‘జగన్‌ను రెండు నిమిషాల్లో అరెస్టు చేయగలను’ | CM Chandrababu Shocking Comments About YS Jagan Arrest Sparks Political Controversy In AP | Sakshi
Sakshi News home page

‘జగన్‌ను రెండు నిమిషాల్లో అరెస్టు చేయగలను’

Jul 2 2026 8:49 AM | Updated on Jul 2 2026 9:45 AM

CM Chandrababu Shocking comments about YS Jagan Arrest

చిల్లకూరు/వరదయ్యపాళెం : ‘నేను అనుకుంటే జగన్‌మోహన్‌రెడ్డిని రెండు నిమిషాల్లో అరెస్టుచేసి జైలుకు పంపగలను’ అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా బుధవారం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం పున్నపువారిపాళెం సమీపంలో ఏర్పాటుచేసిన ప్రజావేదికలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

అలాగే, చంద్రబాబు మరోసారి సొంత డబ్బా కొట్టుకున్నారు. ప్రజావేదికపై చంద్రబాబు మాట్లాడుతూ..‘అభివృద్ధి, సంక్షేమానికే తాను బ్రాండ్‌ అంబాసిడర్‌నని, హైదరాబాద్‌ను తానే అభివృద్ధి చేశానని మరోసారి చెప్పుకునే ప్రయత్నం చేశారు.  దీంతో, చంద్రబాబు వ్యాఖ్యలపై సోషల్‌ మీడియాలో మాటల తూటాలు పేలుతున్నాయి. ఇంకెన్ని రోజులు ఇలా డబ్బా కొట్టుకుంటారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement