ప్రశాంతంగా ఓట్ల లెక్కింపు
● కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ేేే
జనగామ: జిల్లాలోని జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపు శుక్రవారం విజయవంతంగా ముగిసిందని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. స్టేషన్‌ఘన్‌పూర్ 18, జనగామ మున్సిపాలిటీలో 30 వార్డులకు జరిగిన ఎన్నికలు, కౌంటింగ్ సజావుగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించిన జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు.
16న చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక
జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఎన్నికైన వార్డు సభ్యులకు ఈ నెల 16వ తేదీన ఉదయం 11లకు ప్రతిజ్ఞ, ఆ తర్వాత 12.30 గంటల సమయంలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలకు సంబంధిత మున్సిపల్ కార్యాలయాల్లో ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి సభ్యులు ప్రతి ఒక్కరు హాజరు కావాలన్నారు.


