సేవాలాల్ ఆశయాలు మార్గదర్శకం
జనగామ రూరల్: సంత్ సేవాలాల్ ఆశయాలు మా ర్గదర్శకమని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మీనారాయణనాయక్ అన్నారు. శనివారం సేవాలాల్ జయంతి సందర్భంగా పట్టణంలోని నెహ్రూపార్క్ నుంచి గిరిజన మహిళలు సాంప్రదాయ దుస్తులు ధరించి నృత్యాలు చేశారు. సేవాలాల్ మహరాజ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ముందుగా నిలిచిన బంజారా సమాజం, నేటి పరిస్థితుల్లో తమ జాతి ప్రయోజనాల కోసం మరింత ఐక్యంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. అజ్మీరా స్వామి, ఆర్డీఓ గోపీరామ్, మున్సిపల్ చైర్మన్ కడకంచి బాలమణి శ్రీనివాస్, గాంధీ నాయక్, తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి


