మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు
● జిల్లా ఎన్నికల అధికారి,
కలెక్టర్ రిజ్వాన్‌బాషా
జిలాల్లో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పరోక్ష ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్(ఎంసీసీ)ను కట్టుదిట్టంగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదేశాలు జారీ చేశారు. శనివారం కలెక్టరేట్ నుంచి అధికారులతో గూగుల్ మీట్‌లో మాట్లాడారు. ఉదయం 11 గంటలకు సంబంధిత మున్సిపల్ కార్యాలయ సమావేశం హాళ్లలో ప్రారంభమవుతుందన్నారు. ఎన్నికకు 50 శాతం మంది హాజరు కావాలన్నారు. సభ్యులతో 11 గంటలకు ప్రమాణ స్వీకారం నిర్వహించి, మధ్యాహ్నం 12.30 గంటలకు చైర్మన్, అనంతరం వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహిస్తామన్నారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ తరఫున ఎన్నికై న సభ్యులు పార్టీ విప్‌ను తప్పనిసరిగా అనుసరించాలన్నారు. ఎన్నిక సమావేశ ప్రాంగణంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్, డీసీపీ రాజమహేంద్రనాయక్, ఆర్డీఓలు గోపీరామ్, వెంకన్న, తహసీల్దార్లు, మాస్టర్ ట్రేనర్లు పాల్గొన్నారు.


