కొత్త కలెక్టరొచ్చారు! | - | Sakshi
Sakshi News home page

కొత్త కలెక్టరొచ్చారు!

Feb 27 2026 4:23 AM | Updated on Feb 27 2026 4:23 AM

కొత్త కలెక్టరొచ్చారు!

కొత్త కలెక్టరొచ్చారు!

జనగామ: జిల్లా కొత్త కలెక్టర్‌గా పరిపాలనకు కొత్త దిశ ఇవ్వడానికి ప్రభుత్వం ఐఏఎస్‌ అధికారి సందీప్‌ కుమార్‌ ఝాను నియమించింది. ఇప్పటివరకు జీహెచ్‌ఎంసీ కుత్బుల్లాపూర్‌ జోనల్‌ కమిషనర్‌గా పనిచేస్తున్న ఆయన్ను జిల్లాకు బదిలీ చేసింది. గురువారం జిల్లా కలెక్టర్‌గా సందీప్‌ కుమార్‌ ఝా బాధ్యతలు చేపట్టారు.

సమస్యలకు పరిష్కారం లభించేనా?

జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు, భూసర్వే, తదితర సమస్యల పరిష్కారంలో వేగవంతమైన అడుగులు పడతాయన్న ఆశాభావం ప్రజలు, అధికారుల్లో కనిపిస్తోంది. జిల్లాలో ఎక్కువగా కనిపించే భూ రికార్డు సవరణలు, సర్వే ఇష్యూలు, పాస్‌ బుక్‌ సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు. జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్‌ మున్సిపాలిటీ పరిధిలో శానిటేషన్‌, రోడ్ల నాణ్యత, కాలువల సమస్యల పరిష్కారంలో వేగం చూపాల్సిన అవసరం ఉంది. ఆరోగ్య సేవల్లో మెరుగుదల దిశగా కృషి చేయాల్సిన అవసరముంది. జిల్లాలో ఆయా రోగాలు, మధుమేహం, రక్తపోటు కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గ్రామ స్థాయిలో స్క్రీనింగ్‌, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల బలోపేతం, అవసరమైన సిబ్బంది నియామకం వంటి పనులు ప్రాధాన్యం పొందవచ్చని ఆరోగ్య శాఖ వర్గాలు తెలుపుతున్నాయి.

బాధ్యతల స్వీకరణ

జిల్లా కలెక్టర్‌గా సందీప్‌ కుమార్‌ ఝా గురువారం మధ్యాహ్నం బాధ్యతలను స్వీకరించారు. బదిలీపై వెళ్లిన ప్రస్తుత కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా ఆయనకు బాధ్యతలు అప్పగించగా, కొత్త కలెక్టర్‌ అధికారికంగా సంతకం చేశారు. అనంతరం పలువురు ఉన్నతాధికారులు, ఉద్యోగులు కలెక్టర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు.

బాధ్యతలు స్వీకరించిన

సందీప్‌ కుమార్‌ ఝా

కుత్బుల్లాపూర్‌ జోనల్‌ కమిషనర్‌ నుంచి జిల్లాకు..

పెండింగ్‌ సమస్యలకు పరిష్కారం

లభించాలని జిల్లా వాసుల ఆకాంక్ష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement