16ః16
మూడోసారి టాస్ వేస్తారా!
జనగామ చైర్మన్ పీఠానికి చేరి సగం బలం
జనగామ: జనగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ సమాన బలం, స్వతంత్రుల కీలక మద్దతు, ఎక్స్‌అఫీషియో ఎమ్మెల్యే, ఎంపీ ఓట్లు అన్నీ కలిసి రాజకీయ సమీకరణాలను మరింత క్లిష్టం చేశాయి. 16ః16 ఓట్ల సమీకరణతో ఎవరికీ స్పష్టమైన మెజార్టీ కనిపించక చైర్మన్ పీఠం ఎవరిని వరిస్తుందనే విషయం పెద్ద ప్రశ్నగా మారింది. స్వతంత్రుల వైఖరి, పార్టీల క్యాంపు రాజకీయాలు 16న జరిగే ఎన్నికలను హాట్‌టాపిక్‌గా మార్చాయి.
జనగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై రాజకీయ ఉ త్కంఠ పీక్ స్టేజీకి చేరింది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఇరు పార్టీలకూ సమాన సీట్లు రావడం, నలుగురు స్వ తంత్రుల్లో ఇద్దరు చొప్పున రెండు పార్టీలకు మద్దతు ఇవ్వడంతో ఎవరు చైర్మన్ పీఠం అధిరోహిస్తారన్న దానిపై అనిశ్చితి నెలకొంది. స్థానిక పురపాలక రాజకీయాల్లో అరుదుగా కనిపించే ఇలాంటి సమీకరణాలు జనగామలో హాట్‌టాపిక్‌గా మారాయి. ఇ టీవల వెలువడిన ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ 12, ఆ పార్టీ మద్దతుతో గెలుపొందిన సీపీఎంకు–1, బీఆర్‌ఎస్ 13, స్వతంత్రులు 4 స్థానాలు గెలుచుకున్నారు. చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు సాధించాలంటే కనీసం 16 ఓట్లు అవసరం. ఇక్కడే అసలు స స్పెన్స్ మొదలైంది. ఎక్స్‌అఫీషియో ఓటుగా బీఆర్‌ఎస్ తరఫున ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కాంగ్రెస్ తరఫున ఎంపీ చామల కిరణ్ కుమార్‌రెడ్డి ఓటు హ క్కు వినియోగించనున్నారు. దీంతో ఇరు పార్టీలకూ స్వతంత్రుల మద్దతుతో సమానంగా 16 ఓట్లు చేరుతున్నాయి. ఇదే సమాన బలం ఉండగా, రాబోయే చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలో ఎవరి గెలుపునైనా ప్రశ్నార్థకంగా మార్చేయనుంది. నలుగురు స్వతంత్రుల్లో ఇద్దరు బీఆర్‌ఎస్ క్యాంపులో, మరొకరు కాంగ్రెస్‌కు పూర్తి మద్దతు ప్రకటించగా, మరో స్వతంత్ర అభ్యర్థి కాంగ్రెస్‌తో చర్చలు కొనసాగిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇరు పార్టీలకు 16ః16 ఓట్ల సమీకరణంలో ఎవరు చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాలు దక్కించుకుంటారన్నది ఇప్పుడు జనగామ రాజకీయాల్లో పెద్ద ప్రశ్నగా మారింది.
ఎన్నికలకు ముందు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు తమకు పూర్తి మెజార్టీ వస్తుందని నమ్మినా, ప్రచారంలో స్వతంత్రులతో కలిసి పెద్ద ఎత్తున డబ్బుల లావాదేవీలు జరిగినట్లు ప్రచారం. ఓటర్లు ఇరు పార్టీల నుంచి డబ్బులు తీసుకుని ఎవరి మనసు నొప్పంచకుండా ఓటు షేరింగ్ చేసిన నేపథ్యంలో ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజార్టీ రాలేదని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ప్రస్తుతం కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు వేర్వేరు క్యాంపుల్లో ఉంచగా, 16న జరిగే చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో ఎవరిని భాగ్యం వరిస్తుందన్నది ఆసక్తిగా మారింది. సమాన బలం కొనసాగితే జనగామ మున్సిపల్ చరిత్రలో తొలిసారి టాస్ ద్వారా చైర్మన్ ఎంపిక అయ్యే పరిస్థితి తలెత్తే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లో ఉత్కంఠ
చైర్మన్ ఎన్నికకు 16వ తేదీన ముహూర్తం
ఎన్నికపై సస్పెన్స్
పురపాలిక రాజకీయంలో
స్వతంత్రుల హాట్‌టాపిక్
క్యాంపులో ఇరు పార్టీల కౌన్సిలర్లు
చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక మొదటిసారి, రెండవసారి కూడా వాయిదా పడే అవకాశం లేకపోలేదు. మూడోసారి మాత్రం సభ్యుల కోరం ఉన్నా.. లేకపోయినా ఎన్నిక ప్రక్రియ పూర్తి చేయాల్సిందే. పరిస్థితి మళ్లీ సమానంగా ఉంటే టాస్ వేసి తుది నిర్ణయం తీసుకునే అ వకాశం అధికార వర్గాల్లో వినిపిస్తుంది.
16ః16
16ః16


