర్లను కాంగ్రెస్ కార్పొరేటర్లు అడ్డుకుని వాగ్వాదానికి దిగారు. బీఆర్ఎస్ కార్పొరేటర్ల చేతుల్లోని ఫ్లకార్డులు లాక్కొని చించేశారు కార్పొరేటర్లు సీఎన్ రెడ్డి, బాబా ఫసియుద్దీన్. దీంతో.. కార్పొరేటర్లు ఒకరినొకరు తోసేసుకున్నారు. మేయర్ ఎంత విజ్ఞప్తి చేసినా సభ్యులు తగ్గలేదు. మేయర్‌కు వ్యతిరేకంగా కౌన్సిల్లో విపక్షాలు ఆందోళనకు దిగారు. దీంతో సమావేశం వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారామె. ఆపై కౌన్సిల్ హాల్లోకి మార్షల్స్ ప్రవేశించి.. బీఆర్ఎస్ కార్పొరేటర్లలో కొందరిని బయటకు తీసుకెళ్లారు.అంతకుముందు.. కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం కనిపించింది. సర్వసభ్య సమావేశం సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకోవాలని అధికారులు భావించారు. ఈ క్రమంలోనే ఆఫీస్ బయట భారీగా పోలీసులు, మీటింగ్ హాల్ వద్ద మార్షల్స్‌ను మోహరించారు. ‘బిచ్చగాళ్లు’గా బీజేపీ కార్పొరేటర్లుబీజేపీ కార్పొరేటర్ల(BJP Corporaters) వినూత్న నిరసనకు దిగారు. బిచ్చగాళ్ల వేషధారణ తో జీహెచ్ఎంసీ(GHMC) కౌన్సిల్ మీటింగ్‌కి వచ్చారు. ట్యాక్సులు కడుతున్నా తమ డివిజన్లకు నిధులు కేటాయించడం లేదని ఆరోపిస్తున్నారు వాళ్లు. ‘‘మా డివిజన్‌కి నిధులు ఇవ్వండి సారూ..’’ అంటూ అడుక్కుంటూ బీజేపీ కార్పొరేటర్లు నినాదాలు చేశారు. ఇక.. కౌన్సిల్ లో గందరగోళం నెలకొంటే కారకులైన ఆ వ్యక్తులను బయటకు పంపుతామని అధికారులు చెబుతున్నారు.సర్వసభ్య సమావేశంలో రూ.8,440 కోట్లతో ప్రతిపాదించిన బడ్జెట్‌పై చర్చించనున్నారు. మరోవైపు కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై కాంగగ్రెస్ చర్చలు జరుపుతోంది. ఈ ఉదయం మంత్రి పొన్నం నివాసంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు చర్చలు జరుపుతున్నారు. ఇక.. ఫిబ్రవరి 10 తర్వాత మేయర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టాలని విపక్షాలు భావిస్తున్నాయి. -
‘అనంత’ మున్సిపల్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ సత్తా
సాక్షి, అనంతపురం: అనంతపురం మున్సిపల్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ సత్తా చాటింది. ఐదుగురు వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.మునిసిపల్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో పోటీకి టీడీపీ దూరం కాగా, వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు మాత్రమే నామినేషన్లు దాఖలు చేయడంతో ఐదు స్టాండింగ్ కమిటీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు అనీల్ కుమార్ రెడ్డి, సుజాత, రహంతుల్లా, నాగవినూత, నర్సింహులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల స్క్రూటినీ తర్వాత అధికారికంగా ప్రకటించనున్నారు. -
నమ్మక ద్రోహం
పదేళ్ల రాజకీయ జీవితం.. ముచ్చటగా మూడు పారీ్టలు.. తెలుగుదేశం పార్టీలో కార్పొరేటర్‌గా గెలిచి మేయర్‌గా ఎన్నిక.. మూడేళ్లకే అప్పటి ఎమ్మెల్యేతో విభేదాలు.. 2019 ఎన్నికలకు ముందు వైఎస్సార్ సీపీలో చేరిక.. వైఎస్సార్ సీపీలోనూ కార్పొరేటర్‌గా గెలిచి మేయర్‌గా ఎన్నిక.. నాలుగేళ్లకు అప్పటి ఎమ్మెల్యేతో విబేధాలు.. మళ్లీ తెలుగుదేశం పారీ్టలో మంగళవారం చేరడం.. ఇదీ ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు పొలిటికల్ ప్రొఫైల్. పదవుల కోసం పారీ్టలో చేరడం, మళ్లీ పారీ్టకి వెన్నుపోటు పొడవటం, మళ్లీ ఇంకో పారీ్టలో చేరడం.. షాడో మేయర్ పెదబాబుకు వెన్నతో పెట్టిన విద్యలా మారింది. తాజాగా మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో రెండోసారి టీడీపీలో చేరుతున్నారు. సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఏలూరు నగర రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. 2019లో హైకోర్టు కేసులతో ఏలూరు కార్పొరేషన్ ఎన్నిక వాయిదా పడి, 2021లో జరిగింది. మొత్తం 50 డివిజన్లకుగాను 47 డివిజన్లలో అప్పటి వైఎస్సార్ సీపీ విజయం సాధించింది. ఎన్నికలకు ముందు టీడీపీని వీడి మేయర్ నూర్జహాన్ దంపతులు వైఎస్సార్ సీపీలో చేరారు. అప్పటి ఎమ్మెల్యే బడేటి బుజ్జితో ఇబ్బందులు, అవమానాలు ఎక్కువగా ఉన్నాయని, టీడీపీలో వేధింపులు బాగా ఉన్నాయని చంద్రబాబునాయుడుకు చెప్పినా పట్టించుకోలేదని, ఇలా రకరకాల కారణాలు చెప్పి పార్టీని వీడి వైఎస్సార్ సీపీలో చేరారు. బీసీ వర్గానికి చెందిన మహిళ కావడం, రాజకీయంగా నూర్‌బాషా సామాజికవర్గానికి మంచి ప్రాధాన్యం ఇవ్వాలని యోచనతో వైఎస్సార్ సీపీ కార్పొరేటర్‌గా అవకాశం ఇచ్చి రెండో పర్యాయం మేయర్‌గా ఎంపిక చేశారు. వైఎస్సార్ సీపీ అధికారంలో ఉన్నన్ని రోజులూ అంతా బాగానే నడిచింది. ఎన్నికలకు కొద్ది నెలల ముందు నుంచి ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నానితో విబేధాలు ఉన్నాయని అందరికీ చెబుతూ నిత్యం ఆయనతోనే సమావేశాల్లో పాల్గొంటూ ఉండేవారు. కట్ చేస్తే.. ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ఓటమిపాలు కావడంతో పదవి కోసం తెలుగుదేశం బాట పట్టారు. దీనిపై నగరంలో తీవ్ర చర్చ సాగుతోంది. పదేళ్ల ప్రస్ధానంలో మూడు పారీ్టలు మూడోసారి పార్టీ మారుతున్న లీడర్లు అంటూ ప్రచారం జరుగుతోంది. కార్పొరేటర్లతో రహస్య భేటీ ‘మంగళవారం టీడీపీలో చేరుతున్నాను.. మీరందరూ కూడా టీడీపీలోకి వస్తే మనకు ఉన్న రెండేళ్ల పదవీకాలం బాగా వాడుకోవచ్చు, అన్ని విధాలుగా ఉపయోగకరంగా ఉంటుంది. లేకపోతే నష్టపోతారు.. వచ్చేవాళ్లు రండి.. తరువాత జరిగే పరిణామాలకు నేనేమి బాధ్యుడిని కాదు’ అంటూ రెండు రోజుల క్రితం తన నివాసంలో కార్పొరేటర్లతో భేటీ నిర్వహించి తన రాజకీయ భవిష్యత్‌ను ప్రకటించడంతో పాటు కార్పొరేటర్లను పరోక్షంగా హెచ్చరించారు. ఇక వైఎస్సార్ సీపీ అధికారంలో ఉండగా రెండు పర్యాయాలు ఏలూరు మార్కెట్ కమిటీ చైర్మన్‌గా మంచెం మైబాబుకు అవకాశం ఇచ్చారు. అలాగే రాజకీయంగానూ పార్టీ అధిక ప్రాధాన్యం ఇచ్చింది. అధికారం కోల్పోగానే జంపింగ్ నేతల జాబితాలో చేరారు. ఇక మరో నేత ఏలూరు నగర వైఎస్సార్ సీపీ అధ్యక్షులు బొద్దాని శ్రీనివాస్ కుమార్తెకు పార్టీ అధికారంలోకి రాగానే కార్పొరేటర్‌గా అవకాశం ఇవ్వడం, అలాగే స్మార్ట్ సిటీ చైర్మన్‌గా నియమించారు. సాంకేతిక కారణాలతో స్మార్ట్ సిటీ రద్దయిన క్రమంలో ఇడా చైర్మన్‌గా బొద్దాని శ్రీనివాస్‌కు అవకాశం కలి ్పంచారు. నామినేట్ పదవితో పాటు ఐదేళ్ల పాటు నగర పార్టీ అధ్యక్షుడిగా ప్రాధాన్యం ఇచ్చినా ఆర్థిక ప్రయోజనాల కోసం టీడీపీ బాటపట్టారు. మంగళవారం మేయర్ దంపతులతో పాటు బొద్దాని శ్రీనివాస్, మంచెం మైబాబులు టీడీపీలో చేరనున్నారు. -
స్వాతిమలివాల్‌పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
న్యూఢిల్లీ: సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా డిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. కార్పొరేషన్ సమావేశాలు జరగకుండా అడ్డుకున్నారు. ఆప్ ఎంపీ స్వాతి మలివాల్‌పై సీఎం ఇంట్లో జరిగిన దాడి, మున్సిపల్ కార్పొరేషన్‌కు దళిత మేయర్‌ను నియమించాలనే డిమాండ్లతో ఆందోళనకు దిగారు. దీంతో సమావేశాలను మరుసటి రోజుకు మేయర్ వాయిదా వేశారు. ఈ వ్యవహారంపై ఢిల్లీ మేయర్ షెల్లీ ఒబెరాయ్ స్పందించారు. ‘బీజేపీ కార్పొరేటర్లు సమావేశాలను జరగనివ్వలేదు. బీజేపీ కార్పొరేటర్లు సభలో గందరగోళం సృష్టించారు. సంవత్సరంన్నర నుంచి స్టాండింగ్ కమిటీ వేయకుండా అడ్డుకున్నది బీజేపీ కార్పొరేటర్లే’అని మేయర్ తెలిపారు. -
కార్పొరేటర్లను కాంగ్రెస్ లోకి నేనే పంపించా..
-
భవిష్యత్తులో ఏదైనా జరగొచ్చు.. గంగుల
సాక్షి, కరీంనగర్: పార్లమెంట్ ఎన్నికల ముందు కరీంనగర్లో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాలు పెరుగుతుండటంతో ఇక్కడి బీఆర్ఎస్ కార్పొరేటర్లను కాపాడుకునేందుకు ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ సునీల్‌రావు ముందస్తు ప్రయత్నాలు ప్రారంభించారు. నగరంలోని ఓ ప్రముఖ హోటల్లో బీఆర్ఎస్ కార్పొరేటర్లతో మేయర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ శుక్రవారం అర్ధరాత్రి వరకు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కాంగ్రెస్ కండువా కప్పుకునే ఆలోచనలో ఉన్న కార్పొరేటర్లను ఉద్దేశించి గంగుల కమలాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మూడు, నాలుగు నెలల్లో కాంగ్రెస్ దుకాణం బయటపడుతుందంటూ కార్పొరేటర్లకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. తనతో ఉంటే భవిష్యత్తు ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు. లేదంటే విజయశాంతి తరహాలో జంప్ జిలానీలుగా మారిపోతారంటూ సున్నితంగా హెచ్చరించారు. ఈనెల 24వ తేదీన కరీంనగర్లో బీఆర్ఎస్ ముఖ్యకార్యకర్తలతో కేటీఆర్ భేటీ అవుతారని గంగుల చెప్పారు. కరీంనగర్ ఎంపీ ఎన్నికల్లోనూ బీజేపీ, బీఆర్ఎస్ మధ్యే పోటీ ఉంటుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఎంఐఎం బీఆర్ఎస్తోనే ఉంటుందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఎమ్మెల్యే సీట్లలో పెద్ద తేడా లేదని, బీజేపీ, ఎంఐఎంను కలుపుకుంటే భవిష్యత్తులో ఎలాంటి రాజకీయ పరిణామాలైనా చోటుచేసుకోవచ్చని గంగుల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదీచదవండి.. కళ్యాణ కానుకేది..? -
కేటీఆర్ సమావేశంలో రహస్యమేమిటో?
హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ పాలకవర్గంలోనూ మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న మేయర్ బీఆర్ఎస్ పార్టీ కాగా, ఆ పార్టీకి దాదాపు 60 మంది కార్పొరేటర్లున్నారు. ఇటీవలి కాలంలో అన్ని పార్టీల్లోనూ జంపింగ్‌లు సాధారణమయ్యాయి. ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్లోకి చేరిన వారితో పాటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన వారూ ఉన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచింది 56 సీట్లు కాగా, ఇతర పార్టీల నుంచి రాక పోకల నేపథ్యంలో దాదాపు 60 మంది కార్పొరేటర్లున్నారు. ఇప్పటి వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ స్థానే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో బీఆర్ఎస్ నుంచి ఎంతమంది కాంగ్రెస్ వైపు వెళ్తారో తెలియని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ అయితేనే తమ డివిజన్లలోఎక్కువ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయించుకోవడంతో పాటు ఆయా కార్పొరేషన్ల నామినేటెడ్ చైర్మన్లుగా, డైరెక్టర్లుగా అవకాశాలు.. భవిష్యత్తులో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సీట్లకు అవకాశం ఉంటుందనే తలంపుతో పలువురు అధికార పార్టీవైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందే.. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే దాన్ని కాదని కొందరు కాంగ్రెస్‌లో చేరా రు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఇలాంటి వారి సంఖ్య మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. కేటీఆర్ సమావేశంలో రహస్యమేమిటో? గతంలో అధికార పార్టీ అయినందున బీఆర్ఎస్లో చేరిన బీజేపీ కార్పొరేటర్లు బీఆర్ఎస్లోనే కొనసాగుతారా లేక తమ పూర్వాశ్రమంలోకి వెళ్తారా లేక అధికార కాంగ్రెస్‌లో చేరతారా అన్నది చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ నుంచి బీఆర్ఎస్లో చేరిన ఇద్దరు కార్పొరేటర్లు సైతం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వహించిన సమావేశానికి డుమ్మా కొట్టినట్లు తెలిసింది. దీంతో పలు ఊహాగానాలు కొనసాగుతున్నాయి. సమావేశానికి హాజరైన వారు సైతం అందరూ బీఆర్ఎస్లోనే కొనసాగుతారా ? అంటే చెప్పలేని పరిస్థితి నెలకొంది. ప్రతిపక్ష పార్టీలో ఉంటే తమకు సరిగా పనులు జరగవేమోననే తలంపుతోనూ కొందరు కార్పొరేటర్లున్నట్లు తెలుస్తోంది. బహుశా.. కార్పొరేటర్ల ఊగిసలాటను గుర్తించే కాబోలు కేటీఆర్ వారితో నిర్వహించిన సమావేశంలో భవిష్యత్‌లో జరగబోయే నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ వల్ల దాదాపు పదిమంది వరకు కార్పొరేటర్లకు ఎమ్మెల్యేలయ్యేందుకు అవకాశాలుంటాయని ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే గ్రేటర్ పరిధిలోని ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు ఆయా సందర్భాల్లో చేసిన కామెంట్లు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉండటం కూడా పలు ఊహాగానాలకు తావిస్తోంది. ఒకవేళ ఎమ్మెల్యేలు పార్టీ మారితే తమకు అనుకూలురైన కార్పొరేటర్లను కూడా తీసుకు వెళ్లవచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. జీహెచ్ఎంసీలో విచిత్ర పరిస్థితులు.. రాబోయే రోజుల్లో జీహెచ్ఎంసీలో విచిత్ర పరిస్థితులు నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనరల్‌బాడీ సమావేశాలకు, స్టాండింగ్ కమిటీ సమావేశాలకు అధ్యక్షత వహించేది మేయర్. బీఆర్ఎస్కు చెందిన మేయర్‌ది ఇప్పటి వరకు అధికార పార్టీ కాగా, ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీ. ప్రశ్నలు సంధించాల్సింది అధికార పార్టీకి చెందిన కాంగ్రెస్ సభ్యులు. రాష్ట్రంలో తమ పార్టీ ప్రభుత్వమున్నప్పుడే సమావేశాల్ని సవ్యంగా నిర్వహించలేకపోయిన మేయర్.. ఇకముందు ఎలా నిర్వహిస్తారోననే ఆసక్తి రాజకీయ వర్గాల్లో ఏర్పడింది. ప్రతిసారీ గందరగోళాలు, రసాభాసలతో నడిచిన సమావేశాలు రాబోయే రోజుల్లో మరింత గందరగోళం కాగలవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాము ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించిన కాంగ్రెస్ సభ్యులు సైతం ఇకముందు తమ సమస్యల్ని ఎలా ప్రస్తావిస్తారో చూడాల్సిందే. ఇప్పటి వరకు మౌనంగా ఉన్న ఎంఐఎం.. అనుకూలంగానే ఉంటుందా.. వ్యతిరేకత ప్రదర్శిస్తుందా అన్నది స్పష్టం అయ్యేందుకు కొంత సమయం పట్టనుంది. భవిష్యత్‌లో ఒకవేళ ఎంఐఎం కాంగ్రెస్‌తో జత కలిస్తే ..మేయర్ సీటుకు సైతం ఎసరు రాగలదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఇలాంటి పరిణామాల్ని ఊహించి సైతం పార్టీల మార్పిడి జరగవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
జీహెచ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్లలో అసంతృప్తి సెగలు
-
బీజేపీ కార్పొరేటర్ల తీరుపై అధికారుల నిరసన
-
బీజేపీ కార్పొరేటర్ల ధర్నా
-
సీఎం జగన్ ఫోటోను పెట్టడాన్ని ప్రశ్నించిన మేయర్ పై ఆగ్రహం
-
GHMCలో ఎమ్మెల్యేలు Vs కార్పొరేటర్లు
-
ఎంపీ గల్లా జయదేవ్ కనిపించడం లేదు
సాక్షి ప్రతినిధి గుంటూరు: గుంటూరు ప్రజల ఓట్లతో గెలుపొందిన టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ గుంటూరులో మాత్రం కనిపించడం లేదంటూ వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో నిరసన వ్యక్తం చేశారు. ఎంపీ మిస్సింగ్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. శుక్రవారం గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశంలో తమ డివిజన్లలో పనులు జరగడం లేదంటూ తెలుగుదేశం కార్పొరేటర్లు ప్రస్తావిస్తుండగా మేయర్ కావటి మనోహర్‌నాయుడు జోక్యం చేసుకుని తమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెబుతున్నట్లుగా తాము కూడా పారీ్టలకతీతంగా, కులాలు, ప్రాంతాలకతీతంగా నగరాభివృద్ధి చేపట్టామని, టీడీపీ వారు గెలిచిన డివిజన్లలో కూడా రూ.3 కోట్ల నుంచి రూ.8 కోట్ల వరకు అభివృద్ధి పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. తెలుగుదేశం గెలిచిన 38వ డివిజన్లో నాలుగు కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టగా, ఎంపీ కేవలం పది లక్షల రూపాయలు ఇచ్చారని అనడంతో తెలుగుదేశం సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులతో వాగ్వాదానికి దిగారు. దీంతో తెలుగుదేశం సభ్యుడొకరు లేచి తాము నిధులు కావాలని అడుక్కుంటే ఇచ్చారని, మీరు కూడా వస్తే ఇస్తారంటూ వాదనకు దిగారు. దీనిపై అధికార పార్టీ కార్పొరేటర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గుంటూరు ఎంపీ అందరిని సమానంగా చూడాలని, కేవలం మీ పార్టీ సభ్యులకే నిధులు కేటాయించడం ఏమిటని ప్రశ్నించారు. తాము గెలిచి ఏడాదిన్నర కావస్తున్నా ఇప్పటి వరకూ ఎంపీని తాము చూడలేదని, ఎంపీ మిస్సింగ్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. అసలు గుంటూరులో ఉండని వ్యక్తిని ఢిల్లీ వరకూ వెళ్లి నిధులు అడగాలా? అంటూ ప్రశ్నించారు. దీంతో మాటామాట పెరిగి తీవ్ర వాగి్వవాదానికి, తోపులాటకు దారితీసింది. టీడీపీ కార్పొరేటర్లు మహిళా కార్పొరేటర్లను సైతం తోసే ప్రయత్నం చేయడంతో ఎస్సీ మహిళ కార్పొరేటర్లు మల్లవరపు రమ్య, బూసి రాజలత టీడీపీ సభ్యులపై అట్రాసిటీ కేసు నమోదు చేయించాలని డిమాండ్ చేశారు. ఎంపీ గల్లాపై మిస్సింగ్ కేసు నమోదు చేయించాలని మేయర్‌ను కోరారు. అనంతరం మేయర్ కావటి మనోహర్‌నాయుడు జోక్యం చేసుకుని ఎంపీ గల్లా జయదేవ్ తనకు రూ.2.50 కోట్ల దాకా ఎంపీ ల్యాండ్స్ నిధులు వస్తే దానిలో కేవలం రూ.1.20 కోట్లు ఖర్చు చేశారని, అది కూడా టీడీపీ వార్డు సభ్యులకు మాత్రమే మంజూరు చేశారని లెక్కలు చూపడంతో టీడీపీ నాయకులు మిన్నకుండిపోయారు. -
‘కారు’లో లుకలుకలు.. ఎక్కడి నుంచి వచ్చారో తిరిగి అక్కడికే ..!
సాక్షి, రంగారెడ్డిజిల్లా: గులాబీ పార్టీకి సొంత పార్టీ నేతలే షాక్ ఇస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఆపరేషన్ ఆకర్‡్ష మంత్రాన్ని ఆచరించి.. సంఖ్యాబలం లేకున్నా పురపాలికలను చేజిక్కించుకున్న ఆ పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. గెలిచిన పార్టీలకు ఝలక్ ఇస్తూ కారెక్కిన నేతలు.. ఇప్పుడు సొంతగూటి బాట పడుతున్నారు. కొన్నాళ్ల క్రితం తుక్కుగూడ పురపాలక సంఘం చైర్మన్, తాజాగా బడంగ్‌పేట నగరపాలక సంస్థ మేయర్ గులాబీకి గుడ్‌బై చెప్పడం పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్/మేయర్ పదవులను దక్కించుకునేందుకు తగినన్నీ సీట్లు రాకపోవడం టీఆర్ఎస్ను నిరాశకు గురిచేసింది. ఈ నేపథ్యంలోనే ప్రత్యర్థి పార్టీల విజేతలకు వల విసరడం ద్వారా మేజిక్ ఫిగర్‌ను చేరుకోగలిగింది. ఈ క్రమంలోనే బీజేపీ సీటు ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్‌గా గెలిచిన మదన్మోహన్కు తుక్కుగూడ మున్సిపల్ చైర్మన్ పదవిని కట్టబెట్టింది. అదే తరహాలో బడంగ్‌పేటలో పారిజాత నర్సింహారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి కార్పొరేటర్‌గా గెలవడమేగాకుండా.. తన మద్దతుదారులను కూడా భారీ సంఖ్యలో గెలిపించగలిగారు. దీంతో ఈ కార్పొరేషన్ ప్రత్యర్థుల వశంకాకుండా పావులు కదిపిన మంత్రి సబితారెడ్డి.. కాంగ్రెస్ కార్పొరేటర్లను టీఆర్ఎస్లోకి ఆహ్వానించడం ద్వారా మేయర్ పదవిని పారిజాతకు దక్కేలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. తదనంతర పరిణామాల నేపథ్యంలో వలసనేతలకు గులాబీ అగ్రనేతలతో మనస్పర్థలు రావడం మొదలైంది. ఈ క్రమంలోనే మూడు నెలల క్రితం తుక్కుగూడ మున్సిపల్ చైర్మన్ మదన్మోహన్ కాషాయతీర్థం పుచ్చుకోగా.. తాజాగా బడంగ్‌పేట మేయర్, మరో నలుగురు కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ పరిణామాలు మహేశ్వరం నియోజకవర్గం టీఆర్ఎస్ నేతలను ఆత్మరక్షణలో పడేశాయి. దీనికితోడు మీర్‌పేట నగరపాలక సంస్థ కార్పొరేటర్లు కూడా కొందరు పార్టీని వీడేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆదిబట్లలోనూ అదే సీను.. తుక్కుగూడ, బడంగ్‌పేట పరిధిలో చోటుచేసుకున్న పరిణామాలే ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని ఆదిబట్ల మున్సిపాలిటీలోనూ చోటుచేసుకు న్నాయి. ఇక్కడ కాంగ్రెస్ మెజార్టీ సీట్లు కైవసం చేసుకున్నా.. పార్టీని చీల్చి అదే పార్టీకి చెందిన కౌన్సిలర్ కొత్త హరితకు చైర్పర్సన్ గిరిని కట్టబెట్టడం ద్వారా టీఆర్ఎస్ ఖాతాలో ఈ పురపాలికను వేసుకోగలిగింది. స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డితో ఏర్పడ్డ అభిప్రాయబేధాలతో హరిత..‘కారు’ దిగి హస్తం గూటికి చేరారు. ఇదిలావుండగా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోనూ రాజకీయాలు వేడెక్కాయి. కౌన్సిలర్లు, చైర్పర్సన్ మధ్య గ్రూపులుగా విడిపోవడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. ఇక్కడ కూడా పలువురు కౌన్సిలర్లు పక్క చూపులు చూస్తున్నట్లు తెలుస్తోంది. -
కార్పొరేటర్లకు మంత్రి ‘కేటీఆర్’ సీరియస్ వార్నింగ్
సాక్షి, ఖమ్మం: తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు శనివారం ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా లకారం చెరువుపై నిర్మించిన కేబుల్ వంతెనను మంత్రి పువ్వాడ అజయ్‌తో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం, ఖమ్మం నూతన మున్సిపల్ కార్యాలయంలో టీఆర్ఎస్ కార్పొరేటర్లతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్.. టీఆర్ఎస్ కార్పొరేటర్లకు క్లాస్ ఇచ్చారు. కొందరు కార్పొరేటర్ల పనితీరు సరిగా లేదు. ఇంట్లో కూర్చుంటే కుదరదు. మంచిగా పనిచేసి ప్రజల మనసును గెలుచుకోవాలి. వార్డుల్లో ఇంటింటికీ తిరిగి ప్రజల సమస్యలను తెలుసుకోవాలి. పట్టణ ప్రగతిలో అన్ని సమస్యలను పరిష్కరించాలి అని హెచ్చరించారు. ఇది కూడా చదవండి: కేసీఆర్ఫై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు -
మోదీని కలవనున్న బీజేపీ జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు.. పీఎం ఏం చెబుతారో?
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీలోని బీజేపీ కార్పొరేటర్లు మంగళవారం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలవనున్న నేపథ్యంలో ఆయన ఏం చెబుతారోనన్న ఆసక్తి నెలకొంది. జీహెచ్ఎంసీలో బీజేపీ కార్పొరేటర్లు 47 మంది ఉన్నారు. వీరిలో కొందరు సోమవారమే ఢిల్లీ చేరుకున్నారు. మరికొందరు మంగళవారం వెళ్లనున్నారు. ఇటీవల ఇండియన్ బిజినెస్ స్కూల్‌కు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొనేందుకు పీఎం నగరానికి వచ్చినప్పుడే కలవాలనుకున్నప్పటికీ.. గాలిదుమారం, వర్షం కారణంగా సమయం కుదరలేదని ఓ కార్పొరేటర్ తెలిపారు. ఆ రోజు కలవలేకపోవడంతో మంగళవారం ఢిల్లీలో కలిసేందుకు అవకాశం కల్పించారన్నారు. రాబోయే వివిధ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని క్షేత్రస్థాయి నుంచే పార్టీని పటిష్టం చేసేందుకు కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేయగలరనే అభిప్రాయాలున్నాయి. జీహెచ్ఎంసీలో స్థానికంగా కార్పొరేటర్లదే కీలకపాత్ర కావడం తెలిసిందే. ప్రజల స్థానిక సమస్యలు వారికే బాగా తెలుస్తాయి. స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండేదీ కార్పొరేటర్లే అయినందున, వారి సేవల్ని తగిన విధంగా వినియోగించుకోవడం ద్వారా అటు ప్రజలకు తగిన మేలు చేయడంతో పాటు ఇటు పార్టీ బలోపేతానికీ అవకాశముంటుందని కొందరు బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కార్పొరేటర్లు పీఎంను కలవనుండటం.. జీహె చ్‌ఎంసీకి సంబంధించి ఏం చెప్పనున్నారనేది బీజేపీ శ్రేణుల్లో ఉత్కంఠ కలిగిస్తోంది. చదవండి: జూబ్లీహిల్స్ కేసుపై ఎన్‌హెచ్చార్సీ, మహిళా కమిషన్‌కు బీజేపీ ఫిర్యాదు -
వివాదాలు ఘనం.. అభివృద్ధి శూన్యం
ముషీరాబాద్: ముషీరాబాద్ నియోజకవర్గంలో ఆరోపణలు ప్రత్యారోపణలతోనే కార్పొరేటర్ల సంవత్సర పాలన ముగిసింది. నిత్యం ఒకరిపై ఒకరు విమర్శలు ఎక్కుపెట్టుకుంటూ టీఆర్ఎస్, బీజేపీ ప్రజాప్రతినిధులు అభివృద్ధిని మరిచారు. ఏడాది క్రితం ఉత్కంఠ భరితంగా సాగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నియోజకవర్గంలోని ఆరు డివిజన్లలో ఒక్క భోలక్‌పూర్ డివిజన్ మినహా ఐదు డివిజన్లలో బీజేపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. స్థానిక ఎమ్మెల్యే టీఆర్ఎస్ నేత కావడం, గెలిచిన కార్పొరేటర్లంతా బీజేపీ వారు కావడంతో ప్రతి విషయంలోనూ ఆదిపత్యపోరు కొనసాగించారు. దీంతో ఇరు పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలతో వివాదాలు ఎక్కువై అభివృద్ధిపై దృష్టి సారించిన దాఖలాలు తక్కువే. ఎమ్మెల్యే తమను విస్మరిస్తున్నారంటూ.. నియోజకవర్గంలో ఎక్కడ అభివృద్ధి కార్యక్రమం చేపట్టినా ఎమ్మెల్యే ముఠా గోపాల్ తమకు సమాచారం ఇవ్వడం లేదని, ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన తమను విస్మరిస్తున్నారంటూ బీజేపీ కార్పొరేటర్లు ఆరోపణలు గుప్పిస్తున్నారు. నియోజకవర్గంలోని ఐదు డివిజన్లలో ఏడాది నుంచి ఇదే వివాదం కొనసాగుతూ వస్తోంది. ఎమ్మెల్యే శంకుస్థాపన చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు కార్పొరేటర్లు మరోసారి శంకుస్థాపనం చేయడం, ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతి కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్లు వివాదాలకు దిగడం నిత్యం పరిపాటిగా మారింది. ముషీరాబాద్ చేపల మార్కెట్, ఆదర్శ కాలనీ, రాంనగర్ డివిజన్లోని జెమినీ కాలనీ, బాగ్‌లింగంపల్లి.. ఇలా ప లు ప్రాంతాల్లో ఎమ్మెల్యే ముఠా గోపాల్ చేపట్టిన అభివృద్ధి పనుల సందర్భంగా కార్పొరేటర్లు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. కార్పొరేటర్లకు నిధులు నిల్.. కార్పొరేటర్లుగా ఎన్నికై ఏడాది గడిచినా డివిజన్లలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రభుత్వం వారికి నిధులు కేటాయించలేదు. దీంతో వారు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలను స్వతహాగా చేపట్టలేకపోయారు. డ్రైనేజీ, తాగునీటి కలుషితం, వీధి దీపాలు, అధ్వానంగా మారిన అంతర్గత రహదారులు వంటి పలు సమస్యల విషయంలో ప్రజాప్రతినిధులు ఫొటోలు తీయించుకోవడం వరకే పరిమితమయ్యారు. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి వారిపై ఒత్తిడి పెంచడం తప్ప ప్రజల సమస్యలను పరిష్కరించిన దాఖలాలు పెద్దగా కనిపించలేదు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు అనేక రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి పైప్లైన్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే ముఠా గోపాల్ హడావిడిగా శంకుస్థాపనలు చేశారు. ఆ పనులే ఇప్పటికీ కొనసాగుతున్నాయి తప్ప కొత్తగా ఎలాంటి అభివృద్ధి పనులుచేపట్టింది లేదు. -
GHMC: ఆస్తుల ధ్వంసం, మేయర్ ఆగ్రహం, బీజేపీ కార్పొరేటర్లపై కేసు
సాక్షి, బంజారాహిల్స్: బీజేపీ కార్పొరేటర్లు తమ అనుచరులతో కలిసి జీహెచ్ఎంసీ ఆస్తులను ధ్వంసం చేయడం హేయమైన చర్య అని నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. ప్రజాప్రతినిధులుగా ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రజాస్వామ్య పద్ధతిలో అనేక మార్గాలు ఉన్నప్పటికీ మన కార్పొరేషన్ ఆస్తులను మనమే ధ్వంసం చేయడం సరికాదన్నారు. బంజారాహిల్స్‌లోని మేయర్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మేయర్ విజయలక్ష్మి మాట్లాడారు. ప్రజాప్రతినిధులుగా ఉండి ప్రజల ఆస్తిని ధ్వంసం చేయడంపై బీజేపీ కార్పొరేటర్లు ఆత్మపరిశీలన చేసుకోవాలని, రాజ్యాంగ పరమైన పదవిలో ఉండి ఇలాంటి దాడులకు పాల్పడితే ప్రజలకు వ్యవస్థలపై నమ్మకం పోతుందన్నారు. చదవండి: GHMC: రణరంగంగా మారిన మేయర్ చాంబర్.. తనను కలిసేందుకు అనుమతి ఇచ్చినప్పటికీ రాకపోవడంపై బీజేపీ కార్పొరేటర్లు సమాధానం ఇవ్వాలన్నారు. ఆ విషయాన్ని కూడా రాజకీయం చేస్తూ ఇలాంటి దాడులకు పాల్పడటం సరికాదన్నారు. జీహెచ్ఎంసీ అధికారులు, కార్పొరేటర్లు ప్రజా సమస్యలపై స్పందించి వెంటనే పరిష్కరించటంలో రాజీపడటం లేదన్నారు. తాను నగరంలో భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో లోతట్టు ప్రాంతాలు సందర్శించి అధికారులను, ప్రజలను అప్రమత్తం చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఎల్బీనగర్ జోన్‌లోని సరూర్‌నగర్ ప్రాంతం ఎక్కువ ముంపునకు గురైన సందర్భంలో వెల్ఫేర్ అసోసియేషన్, కార్పొరేటర్లు, అధికారులతో సమీక్ష చేసి తాత్కాలిక, శాశ్వత పరిష్కార చర్యలు తీసుకున్నామని తెలిపారు. కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో జూన్ 29న వర్చువల్ ద్వారా జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించినట్లు పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా కార్పొరేటర్లు విన్నవించిన సమస్యలను పరిష్కరించినట్లు స్పష్టం ఆమె స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ దృష్ట్యా జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించలేకపోతున్నామని, ఈ విషయం బీజేపీ కార్పొరేటర్లకు తెలిసినప్పటికీ కావాలనే దాడి చేశారని అన్నారు. కార్పొరేటర్లు సహా 20 మందిపై కేసు ఖైరతాబాద్: జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. కుర్చీలు, పూల కుండీలు, టేబుల్, అద్దాలను ధ్వంసం చేయడంతో బీజేపీ కార్పొరేటర్లు సహా 20 మందిపై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
విశ్వాసం కోల్పోయిన కాకినాడ మేయర్
కాకినాడ: కాకినాడ మేయర్ సుంకర పావని, డిప్యూటీ మేయర్ కె.సత్తిబాబు విశ్వాసం కోల్పోయారు. తెలుగుదేశం పార్టీకి చెందిన వారిపై అవిశ్వాసానికి మద్దతుగా 36 మంది ఓట్లు వేశారు. అవిశ్వాసానికి వ్యతిరేకంగా.. మేయర్‌కు మద్దతుగా ఒక్కరు కూడా ఓటు వేయలేదు. చివరకు మేయర్ కూడా తన ఓటు వేసుకోలేదు. సొంత టీడీపీలో అసమ్మతి కార్పొరేటర్లు విప్‌ను ధిక్కరించి మరీ మేయర్, డిప్యూటీ మేయర్లపై అవిశ్వాసానికి మద్దతుగా ఓటేశారు. టీడీపీకి చెందిన మేయర్, డిప్యూటీ మేయర్లపై మొత్తం 33 మంది కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించారు. వీరిలో టీడీపీకి చెందిన 21 మంది, వైఎస్సార్సీపీకి చెందిన 8 మంది, బీజేపీకి చెందిన ఇద్దరు, ఇండిపెండెంట్లు ఇద్దరు ఉన్నారు. మంగళవారం నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో ప్రిసైడింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ పర్యవేక్షణలో అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నిర్వహించారు. ఈ సమావేశానికి 43 మంది కార్పొరేటర్లు, ఓటు హక్కు కలిగిన మంత్రి కురసాల కన్నబాబు, ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి.. మొత్తం 46 మంది హాజరయ్యారు. బీజేపీ కార్పొరేటర్ లక్ష్మీప్రసన్న సమావేశానికి హాజరుకాలేదు. చేతులెత్తే పద్ధతిన ఓటింగ్ ఉదయం 11 గంటలకు మేయర్ సుంకర పావనిపై అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఉండే ఓటర్లు చేతులెత్తి సమ్మతి తెలియజేయాలని జేసీ సూచించారు. టీడీపీకి చెందిన 21 మంది, వైఎస్సార్సీపీకి చెందిన 8 మంది, బీజేపీకి చెందిన ఇద్దరు, ఇండిపెండెంట్లు ఇద్దరు, మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే.. మొత్తం 36 మంది అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా చేతులెత్తారు. తీర్మానాన్ని వ్యతిరేకించే సభ్యులు చేతులెత్తి ఓటింగ్‌లో పాల్గొనాలని జేసీ సూచించగా ఎవరూ చేతులు ఎత్తలేదు. మేయర్, టీడీపీకి చెందిన 8 మంది, ఒక ఇండిపెండెంట్ సభ్యుడు కూడా స్తబ్ధుగా ఉండిపోయారు. దీంతో మేయర్‌కు ఒక్క కార్పొరేటర్ మద్దతు కూడా లేదని నిర్ధారణ అయ్యింది. అనంతరం 12 గంటలకు డిప్యూటీ మేయర్ కాలా సత్తిబాబుపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నిర్వహించారు. ఆ తీర్మానానికి అనుకూలంగా 36 మంది ఓటు వేశారు. అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ మేయర్, టీడీపీకి చెందిన 8 మంది, ఒక ఇండిపెండెంట్ సభ్యుడు వేశారు. దీంతో డిప్యూటీ మేయర్‌పై అవిశ్వాస తీర్మానం నెగ్గినట్లయింది. ఓటింగ్ ఫలితాన్ని కలెక్టర్ రవికిరణ్ ద్వారా ప్రభుత్వానికి పంపిస్తామని జేసీ చెప్పారు. మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు కోల్పోయినట్లు ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించిన అనంతరం కొత్త మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నికకు తేదీని ఖరారు చేయనున్నారు. చంద్రబాబును ధిక్కరించిన తెలుగుదేశం కార్పొరేటర్లు టీడీపీ అధినేత చంద్రబాబు మాటను, పార్టీ విప్‌ను కూడా టీడీపీ కార్పొరేటర్లు ధిక్కరించారు. అసమ్మతి కార్పొరేటర్లతోపాటు పార్టీకి అనుకూలంగా ఉన్న కార్పొరేటర్లు కూడా విప్‌ను పట్టించుకోకపోవడంతో టీడీపీ నేతలు షాక్ అయ్యా రు. విప్ జారీ చేసినా మేయర్‌కు మద్దతుగా ఒక్కరు కూడా ఓటు వేయకపోవడం చర్చకు దారితీసింది. టీడీపీలో అసమ్మతితో ఉన్నవారు>క మిగిలిన కార్పొరేటర్లు మాజీ ఎమ్మెల్యే కొండబాబు వర్గంగా చలామణి అవుతున్నారు. ఆయన కూడా తన వర్గం కార్పొరేటర్లు విప్‌ను ధిక్కరించేలా చూసినట్లు తెలిసింది. -
మేయర్‌పై అవిశ్వాస తీర్మానానికి సర్వం సిద్ధం
సాక్షి, కాకినాడ: నగర మేయర్ సుంకర పావనిపై మెజార్టీ కార్పొరేటర్లు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై మంగళవారం ఓటింగ్ జరగనుంది. కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆధ్వర్యాన నగరపాలక పాలక సంస్థ యంత్రాంగం ఇందుకు ఏర్పాట్లు చేసింది. కార్పొరేషన్ హాలులో ఉదయం 11 గంటలకు మేయర్, 12 గంటలకు డిప్యూటీ మేయర్ సత్తిబాబులపై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరుగుతుంది. జాయింట్ కలెక్టర్ జి.లక్ష్మీశ ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించనున్నారు. ఓటింగ్ ప్రక్రియ జరిగేది ఇలా.. 44 మంది కార్పొరేటర్లతో పాటు మంత్రి కురసాల కన్నబాబు, ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డితో కలిసి 47 మందికి ఓటు హక్కు ఉంది. మూడింట రెండు వంతుల మంది అంటే 31 మంది హాజరైతేనే కోరం ఉంటుంది. చేతులెత్తే పద్ధతిపై ఓటింగ్ జరుగుతుంది. అవిశ్వాసం నెగ్గాలంటే 31 మంది అనుకూలంగా ఓటు వేయాలి. కార్పొరేటర్లు చేతులెత్తి అభీష్టం తెలిపితే అవిశ్వాస తీర్మానం నెగ్గినట్టు నిర్ధారిస్తారు. ఈ విషయాన్ని కలెక్టర్ ప్రభుత్వానికి నివేదించాక మేయర్ పదవి నుంచి పావని వైదొలగాల్సి ఉంటుంది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రావాల్సి ఉంది. ఈ ఎన్నికపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మేయర్ పావని కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఫలితాన్ని 22వ తేదీ వరకూ పెండింగ్‌లో పెట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. 33 మంది సంతకాలు చేసి, ఐక్యతతో ఉన్నందున పావని పదవీచ్యుతురాలు కావడం ఖాయంగా కనిపిస్తోంది. టీడీపీ విప్‌పై గందరగోళం టీడీపీ విప్‌పై గందరగోళం నెలకొంది. వాస్తవానికి మేయర్, డిప్యూటీ మేయర్లపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించగా కేవలం మేయర్ విషయంలోనే విప్ జారీ చేస్తూ టీడీపీ కాకినాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ తీసుకున్న నిర్ణయం కార్పొరేటర్లలో అసహనం రేకెత్తించింది. మేయర్ విషయంలో విప్ జారీ చేసి, బీసీ వర్గానికి చెందిన డిప్యూటీ మేయర్‌పై నిర్లక్ష్యం చేయడాన్ని ఆ పార్టీ కార్పొరేటర్లు ఇప్పటికే టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకువెళ్లారని అంటున్నారు. మరోవైపు పావనిపై అసమ్మతి కార్పొరేటర్లతో పాటు స్వపక్షంలోని 9 మంది అసమ్మతితో రగిలిపోతున్న తరుణంలో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. మేయర్ వ్యతిరేక శిబిరంలో పార్టీలకు అతీతంగా 33 మంది ఉన్నారు. వీరిలో వైఎస్సార్ సీపీ, టీడీపీ, బీజేపీల్లోని అసమ్మతి కార్పొరేటర్లున్నారు. మేయర్‌తో కలిపి టీడీపీకి అనుకూలంగా పది మంది ఉన్నారు. బీజేపీ కార్పొరేటర్ సాలగ్రామ లక్ష్మీప్రసన్న ఆ పార్టీ ఆదేశాల మేరకు తటస్థంగా వ్యవహరించనున్నారు. కార్పొరేటర్లపై అధిష్టానానికి ఫిర్యాదు : మేయర్ పావని కాకినాడ సిటీ: టీడీపీ కార్పొరేటర్ల తీరుపై టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు మేయర్ సుంకర పావని అన్నారు. అవిశ్వాస తీర్మానంపై జరుగుతున్న పరిణామాలను కలెక్టర్‌కు వివరించేందుకు ఆమె సోమవారం కలెక్టరేట్‌కు వచ్చారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడారు. ఈ నెల 22 వరకూ ఎలాంటి చర్యలూ తీసుకోవద్దని కోర్టు తెలిపిందని మేయర్ వివరించారు. ఇప్పటికే కార్పొరేటర్లకు టీడీపీ విప్ జారీ చేసిందన్నారు. ఉల్లంఘిస్తే చర్యలు ఉంటాయన్నారు. ప్రస్తుతం తన వెంట 10 మంది కార్పొరేటర్లు ఉన్నారన్నారు. -
తుది తీర్పునకు లోబడి ‘కాకినాడ మేయర్’ ఫలితం
సాక్షి, అమరావతి: కాకినాడ మేయర్ సుంకర పావనిపై కార్పొరేటర్లు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై ఈ నెల 5న జరగనున్న సమావేశ ఫలితం తాము వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. పావనిపై అవిశ్వాస తీర్మానానికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, జిల్లా కలెక్టర్, కాకినాడ మునిసిపల్ కమిషనర్, కార్పొరేటర్లు సీహెచ్ వెంకట సత్యప్రసాద్, వాసిరెడ్డి రామచంద్రరావులను హైకోర్టు ఆదేశించింది. ఇందులో భాగంగా వారందరికీ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 22కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ దొనడి రమేశ్ శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తనపై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానానికి సంబంధించి గత నెల 18న జిల్లా కలెక్టర్ ఇచ్చిన నోటీసును సవాల్ చేస్తూ పావని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ విచారణ జరిపారు. పావని తరఫు న్యాయవాది చిత్తరవు రఘు వాదనలు వినిపిస్తూ.. ఆమెపై అవిశ్వాసం చట్టవిరుద్ధమన్నారు. చట్టప్రకారం నాలుగేళ్లు పూర్తయ్యాకే అవిశ్వాస నోటీసు ఇవ్వాల్సి ఉంటుందని, తన పదవీ కాలం ఇంకా నాలుగేళ్లు పూర్తి కాలేదన్నారు. అంతేకాకుండా అవిశ్వాస తీర్మాన నోటీసు ఆమెకు అందలేదన్నారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కాసా జగన్మోహన్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. నోటీసులు ఇచ్చేందుకు అధికారులు ఇంటికి వెళితే తీసుకునేందుకు పావని కుటుంబసభ్యులు తిరస్కరించారని తెలిపారు. దీంతో నిబంధనల ప్రకారం.. ఆమె ఇంటికి నోటీసులు అతికించామని చెప్పారు. పావని కార్పొరేటర్‌గా ఎన్నికై నాలుగేళ్లు పూర్తయిందన్నారు. నిబంధనల ప్రకారమే కలెక్టర్ అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి విచారణను ఈ నెల 22కి వాయిదా వేశారు. -
సుంకర పావని టీడీపీని భ్రష్టు పట్టించారు: కార్పొరేటర్లు
సాక్షి, కాకినాడ: నియంతృత్వ ధోరణితో నగర మేయర్ సుంకర పావని టీడీపీని పూర్తిగా భ్రష్టు పట్టించారని ఆ పార్టీకి చెందిన అసమ్మతి కార్పొరేటర్లు మండిపడ్డారు. పదవి కోసం ఆమె ఆడుతున్న కపట నాటకాలను గుర్తించాలని పార్టీ అధినేతను కోరారు. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబుకు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడులకు టీడీపీ అనుకూల, అసమ్మతి కార్పొరేటర్లు సోమవారం వేర్వేరుగా లేఖ పంపారు. నాలుగేళ్లుగా మేయర్ పావని, ఆమె భర్త తిరుమలకుమార్ అనుసరిస్తున్న ఒంటెద్దు పోకడల వల్ల పార్టీ ఎంతో నష్టపోయిందని చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. కొద్ది నెలల క్రితం అవిశ్వాస తీర్మానం పెడతారనే సమాచారంతో ఆమె ఎక్కని గడప, మొక్కని కాలు లేదంటూ మండిపడ్డారు. చదవండి: (బాబుగారు.. మీకో దండం! దూరమవుతున్న లీడర్లు) అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, ప్రముఖ నేతలను కలిసి, మిగిలిన ఏడాది కాలం తాను పదవిలో ఉండేలా చూడాలంటూ ప్రాధేయపడ్డారని తెలిపారు. ఇందుకు అధికార పార్టీ నుంచి సానుకూల స్పందన లేకపోవడం, అన్ని దారులూ మూసుకుపోవడంతో ఇప్పుడు సరికొత్త నాటకాలకు తెర తీశారని పేర్కొన్నారు. తన ఇంటి ముందు సీసీ కెమెరాలు పెట్టారని, గుర్తు తెలియని వ్యక్తులు రెక్కీ చేస్తున్నారని, తనకు ప్రాణహాని ఉందని పేర్కొంటూ పొలిటికల్ డ్రామాలకు తెర లేపారని చంద్రబాబుకు రాసిన లేఖలో కార్పొరేటర్లు ప్రస్తావించారు. ఇంతకాలం పార్టీని భ్రష్టు పట్టించి, చివరకు గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇప్పుడు పార్టీ పెద్దలను ఆశ్రయిస్తున్నారని మండిపడ్డారు. 45వ డివిజన్ కార్పొరేటర్ కర్రి శైలజ కౌన్సిల్ సమావేశాలకు హాజరు కాకపోవడంపై మేయర్ సకాలంలో స్పందించలేదని, దీనివలన ఆమె తన పదవిని కోల్పోయే పరిస్థితి వచ్చిందని, చివరకు కోర్టును ఆశ్రయించి పదవిలో కొనసాగుతున్నారని వివరించారు. ఇలాంటి ఎన్నో తప్పిదాలు చేశారంటూ మేయర్ తీరును తీవ్రస్థాయిలో ఎండగట్టారు. వీటితో పాటు నాలుగేళ్లుగా మేయర్ కుటుంబ సభ్యుల మితిమీరిన జోక్యం, అవినీతి ఆరోపణలు, ఇతర అంశాలను కూడా ఆ లేఖల్లో ప్రస్తావించారు. ఈ వాస్తవాలను, మేయర్ పాలనా విధానాన్ని, ఆమె హయాంలో కార్పొరేటర్లు, కార్యకర్తలు పడిన ఇబ్బందులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని అధినేతను కోరారు. మెజార్టీ కార్పొరేటర్లు పార్టీకి ఎందుకు దూరమయ్యారో వాస్తవాలను గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. చదవండి: (జనసేనలో భగ్గుమన్న విభేదాలు) నేడో రేపో బాబుతో భేటీ టీడీపీలో ఉన్న కార్పొరేటర్లు మేయర్‌కు వ్యతిరేకంగా చంద్రబాబుకు తమ వాదన వినిపించేందుకు సిద్ధమవుతున్నారు. ఒకటి రెండు రోజుల్లో టీడీపీ పక్షాన ఉన్న సుమారు 9 మంది కార్పొరేటర్లు చంద్రబాబును స్వయంగా కలిసి కాకినాడలో మేయర్ దంపతులతో ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించేందుకు ప్రయత్నిస్తున్నట్టు టీడీపీ వర్గాల సమాచారం. టీడీపీలో తాజాగా చోటు చేసుకున్న ఈ పరిణామం ఆసక్తికరంగా మారింది. -
ఆ కార్పొరేటర్ల బకాయిలు రూ. 40 లక్షలు
సాక్షి, ముంబై: నకిలీ కుల ధ్రువీకరణ పత్రాలు, అక్రమ కట్టడాలు తదితర కేసుల్లో అనర్హత వేటు పడిన పలువురు కార్పొరేటర్లు బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)కి భారీగా బకాయిపడ్డారు. మొత్తం 12 మంది మాజీ కార్పొరేటర్లు రూ. 40 లక్షల మేర బకాయి పడ్డారని బీఎంసీ అకౌంట్స్ విభాగం తెలిపింది. వారిని వెంటనే బకాయిలు చెల్లించాలని కోరుతూ నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించింది. బీఎంసీకి బకాయి పడిన 12 మందిలో శివసేన పారీ్టకి చెందిన ముగ్గురు, బీజేపీకి చెందినవారు ముగ్గురు, కాంగ్రెస్‌కు చెందిన ముగ్గురు, ఎన్సీపీకి చెందిన వారు ఒకరు, ఇండిపెండెంట్లు ఇద్దరు ఉన్నారు. సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో పోటీచేసే అభ్యర్థులు టికెట్ దక్కించుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తారు. ఒక్కోసారి తాము గెలిచే అవకాశమున్న రిజర్వుడ్ వార్డుల నుంచి పోటీ చేసేందుకు తప్పుడు లేదా నకిలీ కుల ధ్రువీకరణ పత్రాలు సమరి్పస్తారు. అలాంటి వారు ఎన్నికల్లో గెలిచిన తర్వాత దానికి సంబంధించి ప్రత్యర్థులు ఫిర్యాదు చేస్తే ఎన్నికల అధికారులు రంగంలోకి దిగుతారు. నకిలీ కుల ధ్రువీకరణ పత్రాలు, అక్రమ కట్టడాలు, ఇతర నేరాలకు సంబంధించిన కేసులుంటే పరిశీలిస్తారు. ఆ తరువాత ఆరోపణలు నిజమని తేలితే గెలిచిన కార్పొరేటర్లపై అనర్హత వేటు వేస్తారు. వారి స్థానంలో ఎన్నికల ఫలితాల్లో రెండో స్థానంలో వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. కానీ, ఈ తతంగమంతా పూర్తయ్యేసరికి నాలుగైదు నెలలు గడుస్తుంది. ఈ కాలవ్యవధిలో కార్పొరేటర్లు పొందిన వివిధ భత్యాలు, గౌరవ వేతనం తిరిగి బీఎంసీకి చెల్లించాల్సి ఉంటుంది. వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో బీఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. కానీ, గత ఎన్నికల్లో అనర్హత వేటు పడిన మొత్తం 24 మంది కార్పొరేటర్లలో 12 మంది ఇప్పటివరకు బకాయిలు చెల్లించలేదు. అనిల్ గల్గలే అనే సామాజిక కార్యకర్త సమాచార హక్కు చట్టం కింద బీఎంసీ అకౌంట్స్ విభాగం నుంచి దీనికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. దీంతో ఈ బకాయిల విషయం బయటకు వచి్చంది. దీంతో బకాయిలు చెల్లించని ఆ 12 మంది మాజీ కార్పొరేటర్ల ఆస్తులు జప్తు చేయాలని అనిల్ గల్గలే బీఎంసీ కమిషనర్ ఇక్బాల్‌సింగ్ చహల్‌ను డిమాండ్ చేశారు. పేరు పార్టీ పార్టీ బకాయిలు(రూ. లక్షల్లో) ముర్జీపటేల్ బీజేపీ 5.64 కేశర్బేన్పటేల్ బీజేపీ 5.64 భావన జోబన్‌పుత్ర బీజేపీ 3.49 రాజపతి యాదవ్ కాంగ్రెస్ 5.64 కిణీ మారిస్ కాంగ్రెస్ 4.84 భారతీ ధోంగడే కాంగ్రెస్ 1.81 సుగుణ నాయిక్ శివసేన 3.55 అనుషా కోడం శివసేన 0.37 సునీల్ చవాన్ శివసేన 0.93 నాజీయా సోఫీ ఎన్సీపీ 7.21 చంగేజ్ ముల్తాని ఇండిపెండెంట్ 0.79 అంజుమ్ అస్లం ఇండిపెండెంట్ 0.45 -
GVMC: టీడీపీ కార్పొరేటర్ల గందరగోళం
సాక్షి, విశాఖపట్నం: మహా విశాఖ నగర పాలక సంస్థ రెండో పాలక వర్గ సమావేశంలో బుధవారం గందరగోళం చోటు చేసుకుంది. నగర మేయర్ హరి వెంకటకుమారి అధ్యక్షతన కోవిడ్ నిబంధనల నడుమ ఉదయం కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. 125 ప్రధాన అంశాలు, మరో 11 సప్లిమెంటరీ అంశాలతో కలిపి మొత్తం 136 చర్చనీయాంశాలతో కూడిన భారీ అజెండాను అధికారులు రూపొందించారు. ఈ క్రమంలో నగరాభివృద్ధికి సంబంధించిన అంశాలను చర్చించకుండా టీడీపీ కార్పొరేటర్లు అడ్టుకొని సమావేశంలో గందరగోళం సృష్టించారు. టీడీపీ కార్పొరేటర్ల తీరుపై వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చదవండి: కులాలకు కేసులకు సంబంధమేంటి? -
పల్లా.. ఇక చాలు: టీడీపీలో ముసలం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: టీడీపీ కార్పొరేటర్లలో అప్పుడే ముసలం బయలుదేరింది. ఏకంగా ముప్పై మంది కార్పొరేటర్లు గెలిచినా ఇప్పటికీ సరైన నిర్దేశం లేకపోవడంతో ఎవరికి వారు అన్నట్టుగానే వ్యవహరిస్తూ వస్తున్నారు. దీనికి తోడు టీడీపీ విశాఖ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు, గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఒంటెద్దు పోకడలతో విసుగెత్తిపోతున్నారని అంటున్నారు. కరోనా కష్ట సమయంలో కూడా జీవీఎంసీ తీరు సమర్ధనీయంగానే ఉన్నా.. లేనిపోని ఆరోపణలు ఎక్కుపెట్టి నానాయాగీ చేయాలని పల్లా అదే పనిగా నగర కార్పొరేటర్లకు నూరిపోస్తూ వచ్చారు. ఇక టీడీపీ అధిష్టానం ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయాలని, నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఓ వారం రోజుల పాటు షెడ్యూల్ విడుదల చేసింది. దరిమిలా.. జీవీఎంసీపై విమర్శలు ఎక్కుపెట్టడంతో పాటు, అధిష్టానం ఆదేశాలను అనుసరించి నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పల్లా భావించారు. ఆ మేరకు శనివారం రెండు నియోజకవర్గాలకు సంబంధించిన పార్టీ కార్పొరేటర్లు, నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. కానీ సదరు సమావేశానికి ముగ్గురే ముగ్గురు కార్పొరేటర్లు హాజరయ్యారు. నలుగురు కార్పొరేటర్లు డుమ్మా కొట్టారు. ప్రభుత్వ పాలన వ్యవహారాల్లో నిజంగా లోపాలుంటే ఎత్తి చూపాలి కానీ చీటీకి మాటికీ విమర్శలు, నిందారోపణలు చేస్తే ప్రజల్లో పలుచన అయిపోతామని ఓ సీనియర్ కార్పొరేటర్ చెప్పినా వినిపించుకోకుండా మీటింగ్ పెట్టారని అంటున్నారు. అందుకే ఆ మీటింగ్‌ను చాలా ’లైట్’ తీసుకున్నామని టీడీపీ నేత ఒకరు చెప్పుకొచ్చారు. అడ్డగోలుగా ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టేది లేదని తెగేసి చెప్పినట్టు స్పష్టం చేశారు. సమన్వయకర్తను పల్లా ఎలా నియమిస్తారు వాస్తవానికి నియోజకవర్గాల పార్టీ సమన్వయకర్తలను నియమించే బాధ్యత టీడీపీ అధిష్టానానిదే. కానీ గాజువాక నియోజకవర్గ సమన్వయకర్తగా పల్లా శ్రీనివాసరావు తన మేనల్లుడైన ప్రసాదుల శ్రీనివాస్‌ను నియమించుకోవడంపై ఆ పార్టీలోనే వివాదం రేగుతోంది. పార్టీ అధిష్టానానికి సంబంధం లేకుండా ఏకపక్షంగా తన బంధువుని గాజువాక సమన్వయకర్తగా నియమించుకోవడం పల్లా ఏకపక్ష ధోరణికి పరాకాష్ట అని టీడీపీ నేతలే విమర్శిస్తున్నారు. చదవండి: వలపు వల.. బెజవాడలో మాయలేడీ మోసాలు టీడీపీ నేత సోమిరెడ్డిపై కేసు నమోదు -
వైఎస్సార్సీపీలోకి జీవీఎంసీ ‘స్వతంత్రులు’
డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ) : ఇటీవల జరిగిన గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) ఎన్నికల్లో స్వతంత్రులుగా గెలుపొందిన ముగ్గురు కార్పొరేటర్లు శుక్రవారం తిమ్మాపురంలో రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 32,35,39 వ వార్డు కార్పొరేటర్లు కందుల నాగరాజు, విల్లూరి భాస్కరరావు, మహ్మద్ సాదిక్‌తో పాటు మాజీ కార్పొరేటర్, జనసేన నాయకుడు మువ్వల పోలారావు, టీడీపీ నేత సూరిశెట్టి లక్ష్మణ్ చేరారు. చదవండి: కోవిడ్ నియంత్రణకు ఎన్ఆర్ఐ డాక్టర్ భారీ విరాళం వందశాతం విద్యుదీకరణ భేష్: ఏపీకి నీతి ఆయోగ్ ప్రశంస -
‘మంచిగ ఉంటేనే బట్టకాల్చి మీదేసే రోజులివి’
సాక్షి, హైదరాబాద్: ‘కోట్లాది మందిలో కేవలం కొద్ది మందికి మాత్రమే సందర్భం కలిసి వచ్చి ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యే అవకాశం వస్తుంది. అది గొప్ప విషయం కాదు. ప్రజాప్రతినిధిగా ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజాజీవితంలో మంచి పేరు తెచ్చుకోవడం గొప్ప విషయం. మంచిగ ఉంటేనే బట్టకాల్చి మీదేసే రోజులివి. కొద్దిగా అవకాశం ఇస్తే చాలా చెడ్డపేరు వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి’ అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు కొత్తగా ఎంపికైన జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్, టీఆర్ఎస్ కార్పొరేటర్లకు హితువు పలికారు. విభిన్న ప్రాంతాలు, విభిన్న సంస్కృతులకు చెందిన ప్రజలు నివాసముంటున్న హైదరాబాద్ నగరం అసలుసిసలైన విశ్వనగరంగా, మినీ ఇండియాగా భాసిల్లుతోందన్నారు. ఈ నగర వైభవాన్ని మరింత పెంచే విధంగా మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు పాటుపడాలని పిలుపునిచ్చారు. మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతారెడ్డి, టీఆర్ఎస్ కార్పొరేటర్లు గురువారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారిని అభినందించి కర్తవ్య బోధ చేశారు. విజయలక్ష్మికి నియామక పత్రాన్ని అందజేస్తున్న సీఎం కేసీఆర్. చిత్రంలో డిప్యూటీ మేయర్ శ్రీలత ప్రతి ఒక్కరినీ ఆదరించాలి... ‘పదవిలో ఉన్న వారు ఎంతో సంయమనం, సహనంతో, సాదాసీదాగా ఉండాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ సహజత్వం కోల్పోవద్దు. వేష భాషల్లో మార్పులు రావద్దు. అసంబద్ధంగా, అవసరం లేని మాటలు మాట్లాడితే వచ్చే లాభమేమీ లేకపోగా కొన్ని సందర్భాల్లో వికటించే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాలి. మీ దగ్గరికి వచ్చే వాళ్ల కులం, మతం చూడవద్దు. ప్రతి ఒక్కరినీ ఆదరించాలి. అక్కున చేర్చుకోవాలి. సరైన గౌరవం ఇవ్వాలి. వారు చెప్పేది ఓపికగా వినాలి. చేతనైనంత సాయం చేయాలి. అబద్ధాలు చెప్పవద్దు. సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో ప్రయత్నించాలి’ అని ముఖ్యమంత్రి చెప్పారు. బస్తీ సమస్యలే ప్రధాన లక్ష్యం కావాలి.. ‘గల్లీ చిన్నది.. గరీబోళ్ల కథ పెద్దది అనే గోరటి వెంకన్న పాట వినండి. నేను వందసార్లు విన్నా. అందులో బస్తీల్లో ఉండే పేదల కష్టాలు, గోసలున్నాయి. వాటిని అర్థం చేసుకోవాలి. మేయర్, కార్పొరేటర్లు బస్తీల్లో పర్యటించాలి. వారి బాధలు అర్థం చేసుకోవాలి. బస్తీ సమస్యలు తీర్చాలి. అదే ప్రధాన లక్ష్యం కావాలి’అని సీఎం చెప్పారు. ‘హైదరాబాద్‌కి అనేక అనుకూలతలున్నాయి. మంచి భవిష్యత్తు ఉన్నది. నిజమైన విశ్వనగరమిది. బయటి రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన అనేక మంది ఉన్నారు. నగరంలో సింధ్ కాలనీ ఉంది. గుజరాతి గల్లీ ఉంది. పార్సీగుట్ట ఉంది. బెంగాలీలున్నారు. మలయాళీలున్నారు. మార్వాడీలున్నారు. విభిన్న ప్రాంతాలు, మతాలు, సంస్కృ తుల వారున్నారు. వారంతా హైదరాబాదీలుగా గర్విస్తున్నారు. హైదరాబాద్ ఓ మినీ ఇండియాలాగా ఉంటుంది. అందరినీ ఆదరించే ప్రేమగల నగరం. ఇంత గొప్ప నగరం భవిష్యత్తు కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లపై ఉన్నది. మీరు గొప్పగా పనిచేసి ఈ నగర వైభవాన్ని పెంచాలి. ప్రభుత్వం కూడా హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడానికి అనేక కార్యక్రమాలు చేపడుతుంది. వాటికి సహకరించాలి’అని సీఎం పిలుపునిచ్చారు. అందరికీ మేయర్ పదవి ఇవ్వలేము... అర్థం చేసుకోండి.. ‘ఇంత మంది కార్పొరేటర్లున్నారు. కానీ ఒక్కరికే మేయర్‌గా అవకాశం దక్కుతుంది. మీలో మేయర్ కావాల్సిన అర్హతలున్న వారు చాలా మంది ఉన్నారు. కానీ అందరికీ ఇవ్వలేము. నా పరిస్థితుల్లో మీరున్నా అంతే చేయగలరు. అర్థం చేసుకుని, అందరూ కలసికట్టుగా ఈ నగరాన్ని ముందుకు తీసుకుపోవాలి’అని సీఎం కేసీఆర్ అన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె. కేశవరావు, రాజ్యసభ సభ్యులు సురేశ్‌రెడ్డి, సంతోశ్‌కుమార్, మంత్రు లు తలసాని, మహమూద్ అలీ, ఇంద్రకరణ్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ పాల్గొన్నారు. -
ప్రమాణ స్వీకారం చేస్తేనే ఎన్నికకు అర్హత
సాక్షి, హైదరాబాద్ : కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు ప్రమాణం చేశాకే మేయర్, డిప్యూటీ మేయర్లుగా పోటీ చేయడానికి కానీ, వారిని ఎన్నుకునేందుకు ఓటు వేసేందుకు కానీ అవకాశం ఉంటుంది. ఈ నెల 11వ తేదీన ఒంటిగంట కల్లా అందరూ జీహెచ్ఎంసీ కౌన్సిల్ హాల్‌కు చేరుకోవాల్సి ఉంటుంది. ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తయ్యాక, ఎన్నిక కార్యక్రమం ప్రారంభమయ్యాక ప్రమాణ స్వీకారానికి అవకాశం ఉండదు. మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నికల విధివిధానాలు, అనుసరించాల్సిన పద్ధతులు తదితరమైన వాటి గురించి ఎన్నికల సంఘం కమిషనర్ సి.పార్థసారథి తమ కార్యాలయంలో జీహెచ్ఎంసీ ఎన్నికల విభాగం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి శ్వేతామహంతి, అడిషనల్ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్, రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్‌కుమార్, జీహెచ్ఎంసీ, పోలీసు విభాగాల అధికారులు పాల్గొన్నారు. సమావేశంలోని ముఖ్యాంశాలు.. కొత్త కార్పొరేటర్లు 11వ తేదీ ఉ. 11 గంటలకు హాజరై ప్రమాణ స్వీకారం చేయాలి. ప్రమాణం చేస్తేనే 12.30 గంటలకు మేయర్ ఎన్నికకు సంబంధించిన ప్రత్యేక సమావేశానికి హాజరయ్యేందుకు అనుమతి. కార్పొరేటర్‌తోపాటు ఎక్స్అఫీషియో సభ్యులకూ ఒక్కొక్కరు ఒక్క ఓటు మాత్రమే వేయాలి. చేతులెత్తడం ద్వారా ఓటింగ్ జరుగుతుంది. ఓటింగ్ నిర్వహించేందుకు కనీసం సగం మంది ఉంటేనే కోరంగా పరిగణించి ఎన్నిక నిర్వహిస్తారు. కోరం లేకపోతే గంటపాటు నిరీక్షిస్తారు. మధ్యాహ్నం 1.30 గంటల వరకు కూడా కోరం లేకున్నా, ఏదైనా అనివార్యకారణాల వల్ల ఎన్నిక జరగకపోయినా,ప్రిసైడింగ్ అధికారి మర్నాటికి వాయిదా వేస్తారు. విప్ వర్తిస్తుంది.. గుర్తింపుపొందిన రాజకీయపార్టీలు విప్ కోసం నిర్దేశించిన అనుబంధం–1లో తమ పార్టీ తరపున విప్‌ను నియమించే అధికారాన్ని ఏ వ్యక్తికైనా ఇవ్వవచ్చు. లేదా పార్టీ అధ్యక్షుడు అనుబంధం–2 ద్వారా నేరుగా పార్టీ తరపున విప్‌ను నియమించవచ్చు. -
జీహెచ్ఎంసీ: వచ్చే నెల 15లోగా మేయర్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ హైదరాబాద్ (జీహెచ్ఎంసీ)కి కొత్తగా ఎన్నికైన 150 మంది కార్పొరేటర్ల పేర్లు ఎట్టకేలకు గెజిట్‌లో నమోదయ్యాయి. రిజర్వేషన్లు, పార్టీలవారీగా కార్పొరేటర్ల వివరాలతో శనివారం గెజిట్ నోటిఫికేషన్ జారీ అయింది. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు వెలువడిన ఐదు వారాల తర్వాత అధికారికంగా వారి పేర్లను రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్ఈసీ) గెజిట్‌లో ప్రచురించింది. బల్దియాలో ఇంతకు ముందెన్నడూ పాలకమండలి గడువు ముగిశాకే ఎన్నికలు జరిగినందున ఇలాంటి పరిస్థితి ఎదురవలేదు. ప్రస్తుత పాలకమండలి గడువు వచ్చేనెల పదో తేదీవరకు ఉండటం, అప్పటివరకు కొత్త పాలకమండలి కొలువుదీరే అవకాశం లేకపోవడంతో ఇప్పటిదాకా గెజిట్ నోటిఫికేషన్ వెలువరించలేదు. నిబంధనల మేరకు గెజిట్‌లో ప్రచురించాక నెలరోజుల్లోగా కొత్తపాలకమండలి సభ్యుల ప్రమాణం, మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక జరగాల్సి ఉంది. దీంతో వచ్చే నెల 15 లోగా ఈ కార్యక్రమాలు పూర్తికానున్నాయి. మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నికకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయడంతోపాటు వారి ఎన్నికకు ఎన్నికల అధికారిగా గ్రేటర్ పరిధిలోని జిల్లాలకు చెందిన కలెక్టర్ లేదా జాయింట్ కలెక్టర్‌ను నియమిస్తారని సంబంధిత అధికారి తెలిపారు. మేయర్‌ఎన్నిక ఇలా.. ఎన్నికైన కార్పొరేటర్లు మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు అర్హులు. మేయర్ పదవికి మహిళారి జర్వేషన్ ఉన్నందున మహిళలే పోటీచేయాల్సి ఉంది. కార్పొరేటర్లతోపాటు జీహెచ్ఎంసీలో ఎక్స్అఫీషియో సభ్యులుగా ఉన్న రాజ్యసభ, లోక్‌సభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కూడా ఓటు వేసే అర్హత ఉంది. మేయర్ ఎన్నికకు ఎక్స్అఫీషియో సభ్యులుసహ మొత్తం సభ్యుల్లో కనీసం 50 శాతం మంది హాజరైతేనే కోరం ఉన్నట్లుగా భావిస్తారు. నిర్ణీత వ్యవధిలోగా తగినంతమంది ఓటర్లు రాకపోతే మర్నాటికి వాయిదా వేస్తారు. అప్పుడు కూడా కోరం లేకపోతే ఎన్నికల సంఘం సూచనల మేరకు కోరం లేకపోయినప్పటికీ మేయర్ ఎన్నిక నిర్వహిస్తారని అధికారులు పేర్కొన్నారు. ఈ ఎన్నికలో విప్ వర్తిస్తుంది. బహిరంగంగా చేతులెత్తడం ద్వారా ఎన్నికను నిర్వహిస్తారు. 27న బడ్జెట్ సమావేశం? ప్రస్తుత సభ్యులతో చివరి సర్వసభ్య సమావేశాన్ని ఈ నెలాఖరులోగా నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. ప్రతి మూడు నెలలకోసారి సర్వసభ్య సమావేశం జరగాల్సి ఉండగా, కోవిడ్ నేపథ్యంలో గత ఏడాది మార్చి నుంచి ఇప్పటివరకు జరగలేదు. మరోవైపు వచ్చే ఆర్థిక సంవత్సరానికి(2021–22) సంబంధించి జీహెచ్ఎంసీ బడ్జెట్ కూడా పాలకమండలి ఆమోదం పొందాల్సి ఉంది. ఇప్పటికే స్టాండింగ్ కమిటీ ఆమోదం పొందిన బడ్జెట్ నిర్ణీత గడువు జనవరిలోగా జనరల్‌బాడీ సమావేశంలో ఆమోదం పొందాల్సి ఉంది. ఈ నేపథ్యంలో జనవరి 27న పాలకమండలి సాధారణ సర్వసభ్య సమావేశం, బడ్జెట్ భేటీ రెండూ కూడా ఒకేరోజు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిసింది. అయితే, అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. సంబంధిత అధికారులు వీటికి సంబంధించిన పనుల్లో నిమగ్నమయ్యారు. -
జీహెచ్ఎంసీ: యంగ్ స్టార్స్..
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ పీఠంపై యువరక్తం కొలువు దీరనుంది. రాజకీయ కుటుంబ నేపథ్యంతో కొంతమంది బరిలోకి దిగితే.. సమాజసేవపై ఆసక్తితో మరికొంత మంది ఎన్నికల్లో పోటీకి దిగారు. నేరెడ్మెట్ను మినహాయిస్తే ఇప్పటి వరకు ఫలితాలు ప్రకటించిన 149 డివిజన్లలో కార్పొరేటర్లుగా గెలుపొందిన అభ్యర్థుల్లో 78 మంది మహిళలు ఉండగా, 71 మంది పురుషులు ఉన్నారు. వీరిలో 29 ఏళ్లలోపు వారు 10 మంది ఉండగా, 30–39 ఏళ్లలోపు వారు 43 మంది, 40–49 ఏళ్లలోపు వారు అత్యధికంగా 59 మంది, 50–59 ఏళ్లలోపు వారు 35 మంది ఉన్నారు. 60 వయసు దాటిన వారు కేవలం(లింగోజిగూడ, రియాసత్‌నగర్) ఇద్దరే ఉన్నారు. పత్తర్‌గట్టి, ఉప్పుగూడ, నవాబ్‌సాబ్‌కుంట, కవాడిగూడ, యూసూఫ్‌గూడ, సీతాఫల్‌మండీ అభ్యర్థులు అవివాహితులు. వీరంతా వైవాహిక జీవితానికి ముందే రాజకీయాల్లో అడుగుపెట్టడం గమనార్హం. యువతతోనే మార్పు హుడాకాంప్లెక్స్: ‘రాజకీయాలను చాలామంది బురద గుంటలా భావిస్తుంటారు. అందులోకి దిగితే ఎక్కడ తమకు అంటుకుంటుందోనని భయపడుతుంటారు. నీతి, నిజాయితీ, సేవాభావం కలిగిన వారు రాజకీయాలకు దూరంగా ఉండటం వల్ల అవినీతిపరులు, స్వార్థపరులు, వ్యాపారులు, రౌడీలు రాజకీయాల్లో వస్తున్నారు. ఎన్నికల్లో రూ.కోట్లు ఖర్చు చేసి గెలుపొందుతున్నారు. చట్టసభల్లో అడుగుపెట్టిన తర్వాత అవినీతికి పాల్పడుతూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. యువత, ముఖ్యంగా అంకితభావంతో ప్రజలకు సేవ చేసే వారు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉంది. వారితోనే రాజకీయాల్లో మార్పు సాధ్యమవుతుందని సరూర్‌నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి(38) అభిప్రాయపడ్డారు. సమాజసేవపై మక్కువతో రాజకీయాల్లోకి అడుగు పెట్టినట్లు ఆమె చెప్పారు. తల్లిదండ్రులది ప్రభుత్వ ఉద్యోగ నేపథ్యం. అత్తమామలది రాజకీయ నేపథ్యం. చిన్నప్పటి నుంచే నాకు రాజకీయంపై ఆసక్తి ఉంది. ఇంటర్మీడియట్, డిగ్రీ కాలేజీ, యూనివర్సిటీ రోజుల్లో విద్యార్థి సంఘంలో చురుకైన పాత్ర పోషించాను. ఎంఏ ఎకానామిక్స్‌లో డిస్టింక్షన్ సాధించాను. ఉన్నత చదువులు చదివిన నాకు నా భర్త అంజన్‌కుమార్ కుటుంబం ద్వారా నాకు రాజకీయ వారసత్వం లభించింది. గత ఎన్నికల్లో మా మామ, బావ పోటీ చేసి ఓడిపోయారు. అయినా వారు నిరుత్సాహపడలేదు. వారిచ్చిన ప్రోత్సాహంతోనే సరూర్‌నగర్ డివిజన్ నుంచి పోటీ చేశాను. ఓటర్లు నన్ను ఆదరించి ఎన్నికల్లో గెలిపించారు. బంధుప్రీతి, అవినీతికి ఆస్కారం లేకుండా ప్రజాసేవ చేస్తాను’ అని ఆమె వివరించారు. క్రీడల నుంచి రాజకీయాల్లోకి.. కాప్రా: గ్రేటర్ ఎన్నికల్లో రెండోసారి గెలుపొంది సత్తాచాటిన కాప్రా సిట్టింగ్ కార్పొరేటర్, టీఆర్ఎస్ అభ్యర్థి స్వర్ణరాజ్ శివమణి రాజకీయాల్లోనే కాదు క్రీడల్లోనూ సత్తా చాటాడు. రాష్ట్రస్థాయి, జాతీయస్థాయిలో ఫుట్‌బాల్ క్రీడాకారుడైన స్వర్ణరాజ్ మైనంపల్లి హన్మంతరావు స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రం తరఫున రాష్ట్ర, జాతీయస్థాయి ఫుట్‌బాల్ క్రీడలో పాల్గొని తనదైన శైలిలో ఆటతీరు కనబర్చారు. కాప్రా సర్కిల్ ప్రస్తుతం పరిచయం అక్కర్లేని రాజకీయ నాయకుడు స్వర్ణరాజ్. డివిజన్లో ప్రజల సమస్యలు, తన సమస్యలుగా భావించి సత్వర పరిష్కారమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాడు. ఎక్కడ సమస్య ఉన్నా నేనున్నాననే భరోసా కల్పించి ప్రజల మన్ననలు పొందుతున్నాడు. స్వర్ణరాజ్ క్రీడాకారుడే కాకుండా రాజకీయాల్లోకి రాకముందు హార్డ్‌వేర్ ఇంజినీర్ కూడా.. యువత క్రీడల వైపు దృష్టి సారించేలా కందిగూడలో బాస్కెట్ బాల్ గ్రౌండ్ నిర్మించారు. స్వర్ణరాజ్ శివమణి కార్యకర్త కుటుంబం నుంచి.. అంబర్‌పేట: ఆమె తండ్రి టీఆర్ఎస్ పార్టీలో సామాన్య కార్యకర్త. బస్తీలో చిన్నపాటి లీడర్. పార్టీ జెండాలు మోయడం, అభ్యర్థుల గెలుపుకోసం కష్టపడి పనిచేయడం చేసేవారు. ఎన్నికల సమయంలో రత్నానగర్ బస్తీలో అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూసుకునేవారు. బస్తీలకు వచ్చిన నాయకులకు జైకొడుతుండేవారు. చిన్నప్పటి నుంచి తండ్రి కష్టాన్ని దగ్గరగా చూసిన దూసరి లావణ్యకు ప్రజాసేవ అంటే ఇష్టం. పెళ్లి తర్వాత భర్త దూసరి శ్రీనివాస్‌గౌడ్ కుటుంబం సైతం అదే బస్తీలోనే నివాసం ఉండేది. భర్త శ్రీనివాస్‌గౌడ్‌కు చిన్నప్పటి నుంచి కష్టపడే మనస్తతత్వం. ఎవరు ఏ పని అప్పగించినా విజయవంతంగా పూర్తి చేసేవారు. భర్త కూడా రాజకీయాల్లో చురుగ్గా ఉండటంతో అతడికి అన్నివిధాలుగా ప్రోత్సాహం ఉండేది. భర్త ప్రోత్సాహంతో టీఆర్ఎస్ తరఫున పోటీలో దిగి విజయం సాధించారు దూసరి లావణ్య. బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తానని తెలిపారు. భర్త, పిల్లలతో .. డాక్టర్.. నుంచి కార్పొరేటర్‌గా.. బహదూర్‌పురా: బహదూర్‌పురా నియోజకవర్గం నవాబ్‌సాబ్‌కుంట డివిజన్ నుంచి మజ్లిస్ పార్టీ అభ్యర్థి షరీన్ ఖతూన్(26) రెండోసారి కార్పొరేటర్‌గా విజయం సాధించింది. 21 ఏళ్ల వయస్సులో గ్రాడ్యుయేషన్ చేస్తూ మజ్లిస్ పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించింది. ప్రస్తుతం డాక్టర్ ఇన్ ఫార్మసీ కోర్సు పూర్తిచేసి ఆస్పత్రిలో పనిచేస్తూనే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మళ్లీ మజ్లిస్ తరఫున పోటీ చేసి గెలుపొందారు. అటు ఉన్నత చదువులు కొనసాగిస్తూనే డివిజన్ ప్రజలతో మమేకమవుతూ సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తున్నారు. తండ్రి అన్నాన్తో కలిసి స్థానిక బస్తీల్లో పర్యటిస్తూ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు. ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కారం అయ్యేలా చూస్తున్నారు. నిరక్షరాస్యులు ఐదుగురే.. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, సీపీఎం, సీపీఐ, టీజేఏసీల నుంచే కాకుండా పలువురు స్వతంత్రులు పోటీ చేశారు. ఇలా మొత్తం 1,122 మంది పోటీ చేశారు. వీరిలో 600పైగా గ్రాడ్యూయేట్లు ఉన్నారు. ఇప్పటి వరకు గెలుపొందిన 149 మంది అభ్యర్థుల్లో 102 మంది విద్యాధికులే. వీరిలో 80 మంది బీఏ, బీకాం, బీఎస్సీ, బీఈ కోర్సులు పూర్తి చేసిన వారు ఉండగా, 13 మంది ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ కోర్సులను పూర్తి చేశారు. మరో ఇద్దరు ఎంబీఏ, ముగ్గురు బీటెక్, ఒకరు ఎంటెక్, ఇద్దరు వైద్య విద్యను పూర్తి చేశారు. ఒకరు ఎంసీఏ, పదో తరగతి పూర్తి చేసిన వారు 18 మంది ఉండగా, ఇంటర్మీడియట్ చదివిన వారు 11 మంది ఉన్నారు. ఐదుగురు నిరక్షరాస్యులు ఉండగా, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిదో తరగతి చదువుకున్న వారు ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. అంతేకాదు 2009, 2016లోని జీహెచ్ఎంసీ పాలకవర్గంలో విద్యావంతులు శాతం 50లోపే ఉండగా ఈ సారి ఏకంగా 68 శాతానికి పెరగడం విశేషం. చిన్నవయసులో.. కవాడిగూడ: డిగ్రీ బీకాం చదువుతుండగానే 22 ఏళ్ల వయసులోనే ఆమెకు బీజేపీ తరఫున పోటీ చేసే అవకాశం వచి్చంది. పేద దళిత కుటుంబానికి చెందిన రచనశ్రీ తండ్రి టెంట్‌హౌస్ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. దాదాపు 36 ఏళ్లుగా ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్, బీజేపీలో పనిచేసిన అనుభవం ఉంది. అతడి సేవలకు గానూ బీజేపీ రచనశ్రీని కవాడిగూడ డివిజన్ నుంచి అభ్యర్థిగా పోటీలో నిలిపింది. ఆమె తరఫున పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ అభ్యర్థి లాస్యనందితపై 1,468 ఓట్ల మెజారీ్టతో ఆమె విజయం సాధించారు. రాజకీయ అనుభవం లేకున్నప్పటికీ పేదల కష్టాలపై తన తండ్రి చేస్తున్న పోరాటాన్ని దగ్గరగా చూసిన అనుభవం, ఎన్నో ఏళ్లుగా ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను ప్రత్యక్షంగా చూసినందున వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పారు. 22 ఏళ్లకే రాజకీయాల్లోకి.. చిలకలగూడ: ప్రపంచంలోని అన్ని అంశాలను ఫింగర్ టిప్స్‌పై ఆవిష్కరిస్తూ ఎన్నో విషయాలను తెలియజేస్తున్న గూగుల్ సంస్థ ఉద్యోగి ఆమె. 2016లో రాజకీయ రంగంలో అవకాశం రావడంతో ప్రజాసేవ చేసే ఆలోచనతో సరేనంది. కట్ చేస్తే 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున అత్యధిక మెజారీ్టతో సీతాఫల్మండి డివిజన్ కార్పొరేటర్‌గా విజయం సాధించింది సామల హేమ. అప్పటి నుంచి నిరంతరం ప్రజల మధ్యే ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషిచేస్తూ స్థానికులకు మరింత దగ్గరైంది. మరోమారు అవకాశం రావడంతో విజయకేతనం ఎగురవేసింది. ఎంబీఏ పూర్తి చేసిన ఆమె ప్రస్తుతం బిజినెస్ మేనేజ్మెంట్ అంశంపై పీహెచ్డీ చేస్తున్నారు. 22 వయసులోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆమె కొద్దిరోజుల్లోనే తనదైన ముద్ర వేసింది. ఉద్యోగంలో ఎంత ఉత్సాహంగా ఉన్నానో, రాజకీయాల్లోకి వచి్చన తర్వాత కూడా అంతే ఆనందంగా ఉన్నానని, చెప్పులు అరిగేలా తిరిగిన వృద్ధురాలికి ఫించను అందిస్తే ఆమె కళ్లలో కనిపించే మెరుపే నాకు అనంతమైన ఆత్మసంతృప్తి ఇస్తుందని చెప్పారు. అతి పిన్న వయసు చాంద్రాయణగుట్ట: జీహెచ్ఎంసీలోనే 2016 ఎన్నికల్లో అతి పిన్న వయసు(21)లో కార్పొరేటర్‌గా గెలుపొందిన ఉప్పుగూడ కార్పొరేటర్ ఫహద్ బిన్ అబ్దుల్ సమద్ బిన్ అబ్దాద్ రెండోసారి కూడా 26 ఏళ్ల వయసులో ద్వితీయ విజయాన్ని అందుకున్నాడు. మజ్లిస్, బీజేపీల నడుమ జరిగిన పోరులో 8,006 ఓట్ల మెజారీ్టతో మజ్లిస్ తరఫున విజయం సాధించారు. బీఈ చదువుతున్న సమయంలోనే మొదటిసారి కార్పొరేటర్‌గా గెలిచిన ఫహద్ ఐదేళ్ల పాటు ప్రజల మధ్యే ఉంటూ అభిమానాన్ని చూరగొని రెండోసారి గెలుపును తన ఖాతాలో వేసుకున్నారు. మూడేళ్ల క్రితం ఫహద్‌కు వివాహం జరిగింది. కుల, మత, రాజకీయాలకతీతంగా చేసిన అభివృద్ధే తనకు మరోసారి అవకాశం కల్పించిందని ఆయన చెప్పారు. నాడు సాఫ్ట్వేర్ ఇంజినీర్ మల్కాజిగిరి: ప్రజాసేవ కోసమే సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చారు శ్రవణ్. 40 సంవత్సరాలుగా అతడి తండ్రి ఎలాంటి పదవి ఆశించకుండా బీజేపీ కార్యకర్తగా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్నారు. కుటుంబ సభ్యులు, పార్టీ, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు మద్దతుతో మల్కాజిగిరి డివిజన్ కార్పొరేటర్‌గా పోటీచేసే అవకాశం రావడంతో గెలుపొందారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని ఆయన తెలిపారు. నాడు రేషన్ డీలర్.. నేడు కార్పొరేటర్ అబిడ్స్: గోషామహాల్ డివిజన్లో అందరినోట అతడు సుపరిచితుడు. 30 సంవత్సరాలుగా గోషామహాల్ డివిజన్ పరిధిలోని ధూల్‌పేట్‌లో లాల్‌సింగ్ రేషన్ డీలర్. బీజేపీలో చురుకైన కార్యకర్తగా ఉంటూ ఓ వైపు రేషన్ షాపు నడుపుతూ.. మరోవైపు బీజేపీలో సైతం కొనసాగుతున్నాడు. గోషామహాల్ డివిజన్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన లాల్‌సింగ్ 7,369 ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ సిట్టింగ్ కార్పొరేటర్ ముఖేష్‌సింగ్‌ను ఓడించారు. భారీ మెజార్టీతో విజయం సాధించడంతో అతడి ఆనందానికి అవధులు లేవు. 59 సంవత్సరాల లాల్‌సింగ్‌కు ఇద్దరు పిల్లలు. ఊహించని స్థాయిలో విజయం సాధించడంతో సంబురపడుతున్న లాల్‌సింగ్ మాట్లాడుతూ.. తాను ఇక నుంచి పూర్తిగా ప్రజాసేవలో మునిగిపోతానన్నారు. ప్రజలు ఎంతో నమ్మకంతో గెలిపించారని, వారికి అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి, మౌలిక సదుపాయాల రూపకల్పనకు కృషి చేస్తానన్నారు. మేనత్త, మేనల్లుడి విజయం కుత్బుల్లాపూర్: వారు వరుసకు బంధువులు.. ఒకరు మూడుసార్లు కార్పొరేటర్‌గా గెలిస్తే.. మరొకరు రెండుసార్లు గెలిచారు. రంగారెడ్డినగర్ డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా మూడుసార్లు విజయం సాధించిన విజయ్‌శేఖర్‌గౌడ్, కుత్బుల్లాపూర్ డివిజన్ నుంచి రెండుసార్లు కార్పొరేటర్‌గా ఎన్నికైన గౌరీష్ పారిజాతగౌడ్ మేనత్త, మేనల్లుడు కావడం విశేషం. అధికార టీఆర్ఎస్ పార్టీ మరోమారు సిట్టింగ్‌లకే సీట్లు ఇవ్వడంతో వీరిద్దరూ విజయం సాధించారు. మూడుసార్లు మూడు పార్టీలు సైదాబాద్: ఐఎస్‌సదన్ ఓటర్లు గ్రేటర్ ఎన్నికల్లో ప్రతీసారి భిన్నంగా తీర్పునిస్తున్నారు. ఐఎస్‌సదన్ డివిజన్‌గా ఏర్పడిన తర్వాత నిర్వహించిన మూడు ఎన్నికల్లో మూడు పార్టీల అభ్యర్థులను గెలిపించారు. సైదాబాద్‌లో అంతర్భాగంగా ఉన్న ఐఎస్‌సదన్ 2009లో చేసిన పునరి్వభజనలో భాగంగా డివిజన్‌గా ఏర్పడింది. 2009లో జరిగిన ఎన్నికల్లో మొదటిసారి ఐఎస్‌సదన్ నుంచి టీడీపీ అభ్యర్థి మంచిరెడ్డి ప్రశాంత్‌రెడ్డి అప్పటి బీజేపీ అభ్యర్థి సామ సుందర్‌రెడ్డిపై గెలిచారు. ఆ తర్వాత 2016లో టీఆర్ఎస్ అభ్యరి్థగా రంగంలోకి దిగిన సామ స్వప్నాసుందర్‌రెడ్డి బీజేపీ అభ్యర్థి సునీతారెడ్డిపై గెలిచారు. ఈ ఎన్నికల్లో బీజేపీ నుంచి నిలిచిన జంగం శ్వేతామధుకర్‌రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి సిట్టింగ్ కార్పొరేటర్ సామ స్వప్నాసుందర్రెడ్డిపై గెలిచి విజయకేతనం ఎగురవేశారు. ఇలా డివిజన్ ఓటరు ప్రతీ గ్రేటర్ ఎన్నికల్లో ఇక్కడ పార్టీ మార్పును కోరుకుంటూ టీడీపీ, టీఆర్ఎస్, బీజేపీ అభ్యరి్థకి ఒక్కోసారి అవకాశం ఇచ్చారు. పచ్చపార్టీకి తీవ్ర పరాభవం సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీని గ్రేటర్ ఎన్నికల్లో ప్రజలు పూర్తిగా తిరస్కరించారు. హైదరాబాద్‌ను తామే అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకునే టీడీపీకి గ్రేటర్ ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. హైటెక్ సిటీని తామే నిరి్మంచామని, చంద్రబాబు విజన్‌తోనే హైదరాబాద్ అభివృద్ధి జరిగిందని డబ్బా కొట్టే పచ్చ పారీ్టకి గ్రేటర్ ప్రజలు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. 38 ఏళ్ల పార్టీ చరిత్ర ఉన్న టీడీపీ గ్రేటర్‌వాసులు నమ్మలేదు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, 2016 జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో కూడా ఆ పార్టీ పరాభవం పాలైంది. ఈ సారి గ్రేటర్ ఎన్నికల్లో కనీసం ఉనికి కూడా చాటుకోలేకపోయింది. పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ పూర్తిస్థాయిలో ఓటమిపాలైంది. అంతేకాదు ఆ పార్టీ అభ్యర్థులకు అన్నిచోట్లా డిపాజిట్ గల్లంతైంది. ఈ ఘోర పరాజయంతో నగరాన్ని ప్రపంచపటంలో పెట్టానని చెప్పుకుంటున్న చంద్రబాబు మాటల్లోని డొల్లతనం వెల్లడికావడంతో పాటు ఆ పార్టీ సంపూర్ణంగా నగర రాజకీయ ముఖచిత్రం నుంచి కనుమరుగైనట్టేనని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా దశలవారీగా కనుమరుగవుతూ వచి్చన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు హయాంలో హైదరాబాద్‌లో తన ప్రస్థా నాన్ని అత్యంత అవమానకరంగా ముగించింది. 92 డివిజన్ల్లో వెయ్యిలోపు ఓట్లు ఈసారీ గ్రేటర్ ఎన్నికల్లో ఆర్భాటానికి పోయి ఏకంగా 106 డివిజన్లలో అభ్యర్థులను బరిలో దింపిన ఆ పారీ్టకి ఎక్కడా డిపాజిట్ కూడా దక్కలేదు. గ్రేటర్ పరిధిలో టీడీపీ అభ్యర్థులు పోటీ చేసిన ఒక్క డివిజన్లో కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు సాధించలేకపోయారు. పోటీ చేసిన 106 డివిజన్లలో 92 డివిజన్లలో వెయ్యిలోపు ఓట్లు పడ్డాయి. 14 డివిజన్లలో వెయ్యి ఓట్లు కంటే తక్కువ నమోదయ్యాయి. 65 డివిజన్లలో కేవలం 100 కంటే తక్కువ జనం ఓట్లు వేశారు. ఎస్సదన్లో టీడీపీ అభ్యరి్థకి అతితక్కువగా 22 ఓట్లు పడ్డాయి. కేపీహెచ్‌బీ డివిజన్లో అత్యధికంగా 2,656 ఓట్లు పడ్డాయి. బాలాజీనగర్ డివిజన్లో 2,252 ఓట్లు, వీవీనగర్‌లో 2,297 ఓట్లు, హైదర్‌నగర్‌లో 2,119 ఓట్లు పడ్డాయి. తక్కువగా ఘాన్సీబాజార్లో 54 , కూర్మగూడ 55, కిషన్‌బాగ్‌లో 71, దూద్»ౌలిలో 82 ఓట్లు పడ్డాయి. -
లెక్క తప్పింది.. అక్కడే: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, అభివృద్ధి చేస్తూ ముందుకెళ్లాలని మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు (కేటీఆర్) అన్నారు. ఆదివారం ఆయన గ్రేటర్ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘గ్రేటర్లో మన ప్రయత్న లోపం లేదు.. ఎమోషన్ ఎలక్షన్ జరిగింది. సిట్టింగ్‌లను మార్చిన చోట టీఆర్ఎస్ గెలిచింది. సిట్టింగ్‌లను మార్చని చోట ఓడిపోయాం.. ఇక్కడే లెక్క తప్పింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఇదే పరిస్థితి రిపీట్ అయ్యే ప్రమాదం ఉంది. గ్రేటర్ ఫలితాలను గుణపాఠంగా తీసుకుందామని’’ ఆయన పేర్కొన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై దృష్టి పెట్టాలన్నారు. దేశంలో జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని.. సిద్ధంగా ఉండాలని సూచించారు. (చదవండి: పార్టీలో పోస్టుమార్టం చేసుకుంటాం : కేటీఆర్) ఈ నెల 8న భారత్ బంద్ విజయవంతం చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమాన్ని తలపించేలా గల్లీ గల్లీ బంద్ కావాలన్నారు. ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు.. బంద్‌ను విజయవంతం చేయాలని కోరారు. ఈ నెల 8న వ్యాపార, వాణిజ్య వర్గాలు కూడా బంద్‌లో పాల్గొన్నాలన్నారు. రాష్ట్రంలోని ప్రతి వ్యాపారవేత్త 2 గంటల పాటు బంద్ పాటించాలని, ఢిల్లీ పెద్దల దిమ్మతిరిగేలా తెలంగాణ బంద్ విజయవంతం కావాలని తెలిపారు. కేంద్రం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలు వెనక్కి తీసుకోవాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. (చదవండి: బీజేపీ: ఆపరేషన్ ఆకర్ష్..) -
‘గ్రేటర్’లో నేరచరిత్ర ఉన్న కార్పొరేటర్లు వీరే
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో నేరచరిత్ర ఉన్న కార్పొరేటర్ల జాబితాను ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ విడుదల చేసింది. మూడు పార్టీల్లో మొత్తం 25 మంది నేరచరితులు ఉన్నట్లు పేర్కొంది. బీజేపీ 10, టీఆర్ఎస్ 8, ఎంఐఎంలో ఏడుగురు కార్పొరేటర్లు నేర చరిత్ర కలిగి ఉన్నట్లు ప్రకటించింది. కాగా, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 55 బీజేపీ 48, ఎంఐఎం 44, కాంగ్రెస్ 2 స్థానాల్లో గెలిచిన విషయం తెలిసిందే. నేరచరిత్ర ఉన్న కార్పొరేటర్ల జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బీజేపీలోకి ఇద్దరు టీఆర్ఎస్ కార్పోరేటర్లు
సాక్షి, హైదరాబాద్ : వెంగల్ రావు నగర్ సిట్టింగ్ టీఆర్ఎస్ కార్పొరేటర్ కిలారి మనోహర్, రామచంద్రాపురం కార్పొరేటర్ అంజయ్య యాదవ్‌లు బీజేపీలో చేరారు. టీఆర్ఎస్నుంచి టికెట్ ఇవ్వకపోవటంతో గురువారం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కిలారి మనోహర్ జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల వాట్సప్ గ్రూపులో అభ్యంతరకర వీడియోలు పెట్టి అప్పట్లో వార్తల్లోకెక్కిన సంగతి తెలిసిందే. కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఆయనకు వెంగల్ రావు నగర్ బీజేపీ టికెట్ ఖరారు చేశారు. -
జీహెచ్ఎంసీ: ఎమ్మెల్యే వర్సెస్ కార్పొరేటర్లు
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ...కొందరు సిట్టింగ్ కార్పొరేటర్లలో టికెట్ గుబులు పట్టుకుంది. ఐదేళ్ల పనితీరు ప్రాతిపదికన సీట్ల కేటాయింపు ఉంటుందన్న వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో.. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు సిట్టింగ్ కార్పొరేటర్లకు చెక్‌చెప్పే యత్నాలు చేస్తుండటంతో నగరంలో అధికార టీఆర్ఎస్లో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. పార్టీ అధిష్టానం ఇప్పటికే సర్వేలు, ముఖ్య కార్యకర్తల అభిప్రాయ సేకరణతో ప్రతి సీటుకు ముగ్గురు చొప్పున జాబితా సిద్ధం చేయగా, పలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు తమకు అనుకూలమైన వారికే టికెట్ వస్తుందన్న ఇండికేషన్స్ ఇస్తున్నారు. ఎవరి జాబితాలు..వారివే ఉప్పల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డికి మెజారిటీ కార్పొరేటర్లకు ఏ మాత్రం సఖ్యత లేదు. ఎమ్మెల్యే ఇప్పటికే ఒక జాబితా సిద్ధం చేసి తన ముఖ్య కేడర్‌కు భరోసా ఇస్తున్నారు. ఈ నియోజకవర్గ పరిధిలోని చర్లపల్లి డివిజన్ నుంచి గెలిచి మేయర్ పదవి చేపట్టిన బొంతు రాంమోహన్ ఈమారు తన భార్య శ్రీదేవిని అక్కడి నుంచి పోటీ చేయించే యోచనలో ఉన్నారు. అయితే స్థానిక నాయకులు తమలో ఒకరికే టికెట్ ఇవ్వాలని బాహాటంగానే తేల్చిచెప్పారు. మల్కాజిగిరిలో సిట్టింగ్ ఎమ్మెల్యే హన్మంతరావు ముగ్గురు కార్పొరేటర్లను మారుస్తున్నామని, ఈ మేరకు ప్రత్యామ్నాయ జాబితా సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. కుత్బుల్లాపూర్‌లో ఓ కార్పొరేటర్ ప్రవర్తనపై జనమే విసిగిపోగా, మరో మహిళా కార్పొరేటర్ ఈమారు తాను పోటీ చేయటం లేదని ప్రకటించారు. కూకట్పల్లి, బేగంపేట డివిజన్ల విషయాల్లో ఎమ్మెల్యేల మధ్య పేచీ నెలకొంది. కూకట్పల్లి సిట్టింగ్‌ను కాదని ఇతరుల పేరును శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ సిఫారసు చేస్తుండగా, సిట్టింగ్‌కే ఇవ్వాలని కూకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు పట్టుపడుతున్నారు. బేగంపేట డివిజన్లో సిట్టింగ్ కార్పొరేటర్ స్థానంలో కొత్త అభ్యర్థిని మంత్రి శ్రీనివాసయాదవ్ తెరపైకి తెచ్చారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని కొండాపూర్, గచ్చిబౌలి, హైదర్‌నగర్ డివిజన్లలో కొత్త అభ్యర్థులను తెరమీదకు తేవాలన్న యోచనలో ఎమ్మెల్యే ఉన్నట్టు సమాచారం. ఎల్బీనగర్ నియోజకవర్గంలో పాత టీఆర్ఎస్, కొత్త టీఆర్ఎస్ విభేదాలు భారీగానే ఉన్నాయి. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డితో పలువురు సిట్టింగ్ కార్పొరేటర్లకు పొసగటం లేదు. ఇక్కడ కూడా చంపాపేట, చైతన్యపురి, నాగోలు కార్పొరేటర్లను మార్చే యోచన ఉన్నట్టు సమాచారం. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యే గోపీనాథ్‌తో యూసుఫ్‌గూడ, వెంగళరావునగర్, రహమత్‌నగర్ కార్పొరేటర్లకు తీవ్ర విభేదాలున్నాయి. ఈ ముగ్గురికి టికెట్ రాకుండా చూడాలన్న యోచనలో ఎమ్మెల్యే ఉండగా, ఎలా రాదో మేమూ చూస్తామంటూ వారంటున్నారు. ఖైరతాబాద్ నియోకజవర్గంలో సోమాజిగూడ కార్పొరేటర్ అత్తలూరి విజయలక్ష్మి తాను పోటీ చేయనని ప్రకటించగా, మిగిలిన అన్ని చోట్ల హేమాహేమీ అభ్యర్థులు తిరిగి పోటీకి సిద్ధం అయ్యారు. సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మాత్రం మూడు చోట్ల అయినా తనవారికి కొత్తగా టికెట్లు ఇప్పించే ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం. ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని అడిక్‌మెట్, ముషీరాబాద్, సనత్‌నగర్‌లో బేగంపేట, మోండా, సికింద్రాబాద్‌లో తార్నాక కార్పొరేటర్లను మళ్లీ కొనసాగించే అంశంపై ఒకింత సందిగ్ధత ఉన్నట్టు సమాచారం. -
హైదరాబాద్‌కు భారీగా నిధులు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: గత ఐదు ఏళ్లుగా హైదరాబాద్ నగరానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించి అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిందని టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ ప్రగతి నివేదిక గత ఐదు ఏళ్లలో తమ పని తీరుకి నిదర్శనంగా ఉండబోతుందన్నారు. జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, నగర మంత్రులు, ఎమ్మెల్యేలతో మంత్రి కేటీఆర్ మంగళవారం సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. జిహెచ్ఎంసీ పరిధిలో ఇన్ని రోజులుగా చేసిన కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత పెద్ద ఎత్తున తీసుకుపోవాలని కార్పొరేటర్లకు పిలుపునిచ్చారు. చదవండి: (కవిత పోటీ.. టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్) రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘ధరణి పోర్టల్’లో వ్యవసాయేతర ఆస్తుల నమోదుకు సంబంధించి ప్రజల్లోకి మరింత సమాచారాన్ని తీసుకుపోవాలని తెలిపారు. హైదరాబాద్ నగరంలో అనేక కారణాలతో కొన్ని చోట్ల రిజిస్ట్రేషన్లు ప్రజల ఆస్తులపైన సంపూర్ణ హక్కులు లేకుండా కొన్ని సమస్యలు ఉన్నాయని తెలిపారు. వాటన్నింటినీ సానుకూలంగా పరిశీలించి పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని స్పష్టం చేశారు. ఇలాంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి ఇప్పటికే ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు తీసుకువచ్చారని గుర్తుచేశారు. స్థిరాస్తులపైన యాజమాన్య హక్కులు కల్పించేందుకు చేపట్టే ప్రక్రియ అత్యంత పారదర్శకంగా ఉంటుందని తెలిపారు. చదవండి: (తెలంగాణ ఇంటి పార్టీలో చేరిన వెదిరె చల్మారెడ్డి) ఇలాంటి ప్రక్రియలో దళారులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కార్పొరేటర్లకు ఆయన సూచించారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అక్టోబర్ 1వతేదీ నుంచి ప్రారంభం కానున్న ఓటరు నమోదు కార్యక్రమంలో అందరూ పాలుపంచుకోవాలన్నారు. హైదరాబాద్ నగరంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని మరింతగా పెంచేందుకు నగరంలో ఉన్న గ్రాడ్యుయేట్లలను ఓటర్లుగా నమోదు చేయించేందుకు ప్రయత్నం చేయాలని చెప్పారు. అక్టోబర్ 1వ తేదీన ప్రతీ ఒక్కరు తమతో పాటు తమ కుటుంబ సభ్యులను ఓటర్లుగా నమోదు చేయించాలని మంత్రి కేటీఆర్ సూచించారు. చదవండి: మాటలు ఎక్కువ.. చేతలు తక్కువ -
సార్.. సార్.. ప్లీజ్
‘సార్.. సార్.. ప్లీజ్ ఎన్నికల్లో మేం మీ గెలుపు కోసమే బాగా పనిచేశాం. మా డివిజన్లో మీకు మెజార్టీ వచ్చింది. మేం తెలుగుదేశంలో ఉన్నా మీరంటే మాకు ఎంతో అభిమానం. దయచేసి మమ్మల్ని మీ పార్టీలోకి తీసుకోండి. ఒకవేళ కుదరకపోతే మమ్మల్ని మీ మనుషులుగా భావించి జాగ్రత్తగా చూసుకోండి. మాకు కార్పొరేషన్లో రావాల్సిన బిల్లులు ఇప్పించండి సార్.’ ఇది తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు నిత్యం చేస్తున్న విన్నపం. వారం రోజులుగా టీడీపీ కార్పొరేటర్లు నెల్లూరు సిటీ, రూరల్ ఎమ్మెల్యేలతో పాటు ఎంపీ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయడంతో పాటు వారిని కలిసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తుండడం నెల్లూరు నగర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: గత నెల వరకు అధికార పార్టీ కార్పొరేటర్లుగా చలామణి అయిన ఎక్కువ మంది కార్పొరేటర్లు మాజీ మంత్రి నారాయణ సిఫార్సుతో వారి డివిజన్లలో సబ్ కాంట్రాక్టులు తీసుకుని భారీగా పనులు చేశారు. ప్రతి డివిజన్‌లోనూ సబ్ కాంట్రాక్టల ద్వారా సుమారు రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల పనులు చేసిన కార్పొరేటర్లు ఉన్నారు. ప్రభుత్వం మనదే కదా మనల్ని ఎవరు అడగరనే ధీమాతో 80 శాతానికి పైగా నాసిరకం పనులు నిర్వహించారు. అలాగే ఎన్నికల కోడ్ ముందు నెలలోనూ భారీగా వర్కులు తీసుకున్న కార్పొరేటర్లు కూడా ఉన్నారు. ఇప్పుడు వారందరి బిల్లులు నగర పాలక సంస్థ ఖజానా ఖాళీగా ఉండడం, ఇతర కారణాలతో నిలిచిపోయాయి. నగరంలో కార్పొరేటర్లు నిర్వహించిన పనులకు సంబంధించి రావాల్సిన బిల్లులు సుమారు రూ.50 కోట్ల వరకు ఉన్నాయి. ఈ క్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఆఖండ మెజార్టీతో గెలిచి, వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలో జిల్లాలో పదికి పది అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంట్ స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు రికార్డు స్థాయి మెజార్టీతో ఘన విజయం సాధించారు. నెల్లూరు నగరం, నెల్లూరు రూరల్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న డాక్టర్ పోలుబోయిన అనిల్‌కుమార్ యాదవ్. కోటంరెడ్డి శ్రీధరరెడ్డి రెండో పర్యాయం గెలపొంది అధికార పార్టీ శాసనసభ్యులు అయ్యారు. అలాగే నెల్లూరు ఎంపీగా ఆదాల ప్రభాకర్‌రెడ్డి గెలుపొందారు. దీంతో తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు కౌంటింగ్ ముగిసిన రోజు నుంచి ఎమ్మెల్యేలకు టచ్‌లోకి వెళ్లేందుకు బలంగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. గత 23వ తేదీ రాత్రి నుంచి తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ల కార్యాచరణ మొదలైంది. మొదటగా నేరుగా ఎమ్మెల్యేను కలవడానికి ప్రయత్నించి కొందరు విఫలం అయిన క్రమంలో రకరకాల సిఫార్సులతో రంగంలోకి దిగారు. సామాజిక కోణం మొదలుకుని పాత స్నేహలు అంటూ కొందరు మాట కలిపే యత్నాలు చేశారు. ఈ క్రమంలో ఇద్దరు ఎమ్మెల్యేలు, ఎంపీ అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్న క్రమంలో ఎమ్మెల్యేలు, ఎంపీ ముఖ్యుల వద్దకు కార్పొరేటర్లు క్యూ కడుతున్నారు. ప్రధానంగా 80 శాతం మంది తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లకు పనులకు సంబంధించిన బిల్లుల రావాల్సింది. ఈ క్రమంలో పార్టీలో చేరికకు ఎమ్మెల్యేలు, ఎంపీ పూర్తిగా మాట్లాడని క్రమంలో కనీసం బిల్లులు ఇప్పించాలని కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. ఐదుగురు కార్పొరేటర్లు ఎమ్మెల్యేను కలిసే యత్నం ఇక నెల్లూరు నగరంలో ఐదుగురు కార్పొరేటర్లు ఎమ్మెల్యేను కలిసే యత్నం చేసి పార్టీ ఫ్లోర్ లీడర్ పి.రూప్‌కుమార్ యాదవ్‌ను కలిసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక నెల్లూరు రూరల్‌లో అయితే ఇద్దరు కార్పొరేటర్లు మినహా మిగిలిన వారందరు ఎమ్మెల్యే కార్యాలయం వద్దకు వచ్చి వెళుతుండడం, ఎమ్మెల్యే పూర్తి స్థాయిలో స్పందించకపోవడంతో పార్టీ నేతలు బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డి, తాటి వెంకటేశ్వర్లు, మురళీకృష్ణను కలిసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇక ఎంపీ కార్యాలయం వద్ద అయితే పార్టీ సీనియర్ నేత వైవీ రామిరెడ్డిని కలిసే ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తం మీద టీడీపీ కార్పొరేటర్లు అందరూ క్యూ కడుతున్న క్రమంలో ప్రజాప్రతినిధులు మౌనం వహిస్తుండటం వారిలో టెన్షన్ పెరుగుతోంది. ఈ పరిణామాలు అన్నీ చూస్తున్న తెలుగుదేశం పార్టీ నేతలే అవాక్కవుతున్నారు. -
బడ్జెట్‌పై ‘కార్పొరేట్’ పలుకు...
దేశ ఆర్థిక వృద్ధికి మధ్యతరగతి వర్గాలు, చిన్న వర్తకులు, రైతులు జీవనాడి వంటివారు. బడ్జెట్ 2019లో ప్రకటించిన నిర్ణయాలు లక్షలాది మంది కలలు. – గౌతం అదానీ, అదానీ గ్రూపు చైర్మన్ ఆర్థిక రంగ దివాలా పరిస్థితి రాకుండా కీలకమైన మధ్యతరగతి, రైతాంగ విభాగాలకు ఇచ్చిన ఉపశమన నిర్ణయాలు గొప్పగా ఉన్నాయి. నియంత్రణతో కూడిన, ప్రేరణనిచ్చే కసరత్తు ఇది. ఆదాయాన్ని స్థిరీకరించి, ఒత్తిడిని ఎదుర్కొంటున్న వర్గాలకు రిస్క్‌ను తగ్గిస్తాయి. – ఆనంద్ మహీంద్రా, మహీంద్రా గ్రూపు చైర్మన్ గ్రామీణ ప్రజలకు ఉపశమనం కలిగించే, వినియోగానికి ప్రేరణనిచ్చేలా బడ్జెట్ ఉంది. 2019–20 ఆర్థిక సంవత్సరానికి వృద్ధికి ఊతమిచ్చేలా, ద్రవ్య క్రమశిక్షణతో, అదే సమయంలో ప్రభుత్వ ఖజానాపై పెద్ద భారం పడకుండా బడ్జెట్‌ను ప్రకటించినందుకు నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని అభినందించాలి’’ – అనిల్ అగర్వాల్, వేదాంత రీసోర్సెస్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ వినియోగాన్ని పెంచడం, వ్యవసాయం, గ్రామీణ వర్గాలు, అవ్యవస్థీకృత రంగంలోని కార్మికులకు ప్రయోజనాలు కల్పించే కార్యాచరణ వృద్ధికి ప్రేరణనిస్తుంది. బడ్జెట్ నిర్ణయాలు ఆర్థిక రంగానికి మంచి చేస్తాయి. – సంజయ్‌పూరి, ఐటీసీ ఎండీ ఇది ఎన్నికల సంవత్సరం బడ్జెట్. అందరికీ ఉద్దేశించినది. రైతుల నుంచి వర్తకుల వరకు, అవ్యవస్థీకృత రంగంలోని పనివారి నుంచి మధ్యతరగతి వేతన జీవుల వరకు అందరికీ ఏదో ఒకటి ఉంది. ప్రభుత్వం చాలా సమతూకం పాటించింది. ద్రవ్యలోటుకు కట్టుబడి ఉంటామన్న సంకేతాన్నిచ్చింది. అయితే, ఆరోగ్య రంగానికి అదనపు కేటాయింపుల్లేకపోవడం లేదా సైన్స్ అండ్ టెక్నాలజీ రంగానికి ప్రోత్సాహకాలు లేకపోవడం నిరాశ కలిగించింది. – కిరణ్ మజుందార్‌షా, బయోకాన్ సీఎండీ వ్యవసాయం, మధ్యతరగతి వర్గాలే స్పష్టమైన లక్ష్యంతో బడ్జెట్ ఉంది. నేరుగా నగదు, పన్ను మినహాయింపుతో లబ్ధిదారులకు రూ.93,000 కోట్ల వెసులుబాటు కలిగిస్తుంది. ఈ పథకాలు వినియోగాన్ని పెంచుతాయి. గ్రామీణ ఆర్థిక రంగానికి మేలు చేస్తాయి’’ – పవన్ ముంజాల్, హీరోమోటోకార్ప్ చైర్మన్ ప్రతీ రంగంలో, ప్రతీ వర్గంలో కొనుగోలు శక్తిని పెంచే విధంగా బడ్జెట్ ఉంది. వ్యక్తిగత ఆదాయపన్ను మినహాయింపును రూ.5 లక్షలకు పెంచడం చారిత్రక నిర్ణయం. దీంతో వారు ఖర్చు చేసేందుకు మరిన్ని నిధులు అందుబాటులోకి వస్తాయి. మరింత మంది ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేస్తారని, పరిశ్రమ వృద్ధికి తోడ్పడుతుందని అంచనా. – వేణు శ్రీనివాసన్, టీవీఎస్ మోటార్ చైర్మన్ చిన్న, మధ్య స్థాయి రైతులకు ఆదాయాన్నిచ్చే పథకం ఎంతో ఆహ్వానించతగినది. పశు సంరక్షణ, చేపల పెంపకం కోసం వడ్డీ రాయితీతో కూడిన రుణాలు ఆయా రంగాలకు చేయూతనిస్తుంది. ఆదాయపన్ను మినహాయింపును రూ.5 లక్షలకు పెంచడం, బ్యాంకు డిపాజిట్లపై టీడీఎస్ పరిమితిని రూ.40,000కు పెంచడం కొత్త డిపాజిట్లను ఆకర్షించేందుకు తోడ్పడతాయి. – రజనీష్ కుమార్, ఎస్బీఐ చైర్మన్ సంక్షోభం లేని ఆరోగ్య వ్యవస్థకు, ఆరోగ్య భారత్ విషయంలో ప్రభుత్వ కట్టుబాటును మధ్యంతర బడ్జెట్ తెలియజేసింది. ప్రభుత్వ చర్యల్లో ఆరోగ్య సంరక్షణ చాలా కీలకంగా ఉండాలి. ఆరోగ్య సదుపాయాల విషయంలో పల్లెలు, పట్టణాల మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చేందుకు అవకాశాలను కోల్పోకూడదు. ఈ రంగంలో ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించే విధానాలు అవసరం’’ – సంగీతారెడ్డి, అపోలో హాస్పిటల్స్ గ్రూపు జాయింట్ ఎండీ -
బుచ్చయ్యపై తమ్ముళ్ల గుస్సా
సాక్షి, రాజమహేంద్రవరం: ‘‘ఇళ్ల లబ్ధిదారులు ఎంపిక, ఫ్లాట్ల కేటాయింపు పారదర్శకంగా చేశాం. ఎవరికీ డబ్బులు ఇవ్వాల్సిన పనిలేదు. ఎవరైనా లంచాలు అడిగితే 1100కి ఫిర్యాదు చేయండి’’ అంటూ ఈ నెల 26వ తేదీన ఫ్లాట్ల కేటాయింపు పత్రాల పంపిణీ కార్యక్రమంలో రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేసిన వ్యాఖ్యలు పలువురు కార్పొరేటర్లలో ఆగ్రహావేశాలకు కారణమయ్యాయి. అందరికీ ఇళ్లు పథకంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, లబ్ధిదారుల వాటా, బ్యాంకు రుణం సహాయంతో జీ ప్లస్ 3 అపార్ట్మెంట్లు నిర్మించి ఇచ్చేందుకు పథకం రూపాందిం చారు. జిల్లాలో కాకినాడ, రాజమహేంద్రవ రం నగరపాలక సంస్థలు, పిఠాపురం, అమలాపురం, పెద్దాపురం, తుని, రామచంద్రపు రం, మండపేట, సామర్లకోట మున్సిపాలిటీల్లో 2015లో దాదాపు 21 వేల ఇళ్లను మంజూరు చేశారు. ఇందులో రాజమహేం ద్రవరం నగరపాలక సంస్థ వాటాగా 4,200 ఇళ్లు వచ్చాయి. దరఖాస్తుల స్వీకరణ అనంతరం 2016 మే నెలలో లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఒక్కొక్కచోట ఒక్కోలా ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలో సుమారు 16 వేల మంది ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. నగరంలో ప్రభుత్వ భూమి లేకపోవడంతో రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం పరిధిలోని బొమ్మూరు, తొర్రేడు, శాటిలైట్‌సిటీ ప్రాంతాల్లో 4,200 ఇళ్లను నిర్మిస్తున్నారు. ఫలితంగా స్థలం మా పరిధిలోనిదంటూ రూరల్ ఎమ్మెల్యే ఇళ్లలో వాటా తీసుకున్నారు. 2,400 ఇళ్లు నగరపాలక సంస్థలోని డివిజన్లకు, మిగతా 1,800 రూరల్ నియోజకవర్గంలోని లబ్ధిదారులకు ఇచ్చేలా నిర్ణయించారు. ఆ మేరకు 50 డివిజన్లలో డివిజన్‌కు 35 మంది చొప్పున లబ్ధిదారులను లాటరీ విధానంలో ఎంపిక చేశారు. ప్రజా ప్రతినిధులకు వాటాలు.. డివిజన్‌కు 35 ఇళ్ల చొప్పున 1,750 ఇళ్లకు లాటరీ తీయగా, రాజమహేంద్రవరం రూరల్‌లో ఏ విధంగా లబ్ధిదారులు ఎంపిక జరిగిందీ ఎవరికీ తెలియదు. లాటరీ అనంతరం అప్పటి కమిషనర్, ప్రజా ప్రతినిధులు ప్రతి కార్పొరేటర్‌కు తలా రెండు ఇళ్ల చొప్పున ఇచ్చారు. ఇవిగాక అధికార టీడీపీ కార్పొరేటర్లలో కొంతమందికి ఎంపీ మాగంటి మురళీమోహన్, ఎమ్మెల్యే గోరంట్ల, నగర ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఐదు ఇళ్లు చొప్పున ఇచ్చారు. వాటి లబ్ధిదారులను ఆయా కార్పొరేటర్లు ఎంపిక చేశారు. ఈ ఇళ్లను పలువురు రూ.50 వేల చొప్పున తీసుకుని ఇవ్వగా, మరికొందరు ఏమీ ఆశించకుండానే అర్హులైన వారిని సిఫార్సు చేశారు. నగదు వసూలు చేసే విషయమై పలుమార్లు గోరంట్ల బుచ్చయ్యచౌదరి అంతర్గత సమావేశాల్లో ప్రస్తావించారని సమాచారం. అయినా పట్టించుకోని పలువురు యథావిధిగా తమపని తాము చేసుకున్నారు. ఈ నేపథ్యంలో రెండేళ్ల తర్వాత ఫ్లాట్ల కేటాయింపు పత్రాల పంపిణీ చేసే సమయంలో లబ్ధిదారులు ముందు ఎమ్మెల్యే గోరంట్ల లంచాలు ఇవ్వొద్దంటూ బహిరంగ ప్రకటన చేయడంతో పలువురు కార్పొరేటర్లు గరంగరంగా ఉన్నారు. ఆ వ్యవహారాల సంగతేంటీ..? ఎమ్మెల్యే గోరంట్ల తమను ఉద్దేశించి తమ డివిజన్ ప్రజల ముందు మాట్లాడడంతో కార్పొరేటర్లు తీవ్ర అవమానంగా భావిస్తున్నారు. ఎన్నికల్లో ఖర్చు పెట్టవద్దని కూడా చెప్పవచ్చుగా అంటూ సమావేశంలోనే పలువురు పక్కవారి వద్ద వ్యాఖ్యానించారు. అక్కడ ఖర్చు పెట్టిన డబ్బు ఎలా తిరిగి రాబట్టాలో సెలవిస్తే వింటామని సమావేశంలో కూర్చున్న పలువురు కార్పొరేటర్ల భర్తలు వ్యాఖ్యానించారు. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు హయాంలో ఆవరోడ్డులో కట్టిన ఇళ్లను గత ఏడాది పంపిణీ చేశారు. అక్కడ అనర్హులంటూ దాదాపు 600 మందికి మొండిచేయి చూపారు. ఆయా ఫ్లాట్లను గోరంట్ల బుచ్చయ్యచౌదరి అనుంగు అనుచరులు, కార్పొరేషన్లో పదవులు ఉన్నవారు గ్రౌండ్ ఫ్లోర్ రూ.6 లక్షలు, మొదటి అంతస్తు రూ.4 లక్షలు, రెండో అంతస్తు రూ.2.75 లక్షల చొప్పున విక్రయించుకున్నారని, మరి వాటి సంగతేంటని ప్రశ్నిస్తున్నారు. పోలీసు స్టేషన్లలో ఇన్స్పెక్టర్ల నియామకాలకు డబ్బులు వసూలు చేశారని ఆరోపిస్తున్నారు. ఇసుక ర్యాంపులు గుప్పెట్లో పెట్టుకుని రోజూ రూ.లక్షలు దండుకుంటున్న వైనంపై కూడా మాట్లాడాలని అధికార పార్టీ కార్పొరేటర్లు డిమాండ్ చేస్తున్నారు. తాము చేస్తే ఒప్పు.. ఇతరులు చేస్తే తప్పు అన్న చందంగా కార్యక్రమంలో ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడడంపై ప్రస్తుతం టీడీపీ కార్పొరేటర్లలో చర్చ జరుగుతోంది. ఇది ఎటు దారితీస్తుందో వేచి చూడాలి. మరో వైపు గోరంట్ల వ్యాఖ్యలు విన్న ఇతరులు.. ‘ఆవు చేలో మేస్తుంటే.. దూడ గట్టున మేస్తుందా?’ అంటూ చమత్కరించడం కొసమెరుపు. -
అవిశ్వాసం ఆపేయండి!
సాక్షి, పెద్దపల్లి: రామగుండం అవిశ్వాస రాజకీయం నాటకీయ మలుపులు తిరుగుతోంది. టీఆర్ఎస్ అధిష్టానం అవిశ్వాసాన్ని ఆపేయాలంటూ అల్టిమేటం జారీచేయగా, హైకమాండ్ ఆదేశానికి కట్టుబడి ఉండాలని ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ సూచించారు. అయితే అవిశ్వాసం నోటీసు ఇచ్చాక ఇప్పుడు వెనక్కి తగ్గేదిలేదని, ఖచ్చితంగా అవిశ్వాసం నెగ్గిస్తామని, లేదంటే తమ కార్పొరేటర్ పదవులకైనా రాజీనామా చేస్తామని టీఆర్ఎస్ కార్పొరేటర్లు తెగేసి చెప్పారు. దీంతో రామగుండం అవిశ్వాసం రాజకీయం రసకందాయంలో పడింది. ఎమ్మెల్యేకు కేటీఆర్ ఫోన్ రామగుండం మేయర్ కొంకటి లక్ష్మీనారాయణపై ప్రవేశపెట్టిన అవిశ్వాసంపై టీఆర్ఎస్ హైకమాండ్ మండిపడింది. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్వయంగా ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణకు ఫోన్‌చేసి అవిశ్వాసం నిలిపివేయాలని ఆదేశించారు. అవిశ్వాసం పెట్టడం పార్టీ విధానం కాదని, వెంటనే అవిశ్వాసం నిలిపివేయాలని ఆదేశించినట్లు సమాచారం. ఈ సందర్భంగా రామగుండం పరిస్థితిని వివరించడానికి ఎమ్మెల్యే ప్రయత్నించినా కేటీఆర్ వినిపించుకోలేదని విశ్వసనీయంగా తెలిసింది. ‘‘అవిశ్వాసం ఆపేస్తారా...అవిశ్వాసం లేకుండా ఆర్డినెన్స్ తీసుకురమ్మంటారా’’ అని ఘాటుగా వ్యాఖ్యానించినట్లు ప్రచారం జరుగుతోంది. సీఎంకు మేయర్ల ఫిర్యాదు పార్టీ అధిష్టానం అకస్మాత్తుగా అవిశ్వాసం వ్యవహారంపై దృష్టిపెట్టడానికి రాష్ట్ర వ్యాప్తంగా మేయర్లు కారణమని సమాచారం. శనివారం హైదరాబాద్‌లో మేయర్లు, కమిషనర్ల సమావేశం జరిగింది. సమావేశానికి రామగుండం మేయర్ లక్ష్మీనారాయణ సహా, ఆరుగురు మేయర్లు హాజరయ్యారు. సమావేశం పూర్తయ్యాక, ఆరుగురు మేయర్లు సీఎం కేసీఆర్‌ను కలిసి రామగుండం మేయర్‌పై సొంత పార్టీయే అవిశ్వాసం పెట్టిందంటూ ఫిర్యాదు చేశారు. స్పందించిన కేసీఆర్ అవిశ్వాసం పెట్టడమేంటంటూ అసహనం వ్యక్తం చేశారని, వెంటనే తన రాజకీయ కార్యదర్శి నరసింహారావు, మంత్రి కేటీఆర్‌లకు ఈ విషయంపై పురమాయించినట్లు సమాచారం. ఈక్రమంలోనే కేటీఆర్, నరసింహారావులు ఎమ్మెల్యే సత్యనారాయణకు ఫోన్‌చేసి అవిశ్వాసాన్ని ఆపేయాలని ఆదేశించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అధిష్టానం చెప్పింది వినండి: ఎమ్మెల్యే అవిశ్వాసం నిలిపివేసి...కలిసి పనిచేసుకోవాలని పార్టీ అధిష్టానం సూచించింది..అధిష్టానం సూచనను కార్పొరేటర్లంతా పాటించాలి...అంటూ ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ఆదేశించారు. ఆదివారం తన నివాసంలో టీఆర్ఎస్కు చెందిన 30 మంది కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. మంత్రి కేటీఆర్ ఫోన్‌చేసిన విషయాన్ని వివరించారు. ఇంతటితో ఈ వ్యవహారాన్ని ఆపేయాలని కార్పొరేటర్లకు చెప్పారు. వెనక్కి తగ్గేది లేదు: కార్పొరేటర్లు అవిశ్వాసంపై వెనక్కి తగ్గేదిలేదు. నోటీసు ఇచ్చాక..ఇప్పుడు వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు.స్టాండింగ్ కమిటీ ఎన్నికలప్పుడు లేని హైకమాండ్ ఇప్పుడే వచ్చిందా? మేం అవిశ్వాసానికే కట్టుబడి ఉన్నాం. ఖచ్చితంగా అవిశ్వాసం నెగ్గిస్తాం. లేదంటే మా కార్పొరేటర్ పదవులకే రాజీనామా చేస్తాం. అంటూ టీఆర్ఎస్ కార్పొరేటర్లు తేల్చిచెప్పారు. పార్టీ అధిష్టానం వైఖరిని ఎమ్మెల్యే చెప్పినా.. కార్పొరేటర్లు ససేమిరా అన్నారు. ఒకదశలో ఎమ్మెల్యేను సైతం ధిక్కరించారు. ఇదిలాఉంటే కాంగ్రెస్ పార్టీ కూడా అవిశ్వాసాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేసింది. రాజకీయం రసవత్తరం అవిశ్వాసం ఆపేయాలని అధిష్టానం ఆదేశించడం...ఎమ్మెల్యే చెప్పినా...కార్పొరేటర్లు ససేమిరా అనడంతో రామగుండంలో రాజకీయం రసవత్తరంగా మారింది. నాటకీయ పరిణామాలతో అవిశ్వాసం రోజుకోమలుపు తిరుగుతోంది. పార్టీ వైరి వర్గాల ఎత్తులు, పై ఎత్తులతో రాజకీయ చదరంగం రక్తికడుతోంది. -
విజయవాడలో వైసీపీ కార్పోరేటర్ల ఆందోళన
సాక్షి, విజయవాడ: వైస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పోరేటర్లను సస్పెండ్ చేయటాన్ని నిరసిస్తూ కౌన్సిల్ హాల్ బయట వైసీపీ కార్పోరేటర్లు ఆందోళన చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు, మేయర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. కార్పోరేటర్ల ఆందోళనకు వైసీపీ నేతలు వెల్లం పల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, యలమంచిలి రవి, తదితరులు మద్దతు పలికారు. గురువారం ఉదయం నుంచి వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు షేక్ బీజన్ బీ, జమల పూర్ణమ్మలు సస్పెన్షన్‌కు వ్యతిరేకంగా మున్సిపల్ హాల్లో దీక్ష చేపట్టారు. వీరికి వైస్సార్సీపీ కార్పోరేటర్లు, నాయకులు మద్దతుగా నిలిచారు. తమకు మేయర్ క్షమాపణ చెప్పే వరకు దీక్ష కొనసాగిస్తామని తెలిపారు. హోదాపై చంద్రబాబు తప్పులను మున్సిపల్ కార్పొరేషన్ సాక్షిగా ఎత్తి చూపుతామనే భయంతోనే మమ్మలను సస్పెండ్ చేశారని పేర్కొన్నారు. హోదాకు వెన్నుపోటు పొడిచిన టీడీపీనే, నేడు కౌన్సిల్లో ఏకగ్రీవ తీర్మానం చేస్తామంటే ఎవరు నమ్ముతారని, తీర్మానం చేసే ముందు హోదాపై మున్సిపల్ కౌన్సిల్ లో సుదీర్ఘంగా చర్చ జరగాలని, చర్చ జరిగితేనే హోదా కు ఎవరు వెన్నుపోటు పొడిచారో ప్రజలకు తెలుస్తుందని తెలిపారు. నాలుగు సంవత్సరాల పాటు హోదాను ఏనాడు పట్టించుకోని చంద్రబాబు, నేడు హోదా గురించి మాట్లాడడం ప్రజలను మోసాగించడం కాదా అని ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాలను ఆశించి.. హోదా కోసం పోరాటం చేసిన వైస్సార్సీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టించిన బాబు ఇప్పుడు హోదా కోసం మాట్లాడడం ఏమిటన్నారు. హోదాపై అనేక సార్లు యూ టర్న్ తీసుకున్న బాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. -
ఇక టార్గెట్ కమిషనరే?
సాక్షి,అమరావతిబ్యూరో: ‘ఇక ఎన్నికలు ఏడాదిలో ఉన్నాయి.. ఇంతవరకు నానా తిప్పలు పడి ఎంతో కొంత పోగేసుకున్నాం.. మళ్లీ ఎన్నికలప్పుడు ఖర్చు పెట్టాలంటే మరికొంత పోగేయ్యాలి.. కమిషనర్ మాత్రం చెప్పిన పనులు చేయటం లేదు.. మంత్రి నారాయణ మాటకే ఆయన విలువనిస్తున్నాడు..ఎవరు చెప్పినా లైట్‌గా తీసుకుంటున్నాడు. ఆయన్ను మార్చకుంటే నగరపాలక సంస్థ మన గుప్పిట్లోకి రాదు.. సంపాదన ఉండదు.. పార్లమెంట్ ఇన్చార్జిగా చినబాబు ఉన్నాడు..ఆయన హవా ఉండాలంటే మనం చెప్పిన పనులకు చేవులూపాల్సిన వారైతేనే కరక్టు వెంటనే కమిషనర్‌ను మార్చేయండి.’ ఇదీ విజయవాడ నగరంలో పాలకపక్షంలోని ఓ వర్గం ప్రభుత్వ పెద్దల వద్ద తెస్తున్న ఒత్తిడి. ఇప్పటికే నగర పాలకసంస్థలో జరుగుతున్న పరిణామాలు, మేయర్ వ్యవహారంతోపాటు కమిషనర్ బదిలీ విషయంపై పార్టీ నగర అధ్యక్షుడు బుద్ధా వెంకన్న వద్ద పలువురు కార్పొరేటర్లతోపాటు పార్టీ కీలక నేతలు అంతర్గత చర్చలు జరిపారు. మేయర్ వ్యవహారం సమసిపోయిన తరువాత కమిషనర్ బదిలీపై తీవ్ర ఒత్తిడి పెంచేలా నిర్ణయించారు. ఇప్పటికే నారా లోకేష్ వద్ద కమిషనర్ వ్యవహారంపై పంచాయితీ పెట్టడంతో ఆయన కమిషనర్ బదిలీపై హామీ ఇచ్చినట్లు సమాచారం. అసలేం జరుగుతుందంటే.. నగర పాలక సంస్థ కమిషనర్‌గా జె.నివాస్ బాధ్యతలు చేపట్టిన నుంచి పాలకపక్ష కార్పొరేటర్ల అక్రమ దందా గురించి లోతుగా అధ్యయ నం చేశాడు. పేదల సొమ్ము పిండుకోవటమే కాకుండా బినామీల ద్వారా నగర పాలక సంస్థ ఆరగించడం, ప్రతి పనికి రేటు బట్టి వసూళ్లు చేయడం, కాంట్రాక్టర్ల వద్ద కమీషన్లు తీసుకోవడం.. అభివృద్ధి పనులను అడ్డుకోవడం లాంటి పనులు చేస్తున్న వైనం గుర్తించారు. వీరిని ప్రోత్సహిస్తే అవినీతి మరకలు అంటే అవకాశం ఉందని భావించిన కమిషనర్ పాలకపక్ష సభ్యులను లైట్‌గా తీసుకున్నాడు. వారు సూచించిన పనులను పక్కన పెడుతున్నాడు. డివిజన్లలో స్వ యంగా పర్యటిస్తూ పలు కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిస్తున్నాడు. అక్రమ ఆదాయం తగ్గిపోవడంతో పాలకపక్ష కార్పొరేటర్లకు ఆగ్రహం తెప్పిం చింది. కమిషనర్ వ్యవహారంపై ఇప్పటికే సీఎం చంద్రబాబు వద్దే పంచాయితీ పెట్టిన సంఘటనలు ఉన్నాయి. కానీ మంత్రి నారాయణ అండదండలు కమిషనర్‌కు ఉండడంతో పాలకపక్ష సభ్యుల ఫిర్యాదును కూడా లైట్‌గా తీసుకున్నారు. తెరపైకి రంజిత్‌బాషా నగర పాలక సంస్థ కమిషనర్‌గా మంత్రి నారా లోకేష్ ఓఎస్డీగా పనిచేసే పి.రంజిత్ బాషాను పేరు తెరపైకి తెచ్చారు. డిప్యూటీ కలెక్టర్‌గా హోదాలో ఉన్న ఆయన రెండు రోజుల కిందటే ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. దీంతో ఆయన్ను నగరపాలక సంస్థ కమిషనర్‌గా నియమించే అవకాశాలు ఉన్నా యి. చినబాబు ఓఎస్డీగా పనిచేసే రంజీత్బాషాకు ఆయనతో మంచి సాన్నిహిత్యం ఉంది. ఆయన్ను పంపించి తమ పనులు చక్కదిద్దుకోవా లనే ఆలోచనలో ఉన్నారు. మంత్రి నారాయణ హవా విజయవాడ పార్లమెంట్ ఇన్చార్జిగా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి నగరపాలక సంస్థపై పెద్దగా దృష్టి సారించలేదు. మంత్రి నారాయణ కనుసన్నల్లోనే కమిషనర్ల నియామకం జరుగుతుంది. ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే గడువు ఉండడంతో ప్రస్తుత కార్పొరేటర్ల అక్రమ సంపాదనకు అడ్డుపడుతున్న కమిషనర్‌కు పంపించి వేయాలన్న డిమాండ్ రోజురోజుకు పెరుగుతుంది. మంత్రి నారాయణ హవా పెరిగితే నగరంలో ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న పరపతి తగ్గే అవకాశం ఉందని ఆయన అనుచరవర్గం భావిస్తుంది. నగర పాలక సంస్థలో జరిగే పరిణామాలు పార్టీకి నష్టం కల్గిస్తున్నాయని వెంటనే చక్కదిద్దాలంటూ చినబాబు వద్ద పంచాయితీ పెట్టారు. రాబోయే సాధారణ ఎన్నికల్లో కూడా విజయవాడ నగర పాలక సంస్థ కీలకమవుతుందని వెంటనే రంగంలోకి దింపి కార్పొరేటర్లుకు లబ్ధి చేకూరే నిర్ణయం తీసుకోవాలని ఆయన దృష్టిలో పెట్టారు. వారి వాదనకు ఏకీభవించిన చినబాబు త్వరలోనే మీ కోరిక తీరుస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం. -
రగులుతున్న మేయర్-కార్పొరేటర్ల పోరు!
సాక్షి, విజయవాడ: నగర మేయర్ కోనేరు శ్రీధర్, టీడీపీ కార్పొరేటర్ల మధ్య తలెత్తిన అసమ్మతిపోరు ఇంకా సద్దుమణగలేదు. నోటి దురుసుతో అందరినీ బూతులు తిడుతున్న మేయర్ శ్రీధర్‌ను ఆ పదవి నుంచి తప్పించాల్సిందేనని స్వపక్ష కార్పొరేటర్లు పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ కార్పొరేటర్లతో పార్టీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న బుధవారం సమావేశమయ్యారు. మేయర్ శ్రీధర్‌ను తప్పించాల్సిందేనని ఈ సమావేశంలో కార్పొరేటర్లు బుద్దాను డిమాండ్ చేశారు. రొటేషన్ పద్ధతిలో మేయర్ పీఠాన్ని వేరేవారికి అప్పగించాలని కోరారు. మేయర్ ను తప్పించడమనేది తన పరిధిలో లేదని, మీ అభిప్రాయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానన్న బుద్దా కార్పొరేటర్లకు హామీ ఇచ్చారు. ఈ వివాదంపై చర్చించేందుకు మధ్యాహ్నం మేయర్ శ్రీధర్‌తో ఎమ్మెల్సీ బుద్దా సమావేశం కానున్నారు. ఈ రోజు సమావేశానికి ముగ్గురు మినహా కార్పొరేటర్లంతా హాజరయ్యారని, మేయర్ దురుసుగా ప్రవర్తిస్తున్నారని కార్పొరేటర్లు తనకు ఫిర్యాదు చేశారని బుద్ధా మీడియాతో తెలిపాఈరు. సమన్వయలోపంతోనే మేయర్, కార్పొరేటర్లు మధ్య వివాదం తలెత్తిందని, మధ్యాహ్నం మేయర్‌తో సమావేశమై.. అందరినీ కలుపుపోవలని ఆయనకు సూచిస్తామని బుద్ధా పేర్కొన్నారు. మిగతా కులాల వారికి రొటేషన్ పద్ధతిలో చైర్మన్ పదవి ఇవ్వాలని కార్పొరేటర్లు కోరుతున్నారని, ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఇతర ప్రాంతాలలో ప్రభావం.. విజయవాడ మేయర్‌ను మారిస్తే ఆ ప్రభావం రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో ఉన్న అధికార పార్టీ మేయర్లపై పడుతుందని అధిష్టానం ఆలోచిస్తున్నట్లు సమాచారం. కొన్ని చోట్ల రెండేళ్లకు ఒకరు మేయర్‌గా ఉండాలన్న ఒప్పందాలు అమలుకాక పార్టీలో అంతర్గత కలహాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో మేయర్ శ్రీధర్‌ను మారిస్తే ఒప్పందాన్ని ఉల్లంఘించి కొనసాగుతున్న తమ మేయర్లను కూడా మార్చాలని, ఇతర ప్రాంతాలలోని ఆశావహులు కూడా తిరుగుబాటు చేసే అవకాశం ఉంటుందని భావిస్తుంది. -
'కార్పొరేటర్లను వదులుకునేందుకు సిద్ధం'
సాక్షి, ఖమ్మం: ఖమ్మం నగరపాలక సంస్థ కార్పొరేటర్లపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహానికి గురయ్యారు. పట్టణంలో కార్పొరేటర్లతో శుక్రవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ల పనితీరుపై తుమ్మల అసహనం వ్యక్తం చేశారు. కార్పొరేటర్లకు చెడ్డపేరు వస్తే ప్రభుత్వానికి చెడు పేరు వస్తుందన్నారు. ప్రజలకు మంచి పేరు తెచ్చేలా ప్రజా ప్రతినిధులు పని చేయాలన్నారు. ఖమ్మం కార్పొరేషన్ లో జరుగుతున్న అభివృద్ది సీఎం కేసీఆర్ సహా అందరూ మెచ్చుకుంటున్నారని తెలిపారు. ప్రజల దయతో గెలిచిన తాము ప్రజల కోసం పని చేయాలన్నారు. పద్దతి మార్చుకోని కార్పొరేటర్లు సహించేది లేదని హెచ్చరించారు. ఒకటి రెండు సీట్లను వదులుకోవడానికైనా తాము సిద్ధమన్నారు. ఖమ్మం ఎమ్మెల్యే సీటు వచ్చే ఎన్నికలలో భారీ మెజారిటీ తో గెలిపించాలన్నారు. ఎక్కడా గ్రూపులు ఉండవని అందరూ కేసీఆర్ మనుషులేనని స్పష్టం చేశారు. -
సినిమాలో నటించావా.. సస్పెండ్ చేస్తా !
సాక్షి, హైదరాబాద్: నగరంలో కార్పొరేటర్లతో మంత్రి సమావేశం శనివారం హాటాహాట్గా జరిగింది. రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె. తారక రామారావు కార్పొరేటర్లకు తీవ్ర హెచ్చరికలు చేశారు. పనితీరు మార్చుకోకుంటే పరిమాణాలు చాలా తీవ్రంగా ఉంటాయని కొందరికి స్పష్టం చేశారు. ముఖ్యంగా చైతన్యపురి, హయత్‌నగర్ కార్పొరేటర్లకు కేటీఆర్ చురకలంటించారు. చైతన్యపురి నీ సామ్రాజ్యం అనుకుంటున్నావా ? అంటూ వ్యంగ్యంగా అడిగారు. అధికారులు మీ డివిజన్లలో తిరిగాలంటే నీ అనుమతి తీసుకోవాలా.? అని నిలదీశారు. ఈ విధమైనవి ఎక్కువ చేస్తే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తానంటూ హెచ్చరించారు. సినిమాలో నటించావా.. అని హయత్ నగర్ కార్పొరేటర్ తిరుమల్ రెడ్డిని అడిగారు. వెంగళరావు నగర్ కార్పొరేటర్ కిలారి మనోహర్.. కాఫీ విత్ కార్పొరేటర్ ప్రోగ్రాంను ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ప్రముఖంగా ప్రస్తావించారు. పార్టీకి కార్పొరేటర్లు కీలకమని, ఇష్టం వచ్చినట్లు చేయటం పద్ధతి కాదని ఆయన సూచించారు. అందరూ కలిసి జాగ్రత్తగా పని చేయండని కోరారు. అధికారులు ఇబ్బంది పెడితే తనకు చెప్పాలని కోరారు. అధికారుల వెంట పడి పని చేయించుకోవాలని కోరారు. వినూత్నంగా పని చేసి జనంలోకి వెళ్ళండని మంత్రి కేటీఆర్ సలహా ఇచ్చారు. -
కొట్టుకున్నటీడీపీ కార్పొరేటర్లు
-
కొట్టుకున్నటీడీపీ కార్పొరేటర్లు
అనంతపురం: అనంత నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ సమావేశం రసాభాసగా మారింది. టీడీపీ కార్పొరేటర్లు ఒకరి పై ఒకరు బాహాబాహీకి దిగారు. ఎంపీ జేసీ వర్గయుడిగా ముద్రపడ్డ టీడీపీ కార్పొరేటర్ ఉమామహేశ్వరరావు పై టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వర్గీయులు దాడి చేశారు. తన డివిజన్ కు అన్యాయం జరిగిందని.. కులగజ్జితో వ్యవహరిస్తున్నారని సమావేశంలో ఉమామహేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో రెచ్చిపోయిన మరో టీడీపీ కార్పొరేటర్ నరేశ్ చౌదరి ఉమా పై దాడికి పాల్పడ్డారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కార్పొరేటర్లతో మేయర్ సమీక్ష
హైదరాబాద్: రానున్న వర్షాకాలం నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలు, ఎస్ఆర్డీపీ, డబుల్ బెడ్ రూం, రోడ్ల వెడల్పు, ఎలివేటెడ్ కారిడార్ అంశాలపైన మేయర్ బొంతు రాంమోహన్ సమీక్ష సమావేశం చేపట్టారు. జీహెచ్ఎంసీ ఎల్ బీ నగర్, సరూర్‌నగర్, హయత్ నగర్ సర్కిళ్ల కార్పొరేటర్లు, వార్డు కమిటీ సభ్యులతో కొత్తపేట్‌లోని సాయి గార్డెన్లో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ..సరూర్ నగర్ కోదండరామ నగర్ లో డ్రైనేజి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామన్నారు. శారదానగర్ లో డ్రైనుల విస్తరణకు ప్రతిపాదనలు రూపొందించాలని ఆదేశాలిచ్చారు. వనస్థలిపురం రైతు బజార్ వద్దనున్న గుడిసెల స్థలాల్లో డబుల్ బెడ్ రూంల నిర్మాణాలకు వారం రోజుల్లో శంకుస్థాపన చేస్తామని తెలిపారు. హయత్ నగర్, బిఎన్ రెడ్డి డివిజన్లలోని శ్మశాన వాటికలను ఆధునికరణ చేస్తామన్నారు. -
‘అనంత’లోనే కార్పొరేటర్ల, కౌన్సిలర్లకు శిక్షణ
అనంతపురం న్యూసిటీ : ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఫినాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషనర్ ఆధ్యర్యంలో కార్పొరేటర్ల, కౌన్సిలర్లకు కెపాసిటీ బిల్డింగ్స్ ప్రోగ్రామ్స్ అనే అంశంపై శిక్షణ తరగతులు ఇవ్వనున్నట్లు అమృత్ సిటీ మిషన్ మేనేజ్మెంట్ యూనిట్ ప్రతినిధులు హిమబిందు, రోజారెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అనంతపురం కార్పొరేటర్లతో పాటు తాడిపత్రి, ధర్మవరం, హిందూపురం కౌన్సిలర్లు శిక్షణ తరగతుల్లో పాల్గొనాల్సి ఉంటుందన్నారు. శిక్షణ తరగతులు ఈ నెల 30, 31, వచ్చే నెల 1న నగరపాలక సంస్థలోని కౌన్సిల్ హాలులో నిర్వహిస్తున్నామని తెలిపారు. -
నెల్లూరు కార్పొరేషన్ సమావేశంలో రసాభాస
-
చేసిందంతా చేసి..
► ఎస్ఈను బుజ్జగించే పనిలో మేయర్ ► నిర్ణయం మార్చుకునేది లేదని తేల్చిచెప్పిన ఇమాముద్దీన్ నెల్లూరు సిటీ: ‘మీ పార్టీ నేతల నుంచి ఇబ్బందులు వస్తున్నాయి.. కొందరు కార్పొరేటర్లు టెండర్లు, బిల్లుల విషయంలో ఇబ్బందులకు గురి చేస్తున్నారని’ ఎస్ఈ ఇమాముద్దీన్ పలుమార్లు మేయర్ అజీజ్ దృష్టికి తీసుకెళ్లారు. అప్పుడు స్పందించని మేయర్ అజీజ్ ఇమాముద్దీన్ స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేయడంతో ఆయన్ను బుజ్జగించే పనిలో పడ్డారు. నెల్లూరు నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగంలో ఎస్ఈగా ఒకటన్నర ఏడాదిగా విధులు నిర్వహిస్తున్నారు. ఎటువంటి మచ్చలేకుండా పారదర్శకంగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన టెండర్లు, బిల్లులు మంజూరు, పనులు నాణ్యతపై ఎక్కడా రాజీపడకుండా పనిచేశారు. అయితే అధికార పార్టీ కార్పొరేటర్లు తమ సంపాదనే ముఖ్యంగా, ఇతర మనోభావాలతో పనిలేకుండా ఇష్టానుసారంగా వ్యవహరించారు. ఈ పరిస్థితులను తట్టుకోలేక ఎస్ఈ స్చచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. దీంతో పెద్ద ఎత్తున దూమారం రేగడంతో మేయర్ అజీజ్ పార్టీకి, తనకు ఎక్కడ చెడ్డపేరు వస్తుందోనని ఎస్ఈ ఇమాముద్దీన్‌ను బుధవారం బుజ్జగించే పనిలో పడ్డారు. అయితే ఒకసారి తీసుకున్న నిర్ణయం వెనక్కు తీసుకోవడం కుదరదని ఇమాముద్దీన్ తేల్చిచెప్పినట్లు సమాచారం. పర్సంటేజీలపై కాంట్రాక్టర్లకు ఆదేశాలు ఇప్పటి వరకు కాంట్రాక్టర్లకు నాణ్యతతో కూడిన పనులు చేయాలని ఎస్ఈ ఇమాముద్దీన్ ఆదేశాలు ఇచ్చారు. దానికి తగ్గట్లు పనులు పై ఎప్పటికప్పుడు ఫొటోలను పరిశీలిస్తూ వచ్చారు. అయితే ఎస్ఈ ఇమాముద్దీన్ తీసుకున్న నిర్ణయంతో అవినీతి అధికారులు, అధికార పార్టీ కార్పొరేటర్లు పర్సంటేజీలు పెంచాలని, నాణ్యత లేకపోయినా పర్సంటేజీలు తగ్గకూడదని కాంట్రాక్టర్లకు ఆదేశించినట్లు సమాచారం. ఇక నుంచి అంతా మన ఇష్టం కొందరు అవినీతి అధికారులకు ఇంతకాలం అడ్డుగా నిలిచిన ఎస్ఈ ఇమాముద్దీన్ స్వచ్ఛంద విమరణ చేయడంతో వారిలో సంతోషం వ్యక్తం అవుతుంది. పైకి మాత్రం ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం బాధాకరంగా ఉందని వ్యక్తం చేస్తుండగా, తమ సన్నిహితుల వద్ద మాత్రం ‘ఇక నుంచి మనం ఆడిందే ఆటగా సాగుతుందని, ఆదాయం పెరుగుతుందని చెప్పడం’ గమనార్హం. -
బెజవాడలో సెక్స్‌రాకెట్ గుట్టురట్టు
విజయవాడ: బెజవాడ కేంద్రంగా సాగుతున్న సెక్స్‌రాకెట్‌ను పోలీసులు గుట్టురట్టు చేశారు. నగరంలోని ఓ సీఐ ఫ్లాట్ పక్కనే జరుగుతున్న ఈ దందాను మంగళవారం రాత్రి పోలీసులు వెలుగులోకి తీసుకువచ్చారు. పోలీసుల దాడిలో ఇద్దరు సెక్స్ వర్కర్లు, ఇద్దరు విటులు, ఒక నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు. వ్యభిచార గృహం నిర్వాహకుల వద్ద పలువురు ప్రముఖుల సెల్ నంబర్లు దొరికినట్లు తెలుస్తుంది. వాటిలో నగరానికి చెందిన ఇద్దరు అధికార పార్టీ కార్పొరేటర్ల నంబర్లు కూడా ఉన్నట్లు సమాచారం. నగరంలో ఒకే చోట కాకుండా పలు ప్రాంతాల్లో ఈ దందా సాగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
ముగిసిన శిక్షణ శిబిరం
♦ చివరి రోజు హాజరైన సీఎం కేసీఆర్ ♦ ఉపముఖ్యమంత్రులతో పాటుగా మంత్రివర్గ సహచరులూ హాజరు ♦ ఉత్సాహంగా కనిపించిన కార్పొరేటర్లు చేవెళ్లః నూతనంగా ఎన్నికైన జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, కార్పొరేషన్ చైర్మన్లకు మూడు రోజులపాటు రంగారెడ్డి జిల్లా చేవేళ్లలోని ప్రగతి రిసార్ట్స్‌లో నిర్వహించిన అవగాహన కార్యక్రమం బుధవారం సాయంత్రం ముగిసింది. మొదటి రోజు సోమవారం ఈ సదస్సుసు ప్రారంభించిన సీఎం కేసీఆర్ చివరిరోజు బుధవారం ముగింపునకు కూడా హాజరై పరిపాలనలో ఎలా మసలుకోవాలో కార్పొరేటర్లకు దిశా నిర్ధేశం చేశారు. చివరి రోజున ఉపముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్‌అలీ, మంత్రులు కె.తారకరామారావు, పి.మహేందర్‌రెడ్డి, నాయిని నర్సింహారెడ్డి, పద్మారావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, జోగు రామన్న, చందూలాల్‌లు హాజరయ్యారు. పార్లమెంటు సభ్యులు కల్వకుంట్ల కవిత, బాల్క సుమన్, సీతారాంనాయక్‌లు వచ్చారు. ఎమ్మెల్యేలు కాలె యా దయ్య, సంజీవరావు, కొండా సురేఖ, వివేక్, కృష్ణారెడ్డి, తీగల కృష్ణారెడ్డి తదితరులు హాజరయ్యారు. ఎమ్మెల్సీలు పి.నరేందర్‌రెడ్డి, శంభీపూర్ రాజు, కొండా మురళి, సలీం, స్టీఫెన్సన్, తదితరులు శిక్షణా శిబిరానికి తరలివచ్చారు. మేయర్లు దొంతు రామ్మోహన్ (జీహెచ్ఎంసీ), డిప్యూటీ మే యర్ బాబా ఫసియోద్ధీన్, ఆకుల సు జాత (నిజామాబాద్), పాపాలాల్ (ఖమ్మం), నరేందర్ (వరంగల్), లక్ష్మీనారాయణ (రామగుండం), రవీందర్‌సింగ్ (కరీంనగర్)లు వచ్చారు. హైద రాబాద్‌ను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దుదాం : డిప్యూటీ సీఎంలు, మంత్రులు శిక్షణ శిబిరంలో ఉపముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, మంత్రులు కేటీఆర్, మహేందర్‌రెడ్డి, నాయిని నర్సింహారెడ్డి, పార్లమెంటు సభ్యురాలు కవిత తదితరులు మాట్లాడుతూ హైదరాబాద్‌ను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. శిక్షణలో ఆకళింపు చేసుకున్న అంశాలతో హైదరాబాద్ రూపురేఖలు మార్చే విధంగా పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. గతంలోని పార్టీలు ప్రజలకు ఏం చేయలేవు కాబట్టే టీఆర్ఎస్కు ఎప్పుడూ రాని విధంగా మెజార్టీని కట్టబె ట్టారని గుర్తుచేశారు. అందుకు అనుగుణంగానే అభివృద్ధి దిశలో హైదరాబాద్‌ను పరుగులు పెట్టించాలని సూచించారు. అభివృద్ధిలో ప్రజలను తప్పనిసరిగా భాగస్వాములను చేయాలని, వారితో కమిటీలను వేసి బాధ్యతను పెంచాలన్నారు. మంచినీరు, రోడ్లు, విద్య, వైద్యం, తదితర అంశాలను ముం దుగా పరిష్కరించాలని సూచించారు. ప్రభుత్వ స్థలాలు, పార్కులను ఎవరైనా కబ్జా చేస్తే ఉపేక్షించరాదని, కఠినంగా శిక్షించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు కార్పొరేటర్లు అన్ని విధాలా సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు. నగరానికి నలువైపులా ఉన్న రంగారెడ్డి జిల్లా కూడా అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు. నగరాభివృద్ధికి ప్రభుత్వం ఎన్ని నిధులైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నదని చెప్పారు. పార్లమెంటు సభ్యురాలు కవిత మాట్లాడుతూ పూణే తరహాలో చెత్త వినియోగించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. బెంగళూరు తరహాలో వర్షపు నీటిని వినియోగించుకునేలా కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. -
ప్రజలు బండకేసి కొడతారు.. జాగ్రత్త!
హైదరాబాద్: రాజకీయ నాయకులకు పదవులు రావడం గొప్ప కాదని.. వాటిని కాపాడుకోవడం గొప్పని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. సోమవారం జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల శిక్షణ తరగతుల ప్రారంభం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు నాయకులను నమ్మితే భుజానెత్తుకుంటారని...లేకపోతే బండకేసి కొడతారని ఆయన హెచ్చరించారు. గతంలో గ్రేటర్ ఎన్నికలు ఉండాలా.. వద్దా? అని సర్వే చేస్తే మెజారిటీ ప్రజలు వద్దన్నారని చెప్పారు. గతంలో పనిచేసిన కార్పొరేటర్లకు చెడ్డపేరు ఉండటం వల్లే ఇలా జరిగిందని తెలిపారు. అలాంటి విధానాల నుంచి బయటకు రావాలన్నారు. అమలుకాని హామీలను ఇవ్వకూడదని, మనం చేయగలిగింది మాత్రమే ప్రజలకు చెప్పాలని సూచించారు. చిత్తశుద్ధితో పనిచేస్తే అద్భుత ఫలితాలు సాధించవచ్చునని కేసీఆర్ చెప్పారు. డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం స్థలాలు గుర్తించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ప్రభుత్వంపై నమ్మకంతోనే లక్షల సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం ఎవరూ లంచాలు ఇవ్వొద్దని..దళారులను ఆశ్రయించొద్దని కేసీఆర్ ప్రజలకు సూచించారు. -
కార్పొరేటర్ల శిక్షణా తరగతులు ప్రారంభం
హైదరాబాద్: జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల శిక్షణా తరగతులను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా పొద్దటూర్లోని ప్రగతి రిసార్ట్స్‌లో నేటి నుంచి మూడు రోజుల పాటు ఈ తరగతులు జరుగుతాయి. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ప్రజాసమస్యలను పరిష్కారించేందుకు నిరంతరం కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, గ్రేటర్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. -
దాహం..దాహం..
♦ కడప నగరంలోని పలు కాలనీల్లో తాగునీటి సమస్య తీవ్రతరం ♦ అధికారులు పట్టించుకోవడం లేదంటూ మండిపడిన కార్పొరేటర్లు ♦ బడ్జెట్ సమావేశంలో తాగునీటి సమస్యపైనే ప్రధాన చర్చ ♦ డివిజన్ల వారీగా దాహార్తి సమస్యలు ఏకరువు ♦ సోమశిల బ్యాక్ వాటర్ స్కీమ్ తీసుకు రావాలని తీర్మానం కడప కార్పొరేషన్ : కడప నగరంలో తాగునీటి సమస్యను పరిష్కరించడంపై అధికారులు శ్రద్ధ చూపడం లేదని కార్పొరేటర్లు మండిపడ్డారు. ఏ కాలనీలో చూసినా నీటి సరఫరా సక్రమంగా లేదని గురువారం నిర్వహించిన నగర పాలక సంస్థ బడ్జెట్ సమావేశంలో పలువురు కార్పొరేటర్లు అసహనం వ్యక్తం చేయడంతో తాగునీటి సమస్యే ప్రధాన అజెండాగా తీసుకుని చర్చించారు. నగర మేయర్ కె.సురేష్‌బాబు అధ్యక్షతన సమావేశం ప్రారంభం కాగానే గుర్రాలగడ్డ, దస్తగిరి జెండా వీధి, రాజాఖాన్భాగ్ వీధులకు మంచి నీరు ఇవ్వాలని 31వ డివిజన్ కార్పొరేటర్ ఎంఎల్ఎన్ సురేష్ ప్ల కార్డు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంలోనే మేయర్.. తాగునీటిపై చర్చకు అనుమతించారు. 3వ డివిజన్లోని శ్రీరామ్‌నగర్, ఆర్కేనగర్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని ఆ డివిజన్ కార్పొరేటర్ కుర్రా లక్ష్మిదేవి సభ దృష్టికి తీసుకు రాగా, దీనికి మేయర్ మద్దతు తెలుపుతూ 3వ డివిజన్లో సుమారు 25 వేల మంది ఉన్నారని, వారికి సరిపడా నీరు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. 22వ డివిజన్లో 13వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన పైప్‌లైన్ పనులను పూర్తి చేయకపోవడంపై ఆ డివిజన్ కార్పొరేటర్ బోలా పద్మావతి సమావేశం మధ్యలో కూర్చొని నిరసన తెలిపారు. ఆరు నెలలుగా తిరుగుతున్నా పనులు ఎందుకు చేయలేదని ఆమె ప్రశ్నించారు. దీనిపై కమిషనర్ పి.చంద్రమౌళీశ్వర్‌రెడ్డి సమాధానం ఇస్తూ రోడ్డు కటింగ్ కోసం రూ. 14 లక్షలు చెల్లించాలని ఆర్అండ్బీ వారు అడుగుతున్నారని, దీనివల్ల ఆలస్యమవుతోందని చెప్పారు. దీనిపై 15 రోజుల్లో అనుమతి రాకపోతే నగర పాలక సంస్థ పాలకవర్గమంతా ఆర్అండ్బీ కార్యాలయం వద్ద ఆందోళన చేయాలని మేయర్ తీర్మానం చేశారు. బండి కనుమ ట్యాంకు నిర్మాణం జరిగి తొమ్మిది నెలలైనా దాన్ని ఎందుకు ఉపయోగంలోకి తీసుకు రాలేదని సభ్యుడు మగ్బూల్‌బాష ప్రశ్నించారు. నీటి సమస్య శాశ్వతంగా పరిష్కరించేందుకు సోమశిల బ్యాక్ వాటర్ స్కీం తీసుకు రావాలని ప్రతిపాదించగా సభ ఆమోదం తెలిపింది. అనంతరం రూ.124.32 కోట్లతో రూపొందించిన బడ్జెట్‌ను నగర పాలక వర్గం ఆమోదించింది. కార్పొరేషన్ నిధులను జన్మభూమి, ఎన్టీఆర్ సుజల పథకాలకు వినియోగించడంపై వైఎస్ఆర్ సీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. బడ్జెట్ అంచనాల్లోనూ, సవరించిన బడ్జెట్లోనూ తప్పులు దొర్లాయని ఎమ్మెల్యే, మేయర్ విమర్శించారు. సమావేశంలో డెప్యూటీ మేయర్ బి.ఆరీఫుల్లా, కార్పొరేటర్లు చల్లా రాజశేఖర్, పాకా సురేష్, జావేద్ అహ్మద్, అన్సర్ అలీ, కో ఆప్షన్ సభ్యులు టీపీ వెంకట సుబ్బమ్మ, నాగమల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజాప్రతినిధుల ఆవేదనను అర్థం చేసుకోవాలి : ఎమ్మెల్యే అంజాద్ బాషా ప్రజాప్రతినిధుల ఆవేదనను అధికారులు అర్థం చేసుకోవాలని ఎమ్మెల్యే ఎస్బీ అంజద్‌బాష సూచించారు. కరువు సమయంలో అత్యవసరంగా పనులు చేసేందుకు ఎలాంటి ఆక్షేపణలు ఉండవని, ఈ మేరకు అధికారులు ముందుండి పని చేయాలన్నారు. జరుగుతున్న పనులపై కమిషనర్ ప్రతిరోజు సమీక్ష చేయాలన్నారు. మన మధ్య ఉన్న లోపాల వల్ల ప్రజలకు నష్టం జరగకూడదని ఆయన తెలిపారు. అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి 10వ తేది వరకు నీటిని విడుదల చేయాల్సిందిగా సంబంధిత మంత్రితో మాట్లాడామని తెలిపారు. చర్చకు వచ్చిన ప్రధాన సమస్యలు ♦ ఐదవ డివిజన్లోని అశోక్‌నగర్‌లో నాలుగు బోరు బావులకు మోటార్లు బిగించి కనెక్షన్లు ఇవ్వాలి. ♦ 11వ డివిజన్లోని భాగ్యనగర్ కాలనీ ఎదురుగా ఎంజే కుంటలో ఐదు రోజులకు ఒకసారి కూడా నీరు రావడం లేదు. ♦ 12వ డివిజన్లోని ఓం శాంతినగర్, ముత్తరాసుపల్లె ప్రాంతాలకు సక్రమంగా నీరు సరఫరా కావడం లేదు. ♦ 13వ డివిజన్లోని నిరంజన్‌నగర్, ప్రకాశ్‌నగర్ కట్టా, పటేల్ రోడ్డు ప్రాంతాల్లో ఏడాది పొడవునా తాగునీటి సమస్య ఉంటోంది. ♦ 30వ డివిజన్లో పసుపు వర్ణంలో నీళ్లు సరఫరా అవుతున్నాయి. -
మంచి ‘ఆప్షన్’ అని..
కోఆప్షన్ పదవికి భారీగా దరఖాస్తులు బరిలో మాజీ కార్పొరేటర్లు... విశ్రాంత అధికారులు సిటీబ్యూరో: జీహెచ్ఎంసీలో కో-ఆప్షన్ పదవులపై అనేక మంది కన్నేశారు. కార్పొరేటర్లుగా అవకాశం రాని వారు కనీసం కో ఆప్షన్ సభ్యులుగానైనా ఎన్నిక కావాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఒకరూ.. ఇద్దరూ కాదు.. ఏకంగా యాభై మంది పోటీలో ఉన్నారు. ముగ్గురు కో ఆప్షన్ సభ్యుల నియామకానికి ఏప్రిల్ 4 వర కు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇప్పటి వరకు దాదాపు 50 దరఖాస్తులు అందాయి. కార్పొరేటర్‌గా టిక్కెట్ లభించని వారితో పాటు మాజీ కార్పొరేటర్లు.. శివారు మున్సిపాలిటీల్లోని మాజీ కౌన్సిలర్లు... కో ఆప్షన్ సభ్యత్వం కోసం పోటీ పడుతున్నారు. వీరితో పాటు జీహెచ్ఎంసీలో ఇంజినీర్లుగా పని చేసి రిటైరైన వారు కూడా దరఖాస్తు చేసుకున్నారు. కో ఆప్షన్ సభ్యులకు మేయర్, డిప్యూటీ మేయర్లను ఎన్నుకునే అవకాశం మినహా కార్పొరేటర్లకు గల అధికారాలన్నీ ఉంటాయి. కార్పొరేటర్ బడ్జెట్ ఏడాదికి రూ.కోటితో పాటు ఇతరత్రా వారికి గల అన్ని సదుపాయాలూ కోఆప్షన్ సభ్యులకు వర్తిస్తాయి. ఈ పదవులకు కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఈ నెల 3న ప్రకటన జారీ చేశారు. తొలుత 21వ తేదీ వరకు మాత్రమే గడువిచ్చారు. ఆ తరువాత ఎన్జీవోల్లో పని చేసిన వారితో పాటు మరికొన్ని వర్గాలకూ అవకాశం కల్పిస్తూ జీవోను సవరించారు. గడువును ఏప్రిల్ 4 వరకు పొడిగించారు. బరిలో వీరే... గత పాలక మండలిలో కాప్రా డివిజన్ కార్పొరేటర్ కొత్త రామారావు... ఓల్డ్ మల్కాజిగిరి కార్పొరేటర్ ప్రేమ్‌కుమార్... గౌతమ్‌నగర్ కార్పొరేటర్ సుమలత, ఆడిక్‌మెట్ కార్పొరేటర్ సునీత.. ఎర్రగడ్డ కార్పొరేటర్ సదాశివ యాదవ్, మూసారాంబాగ్ కార్పొరేటర్ అస్లాంపాషా తదితరులు ఆశావహుల్లో ఉన్నారు. వీరిలో మెజార్టీ సభ్యులు గతంలో టీడీపీలో ఉండగా... ప్రస్తుతం టీఆర్ఎస్ గూటికి చే రారు. గతంలో కాంగ్రెస్ నుంచి ప్రాతినిథ్యం వహించి... ప్రస్తుతం టీఆర్ఎస్లో చేరిన వారు సైతం ఉన్నారు. 1986, 2002 పాలక మండళ్లలో కార్పొరేటర్లుగా వ్యవహరించిన వారు సైతం ప్రస్తుతం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో మాచర్ల పద్మజ, బండారు లత, లక్ష్మీనారాయణమ్మ తదితరులు ఉన్నారు. గత పాలక మండలిలో ఎక్స్అఫీషియో సభ్యురాలిగా వ్యవహరించిన మల్లారపు శాలిని మళ్లీ దరఖాస్తు చేసుకున్నారు. మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లుగా పని చేసిన మహేశ్ యాదవ్, శ్రీరాంచందర్ వంటి వారూ దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. వీరితో పాటు జీహెచ్ఎంసీ(ఎంసీహెచ్)లో గతంలో సూపరింటెండింగ్ ఇంజినీర్లుగా పనిచేసి రిటైరైన ఎంఏ హమీద్, ఫయీముద్దీన్, డిప్యూటీ ఈఈ జయప్రకాష్ నారాయణరావు తదితరులూ దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులను పరిశీలించి... వీరిలో నుంచి ముగ్గురిని కో ఆప్షన్ సభ్యులుగా ఎన్నుకునేందుకు పాలక మండలి ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తారు. మెజార్టీ సభ్యుల నిర్ణయం మేరకు ముగ్గురిని కో ఆప్షన్ సభ్యులుగా ఎన్నుకుంటారు. -
‘లెక్క’ చెప్పలేదు
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఖర్చుల వివరాలివ్వని అభ్యర్థులు సమర్పించకుంటే అనర్హత వేటు పడే ప్రమాదం సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికలు ముగిశాక ఫలితాలు వెలువడిన 45 రోజుల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఎన్నికల ఖర్చుల వివరాలను అధికారులకు సమర్పించాలి. లేని పక్షంలో రాబోయే మూడేళ్ల వరకు ఎలాంటి ఎన్నికల్లోనూ పోటీకి వీలుండదు. అయినప్పటికీ జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి ఇంకా 412 మంది తమ వివరాలను అధికారులకు సమర్పించలేదు. ఈ నెల 20 వరకు మాత్రమే దీనికి గడువుంది. ఈ మేరకు అధికారులు వారికి నోటీసులు జారీ చేశారు. నిర్ణీత గడువులోగా లెక్కలు సమర్పించని పక్షంలో తగిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత నిబంధనల మేరకు లెక్కలు తెలపని వారు మూడేళ్ల వరకు పోటీ చేయడానికి అనర్హులు. ఉప ఎన్నికలొస్తే తప్ప జీహెచ్ఎంసీ, అసెంబ్లీ ఎన్నికలు జరిగేదే ఐదేళ్లకోసారి. అంటే.. మళ్లీ ఎన్నికలు జరిగే సమయానికి వీరి పోటీకి ఆటంకాలు ఉండవు. అలాంటప్పుడు అనర్హత వేటు వేసినా, వేయకపోయినా వారికి జరిగే నష్టమేమీ లేదు. ఈ ధీమాతోనే ఓడిపోయిన పలువురు అభ్యర్థులు దీనిపై దృష్టి సారించలేదని తెలుస్తోంది. గెలిచిన వారు ఎన్నికల లెక్కలు చూపని పక్షంలో కార్పొరేటర్లుగా అనర్హులవుతారు. దీంతో వారు అప్రమత్తంగానే ఉన్నట్లు తెలుస్తోంది. గడువు వరకు అధికారులు వేచి చూస్తున్నారు. మరోవైపు ఎన్నికల లెక్కలు తెలపాల్సిందిగా ఓడిన వారిని హెచ్చరిస్తున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థుల మాదిరిగా తిరిగి ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆరేళ్ల వరకు అనర్హత వేటు వేస్తేనే ఇలాంటి వారుస్పందిస్తారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఎన్నికల సంఘం ఈ అంశంపై శ్రద్ధ చూపితే బాగుంటుందని వారు భావిస్తున్నారు -
పార్టీ ప్రతిష్ట పెంచాలి
{పజలకు అందుబాటులో ఉండండి సమన్వయంతో పనిచేయండి కొత్త కార్పొరేటర్లకు కడియం దిశానిరేశం హన్మకొండ అర్బన్ : కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు సమన్వయంతో పనిచేసి పార్టీ ప్రతిష్ట పెంచాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. నూతన కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారానికి వెళ్లే ముందు నక్కలగుట్టలోని హరిత హోటల్లో పత్య్రేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కడియం మాట్లాడు తూ.. అవినీతి అక్రమాలకు, భూకబ్జాలకు దూరంగా ఉంటూ నీతివంతమైన పాలన అందించాలని సూచిం చారు. జిల్లాపై ముఖ్యమంత్రికి ప్రత్యేక దృష్టి ఉందని, దానికి అనుగుణంగా నిధులు కేటాయిస్తున్నారని చెప్పారు. కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా పనిచేయాలన్నారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చందూలాల్ మాట్లాడుతూ వరంగల్ నగరానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత బడ్జట్లో రూ.300 కోట్లు కేటాయించిందని, ప్రతి ఏటా ఇదే విధంగా నిధులు వస్తాయని చెప్పారు. కార్పోరేషన్‌పై ప్రజల్లో సదభిప్రాయం లేదని, దానికి తొలగించేలా పాలన సాగాలని అన్నారు. చిత్తశుద్ధితో పనిచేసి మంచిపేరు తెచ్చుకోవాలని కోరారు. పశ్చిమ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ కొత్తగా ఎన్నికైన వారు పార్టీలో అవకాశాలు దక్కక అసంతృప్తితో ఉన్నవారిని కలుపుకుని పోవాలని సూచించారు. కార్పరేటర్‌గా సమర్ధవంతంగా పనిచేసినవారికి మంచి అవకాశాలు వస్తాయని అన్నారు. తాను, ఎంపీ గుండు సుధారాణి కార్పొరేటర్లుగానే రాజకీయ ప్రస్థానం ప్రారంభించామని గుర్తు చేశారు. ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు మాట్లాడుతూ డివిజన్ కేంద్రాల్లో కార్పొరేటర్లు ప్రజలకు వారానికి నాలుగు రోజులు అందుబాటులో ఉండాలన్నారు. ప్రజల మధ్య ఉంటేనే వారి సమస్యలు తెలుస్తాయని అన్నారు. సమావేశంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్రావు, ఎంపీలు సీతారం నాయక్, పసునూరి దయూకర్, గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు కొండా సురేఖ, తాటికొండ రాజయ్య, అరూరి రమేష్, శంకర్‌నాయక్, పుల్లా పద్మావతి తదితరులు పాల్గొన్నారు. -
మరో రెండేళ్లు పోరాటం చేద్దాం
కార్పొరేటర్లతో వైఎస్ జగన్ కడప కార్పొరేషన్: ‘‘మరో రెండేళ్లు ఈ ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉండండి.. ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత చూసి అధికారులు, పోలీసుల్లో కూడా మార్పు వస్తుంది, అప్పుడు మన మాటే వింటారు’ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. గురువారం ఆలంఖాన్‌పల్లె సమీపంలోని బుద్ద టౌన్షిప్లో కడప నగరపాలక సంస్థ కార్పొరేటర్లతో ప్రత్యేకంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇన్నేళ్లుగా మా కుటుంబం వెన్నంటి ఉన్న మీరు ఒకట్రెండు సంవత్సరాలు ఓపిక పడితే కష్టాలన్నీ తీరిపోతాయన్నారు. ఇప్పటికే గ్రామాల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, మరో ఏడాది ఓపిక పడితే పరిస్థితి పూర్తిగా తారుమారవుతుందని తెలిపారు. మీరంతా జిల్లాలో తనకు అండగా ఉంటే మిగతా జిల్లాల్లో పార్టీని బలోపేతానికి కృషి చేస్తానన్నారు. మన ప్రభుత్వం వచ్చినప్పుడు పేరుపేరునా గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కరికీ మేలు చేస్తామని చెప్పినట్లు తెలిసింది. సొంత జిల్లాలోనే తలనొప్పులు తెస్తే ఇబ్బందిగా ఉంటుందని చెప్పగా, ఇందుకు కార్పొరేటర్లంతా ముక్తకంఠంతో స్పందిస్తూ ప్రాణం పోయేంత వరకూ పార్టీని వీడబోమని ప్రతిన చేసినట్లు తెలుస్తోంది. కొందరు కార్పొరేటర్లు వైఎస్ జగన్‌తో మాట్లాడుతూ మీరు జిల్లాకు వచ్చినప్పుడు కడపలో రైలు దిగి వెళితే నాయకులు, కార్యకర్తలకు భరోసాగా ఉంటుందని చెప్పినట్లు తెలిసింది. దీనికి వైఎస్ జగన్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ప్రతి నెలకో, రెండు నెలలకో కార్పొరేటర్లు, నాయకులతో సమావేశమై వారి సమస్యలు తెలుసుకోవాలని, మీవల్ల పరిష్కారం కాని వాటిని తన దృష్టికి తీసుకురావాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి, నగర మేయర్ కె.సురేష్‌బాబు, కడప ఎమ్మెల్యే ఎస్బి అంజద్‌బాషాలను సూచించినట్లు తెలిసింది. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సానపురెడ్డి శివకోటిరెడ్డి, రామలక్ష్మణ్‌రెడ్డి, పాకా సురే్ష్, చైతన్య, ఎస్ఏ షంషీర్, బోలా పద్మావతి, కె.బాబు, ఎన్.రషీదా తబస్సుమ్, ఎస్బి మహ్మద్ అన్సర్ అలీ, కోఆప్షన్ సభ్యులు నాగమల్లారెడ్డి, టీపీ వెంకటసుబ్బమ్మ తదితరులు పాల్గొన్నారు. -
మజ్లిస్ కార్పొరేటర్లలో కొత్త ముఖాలే ఎక్కువ!
44 మందిలో 35 మంది కొత్తవారే... సిటీబ్యూరో: జీహెచ్ఎంసీలో రెండో అతి పెద్దపార్టీగా అవతరించిన మజ్లిస్ పార్టీ కార్పొరేటర్లలో అత్యధిక శాతం కొత్తగా ఎన్నికైన వారు ఉన్నారు. మొత్తం 44 మంది కార్పొరేటర్లుగా ఎన్నిక కాగా అందులో 35 మంది కొత్త వారు ఉన్నారు. కొత్త వారిలో 19 మంది మహిళలు కాగా, 16 మంది పురుషులు ఉన్నారు. తొమ్మిది మంది పాత కార్పొరేటర్లు తిరిగి ఎన్నికయ్యారు. మజ్లిస్ పార్టీ మొత్తం 150 డివిజన్లకు గాను 60 డివిజన్లల్లో మాత్రమే పోటీ చేసింది. డివిజన్ల డీలిమిటేషన్, రిజర్వేషన్ తారుమారుతో కేవలం తొమ్మిది మంది సిట్టింగ్‌లకు మాత్రమే తిరిగి అవకాశం కల్పించి మిగితా 51 స్థానాల్లో కొత్త అభ్యర్థులను బరిలో దింపింది. సిట్టింగ్‌లందరూ తిరిగి ఎన్నిక కాగా, కొత్తవారిలో 16 మందికి ఓటమి తప్పలేదు. పదిమంది ముస్లిమేతర అభ్యర్థులు బరిలో దిగగా నలుగురు మాత్రమే విజయం సాధిం చారు. పాతబస్తీలో పూరానాపూల్ డివిజన్ మజ్లిస్ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది. సిట్టింగ్ కార్పొరేటర్ మహ్మద్ గౌస్ పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ పక్షా న బరిలో దిగడంతో అక్కడ ముస్లిమేతర అభ్యర్థి బరిలో దంపి సత్తా చాటింది. పోలిం గ్ రోజు జరిగిన ఘటనతో కౌటింగ్ రోజురీ పోలింగ్ నిర్వహిం చినా సునాయాసంగా గట్టెక్కింది. ఈ సారి జీహెచ్ఎంసీలో కొత్తవారే అత్యధికంగా ఎన్నిక కావడంతో వారికి అనుభవజ్ఞులతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. కార్పొరేటర్లుగా ఎన్నికైన వారికి జరిగిన అభినందన సమావేశంలో సైతం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ సలహాలు, సూచనలు అందించారు. రేపు జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ ఎంపిక జీహెచ్ఎంసీ మజ్లిస్ పార్టీ ఫ్లోర్ లీడర్ ఎంపిక మంగళవారం జరుగనుంది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయమైన దారుస్సలాంలో పార్టీ కార్పొరేటర్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశా రు. 11న మేయర్ ఎన్నిక జరుగనుండటంతో దాని కంటే ముందే పార్టీ పక్ష నేత ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని పార్టీ అధిష్టానవర్గం భావిస్తోంది. పాతవారికే పార్టీ ఫ్లోర్ లీడర్‌గా ప్రకటించే అవకాశాలు లేకపోలేదు. -
ఇదీ మేయర్ లెక్క..
* ఎన్నికైన కార్పొరేటర్లు 150 * ఎక్స్ అఫీషియో సభ్యులు 67 మంది * మొత్తం ఓటర్లు 217 సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్‌ను ఎన్నుకోవడంలో మరో ట్విస్ట్ ఎదురయ్యింది. మేయర్ ఎన్నికలో 217 మందికి ఓటు హక్కు ఉంది. ఎన్నికైన 150 మంది కార్పొరేటర్లతో పాటు 67 మంది ఎక్స్అఫీషియో సభ్యులు వీరిలో ఉన్నారు. ఎమ్మెల్సీలను ఎక్స్ అఫీషియో సభ్యులుగా చేసేందుకు ఇటీవల జీవోను సవరించడంపై హైకోర్టులో ఉన్న కేసు సోమవారం విచారణకు రానుండటం.. ఆగమేఘాల మీద సదరు జీవోను రద్దుచేస్తూ ఆర్డినెన్స్ తేవడం.. తదితర పరిణామాల నేపథ్యంలో మేయర్‌ను ఎన్నుకోనున్న ఎక్స్అఫీషియో సభ్యులు ఎందరన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. తాజా సమాచారం మేరకు అర్హత కలిగిన ఎక్స్‌అఫీషియోలు 67 మంది ఉన్నారు. ఏపీకి కేటాయించిన రాజ్యసభ సభ్యులకు సైతం ఇక్కడ మేయర్ ఎన్నికలో ఓటు హక్కు కల్పించారు. తామిక్కడి ఓటర్లయినందున తమకు కూడా ఓటు హక్కు ఉండాలని ఎంఏ ఖాన్ కోరడంతో ఆ మేరకు ప్రభుత్వానికి నివేదించి... వారికి అవకాశం కల్పించారు. ఈ మేరకు మేయర్ ఎన్నికకు హాజరు కావాల్సిందిగా కోరుతూ కార్పొరేటర్లతో పాటు వీరందరికీ ఆహ్వానపత్రాలు పంపడంతో వారు ఈ నెల 11న మేయర్ ఎన్నికకు హాజరు కానున్నారు. ఎన్నిక జరిగే హాల్లోకి వెళ్లేముందు అంతకుముందు తామెక్కడా మేయర్ ఎన్నికలో ఓటు వేయలేదని డిక్లరేషన్ పత్రంపై సంతకం చేయాలి. వీరిలో కనీసం సగం మంది హాజరైతే మేయర్ ఎన్నికకు కోరం ఉన్నట్లు లెక్క. అంటే కనీసం 109 మంది హాజరైతే మేయర్ ఎన్నికను నిర్వహిస్తారు. అయితే టీఆర్ఎస్కు సంఖ్యా బలమున్నందున మేయర్ ఎన్నిక లాంఛనమే కానుంది. ఎక్స్ అఫీషియోలుగా ఓటు హక్కు వినియోగించుకోనున్న వారిలో పదిమంది రాజ్యసభ సభ్యులు, నలుగురు లోక్‌సభ సభ్యులు, 24 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. తెలంగాణలోని 40 మంది ఎమ్మెల్సీల్లో 29 మందికి ఇక్కడ ఓటు హక్కు ఉండగా, మిగ తా వారు ఇతర పురపాలికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు హక్కులేని వారు.. ఎమ్మెల్సీల్లో కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావులకు ఇక్కడ ఓటు హక్కు లేదు. ఎంపీ విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డికి కూడా లేదు. వీరు ఇప్పటికే ఇతర పురపాలికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నట్లుల నిర్ధారించుకున్నారు. ఎమ్మెల్సీలు.. 1. భూపాల్‌రెడ్డి, 2 సుంకరిరాజు, 3.కె.జనార్దన్‌రెడ్డి , 4. భూపతి రెడ్డి , 5. సతీష్‌కుమార్, 6. కర్నె ప్రభాకర్, 7. వి.స్వామిగౌడ్, 8. ఎండి సలీం, 9.నాయిని నరసింహారెడ్డి , 10. గంగాధ ర్‌గౌడ్, 11. డి.రాజేశ్వరరావు, 12. పూల రవీందర్, 13. మహమూద్‌అలీ, 14. కసిరెడ్డి నారాయణరెడ్డి ,15. పి.సుధాకర్‌రెడ్డి ,మ16. మహ్మద్ అలీ షబ్బీర్, 17. పల్లా రాజేశ్వర్, 18. యాదవరెడ్డి, 19. బి.వెంకటేశ్వర్లు, 20. ఎం.శ్రీనివాసరెడ్డి, 21. నేతి విద్యాసాగర్, 22. రాములు నాయక్, 23. పట్నం నరేందర్‌రెడ్డి, 24. భానుప్రసాదరావు, 25. సయ్యద్ అల్తాఫ్ హైదర్ రజ్వి, 26ఎంఎస్ ప్రభాకర్, 28. నారదాసు లక్ష్మణరావు, 29. సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రి. -
మరోసారి గెలిచిన వీరులు!
పార్టీలు ... డివిజన్లలో మార్పు సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచిన వారిలో ఇరవై మందికి పైగా గత పాలక మండలిలో, మరో పదిమంది 2002లో కార్పొరేటర్లుగా గెలిచిన వారు ఉన్నారు. వీరిలో చాలామంది గతంలో టీడీపీ, కాంగ్రెస్‌లలో ఉండ గా... ప్రస్తుతం అధికార పార్టీ టీఆర్ఎస్ అభ్యర్థులుగా గెలుపొందారు. కొందరు అవే డివిజన్ల లో రెండోసారి గెలుపొందగా... మరికొందరు ఇతర డివిజన్ల నుంచి విజయం సాధించారు. గతంలో ఉన్న కొన్ని డివిజన్లు రద్దు కావడం.. కొన్నింటిలో రిజర్వేషన్ల మార్పుతో పోటీ చేయలేకపోవడం వంటికారణాలతో ఇతర డివిజన్ల నుంచి బరిలో దిగారు. ఎంఐఎం కార్పొరేటర్లు పార్టీ మారనప్పటికీ... కొందరి డివిజన్లు మారాయి. అలాంటి వారిలో మాజీమేయర్ మాజిద్ హుస్సేన్ తదితరులు ఉన్నారు. గత పాలక మం డలిలో బీజేపీ ఫ్లోర్‌లీడర్‌గా పనిచేసిన బంగారి ప్రకా శ్ ఇప్పుడు వేరే డివిజన్ నుంచి గెలుపొం దారు. ఎంఐఎం కోఆప్షన్ సభ్యురాలు అయేషారూబినా ఈసారి అహ్మద్‌నగర్ డివిజన్ నుంచి గెలిచారు. వీరిలో కొందరు మూడోసారి ఎన్నికైన వారు ఉన్నారు. వివరాలిలా ఉన్నాయి. రెండో పర్యాయం కార్పొరేటర్లుగా ఎన్నికైన వారిలో జిట్టా రాజశేఖరరెడ్డి (వనస్థలిపురం), సయ్యద్ మిన్హాజుద్దీన్ (అక్బర్‌బాగ్), మీర్ వాజి ద్ అలీఖాన్, తారాబాయి (ఫలక్‌నుమా), సున్నం రాజ్‌మోహన్ (పురానాపూల్), మహ్మద్ యూసుఫ్ (దత్తాత్రేయనగర్), కె.సత్యనారాయణ (జూబ్లీహిల్స్), జగన్ (జగద్గిరిగుట్ట) ఉన్నారు. -
ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలి
కార్పొరేటర్లతో మంత్రి మహేందర్‌రెడ్డి: మంత్రిని కలిసిన శివారు కార్పొరేటర్లు శుభాకాంక్షలు తెలిపి స్వీట్లు తినిపించిన మహేందర్‌రెడ్డిఅభివృద్ధిపై దిశానిర్దేశం రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్కు కనీవినీ ఎరుగని రీతిలో మెజార్టీ కట్టబెట్టిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా కష్టపడి పని చేయాలని రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పి.మహేందర్ రెడ్డి కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లకు సూచించారు. శనివారం పలువురు కార్పొరేటర్లు మంత్రిని కలిసి తమ గెలుపునకు కృషి చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ కార్పొరేటర్ ప్రజలతో మమేకమై అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా తమ పరిధిలో రోడ్ల నిర్మాణం, తాగునీటి ఎద్దడి నివారణ, మురుగు కాల్వల నిర్మాణంతో పాటు ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరించడానికి కృషి చేయాలన్నారు. జిల్లా పరిధిలోని శివారు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న పేదలకు కనీస సౌకర్యాలు కల్పించి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచాలన్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయసాధన కోసం అందరూ కంకణబద్ధులు కావాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, చంపాపేట, శేరిలింగంపల్లి, చందానగర్, మైలార్ దేవ్‌పల్లి, అత్తాపూర్, రాజేంద్రనగర్ కార్పొరేటర్లు, పలువురు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. -
‘కోటి’ రూట్లు
సేవ ప్రశ్నార్థకం.. ఇప్పుడు భారీ మొత్తంలో ఖర్చు చేసి ఎన్నికయ్యే కార్పొరేటర్లు ఎంతమేరకు అందుబాటులో ఉంటారనేది ప్రశ్నార్థకం. తమ వ్యాపారాల్లో కార్పొరే షన్ పరంగా ఇబ్బందులు లేకుండా చూసుకునేందుకు కొంతమంది అభ్యర్థులు ఎన్నికలను వినియోగించు కుంటున్నారన్నది బహిరంగ రహస్యమే. అనేక మంది మాజీలు, తాజాలు తమ ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు పోటీలో నిలుస్తున్నారు. * గెలుపు కోసం పాట్లు * విచ్చల విడిగా ధన ప్రవాహం * శివాలెత్తుతున్న శివారులు సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీఎన్నికల్లో పోటీ రసవత్తరంగా మారింది. ఎలాగైనా విజయం సాధించాలనే లక్ష్యంతో అభ్యర్థులు ‘కోటి’మార్గాలు వెదుకుతున్నారు. డబ్బును విచ్చల విడిగా వెదజల్లుతున్నారు. ఖర్చెంతైనా ఫర్వాలేదు..గెలిస్తే చాలునన్న ధోరణిలో ముందుకెళుతున్నారు. ఈ విషయంలో నగరం కంటే శివారు ప్రాంతాలే ముందున్నాయి. ఉప్పల్, హయత్‌నగర్, నాచారం, మాదాపూర్ డివిజన్లలో ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా భావించిన పలువురు అభ్యర్థులు ధనాన్ని మంచినీళ్లలా ఖర్చు చేస్తున్నట్లు వినికిడి. బౌద్ధనగర్, బేగంపేట, తార్నాక, అమీర్‌పేట, కూకట్పల్లి వంటి చోట్ల కూడా ఒక్కో డివిజన్‌కు రూ.కోటి నుంచి రూ.కోటిన్నర వరకు వెచ్చించడానికి వెనుకాడడం లేదు. వందలాది మంది కిరాయి కార్యకర్తలు, వాహనాలు, బాజాభజంత్రీలకు రోజూవారీ కూలీ, భోజనం, ప్రచార సామగ్రి ఖర్చు రోజుకు రూ.6-10 లక్షలకు మించిపోతోంది. ప్రచారం సంగతి పక్కన పెడితే... ఎన్నికల పుణ్యమా అని అడ్డాకూలీలకు ఆధారం దొరికింది. నిత్యం పక్కాగా కూలీ గిట్టుబాటవుతుండటంతో యువకులతో పాటు మహిళలు, వృద్ధులు సైతం ప్రచారంలో పాల్గొని నాలుగురాళ్లు సంపాదించుకుంటున్నారు. ‘మొత్తం’ తేడా! గ్రేటర్ హైదరాబాద్ వుున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు అసెంబ్లీని తలపిస్తున్నాయి. 150 వార్డులకు మొత్తం 1,333 వుంది పోటీ పడుతున్నారు. నువ్వా...నేనా అన్నట్లు ప్రచారం చేస్తున్నారు. ఈ ఎన్నికలను అన్ని పార్టీల కార్పొరేటర్అభ్యర్థులు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. ఎట్టి పరిస్థితిల్లోనూ గెలిచి తీరాలనే పట్టుదలతో పరిమితులను అతిక్రమిస్తున్నారు. ఎన్నికల కమిషన్ నిబంధన ప్రకారం రూ.ఐదు లక్షలకు మించి ఖర్చు చేయకూడదు. ఈ ‘మొత్తం’ ఏ మూలకూ సరిపోదని స్వయుంగా అభ్యర్థులే వెల్లడిస్తున్నారు. పార్టీల కార్యాలయాల్లో బీ ఫారాలు తీసుకున్నప్పటి నుంచి ఎన్నికలు ముగిసే వరకు ఒక్కో అభ్యర్థి ఎంత ఖర్చు చేస్తున్నారో తెలుసుకునేందుకు ‘సాక్షి’ ప్రయుతిస్తే... వారు చెబుతున్నదానికీ...వాస్తవానికీ మధ్య ఎంత తేడా ఉందో తెలుసుకోవచ్చు. అభ్యర్థులు వుంచినీళ్ల ప్రాయుంగా డబ్బు ఖర్చు చేస్తున్నారనే విషయుం అందరికీ తెలిసిందే. వివిధ ప్రాంతాలు, పార్టీల బలాబలాలు, అభ్యర్థుల ఎన్నికల ఖర్చును ప్రభావితం చేస్తున్నారుు. ఉ దాహరణకు పాతబస్తీ అభ్యర్థులకు ఎన్నికల కమిషన్ నిబంధనలకు అటు ఇటుగా ఖర్చవుతుండగా... మిగిలిన వార్డుల్లో ఈ మొత్తం రూ.రెండు నుంచి మూడు కోట్లకు పైనే ఉంటుందని అంచనా. -
'అనంత' టీడీపీలో విభేదాలు
అనంతపురం: స్టాండింగ్ కమిటీ ఎంపిక అనంతపురం పట్టణ టీడీపీలో చిచ్చురేపింది. స్థానిక ఎమ్మెల్యే జయరాం నాయుడు, మేయర్ స్వరూప ఒక వర్గం కాగా, కార్పొరేటర్లు మరో వర్గంగా విడిపోయారు. స్టాండింగ్ కమిటీ సభ్యులుగా నామినేషన్ దాఖలు చేశారు. ధనలక్ష్మి అనే కార్పొరేటర్ శుక్రవారం ఉదయం నామినేషన్ దాఖలు చేయగా దానిని ఉపసంహరించుకోవాలని మేయర్ స్వరూప ఒత్తిడి తెచ్చారు. విషయం తెలుసుకున్న జయరాంనాయుడు ధనలక్ష్మీ వద్దకు వెళ్లి వాగ్వివాదానికి దిగారు. ధనలక్ష్మి నామినేషన్ ఉపసంహరించుకునేందుకు అంగీకరించకపోవటంతో అధికారులతో కూడా వాదులాట జరిగింది. దీంతో రెండు వర్గాల మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. -
22 మంది కార్పొరేటర్లకు నోటీసులు
♦ జారీ చేసిన బాంబే హైకోర్టు ♦ 27న విచారణకు హాజరుకావాలని ఆదేశం సాక్షి, ముంబై : తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలు సమర్పించి ఎన్నికల్లో పోటీ చేశారనే ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ 22 మంది భివండీ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లకు బాంబే హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలు సమర్పించి ఎన్నికల్లో పోటీ చేశారని ఆరోపిస్తూ మాజీ కార్పొరేటర్ సిద్ధేశ్వర్ కామ్మూర్తి బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన కోర్టు వీరందరికి నోటీసులు జారీ చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్పొరేటర్లంతా సుప్రీం కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. కేసు విచారణ జరపాలని హైకోర్టును సుప్రీం ఆదేశించింది. ఆ మేరకు తదుపరి విచారణ ఈ నెల 27న జరుపుతామని బాంబే హైకోర్టు న్యాయమూర్తి మోహిత్ షా తెలిపారు. విచారణ సమయంలో 22 మంది కార్పొరేటర్లు కోర్టుకు హాజరు కావాలని ఆదేశాలు జారీచేశారు. ఆరోపణలు ఎదుర్కొంట్ను వారిలో స్థాయీ సమితి సభాపతి ప్రశాంత్ లాడ్, బీజేపీకి చెందిన అస్మితా చౌదరి, మహేశ్ చౌగులే ఉన్నారు. భివండీ కార్పొరేషన్‌కు 2013లో 90 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో ఓబీసీ రిజర్వుడు స్థానాల్లో పోటీ చేసి 22 మంది గెలిచారు. వీరంతా నామినేషన్ పత్రాలతోపాటు థానే జిల్లా అధికారి కార్యాలయం ద్వారా జారీ చేసిన కుల ధ్రువీకరణ పత్రాలు సమర్పించారు. కాని వీరు తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలు సమర్పించారని ఆరోపిస్తూ సిద్ధేశ్వర్ పిటిషన్ దాఖలు చేశారు. -
పనులు 20 శాతం కూడా పూర్తి కాలేదు
- నాలాలు శుభ్రం చేసే పనులు మందకోడిగా సాగుతున్నాయి - ఆగ్రహం వ్యక్తం చేసిన బీఎంసీ కార్పొరేటర్లు - 40 శాతం పనులు పూర్తయ్యాయన్న కార్పొరేషన్ సాక్షి, ముంబై: నగరంలో మురికి కాల్వలు, నాలాలు శుభ్రపరిచే పనులు 20 శాతం కూడా పూర్తికాలేదని మహానగర పాలక సంస్థ (బీఎంసీ) ప్రతిపక్ష కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఏటా మే మాసం వచ్చే సరికి 50 శాతం మురికి కాల్వలు, నాలాల పనులు పూర్తవుతాయని, కానీ ఈ ఏడాది ఇప్పటి వ రకు పనులు అనుకున్న మేర జరగలేదని కార్పొరేటర్లు ఆరోపించారు. వర్షాకాలానికి ఇంకా నెల రోజులు కూడా సమయం లేదని హెచ్చరించారు. నగరంలో 1.75 లక్షల మురికి కాల్వలు 45 పెద్ద నాలాలు, 38 చిన్న నాలాలు ఉన్నాయి. వీటిలో పేరుకుపోయిన చెత్త, బురద వెలికితీసే పనులు 40 శాతం పూర్తయ్యాయని బీఎంసీ పరిపాలన విభాగం వెల్లడించింది. కాని వాస్తవాలు అందుకు భిన్నంగా ఉన్నాయని బీఎంసీలో ప్రతిపక్ష నాయకుడు దేవేంద్ర ఆంబేకర్ ఆరోపించారు. కొన్ని ప్రాంతాల్లో నాలాల నుంచి బయటకు తీసిన బురద, చెత్త అలాగే పడి ఉందని, దీంతో దుర్గంధం వ్యాపించడంతో ప్రజలనుంచి ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. కొన్ని ప్రాంతాల్లో పనులు మందకోడిగా సాగుతున్నాయన్నారు. ఇచ్చిన సమయానికల్లా కాంట్రాక్టర్లు పనులు పూర్తిచేయాలని నిబంధనలు ఉన్నాయని, అయితే వర్షాకాలం ప్రారంభమైన తర్వాత కూడా నాలాలు శుభ్రం చేసే పనులు కొనసాగుతున్నాయని ఆరోపించారు. -
అదనపు ట్యాంకర్లే.. కొత్త బోర్లు లేవు!
సాక్షి, సిటీబ్యూరో : ప్రతి యేటా వేసవిలో తలెత్తే నీటిఎద్దడి దృష్ట్యా దాదాపు రూ. 10 నుంచి రూ. 20 కోట్ల వరకు ఖర్చు చేస్తోన్న జీహెచ్ఎంసీ ఈసారి కొత్త బోర్లు వేయడం లేదు. అవసరమైన ప్రాంతాల్లో అదనపు ట్యాంకర్ల ద్వారా నీటిని అందించేందుకు ఏర్పాట్లు చేశారు. గతంలో పాలకమండలి సమయంలో వేసవి వచ్చిందంటే చాలు కార్పొరేటర్ల నుంచి బోర్ల కోసం విజ్ఞప్తులు వెల్లువెత్తేవి. దాంతో అధికారులు బోర్ల కోసమని నిధులు మంజూరు చేసేవారు. నిధులు ఖర్చయ్యేవి కానీ.. బోర్లలో నీరు వచ్చేది కాదు. వెయ్యి అడుగుల మేర బోరు వేసినా నీరు రాకపోవడం అందుకు ఒక కారణం కాగా, కార్పొరేటర్లు..కాంట్రాక్టరుల కుమ్మక్కై పనులను మమ అనిపించేవారు. మొత్తానికి ప్రజలకు నీరందకపోయినా నిధులు ఖర్చయ్యేవి. భూగర్భజలాలు తగినంతగా లేనందున కొత్తగా పవర్‌బోర్లు వేసినా ఫలితం లేదని భావించిన అధికారులు ఈసారి నీటికొరత ఉందంటూ విజ్ఞప్తి అందినప్రాంతాలకు అదనపు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు సిద్ధమయ్యారు. అదనపు ట్యాంకర్ల ద్వారా వేసవిలో నీటి పంపిణీకి దాదాపు కోటి రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఆ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నీటిసరఫరా పైప్లైన్లు లేని శివారు కాలనీలకు జీహెచ్ఎంసీయే ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తోంది. రెగ్యులర్ ట్యాంకర్లతో పాటు వేసవిలో అదనపు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసేందుకు ఈ నిధులు వెచ్చించనున్నారు. సర్కిళ్ల వారీగా వినియోగించనున్న అదనపు ట్యాంకర్లు, అందుకయ్యే వ్యయం వివరాలిలా ఉన్నాయి. -
విజయవాడ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఉద్రిక్తత
హైదరాబాద్: విజయవాడ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ఉద్రిక్తంగా మారింది. శుక్రవారం జరిగిన ఈ సమావేశంలో మేయర్ అధికార తెలుగుదేశం పార్టీకి వత్తాసు పలకడంతో వైఎస్ఆర్ కార్పొరేటర్లు నిరసన వ్యక్తం చేశారు. కౌన్సిల్ తీర్మానాలపై వైఎస్ఆర్ సీపీ కార్పొరేటర్ బహుదూర్ మేయర్‌ను నిలదీశారు. మేయర్ బహుదూర్‌ను సస్పెండ్ చేయడంతో మేయర్ చాంబర్ ముందు ఆయన బైఠాయించారు. మార్షల్స్ వచ్చి బహుదూర్‌ను బయటకు ఈడ్చుకెళ్లారు. దీనిపై వైఎస్ఆర్ కార్పొరేటర్లు నిరసన వ్యక్తం చేస్తూ సభను వాకౌట్ చేశారు. -
ఎమ్మెన్నెస్‌కు మరో షాక్
సాక్షి, ముంబై : నాసిక్‌లో మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్)కు చెందిన ఇద్దరు కార్పొరేటర్లు శివసేనలో చేరారు. ఎమ్మెన్నెస్ కార్పొరేటర్లైన నిలేష్ శెలార్, శోభనా షిందే బుధవారం మాతోశ్రీలో ఉద్దవ్ సమక్షంలో శివసేన తీర్థం పుచ్చుకున్నారు. తాము ఊహించినట్టుగా ఎమ్మెన్నెస్‌తో అభివృద్ధి జరగలేదని, అందుకే తాము శివసేనలో చేరినట్టు వారు పేర్కొన్నారు. ఎమ్మెన్నెస్‌కు షాక్ నాసిక్ మేయర్ ఎన్నికలు ఎమ్మెన్నెస్‌కు మరింత సమస్యగా మారనుంది. గత ఎన్నికల్లో బీజేపీతో జతకట్టిన ఎమ్మెన్నెస్ నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్లో అధికారం చేపట్టింది.ఈ సారి ఎన్నికల్లో మాత్రం ఎమ్మెన్నెస్‌తో బీజేపీ తెగదెంపులు చేసుకుంది. మళ్లి శివసేన, బీజేపీ, ఆర్పీఐలు మహాకూటమిగా ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఒంటరైన ఎమ్మెన్నెస్‌కు ఇద్దరు కార్పొరేటర్లు పార్టీని వీడిచి వెళ్లిపోయారు. వారిద్దరూ శివసేనలో చేరడం మరింత షాక్‌కు గురి చేసింది. మహాకూటమికే అధికారం: ఉద్దవ్ ఠాక్రే నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్లో మహాకూటమి అధికారంలోకి వస్తుందన్న ధీమాను శివసేన అధ్యక్షులు ఉద్దవ్ ఠాక్రే వ్యక్తం చేశారు. శివసేనలో చేరిన ఇద్దరు కార్పొరేటర్లకు స్వాగతం ఆయన స్వాగతం పలికారు. శుక్రవారం జరగబోయే ఎన్నికల్లో తాము విజయం సాధిస్తామని తమ అభ్యర్థి మేయర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరిస్తారన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. -
సీ లింక్ మీదుగా ఉచిత రాకపోకలు
సాక్షి, ముంబై: బాంద్రా-వర్లీ సీ లింకు మీదుగా కార్పొరేటర్లు ఉచితంగా రాకపోకలు సాగించేందుకు మేయర్ సునీల్ ప్రభు సౌకర్యం కల్పించారు. మేయర్ పదవీ కాలం సెప్టెంబర్ 9వ తేదీన ముగియనుంది. తాను పదవిలో ఉండగా కార్పొరేటర్లకు మేలు చేయాలని సంకల్పించారు. అందుకు బీఎంసీ సమావేశ మందిరంలో బుధవారం జరిగిన చివరి సమావేశంలో ఈ శుభవార్త వెల్లడించారు. బీఎంసీలో మొత్తం 227 మంది కార్పొరేటర్లు ఉన్నారు. ఇందులో అనేకమంది బాంద్రా-వర్లీ సీ లింకు మీదుగా రాకపోకలు సాగిస్తుంటారు. కానీ అక్కడ ఏర్పాటు చేసిన టోల్ ప్లాజా వద్ద జేబులోంచి డబ్బులు చెల్లించాల్సి వస్తోంది. ఈ విషయాన్ని కార్పొరేటర్లు పలుమార్లు మేయర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సంబంధిత ప్రభుత్వాధికారులతో మేయర్ చర్చించారు. ఎట్టకేలకు కార్పొరేటర్లకు సీలింకు మీదుగా ఉచితంగా రాకపోకలు సాగించేందుకు అనుమతి లభించింది. కార్పొరేటర్ వాహనానికి ఒక ట్యాగ్ ఏర్పాటు చేస్తారు. దీని ద్వారా బాంద్రా సీ లింకు మీదుగా ఎన్నిసార్లైనా రాకపోకలు సాగించేందుకు వీలు లభించనుందని మేయర్ తెలిపారు. బోరివలిలోని నేషనల్ పార్క్‌లోనికి వెళ్లాలంటే అక్కడి సిబ్బంది కార్పొరేటర్ల నుంచి పన్ను వసూలు చేస్తున్నారు. ఇక నుంచి అది కూడా చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇందుకు మేయర్‌కు కొర్పొరేటర్లు ప్రశంసలతో ముంచెత్తారు. అభినందనలు తెలియజేశారు. -
హెల్ప్‌లైన్‌కు కార్పొరేటర్ల మోకాలడ్డు
భివండీ, న్యూస్‌లైన్ : భివండీ కార్పొరేషన్ పట్టణ ప్రజల సౌకర్యార్థం హెల్ప్‌లైన్ నంబర్ ప్రారంభించనుంది. వివిధ సమస్యలపై ప్రజలు నేరుగా ఆయా విభాగాల అధికారులకు ఫిర్యాదులు చేయడానికి కార్పొరేషన్ కమిషనర్ జీవన్ సోనావణే 997001312 అనే హెల్ప్ లైన్ నంబర్ ప్రాంభించాలని సంకల్పించారు. అందుకు తగిన ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. కానీ, కొందరు కార్పొరేటర్ల నుండి వ్యతిరేకత రావడంతో ఇది అటకెక్కే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రజలకు ఇబ్బందిలేకుండా.. భివండీ మున్సిపల్ కార్పొరేషన్ 26 కి.మీ. మేర విస్తరించి ఉంది. ప్రజల ఫిర్యాదులు ఏమైనా చేయాలంటే కార్యాలయానికి వ్యయప్రయాసాలకు ఓర్చి రావల్సి వస్తోంది. ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు హెల్ప్ లైన్ ప్రారంభించాలని కమిషనర్ నిర్ణయం తీసుకున్నారు. అందుకు ఆరోగ్య విభాగం-బి 01, విద్యుత్ శాఖ-02, నీటి పారుదల శాఖ-03, నిర్మాణ శాఖ-04, లెసైన్స్ శాఖ-05, టౌన్ ప్లానింగ్ శాఖ-06, పన్ను చెల్లింపు శాఖ-07, అగ్నిమాపక శాఖ-08, ఉద్యాన వన విభాగం-09, వైద్య ఆరోగ్య విభాగం-10 ఇలా ఇంటర్ కామ్ నంబర్లను కేటాయించారు. కార్పొరేటర్ల వ్యతిరేకత ప్రజల కోసం హెల్ప్‌లైన్ నంబర్ ప్రారంభించడాన్ని కొందరు కార్పొరేటర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నెంబర్ వల్ల ప్రజలతో ఉన్న సత్సంబంధాలు దెబ్బతింటాయని కొందరు ఇటీవల జరిగిన మహాసభలో కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. హెల్ప్‌లైన్ నెంబర్ ప్రారంభించడంపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. దీంతో ఇది ప్రారంభానికి నోచుకొంటుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కార్పొరేటర్ల తీరుపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రజలకు సౌకర్యం కల్పిస్తాం కానీ కార్పొరేషన్ కమిషనర్ మాత్రం ప్రజల నుండి ఫిర్యాదులు చేయడానికి ఎలాగైనా సౌకర్యం కల్పిస్తామని అధికారులు అంటున్నారు. ఈ విషయమై జీవన్ సోనావణే‘ న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ.. ఒకవేళ కార్పొరేటర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తే ఎస్సెమ్మెస్ సేవలనుఅందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. -
ఆకుపచ్చ నగరం
ఆగస్టులో 16.50 లక్షల మొక్కల పంపిణీ కార్పొరేటర్లు, షాపింగ్ మాల్స్, విద్యాసంస్థల ద్వారా సరఫరా ఏర్పాట్లలో జీహెచ్ఎంసీ సాక్షి, సిటీబ్యూరో: కాంక్రీట్ జంగిల్‌గా మారిన నగరంలో పచ్చదనం కరువైంది. గ్రేటర్ నగరాన్ని హరిత వనంగా తీర్చిదిద్దేందుకు జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఆదేశాలతో అధికారులు కస రత్తు ప్రారంభించారు. వర్షాకాలం ప్రారం భం కావడంతో నగరంలోని వివిధ ప్రాంతాల్లో మొక్కలు నాటేందుకు సిద్ధమవుతున్నారు. ఆగస్టు మొదటి వారంలో 16.50 లక్షల మొక్క లు పంపిణీ చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేశారు . వీటిని కార్పొరేటర్లు, షాపింగ్ మాల్స్, విద్యా సంస్థల ద్వారా ప్రజలకు సరఫరా చేయనున్నారు. ప్రజలు మక్కువ చూపే మొక్కల్నే పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఇళ్ల వద్ద నాటేందుకు 4 లక్షలు, విద్యాసంస్థల్లో నాటేం దుకు 2 లక్షల మొక్కలు పంపిణీ చేయాలని ప్రతిపాదించారు. వీటితోపాటు ప్రభుత్వ ఖాళీ స్థలాలు, జీహెచ్ఎంసీ ఓపెన్ ప్లేస్‌లు, రోడ్డుకిరువైపులా, ట్రాఫిక్ ఐలాండ్లు, శ్మశానవాటికలు, పెట్రోల్ బంకులు, ఆస్పత్రులు, పార్కులు తదితర ప్రాంతాల్లో మరో 10.50 లక్షలు ఈ సీజన్లో నాటాలని తీర్మానించారు. వీటిని సమకూర్చుకునేందుకు జీహెచ్ఎంసీ జీవవైవిధ్య విభాగం అధికారులు హెచ్ఎండీఏ, జలమండలి, ఔషధ, సుగంధ మొక్కల బోర్డు, సిమాప్,రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ పరిశోధన సంస్థ, సంగారెడ్డిలోని ఫల పరిశోధన కేంద్రాల అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. మొక్కలకు రక్షణకుగాను ట్రీగార్డుల్ని కూడా ఏర్పాటు చేస్తారు. అందంగా కనిపించే వివిధ రంగుల పూల మొక్కలను రోడ్ల వెంబడి నాటుతారు. పంపిణీ చేసే మొక్కలు తులసి, ఉసిరి, అలోవీరా, జామ, దానిమ్మ, నారింజ, సపోటా, నిమ్మ, మామిడి, సీతాఫలం తదితర మొక్కలు పంపిణీ చేయనున్నారు. వీటితోపాటు గుల్మొహర్, పగోడ, పెల్టో ఫోరం, తదితర జాతులకు చెందిన మొక్కల్ని కూడా పంపిణీ చేస్తారు. కార్పొరేటర్ల ద్వారా.. గృహాలకు పంపిణీ చేసే 4 లక్షల మొక్కల్లో మూడు లక్షల మొక్కలను కార్పొరేటర్ల ద్వారా పంపిణీ చేయాలని నిర్ణయించారు. జీహెచ్ఎంసీలోని 150 డివిజన్లు ఉన్నాయి. ఒక్కో కార్పొరేటర్ ద్వారా 2వేల మొక్కలు పంపిణీ చేస్తారు. -
అసెంబ్లీకీ.. తలోదారి
సాక్షి, ముంబై : రానున్న అసెంబ్లీ ఎన్నికల ఆట అప్పుడే షురూ అయ్యింది. మాజీ, ప్రస్తుతం పదవిలో ఉన్న మేయర్లు, అనేక ఏళ్లుగా కార్పొరేటర్లుగా కొనసాగుతున్న వారికి అసెంబ్లీ ఎన్నికలపై మోజు పెరిగింది. కానీ అభ్యర్థిత్వం లభించే అవకాశాలు లేకపోవడంతో శివసేనకు చెందిన కొందరు కార్పొరేటర్లు తిరుగుబాటు చేసే యోచనలో ఉన్నారు. ఇలా పార్టీ నుంచి బయట పడినవారంతా ఇతర పార్టీలో చేరాలని లేదా స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో దిగాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ బెడద ఆగస్టులో తీవ్రరూపం దాల్చే ప్రమాదం ఉంది. ఇది శివసేనకు తలనొప్పిగా మారనుంది. కాంగ్రెస్, ఎన్సీపీదీ ఎవరిదారి వారే? ప్రస్తుతం కాంగ్రెస్, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నాయకుల మధ్య కుంపటి రాజుకుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సొంత బలంపై పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ఎవరికి వారే ప్రకటించుకుంటున్నారు. ఇరు పార్టీలపై వ్యతిరేకంగా వాతావరణం నెలకొంది. ఈ పరిస్థితుల్లో శివసేన తప్పకుండా లబ్ధి పొందనుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని శివసేన టికెటుపై పోటీచేస్తే గెలుపు ఖాయమని అందరు భావిస్తున్నారు. దీన్ని అదనుగా చేసుకుని శివసేన టికెట్టుపై పోటీచేయాలని మాజీ, సిట్టింగ్ మేయర్లు, కార్పొరేటర్లు ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. అందుకు వీరంతా ఇప్పటి నుంచే పైరవీలు చేయడం ప్రారంభించారు. తమ సమర్థులకే అభ్యర్థిత్వం ఇవ్వాలని నాయకులు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల మాతోశ్రీ బంగ్లాకు నాయకుల రాకపోకలు పెరిగిపోయాయి. తెరపైకి అసంతృప్తులు ఇదిలాఉండగా 2012లో జరిగిన బీఎంసీ ఎన్నికల్లో టికెటు లభించని వారు అనేక మంది ఉన్నారు. ఆ సమయంలో అసంతృప్తితో ఉన్న వీరందరిని అసెంబ్లీ ఎన్నికల్లో మీ గురించి ఆలోచిస్తాం అని చెప్పి బుజ్జగించారు. ఆ సమయం ఇప్పుడు రానే వచ్చింది. అప్పుడు అసంతృప్తితో ఉన్నవారంతా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థిత్వం ఇచ్చి మాకు న్యాయం చేయాలని, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఒకవేళ వీరిని కాదని మాజీ, సిట్టింగ్ ఎమ్మెల్యేలకు లేదా కొత్త ముఖాలకు అభ్యర్థిత్వం కట్టబెడితే అప్పుడు శివసేన పరిస్థితి అగమ్యగోచరంగా మారనుంది. పార్టీలోనే తిరుగుబాటు బెడద అధికమై మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది. శివసేన, మిత్రపక్షమైన బీజేపీ మధ్య ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే వారే ముఖ్యమంత్రి పదవి చేపట్టాలి. కానీ తిరుగుబాట్ల బెడదవల్ల శివసేనకు సీఎం పదవీ చేజారిపోయే ప్రమాదం లేకపోలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికి అవకాశమివ్వాలి...? ఎవరిని పక్కన బెట్టాలనేది శివసేన నాయకత్వానికి తలనొప్పిగా మారింది. -
ఎమ్మెల్యే టికెట్‌పై కార్పొరేటర్ల కన్ను
సాక్షి, ముంబై: లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో మోడీ హవా స్పష్టంగా ప్రతిబింబించిన నేపథ్యంలో శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయాలని బీజేపీకి చెందిన కొందరు కార్పొరేటర్లు భావిస్తున్నారు. తాము కూడా ఎమ్మెల్యేలు కావాలని వారంతా ఉవ్విళ్లూరుతున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మోడీ ప్రభంజనం కారణంగా నగరంలోని మొత్తం ఆరు లోక్‌సభ స్థానాలు కాంగ్రెస్, ఎన్సీపీ నుంచి చేజారిపోయాయి. శివసేన, బీజేపీ అభ్యర్థులు భారీ మెజారిటీతో విజయఢంకా మోగించారు. ఈ ఫలితాలు సీనియర్ నాయకులు, సిట్టింగ్‌లు, మాజీ కార్పొరేటర్లతోపాటు కార్యకర్తల్లోనూ నూతనోత్తేజాన్ని నింపింది. దీంతో వీరంతా శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచార సభల్లో మోడీ తనదైన ప్రసంగాలతో ప్రజలను మరింత జాగృతం చేశారు. ఓటర్లను తనవైపు తిప్పుకోవడంలో సఫలీకృతులయ్యారు. దీంతో బీజేపీని విజయలక్ష్మి వరించింది. ఈ ఎన్నికల్లో కొన్ని స్థానాల్లో మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) ప్రభావం కారణంగా సీట్లు చేజారిపోవచ్చని బీజేపీ, శివసేన నాయకులు తొలుత భావించారు. అయితే శివసేన అభ్యర్థులకు భారీగా ఓట్లు రావడంతో బీజేపీ కార్పొరేటర్లు, కార్యకర్తల్లో మనోధైర్యం మరింత బలపడింది. త్వరలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. లోక్‌సభ ఎన్నికల ఫలితాల ప్రభావం ఈ ఎన్నికలపైకూడా పడే అవకాశముంది. ఈ నేపథ్యంలో శాసనసభ ఎన్నికల బరిలోకి దిగి ఎమ్మెల్యే కావాలని సీనియర్ నాయకులు, సిట్టింగ్, మాజీ కార్పొరేటర్లు, కార్యకర్తలు భావిస్తున్నారు. ఇందులోభాగంగా వారంతా ఇప్పటికే తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. సాధారణ కార్యకర్తగా పార్టీలో చేరిన కొందరు పదాధికారులు, కార్పొరేటర్లు అయ్యారు. ఇక గల్లీ నుంచి ఢిల్లీకి వెళ్లాలని కలలు కంటున్నారు. టికెట్ దొరికితే విజయం అత్యంత సునాయాసమనే ధీమాతో ఉన్నారు. ఇలా పెద్ద సంఖ్యలో సీనియర్లు, కార్పొరేటర్లు, కార్యకర్తలు టికెట్ ఆశిస్తున్న నేపథ్యంలో సిట్టింగ్, మాజీ ఎమ్మెల్యేల పరిస్థితి ఏమిటనేది బీజేపీకి తలనొప్పిగా మారే అవకాశముంది. భవిష్యత్తులో కొత్త కొత్త సమస్యలు తలెత్తే ప్రమాదముందని బీజేపీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. -
ఇటు కార్పొరేటర్లకు ప్రయోజనం
=కాంట్రాక్టర్లు, కార్పొరేటర్లు కుమ్మక్కు =రోడ్డు పనులపైనే మోజు =తూతూమంత్రంగా పనులు =మూడ్రోజులకే నాణ్యతకు తూట్లు =వర్షాలే కారణమంటూ సాకులు =అటు కాంట్రాక్టర్లకు లాభం =ఇటు కార్పొరేటర్లకు ప్రయోజనం సాక్షి, సిటీబ్యూరో: అటు వర్షాలే కాదు.. ఇటు కార్పొరేటర్లు, కాంట్రాక్టర్ల ‘కమీషన్ల’ వ్యవహారాలు కూడా నగర రహదారులకు తూట్లు పొడుస్తున్నాయి. స్థానిక ప్రజాప్రతినిధులు తమ డివిజన్లలో ప్రజోపయోగకరమైన పనులు చేసేందుకు జీహెచ్ఎంసీ ఏటా కోటి రూపాయల్ని కార్పొరేటర్ల బడ్జెట్ కింద మంజూరు చేస్తోంది. ఈ నిధుల నుంచి మన కార్పొరేటర్లు ఏ పనులకు ఎక్కువ వెచ్చిస్తున్నారో తెలుసా?.. రోడ్ల పనులపై!. ఇంతగా ఖర్చు చేస్తున్నా నగరవాసులు రోడ్డెక్కగానే ఒళ్లు, బళ్లు హూనమవుతున్నాయెందుకనే అనుమానం రావొచ్చు.. నిజమే!.. నాలుగు రాళ్లు వెనకేసుకోవాలంటే రోడ్లకు చిల్లు పెట్టడం కన్నా సులువైన పనేమీ లేదు మరి!. కాంట్రాక్టర్ల ద్వారా అందే కమీషన్లు కార్పొరేటర్లను ఊరిస్తున్నాయి. పైగా రోడ్లేతర పనుల పూర్తికి చాలా సమయం పట్టడంతో పాటు కాంట్రాక్టర్లకూ పెద్దగా లాభాలుండవు. అందుకే జీహెచ్ఎంసీలో పేరు నమోదు చేయించుకున్న చాలామంది కాంట్రాక్టర్లు ఇతర పనుల జోలికి వెళ్లరు. అందరూ రోడ్డు పనులపైనే మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే.. నాణ్యతపై పట్టింపు ఉండదు. నాలుగు రోజుల్లోనే రోడ్డు కొట్టుకు పోయినా వర్షాల సాకు ఉండనే ఉంది. అందుకే ఎక్కువ మంది కాంట్రాక్టర్లు పోటీ పడేది రోడ్ల పనులకే. వారు ఆసక్తి చూపే పనులిస్తేనే కార్పొరేటర్లకు కాసులు రాలేది. అందుకే మన ప్రజాప్రతినిధులు కమీషన్ లెక్కలేసుకుని తమ బడ్జెట్ నిధుల నుంచి రోడ్ల పనులు చేసేందుకే ఎక్కువ మోజు చూపుతున్నారు. తద్వారా ఇద్దరూ ప్రయోజనం పొందుతున్నారు. సాధారణ బడ్జెట్లోనూ పెద్ద వాటా.. జీహెచ్ఎంసీ సాధారణ బడ్జెట్ నుంచి సైతం రోడ్ల పనులకే పెద్ద మొత్తాల్లో వెచ్చిస్తున్నారు. అటు ఆ బడ్జెట్ నుంచి.. ఇటు కార్పొరేటర్ల బడ్జెట్ నుంచి రోడ్ల పనులకు, అందులోనూ మైనర్ రోడ్లు, చిన్నచిన్న బిట్ల పనులకు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే.. చిన్న పనులకైతే చేసేందుకు సమయం తక్కువ. వచ్చే లాభాలెక్కువ. కార్పొరేటర్ల నిధుల నుంచి 2013-14 ఆర్థిక సంవత్సరంలో వివిధ పనుల కోసం రూ. 84.59 కోట్లు మంజూరయ్యాయి. ఇందులో ఇప్పటి వరకు రూ. 5.86 కోట్ల చెల్లింపులు జరిగితే.. అందులో 30 శాతం రోడ్లకు సంబంధించిన చిన్న పనులపైనే వెచ్చించారు. ఇవి కాక రోడ్ల తవ్వకాలు, పునరుద్ధరణ, మేజర్ రోడ్ల అభివృద్ధి తదితరాల పేరిట మరో 10 శాతం ఖర్చు చేశారు. కార్పొరేటర్లు తమ బడ్జెట్ నిధులు కేటాయించిన ఇతర పనుల్లో పండుగల పనులు, ఇతరత్రా పనుల పేరిట రూ. 6.76 కోట్లు, నీటి కాలువల నిర్వహణకు రూ.5.21 కోట్లు, శ్మశానవాటికల మరమ్మతులకు రూ. 1.21 కోట్లు, భవనాల మరమ్మతులకు రూ. 1.13 కోట్లు ఖర్చు చేశారు. ఇవికాక ఆట పరికరాలు, మురుగు కాలువల పనులు ఇతర పనుల కోసం మరికొంత ఖర్చు చేశారు. సాధారణ, కార్పొరేటర్ల బడ్జెట్ల నుంచి అత్యధిక నిధులు ఖర్చు చేస్తున్నది రోడ్లకే అయినా నగర రోడ్లు ఎప్పుడు చూసినా అధ్వానంగా ఉంటుండటమే విశేషం. -
సబ్‘ప్లాన్’
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : సొమ్మొకరిది..సోకొకరిది అన్నట్టుగా మారింది ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల వినియోగం వ్యవహారం. ఎస్సీ,ఎస్టీలను ఉద్ధరిస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా చెప్పుకుంటున్న సబ్‌ప్లాన్ నిబంధనలకు అధికార పార్టీ నేతలే తూట్లు పొడుస్తున్నారు. సబ్‌ప్లాన్ కింద విడుదలైన నిధులను ఎస్సీ,ఎస్టీలు నివాసం ఉంటున్న కాలనీల్లో అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించాల్సి ఉన్నా అధికార పార్టీ నాయకులు తమకు ఇష్టమున్న ప్రాంతాల్లో ఖర్చు పెట్టాలని అధికారులపై ఒత్తిడి తెస్తూ, ఆ మేరకు పనులు చేజిక్కించుకుంటున్నారు. అందుకు వారు రకరకాల అడ్డదారులు ఎంచుకుంటున్నారు. ఈ తరహాలో పనులు చేపడుతోంది మారుపల్లెల్లో కాదు. ఏకంగా జిల్లా కేంద్రమైన నెల్లూరులో కావడం గమనార్హం. ఈ పనుల కేటాయింపులు, నిధుల వినియోగం మొత్తం సొమ్మొకరిది..సోకొకరిది అన్నట్టుగా మారుతోంది. నెల్లూరు రూరల్ శాసనసభ్యులు ఆనం వివేకానందరెడ్డి అనుచరులైన మాజీ కార్పొరేటర్లు కొందరు కార్పొరేషన్ అధికారులపై ఒత్తిడి తెచ్చి అడ్డంగా పనులు చేసుకుంటున్నారు. ఎస్సీ,ఎస్టీలు లేని ప్రాంతాల్లో పనులకు అనుమతులు తెచ్చుకుంటూ నిధులను దారి మళ్లిస్తున్నారు. ఇంకొందరు ఎస్సీలు లేని కాలనీలకు ఎస్సీ కాలనీలుగా పేర్లు మార్చి కాంట్రాక్టులు పొందుతున్నారు. నగరంలో ఎప్పుడో ఎస్సీ,ఎస్టీలు నివాసం ఉండి అక్కడ నుంచి స్థానభ్రంశం చెందిన ప్రాంతాలను ఇప్పుడు వారు నివాసం ఉంటున్నట్టు చూపించి పనులు చేపడుతున్నారు. ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్ అమల్లోకి వచ్చిన తరువాత మొదటివిడతగా నెల్లూరు కార్పొరేషన్‌కు రూ. 4.98 కోట్లు విడుదలయ్యాయి. ఈ నిధుల్లో పాతికభాగం సబ్‌ప్లాన్ నిబంధనలకు విరుద్ధంగా పనులు చేపట్టేందుకు అనుమతించినట్టు ఆరోపణలు వస్తున్నాయి. మూలాపేట ప్రాంతంలోని పెన్షన్ వీధిలో ఎస్సీ కుటుంబాలు లేవు. ఇప్పటికే ఇక్కడ కార్పొరేషన్ సాధారణ నిధులతో రోడ్డు నిర్మించారు. మళ్లీ ఈ వీధిలో సీసీ రోడ్డు నిర్మాణానికి రూ. 20 లక్షల సబ్‌ప్లాన్ నిధులు విడుదల చేశారు. ఒకటి రెండు రోజుల్లో ఈ రోడ్డు పనులు ప్రారంభించేందుకు కార్పొరేషన్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. రూరల్ ఎమ్మెల్యే ఆనం అనుచరుడైన ఒక మాజీ కార్పొరేటర్ ఈ పనిని తన అనుచరులకు ఇప్పించుకున్నారు. శాంతినగర్‌లో చేపట్టిన రోడ్డు నిర్మాణం పూర్తి కొద్దిరోజుల కిందట పూర్తి చేశారు. అయితే ఈ రోడ్డుకు ఎస్సీలు నివాసం ఉంటున్న వీధిగా రికార్డుల్లో చూపించి అనుమతులు తెచ్చుకున్నారు. ఎస్టీలు లేని సాదావారిపాలెం, చాకలివీధి తదితర ప్రాంతాలను ఎంపిక చేసి సబ్‌ప్లాన్ నిధులతో డ్రైన్లు, రోడ్ల నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారు. అనుమతులు ఇచ్చిన కొన్ని పనులకు కేవలం డివిజన్ నంబర్లు మాత్రమే సూచించి అవి ఏ ప్రాంతాలు అనేది తెలియకుండా గోప్యత పాటిస్తున్నారు. ఈ రకంగా పెద్ద ఎత్తున సబ్‌ప్లాన్ నిధులను దుర్వినియోగం చేస్తున్నారు. ఈ తరహా పనులు కోటిన్నర రూపాయలకు పైగా ఉన్నట్టు అధికారపార్టీ నాయకుల్లోనే విమర్శలు వస్తున్నాయి. అధికారులు ఇప్పటికైనా కళ్లు తెరవకపోతే సబ్ ప్లాన్ ఉద్దేశం నెరవేరే అవకాశాలు లేవు.


