బుగులు వేంకటేశ్వరుడికి వారకల్యాణం | - | Sakshi
Sakshi News home page

బుగులు వేంకటేశ్వరుడికి వారకల్యాణం

Feb 15 2026 7:34 AM | Updated on Feb 15 2026 7:34 AM

బుగుల

బుగులు వేంకటేశ్వరుడికి వారకల్యాణం

చిల్పూరు: బుగులు వేంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామి వారికి అర్చకులు రవీందర్‌శర్మ, రంగాచార్యులు, కృష్ణమాచార్యుల వేద మంత్రాల నడుమ వైభవంగా వార కల్యాణం నిర్వహించారు. ఈఓ లక్ష్మీప్రసన్న, చైర్మన్‌ పొట్లపల్లి శ్రీధర్‌రావు ఆధ్వర్యంలో రామోజు వెంకటేశ్వర్లు–విశాల, ఆదిమూలం సునీల్‌కుమార్‌–సాగరికలు భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో దాత సంగోజు మోహనాచారి– శంకరలక్ష్మి, జూనియర్‌ అసిస్టెంట్‌ కుర్రెంల మోహన్‌, వీరన్న, మల్లికార్జున్‌, హరిశంకర్‌, కృష్ణ పాల్గొన్నారు.

సోమేశ్వరాలయంలో ధ్వజారోహణం

పాలకుర్తి టౌన్‌: సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో మహాశివరాత్రి జాతర బ్రహ్మోత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. గుట్టపై మహామండపంలో గణపతి పూజా, పుణ్యాహవచనం, పంచగవ్వం, అంకురాప్పణ, రుత్తిక్‌వరుణ, ధ్వజారోహణ, వేదస్వస్తి, త్రిశూలపూజ, స్వామివారికి అభిషేకాలు, అఖండ దీపారాధన అర్చకులు నిర్వహించారు. ఆలయ ఈఓ భాగం లక్ష్మీప్రసన్న, ఏసీపీ అంబటి నర్సయ్య, సూపరింటెండెంట్‌ వెంకటయ్య, ప్రధాన అర్చకుడు దేవగిర లక్ష్మన్న, అర్చకులు డీవీఆర్‌శర్మ, అనిల్‌కుమార్‌, నాగరాజు, భక్తులు పాల్గొన్నారు.

జాతీయ స్థాయి సదస్సుకు ఎంపిక

జనగామ రూరల్‌: జనగామ పట్టణానికి చెందిన ప్రముఖ కవి, రచయిత, పరిశోధకుడు, సీనియర్‌ తెలుగు అధ్యాపకుడు కోడం కుమారస్వామి జాతీయస్థాయి సదస్సుకు ఎంపికయ్యారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 17, 18 తేదీల్లో ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ సోషల్‌ సైన్స్‌ రీసెర్చ్‌ సహకారంతో నిర్వహిస్తున్న ఐరన్‌ మ్యాన్‌ విజినరీ లీడర్షిప్‌ – లిబరేషన్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ అనే అంశంపై రెండు రోజుల సదస్సు జరగనుంది. ఈ సదస్సులో కుమారస్వామి కాళోజీ కవిత్వం–నిజాం పాలన వ్యతిరేకత అనే అంశంపై పరిశోధన పత్రం సమర్పించి ప్రసంగించనున్నారు. జాతీయ సదస్సుకు ఎంపికై న కుమారస్వామిని జనగామ రచయితల సంఘం అధ్యక్షుడు నక్క సురేష్‌, జి.కృష్ణ, సోమేశ్వర్‌, పానుగంటి రామ్మూర్తి, శ్రీనివాస్‌ తదితరులు అభినందనలు తెలిపారు.

తల్లుల దీవెనలతో ప్రజలకు సేవ చేస్తాం

ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మల తల్లుల దీవెనలతో ప్రజలకు మరింత సేవ చేస్తానని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. నూతనంగా ఎన్నికై న స్టేషన్‌ఘన్‌పూర్‌ మున్సిపాలిటీ కౌన్సిలర్లతో కలిసి ఆయన శనివారం అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవార్లకు ఎత్తు బంగారం, చీరసారె, పసుపు, కుంకుమ, పూలు, పండ్లు సమర్పించి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవార్ల ఆశీస్సులతో ప్రజలకు మరింత సేవ చేయాలని సంకల్పించామని తెలిపారు. ఆలయ సంప్రదాయ ప్రకారం దేవాదాయశాఖ అధికారులు, పూజారులు కడియం శ్రీహరితోపాటు నూతనంగా ఎన్నికై న కౌన్సిలర్లకు డోలి వాయిద్యాలతో స్వాగతం పలికారు.

కంప్యూటర్‌ సైన్స్‌

బీఓఎస్‌గా రమేశ్‌

కేయూ క్యాంపస్‌: కేయూ లోని కంప్యూటర్‌ సైన్స్‌ విభాగం బోర్డు ఆఫ్‌ స్టడీస్‌ చైర్మన్‌గా (బీఓఎస్‌) అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ డి.రమేశ్‌ను నియమిస్తూ రిజిస్ట్రార్‌ ఆచార్య వి.రా మచంద్రం శనివారం ఉత్తర్వులు జారీచేశారు. ఇప్పటివరకు బీఓఎస్‌గా పనిచేసిన డాక్టర్‌ మంజుల పదవికాలం ముగియడంతో రమేశ్‌ను ని యమించారు. రమేశ్‌ ఈ పదవిలో 2 సంవత్సరాలపాటు కొనసాగనున్నారు.

బుగులు వేంకటేశ్వరుడికి వారకల్యాణం
1
1/3

బుగులు వేంకటేశ్వరుడికి వారకల్యాణం

బుగులు వేంకటేశ్వరుడికి వారకల్యాణం
2
2/3

బుగులు వేంకటేశ్వరుడికి వారకల్యాణం

బుగులు వేంకటేశ్వరుడికి వారకల్యాణం
3
3/3

బుగులు వేంకటేశ్వరుడికి వారకల్యాణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement